Bihar elections 2025 : బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల- రెండు దశల్లో పోలింగ్..
సామాజిక స్పృహ కలిగిన వారంతా ప్రభుత్వంతో కలిసి రావాలి : పొన్నం
ఢిల్లీ: అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించుకుని ముందుకు వెళ్తున్నాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసి రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వాస్తవంగా అన్ని రకాల రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం అని బిసి రిజర్వేషన్లపై చట్టసవరణ బిల్లు, ఆర్డినెన్స్ ను అడ్డుకుంటున్నదే బిజెపి నేతలు అని విమర్శించారు. బిజెపి నేతలు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఇప్పుడు మాట మారుస్తున్నారని, బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులను ఆమోదింపజేయాలని పొన్నం సూచించారు.
బిజెపి ఫ్యూడలిస్టు పార్టీ.. ఎస్సి, ఎస్టి, బిసి రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ హెచ్ సియూలో ఎస్సిలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని మండిపడ్డారు. శాసనసభలో మద్దతు ఇచ్చిన బిజెపి, బిఆర్ఎస్ న్యాయప్ర్రకియలోనూ సహకరించాలని, ప్రామాణికమైన లెక్కల ద్వారానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలియజేశారు. సామాజిక స్పృహ కలిగిన వారంతా ప్రభుత్వంతో కలిసి రావాలని, జనాభా ప్రాతిపదికగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల ఎవరి హక్కులకు భంగం కలగదు అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ దే విజయమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు వచ్చే రూట్లన్నీ బిజీబిజీ.. ఇటు విజయవాడ, అటు వరంగల్ హైవేలపై ట్రాఫిక్!
లిక్కర్ కుంభకోణంలో నిందితులను వదిలే ప్రసక్తి లేదు: పంచుమర్తి అనురాధ
అమరావతి: కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట్ మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డే అని టిడిపి ఎమ్మెల్సి పంచుమర్తి అనురాధ తెలిపారు. మహిళల పుస్తెలు తెంచి.. పాపపు సొమ్ము తన ప్యాలెస్ లో దాచారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాటి కుంభకోణాలు, మృతులపై నోరు మెదపలేదని ఆరోపించారు. జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం ఏదో జరిగిపోతుందని సొంత పత్రికలో రాసుకున్నారని, లిక్కర్ కుంభకోణంలో నిందితులను వదిలే ప్రసక్తి లేదని తెలియజేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వారిని జగన్ ఏం చేశారు? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్ లో మద్యం తాగి 6 మంది చనిపోతే ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు కల్తీ మద్యంతో దొరికిన వారంతా వైసిపి మూలాలున్న వారే అని పంచుమర్తి అనురాధ విమర్శించారు.
మహీంద్రా బొలెరో విడుదల: ధర రూ. 7.99 లక్షలు – మారిన 3 ముఖ్య విషయాలు ఇవే
భారత నౌకదళంలోకి మరో యుద్ధనౌక ఆండ్రోత్.. ఇందులో అనేక ప్రత్యేకతలు!
వరుసగా మూడు సెషన్లలో 1,500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్: మార్కెట్ ర్యాలీకి 5 ప్రధాన కారణాలు ఇవే
సిజెఐ గవాయ్‌పై చెప్పు విసిరబోయిన లాయర్
ఢిల్లీ: సుప్రీంకోర్టులో కలకలం సృష్టించింది. సిజెఐ బిఆర్ గవాయ్‌పై దాడికి యత్నించారు. సుప్రీంకోర్టు ఆవరణలో సిజెఐ గవాయ్‌పై లాయర్ కిషోర్ రాకేష్ చెప్పు విసిరేందుకు ప్రయత్నించాడు. కిషోర్ ను తొటి లాయర్లు అడ్డుకున్నారు. ఓ కేసు విచారణ సమయంలో సిజెఐపై లాయర్ కిషోర్ చెప్పు విసిరాడు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ కిషోర్ నినాదాలు చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని సిజెఐ గవాయ్ తెలిపారు.