పూలను పూజించే గొప్ప సంస్కృతికి బతుకమ్మ పండుగకు ఉంది: సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంటేనే ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆడబిడ్డలందరూ ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సోమవారం అతి పెద్ద బతుకమ్మ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు లభించాయి. 63 అడుగుల భారీ బతుకమ్మగా గిన్నిస్ రికార్డు నమోదైంది. దీంతో పాటు 1,354 మంది మహిళలతో అతి పెద్ద తెలంగాణ జానపద నృత్యంగా రికార్డు సాధించింది. 63 అడుగుల ఎత్తు గల బతుకమ్మని 11 అడుగుల వెడల్పుతో, 7 టన్నుల బరుపుతో ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. మంత్రి సీతక్క బతుకమ్మ పాట పడి అలరించారు.
కాకినాడలో భారీగా గంజాయి పట్టివేత..
కరూర్ తొక్కిసలాటకు విజయే కారణమట!
‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
వెదర్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు!
సూర్యను చూసి.. కాపీ కొట్టిన పాక్ కెప్టెన్.. విమర్శల వెల్లువ
దుబాయ్: ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచిదంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా ట్రోఫీని భారత్ తొమ్మిదోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్, భారత్‌ల మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగితే.. మూడుసార్లు విజయం భారత్‌నే వరించింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో మధ్య జరిగే మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరు జట్లు తలపడ్డాయి.
అయితే తలపడిన తొలి మ్యాచ్‌లో భారత ఆటగాలళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని పాక్ ఆటగాళ్లు రాద్ధాంతం చేశారు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఇది ఫైనల్స్‌లో తారాస్థాయికి చేరింది. పాకిస్థాన్‌కు ఎసిసి అధ్యఖ్సులు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో అతడు కోపంతో ట్రోఫీని.. భారత ఆటగాళ్లకు ఇచ్చే మెడల్స్‌ని తీసుకొని వెళ్లిపోయాడు. అయితే ఇక్కడే అసలు కథ జరిగింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తన ఫీజు మొత్తం పహల్గాం బాధితులకు, సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
దీంతో సూర్యకుమార్ తీసుకున్న నిర్ణయంపై భారతదేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. అయితే సూర్య నిర్ణయాన్ని కాపీ కొడుతూ.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా వ్యవహరించాడు. ‘ఆపరేషన్ సింధూర్’లో మరణించిన వారి కుటుంబాలను తన ఫీజు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఆపరేషన్ సింధూర్’లో మరణించింది ఉగ్రవాదులే అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ.. సల్మాన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
లంగర్‌హౌస్‌లో మహాచండీ రూపంలో అమ్మవారు
దరాబాద్: లంగర్ హౌస్, బాపునగర్ లో వేలసినా నల్లపోచమ్మ సమేత దుర్గామాత దేవాలయంలో అమ్మవారు మహాచండి దేవి రూపంలో దర్శనం ఇచ్చారు. అలాగే ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్ర సమయంలో అమ్మవారికి పల్లకి సేవాతో పాటుగా అమ్మావారికి పవలింపు సేవ కూడా చేస్తున్నాట్టు ఆలయా కమిటి సభ్యులైనా గుడిపల్లి గణేష్ తేలిపారు.
ఆల్‌రౌండ్ ప్రదర్శన.. దూబేకు ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డ్
ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును టీం ఇండియా మేనేజ్‌మెంట్ ప్రధానం చేస్తుంది. ఈ మేరకు ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి శివమ్ దూబేకి ఈ అవార్డు దక్కింది. టీం ఇండియా సహాయక బృందంలోని ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్ ఈ అవార్డు తాలుక మెడల్‌ను దూబేకు అందించారు.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో తొలి రెండు ఓవర్లలో దూబె పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ 33 పరుగులు చేసి జట్టును గెలిపిచడం కోసం కృషి చేశాడు. దీంతో దూబేకు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు దొరికింది. ఈ అవార్డు అందుకున్న సమయంలో దూబే మాట్లాడుతూ.. తనకు ఎంతో సంతోషంగా ఉందని.. తొలి ఓవర్ బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్‌కు, కోచ్ గౌతమ్ గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయడానికి చాలా ఒత్తిడికి గురయ్యానని.. భయపడ్డానని అన్నాడు. కేవలం బౌలింగ్‌పైనే దృష్టి పెట్టడంతో మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఒత్తిడి తగ్గిందని పేర్కొన్నాడు.