భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి: అనిల్

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా […]



