శుభ్‌మాన్‌కి ఇప్పట్లో ఆ అవకాశం రాదు.. : ఉతప్ప
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో కొన్ని నెలల క్రితం టీం ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్.. తాజాగా రోహిత్ నుంచి వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం టి-20లకు వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే పొట్టి ఫార్మాట్‌లో కూడా అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పట్లో అది జరిగే పని కాదని.. టీం ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డారు.
‘‘టెస్ట్ క్రికెట్‌లో గిల్ మంచి ఆటగాడని నేను అనుకుంటున్నాను. వన్డేల్లోనూ అతడి గణంకాలు బాగున్నాయి. కానీ, ఈ స్థాయి ఆటగాడికి మరింత మెరుగైన గణాంకాలు ఉండాలని అనుకుంటున్నా. సెలక్టర్‌లు టి-20లకు కెప్టెన్‌ా శ్రేయస్ అయ్యర్ పేరును పరిశీలిస్తారని భావిస్తున్నా. పొట్టి ఫార్మాట్‌లో గిల్ ఇంకా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదు. ఆసియా కప్‌లో 2025లో గిల్ బాగా ఆడకపోవడంతో రెండో ఓపెనింగ్ స్లాట్ కోసం సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్‌ల మధ్య పోటీ నెలకొంది. గిల్ ఇంకా టి-20 జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఇప్పట్లో అతను కెప్టెన్ అవుతాడని నేను అనుకోవడం లేదు. భారత క్రికెట్‌లో రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయి. నిజాయితీగా చెప్పాలంటే.. చాలా మంది వైస్ కెప్టెన్‌లు కెప్టెన్ కాకపోవడం కూడా చూశాం కదా?’’ అని ఊతప్ప అన్నారు.
జగన్‌కు హెలికాప్టర్ ద్వారా మాకవరపాలెం చేరుకోవడానికి అనుమతి.. రోడ్‌షోకు నో పర్మిషన్!
సోదరిని పెళ్లి చేసుకున్నాడని.. దారుణంగా చంపేశారు..
గుంటూరు: తన సోదరిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని ఓ యువకుడిని యువతి సోదరుడు దారుణంగా హత్య చేశాడు. గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కుర్రా గణేశ్ అనే యువకుడిని యువతి సోదరుడితో పాటు మరో ఇద్దరు కలిసి దారుణంగా హతమార్చారు. కొలకలూరుకు చెందిన యువతిని.. విద్యుత్‌శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్న గణేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ కోరుతూ గుంటూరు నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడారు. దీంతో అంతా సద్దుమణిగిందని భావించారు. ఈ తరుణంలో గణేశ్‌ని యువతి సోదరుడు దారుణంగా కత్తులతో పొడిచి చంపారని గణేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమా.. శ్రీలీల లేదా భాగ్యశ్రీ ఎవరికి దక్కేనో..
ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హవానే నడుస్తోంది. స్టార్ హీరోలు అందరూ భారీ సినిమాలు చేయడంలో బిజీగా ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒకటి లేదా రెండు అలా చాలా అరుదుగా వస్తున్నాయి. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కంటెంట్ ఉండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసేందుకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. అలాంటి నిర్మాణ సంస్థల్లో వైజయంతి మూవీస్ ఒకటి.
‘మహానటి’, ‘సీతా రామం’, ‘కల్కి’ సినిమాలతో మంచి కామ్‌బ్యాక్ ఇచ్చింది వైజయంతి మూవీస్. ఇప్పుడు ఈ బ్యానర్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా’ అనే టైటిల్‌ను వైజయంతి మూవీస్ రిజిస్టర్ చేసిందట. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. తండ్రి, కూతురి మధ్య జరిగే భావోద్వేగ కథ ఇది అని టాక్.
అయితే ఈ సినిమా కోసం కొందరు హీరోయిన్లను పరిశీలిస్తున్నారట. వారిలో శ్రీలీల.. భాగ్యశ్రీ బోర్సే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కమర్షియల్ సినిమాల్లో వీళ్ల యాక్టింగ్‌పై చిన్నపాటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. వీళ్లను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా చేయడం అంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటుందనే చెప్పాలి.
‘కాంతార: ఛాప్టర్ 1’ పై కెఎల్ రాహుల్ ప్రశంసలు
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో.. స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీం ఇండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ చేరాడు. ఈ సినిమాను మెచ్చుకుంటూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు.
‘‘కాంతార ఛాప్టర్ 1 చూశాను. మరోసారి రిషబ్ తన ప్రతిభతో మేజిక్ చేశారు. మంగళూరు ప్రజల నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు’’ అని రాహుల్ రాసుకొచ్చాడు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ‘‘ఇది చూశాక ఎంతో గర్వంగా ఉంది. ఇది టీమ్ అందరికీ నిజంగా విన్నింగ్ మూమెంట్’’ అని పేర్కొంది. కెఎల్ రాహుల్‌కు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది.
హలో స్టూడెంట్స్.. ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేశారా? లేదా? మరికొన్ని రోజులే టైమ్!
నవ్వులు పూయిస్తున్న ‘మిత్ర మండలి’ ట్రైలర్
ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిత్ర మండలి’. కొన్నళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకోగా.. ఈ మధ్యే రిలీజైన సాంగ్స్‌కి కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ప్రధాన తారగణంతో పాటు వెన్నెల కిషోర్, సత్యల తదితరుల కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచేలా ఉంది. ఇక ఈ సినిమాను నిర్మాత బన్ని వాస్ సమర్పిస్తుండగా.. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించగా.. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన విడుదల కానుంది. మీరు కూడా మిత్ర మండలి ట్రైలర్‌ను చూసేయండి..
‘కరూర్’ ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ వీడియో కాల్
చెన్నై: టివికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్ర్భాంతికి గురి చేసింది. తాజాగా విజయ్ మంగళశారం బాధిత కుటుంబాలతో వీడియో కాల్‌లో మాట్లాడారు. త్వరలో కరూర్‌లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
కాగా, ఈ ఘటనపై ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు ప్రామాణిక నిర్వహణ విధా నిబంధనలు రూపొందించే వరకూ హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ : పేర్నినాని
అమరావతి: మందుబాబులకు కూడా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఆఫ్రికా ఫార్ములా తెచ్చి ఎపిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. టిడిపి నేతల మద్యం తయారీపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇస్తున్నారని, నకిలి మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని పేర్ని నాని సూచించారు. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ను.. ఇక నుంచి ‘ కలుగు నాయుడు’ అని పిలవాలని, ఎన్నికల ముందు బయటకొస్తాడని, ఊగిపోతాడని, జుట్టు పీక్కుంటాడని విమర్శించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులో నుంచి బయటకు రాడని పేర్నినాని ఎద్దేవా చేశాడు.