హద్దు మీరిన పాక్ ఆటగాళ్లు

గన్ ఎక్కిపెట్టినట్టు ఫర్హాన్ సైగలు.. నోటికి పని చెప్పిన రవూఫ్, అఫ్రిది బ్యాట్‌తో సమాధానం చెప్పిన అభిషేక్, గిల్ దాయాదుల సమరంలో రచ్చరచ్చ దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సూపర్4 సమరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న పాకిస్థాన్ ప్రస్తుతం డిప్రెషన్‌లో కూరుకుపోయిన విషయం సూపర్4 మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి సమాధానం చెప్పాలని భావించిన […]
మంగళవారం రాశి ఫలాలు (23-09-2025)

మేషం – పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు. వృషభం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కాలం అనుకూలo. మిథునం – చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం […]
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతం ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఘటన స్థలం నుంచి ఎకె47 రైఫిల్ స్వాధీనం మన తెలంగాణ/హైదరాబాద్/తంగళ్ళపల్లి : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా (63), కడారి సత్యనారాయణ రెడ్డి […]
విచారణలో తెలియదు…గుర్తులేదు…అని చెబుతున్నారు.. ఆయన బెయిల్ రద్దు చేయండి!

ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయండి సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదనలు విచారణ పేరుతో హింసిస్తున్నారు ప్రభాకర్ రావు తరపు న్యాయవాది వాదనలు విచారణ అక్టోబర్ 8కి వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో తెలియదు, గుర్తులేదు అని చెబుతున్నారని ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సిట్ […]
అల్పపీడన ప్రభావం.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు […]
సింగరేణి కార్మికులకు బోనస్.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

దసరా పండుగ పూట కార్మికులకు చేదు కబురు చెప్పారు సింగరేణి బోనస్‌పై రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం మొత్తం లాభంపై కాకుండా వాటా తగ్గించి బోనస్ ఇస్తున్నారని ఆరోపణ నికర లాభాల్లో 34 శాతంను బోనస్‌గా ప్రకటించాలని డిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు చెల్లించే బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు […]
టిజిపిఎస్‌సి సభ్యులుగా మరో ముగ్గురి నియామకం

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కొత్తగా మరో ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. సి.చంద్రకాంత్ రెడ్డి, ఐపిఎస్ అధికారి విశ్వప్రసాద్, ప్రొఫెసర్ ఎల్.బి లక్ష్మీకాంత్ రాథోడ్‌లను టిజిపిఎస్‌సి నూతన సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరేళ్ల పాటు లేదా 62 సంవత్సరాల వయస్సు వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలిపారు. వీరి నియామకం వారు పదవీ […]
బతుకమ్మ వేడుకలపై పోలీసుల ఆంక్షలా?: రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బతుకమ్మ వేడుకలపైనా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బిజెపి మహిళా మోర్చా రూపొందించిన బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో సోమవారం రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ చర్యను తూర్పారబట్టారు. బతుకమ్మ వేడుకలకు కొన్ని చోట్ల అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్ళి అనుమతి పొందాల్సి వచ్చిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పుకునే ప్రభుత్వం ఈ […]
బండి సంజయ్ కి జగదీష్ రెడ్డి కౌంటర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్లు ఏ షోరూంలో కొనుగోలు చేశారో.. కెటిఆర్ కూడా అక్కడే కొనుగోలు చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి చెప్పారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారని, వారు ఎక్కడ తెచ్చారో తమకెలా తెలుస్తుందని అన్నారు. తాను కారు అమ్మేస్తా ఎవరైనా కొంటారని చెప్పారు. బండి సంజయ్ హోమ్ మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏమైనా వాస్కోడిగామానా లేక కొలంబసా..అంటూ ఎద్దేవా చేశారు. […]