ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్ – ఈ పొరపాటు అసలు చేయకండి, లేకపోతే కార్డు రద్దవుతుంది..!
హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు… వీడియో వైరల్

చెన్నై: ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా తారమంగళం ప్రాంతంలో జరిగింది. ఓమలూరు గ్రామానికి చెందిన శరవణకుమార్ (32) అనే యవకుడు వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో హిజ్రా సరోవ(30)ను ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పెద్దల సమక్షంలో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలో పెరియార్ కల్యాణంలో మండపంలో అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కళగం జిల్లా అధ్యక్షుడు […]
ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు

అనంత పురం జిల్లా: బెలుగుప్ప- నక్కపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆర్టిసి బస్సులో 17 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య
హైదరాబాద్ వేదికగా Poultry India Expo 2025- ఆ లక్ష్యంతో ముందడుగు!
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాకపోకలకు అంతరాయం

మన తెలంగాణ / మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి – చిట్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఆలేరు మోటకొండూర్ మధ్య రాకపోకలు బంద్ చేస్తూ బారి కేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. బహుదూర్ పేట వాగు, మంతపురి వద్ద ఉన్న ఈదుల వాగు ఉదృతంగా […]
డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారత సంతతి వ్యక్తి డల్లాస్ నగరంలో మోటల్ నిర్వహిస్తున్నాడు. మోటల్‌లో పని చేసే జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ అనే ఉద్యోగి కత్తితో చంద్రమౌళి తల నరికి చంపాడు. చంద్రమౌళిని చంపుతున్నప్పుడు భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ ను అరెస్టు చేసి […]
సెప్టెంబర్ 12 : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..
ప్రేమపెళ్లి…. ప్రియురాలి కోసం భార్యను చంపి… దృశ్యం సినిమా చూపించాడు

బెంగళూరు: ప్రియురాలి కోసం గర్భవతిని భర్త తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా కాగవాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉగార గ్రామానికి చెందిన చైతాలిని ప్రదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చైతాలి గర్భం దాల్చడంతో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. చైతాలికి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి […]