తిరుమల శ్రీవారి బహ్మోత్సవాలు 2025 : ఘనంగా కల్పవృక్ష వాహన సేవ – రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప కటాక్షం
‘ది ప్యారడైజ్’ నుంచి మోహన్‌బాబు ఫస్ట్‌లుక్ విడుదల
హైదరాబాద్: ‘హిట్-ది థర్డ్ కేస్’ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు తన కెరీర్‌లోనే అతి పెద్ద చిత్రం ‘ది ప్యారడైస్’లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్లు అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమాలో మోహన్‌బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మోహన్‌బాబు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సంవత్సరాల తర్వాత మోహన్‌బాబు మళ్లీ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ పోస్టర్‌లో రక్తమోడిన చేతులతో కత్తి పట్టుకొని భయంకరమైన లుక్‌లో మోహన్‌బాబు కనిపించారు. ‘‘పేరు ‘శిఖంజా మాలిక్’.. సినిమా యొక్క డార్క్ లార్డ్ మళ్లీ ఉదయిస్తున్నారు. లెజండరీ మోహన్‌బాబు గారు శిఖంజా మాలిక్‌గా ఈ ది ప్యారడైజ్ సినిమాలో పీక్ విలనిజం పండిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాని ‘దసరా’ సినిమాతో నానికి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. తెలుగుతోపాటు హింది, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అప్పుడు రజినీకాంత్… ఇప్పుడు గజినీకాంత్: హరీష్ రావు
హైదరాబాద్: మార్పు మార్పు అని ప్రజలని ఏమార్చడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి పంచారని, నేడు బాకీ కార్డులను తాము అదే ఇండ్లకు పంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి, ఎన్నికల తర్వాత గజినీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయారని ఎద్దేవా చేశారు. బాకీ కార్డులు విడుదల సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ కార్డు చూపించి ప్రజలు నిలదీయాలని సూచించారు.
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అయ్యారని హరీష్ రావు చురకలంటించారు. బిఆర్ఎస్ ప్రారంభించిన వాటికి సిఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ అమలు చేసిన పథకాలకు కటింగ్ చేస్తున్నారని, అయితే రిబ్బన్ కటింగ్ లేదంటే సంక్షేమ పథకాలకు కటింగ్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ అక్రమ కేసులతో ప్రభుత్వాన్ని నడపలేవని రేవంత్ కు చురకలంటించారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డరని, రేవంత్ ప్రభుత్వానికి కాలం దగ్గర పడుతుందని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని, బాకీ కార్డుతో అప్పుడు ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకొని అడుగుతారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తామన్నారు. తాము ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని తెలిపారు.
ఆ కార్డుతో కాంగ్రెస్ ను నిలదీస్తాం: కెటిఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడిందో నిలదీసి అడిగేందుకే బాకీ కార్డులకు రూపకల్పన చేశామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ, కౌలు రైతులకు రూ. 15000, రైతు కూలీలకు రూ.12000, ఆటో అన్నలకు దాదాపు రూ.24,000 ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500.. పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూ.4,౦౦౦, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు రూ.500 బోనస్, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? అని అడిగారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని కార్డులలో తెలుపుతామన్నారు. బిఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడమని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వదలిపెట్టమన్నారు.
‘దేవర’ వచ్చి ఏడాది.. ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్..
హైదరాబాద్: ఎన్టిఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 27న విడుదలై చరిత్ర సృష్టించింది. చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్టిఆర్ ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘దేవర-2’ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో ఎన్టిఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ‘‘దేవర ప్రతి సముద్ర తీరాన్ని వణికించి నేటికి ఏడాది పూర్తయింది. ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు ఇది. తాను పంచిన ప్రేమ, తాను చూపిన భయం.. ఎప్పటికీ మర్చిపోలేరు. ‘దేవర-2’ కోసం అందరూ సిద్ధంగా ఉండండి’’ అని చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.
