వార ఫలాలు (21-12-2025 నుండి 27-12-2025 వరకు)
మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా రావలసినటువంటి లాభాలు అందుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతాన సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొంత వరకు బాగుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార పరంగా మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసికంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొదుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని మరియు కాలభైరవ అష్టకం చదవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్.
వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం మారే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఖర్చులు అధికంగా రాబడి తక్కువగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. స్కాలర్షిప్స్ లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అప్పు ఇస్తే తిరిగి రాదు. అప్పు తీసుకోవడం కూడా కలిసి రాదు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వాహనయోగం ఉంది. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రే.
మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది విషయాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ మారాలి అని ఆలోచన వస్తుంది. ఉద్యోగ పరంగా మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ధ్యానం చేయండి దైవ నామస్మరణ ఎక్కువగా చేయండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ తీసుకుంటారు. ఆరోగ్య పరంగా చిన్నచిన్నఇబ్బందులు ఉంటాయి. జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. మంగళవారం మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు కాషాయం.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. అమ్మకాలు కొనుగోలులో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. సంతానం యొక్క చదువుపై శ్రద్ధ వహించాలి. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోర్టుకు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్టాక్ మార్కెట్ కి స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి ఫార్మా రంగంలో ఉన్న వారికి సినీ కళారంగాలలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య త్రీ కలిసివచ్చే రంగు లైట్ ఎల్లో.
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా బాగుంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి పేరు ప్రఖ్యాతలు మాత్రం బాగుంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. పది రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అవసరం. స్నేహితులకి చెడు అలవాట్లకి దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీ తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కాలం ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఆశలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులు ఏకముఖి రుద్రాక్షలు ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు గ్రే.
తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా మనశ్శాంతి లోపి స్తుంది. వ్యాపారంలో ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విషయంలోనైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో శుభకార్యాలకు ప్రస్తావన ఉంటుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఫలితాలు బాగుంటాయి. చదువుపై శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు అందుకుంటారు. భూమి కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు గ్రీన్.
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. బంధు వర్గంలో నరదిష్టి అధికంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడమే మంచిది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. నూతన కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు లభిస్తాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్.
ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. కెరియర్ పరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గో సేవ చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రుణాలు చాలా వరకు తీరుస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా లభిస్తుంది. రాజకీయరంగంలో ఉన్న వారికి నూతన పదవులు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. నూతన పనులను కొంతకాలం వాయిదావేస్తారు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున నలుపు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. సినీ కళారంగాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా కాలం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. మీ జీవిత ఆశయం నెరవేరుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కెరియర్ పరంగా బాగుంటుంది. ఉద్యోగ విషయంలో అధికారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. గృహంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయట పడతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వస్తువులు, వాహనం కొనుగోలు చేస్తారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. గతవారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించండి. నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు తెలుపు.