విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్.. మొత్తం ఇంటర్నెట్ షేక్..
టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. టి-20, టెస్ట్ ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే విరాట్ సోషల్‌మీడియాలో ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతుంటాడు. పెట్టినప్పుడల్లా అతని పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్‌మీడియా అంత యాక్టివ్‌గా ఉండపోయినా.. విరాట్‌కు మిలియన్స్‌లో ఫాలోవర్లు ఉన్నారు.
తాజాగా విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. తన భార్య అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత’ అంటూ ఆ పోస్ట్‌కి క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దీనికి 9 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. కోహ్లీ చివరిసారిగా ఐపిఎల్‌లో ఆడాడు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫ్రీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆసియాకప్ ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
దుబాయ్: ఆసియాకప్-2025లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. 41 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్ ఫైనల్స్‌లో తలపడుతున్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్‌లో ఒకసారి భారత్, పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ను ముచ్చటగా ఓడించి ట్రోఫీని అందుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హార్థిక్ పాండ్యా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చాడు. బుమ్రా, దుబేలు తుది జట్టులోకి వచ్చారు. ఇక పాకిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న హ్యాట్ బ్యూటీ
విజయ్‌కి షాక్.. హైకోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు
తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 48 మంది ఐసియులో ఉన్నారు. అయితే ఈ ఘటన తర్వాత విజయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ విషాద ఘటనపై విచారణ పూర్తయ్యే వరకూ విజయ్ నిర్వహించే ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి.
సామాజిక కార్యకర్త సెంథిల్ కన్నన్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కన్నన్ తన పిటిషన్‌లో ‘‘ప్రజా భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) అనేది అసెంబ్లీ హక్కు (సమావేశాలు నిర్వహించే హక్కు) కంటే ముఖ్యమైనది అంటే ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటం అత్యవసరం. అందుకే టివికె పార్టీ భవిష్యత్తులో నిర్వహించే ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా నిరోధించాలి’’ అని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉంది.
‘స్పిరిట్’లో మెగాస్టార్.. ఇక థియేటర్లు దద్దరిల్లిపోతాయ్..?
హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా గురించి ఏ వార్త వచ్చినా.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా మెగా హీరో నటిస్తున్నారని టాక్.
అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ పాత్ర చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు షూటింగ్ కోసం ఆయన ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. సినిమాలో ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాలో కూడా తండ్రి పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డికి ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో కలిసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని సందీప్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇంతలో ఇలా స్పిరిట్‌లో చిరు భాగం అవుతున్నారని టాక్ రావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
కాసేపట్లో దాయాదుల మధ్య పోరు.. భారత్ గెలవాలని పూజలు, హోమాలు
గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఒక్కరికి మాత్రం..
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. 783 పోస్టులకు గాను 782 మంది ఎంకయ్యారు. ఒక పోస్ట్ మాత్రం భర్తీ కాలేదు. గ్రూప్-2 అబ్బాయిలలో 1.హర్ష వర్ధన్, 2.సచిన్, 3.మనోహర్ రామ్, 4.శ్రీరామ మధు, 5.ప్రితం రెడ్డి టాపర్స్‌లో నిలవగా.. అమ్మాయిలలో 1.వినిషా రెడ్డి, 2.సుస్మిత, 3.శ్రీవేణి, 4.శ్రీలత, 5.స్నేహ నిలిచారు.
గ్రూప్-2 సర్విసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ 29న టిజివిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జనవరి 18నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు… దాదాపు నెలరోజుల పాటు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించింది. 5,51,855 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు.
పాక్‌పై విజయం సాధించాలంటే అదే కీలకం: మాజీ క్రికెటర్
ఆసియాకప్-2025లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడోసారి తలపడుతున్నాయి. గ్రూప్ దశలో ఒకసారి, సూపర్-4లో రెండోసారి ఈ రెండు జట్లు తలపడగా.. టీం ఇండియానే విజయం సాధించింది. మరికొన్ని గంటల్లో ఫైనల్‌లో ముచ్చటగా మూడోసారి ఈ రెండు జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిచి పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పించాలని భారత అభిమానులు ఆశపడుతున్నారు.
అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించాలంటే.. ముందు నుంచే అధిపత్యం చూపించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. పవర్‌ప్లేలోనే భారత్ పట్టు సాధించాలని పేర్కొన్నారు. ‘‘పవర్ ప్లేలో మ్యాచ్‌పై పట్టు సాదించాలి. చాలాసార్లు మ్యాచ్ చివరి వరకూ వెళ్తోంది. ఆరంభంలోనే సత్తా చాటితే మ్యాచ్ మీదే. పవర్‌ప్లేలో భారత్ విఫలమైన ఏం కాదు.. ఆ తర్వాత పుంజుకోవచ్చు. అయితే పాకిస్థాన్‌కు అది సాధ్యం కాదు. వారిని ఆదిలోనే నియంత్రిస్తే.. ఇక ఆ జట్టు కోలుకోలేదు’’ అని అకాశ్ విశ్లేషించారు
విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి అనేక సమస్యలు పరిష్కరించాం: చంద్రబాబు
అమరావతి: పార్టీ కార్యకర్తలైనా.. నాయకులైనా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరు అని అన్నారు. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలతో సిఎం టెలికాన్ఫరెన్స్ జరిపారు. సిఎంతో టెలీకాన్ఫరెన్స్ లో గ్రామస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..11మంది వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, వైసిపి ఎమ్మెల్సిలు సభకు రావడం ఇదేం ద్వంద వైఖరి అని విమర్శించారు. వైసిపి అసమర్థవిధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పెరిగిందని, విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి అనేక సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని, భవిష్యత్తులో ప్రజలపై రూ. వెయ్యి కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని తెలియజేశారు. జిఎస్టి సంస్కరణలపై ప్రజలకు కార్యకర్తలు వివరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని అన్నారు. కూటమి జిఎస్టి సంస్కరణల ఉత్సవ్ ప్రచారం చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.