దీంతో త్వరలోనే ఈ సీక్వెల్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టిఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూళ్లు షూటింగ్ పూర్తి చేసుకుంది. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టిఆర్ ‘దేవర-2’ టీంతో జతకడతారు. దర్శకుడు కొరటాల శివ దేవర-2 గురించి పలు సందర్భాల్లో మాట్లాడి.. సినిమాపై హైప్‌ని పెంచేశారు. దేవరలో చూసింది 10 శాతమే అని.. సీక్వెల్‌లో 100 శాతం చూస్తారని ఆయన అన్నారు.
ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారు: చంద్రబాబు
అమరావతి: బిఎస్ఎన్ఎల్ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక్కసారి టెక్నాలజీ
మారిందంటే ఎవరూ ఆపలేరని అన్నారు. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయని, బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయని తెలియజేశారు. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించారని పేర్కొన్నారు. జాబ్ వర్క్ చేస్తున్నామని కొత్త ఆలోచనలు రావాలని, 2010 లో 4 జి, 2020 లో 5జి, 2023 లో 6జి సేవలు వస్తాయని చెప్పారు. నరేంద్ర మోడీ దూదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని, కోవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ అని
ప్రశంసించారు. ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారని, ప్రధాని సూచిస్తే డిజిటల్ కరెన్సీపై రిపోర్టు ఇచ్చామని అన్నారు.
మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని, అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయని, ఎవరూ
ఆపలేరని అన్నారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారని, మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి జనవరిలో
వస్తుందని, సేఫ్టీ, సెక్యూటరీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటి చాలా
అవసరమని, దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తుంటే.. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ తీసుకొస్తున్నామని రియల్ టైమ్ డేటా కోసం ఐవోటీలు
వస్తున్నాయని, రియల్ టైమ్ లో మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నాం అని 2010 లో 4జి, 2020లో 5జి, 2030లో 6జి సేవలు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
అక్టోబర్ 1న అమల్లోకి NPS కొత్త నిబంధనలు- మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు..
మునిగిన శివాలయం… మూసీలో చిక్కుకున్న పూజారి కుటుంబం
హైదరాబాద్: మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పొంగిప్రవహిస్తోంది. 30 ఏళ్ల తరువాత అత్యంత భారీగా మూసీ ప్రవాహం ఉందని అధికారులు వెల్లడించారు. మూసీ వరద తాకిడికి శివుడి దేవాలయం మునిగిపోయింది. వరద పొటెత్తడంతో శివాలయం పైనే పూజారి కుటుంబం తలదాచుకుంది. సహాయం కోసం శివాలయం పైకెక్కి పూజారి ఆర్తనాదాలు చేస్తోంది. పురానాపూల్ వద్ద స్మశానవాటిక నీటిలో మునిగిపోయింది. లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ లోకి వరద నీరు చేరడంతో జాతిపిత సమాధి మునిగిపోయింది.
భారీ వర్షాలు కురవడంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. చాదరఘాట్ వద్ద చిన్ని బ్రిడ్జి వరద ప్రవాహంలో మునిగిపోయింది. ఎంజిబిఎస్ లో మోకాల్లోతు వరద ప్రవహిస్తుంది రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షానికి హైదరాబాద్ విలవిలలాడిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ తీరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూసీ ఉధృతితో పరివాహక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అప్పుడు కొట్టుకపోయాడు… ఇప్పుడు మృతదేహం లభ్యం
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలలో కొట్టుకుపోయిన మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 13 రోజులు తర్వాత నాగోల్ సమీపంలోని మూసీ నద వద్ద మృతదేహం లభించింది. ఒక్క మృతదేహాన్ని కూడా వెతలేకపోయారని కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తడంతో మామ, అల్లుడ్లు అర్జున్, రామా కొట్టుకపోయిన విషయం తెలిసిందే. అర్జున్ మృతదేహం 75 కిలో మీటర్ల దూరంలోని వలిగొండలో లభించింది. శుక్రవారం నాగోల్ సమీపంలోని మూసీలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి ఈ నెల 14వ తేదీన కొట్టుకుపోయిన రామాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.