కేరళలో కలకలం.. 60 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ఆయుధాలు

తిరువనంతపురం: కేరళలోని (Kerala) ఓ వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు లభించడం కలకం సృష్టిస్తోంది. భారీగా ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రి కూడా దొరికాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మలప్పురం జిల్లాలో నివసిస్తున్న ఉన్నికమద్ (60) ఇంట్లో ఆయుధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 20 ఎయిర్ గన్‌లు, మూడు రైఫిల్స్, 40 పెల్లెట్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఉన్నికముద్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
నిరుద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా: రాజగోపాల్ రెడ్డి
చెత్తగా ఆడాము.. అదే మా ఓటమికి కారణం: రషీద్ ఖాన్

ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదని.. అందుకే ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చిందని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) అన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అఫ్ఘాన్ జట్టు విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ […]
మరో సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగింపు

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా ఆయన ఫిర్యాదులతో ఇతర సినిమా వాళ్లకు దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాపై కాపీరైట్ ఫిర్యాదు చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో ఆ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. తన అనుమతి లేకుండా ఈ సినిమాలో తన పాటలను ఉపయోగించారని ఇళయరాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని.. […]
ప్రజలపై భారం తగ్గించేందుకే జిఎస్టి తీసుకొచ్చాం: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టి ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అన్నింటినీ కలిపి ఒకే పన్ను, నాలుగు స్లాబ్ లుగా తీసుకొచ్చిందే జిఎస్టి అని తెలియజేశారు. 2017 కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, 2017 కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లించే వారని […]
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరం: మోడీ

భోపాల్: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మధ్య ప్రదేశ్ లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరమని, ఈ పథకం మధ్యప్రదేశ్‌లోని వివిధ వర్గాలకు చాలా ఉపయోగమని, ఈ పథకం వల్ల చేనేత కార్మికులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. పిఎం మిత్ర పార్కుతో రైతులూ పలు విధాలుగా ప్రయోజనం పొందుతున్నారని, […]
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు మృతి
నెల్లూరులో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు […]