విదేశీ సినిమాకు ట్రంప్ షాక్.. వంద శాతం సుంకం
రేవంత్ పంజాకు కెసిఆర్ కుటుంబం నిలబడలేదు: మంత్రి జూపల్లి
శ్వేత సౌధం స్వర్ణమయం : ట్రంప్ వీడియో వైరల్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌ను 24 క్యారెట్ల బంగారం తాపడాలతో అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శ్వేతసౌధం లోని ఓవల్ ఆఫీస్ క్యాబినెట్ రూమ్‌లో భారీగా స్వర్ణ అలంకరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అందమైన భవనంగా పేరుపొందిన శ్వేతసౌధం ఇకపై అత్యుత్తమమైన భవనంగా ఇక్కడికి వచ్చిన విదేశీ నేతలను విస్తుపోయేలా చేస్తుందని తెలిపారు. కార్యాలయంలో అలంకరిస్తున్న మేలిమి అలంకరణల నాణ్యత, సౌందర్యం చూసి ఏ విదేశీ నాయకుడైనా ఆశ్చర్యపోవాలన్నారు.
శ్వేతసౌధంలో ఏర్పాటు చేయనున్న స్వర్ణ అలంకరణలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో బంగారు పూతతో ఉన్న డజన్ల కొద్దీ డిజైన్లు కనిపిస్తున్నాయి. వైట్‌హౌస్‌లో స్వర్ణతాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారం ఖర్చును ట్రంప్‌నే స్వయంగా భరించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఇటీవల పేర్కొన్నారు. అయితే ఎంతమొత్తంలో బంగారాన్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే ఓవల్ ఆఫీస్‌లో పలు చోట్ల స్వర్ణ తాపడాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా బంగారంతో అలంకరించాలనే తన కోరికను ట్రంప్ పలుమార్లు బయటపెట్టారు.
ఎపి లిక్కర్ స్కామ్ ..మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు
టిజిఎస్‌ఆర్టీసి కొత్త ఎండిగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు సంఘటనల్లో నలుగురి మృతి
టీవీకే పార్టీనే పవర్‌కట్ చేయమని కోరింది : తమిళనాడు విద్యుత్తు బోర్డు
చెన్నై : కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో కుట్ర కోణం ఉందని విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్తు బోర్డు స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతి పత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. అయితే అందుకు తాము అంగీకరించలేదని వెల్లడించారు.
సెప్టెంబర్ 27,2025 రాత్రి ఈ రోడ్డు లోని వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ , టీవీకే నుంచి లేఖ అందిందని, విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మిపేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని … విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరారన్నారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని తెలిపింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.
అయితే ఘటన అనంతరం టీవీకే మాత్రం దీనిలో కుట్ర కోణం ఉందని ఆరోపించింది. తమ నేత విజయ్ ర్యాలీ వేదికకు చేరుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారని పేర్కొంది. దీంతో అభిమానులు ఆయనను చూసేందుకు ముందుకు కదిలారని, ఈ క్రమం లోనే తొక్కిసలాట జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.