ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లాలి!
షోరూమ్ వాళ్లు స్పందించలేదని… ఓలా స్కూటీని తగలబెట్టిన కస్టమర్
గాంధీనగర్: ఓలా స్కూటీ రిపేర్ విషయంలో కంపెనీ వాళ్లు సరిగా స్పందించలేదని వాహనాన్ని షోరూమ్ ముందు కస్టమర్ తగలబెట్టాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం పాలన్‌పూర్‌లో జరిగింది. సాహిల్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమారుడితో కలిసి ఓలా బైక్‌పై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఓలా బైక్ స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. స్కూటీని రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులను ఇతర వాహనంలో ఇంటికి పంపించాడు. కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారు స్పందించలేదు. మరో వాహనంలో స్కూటీని షోరూమ్‌కు తీసుకెళ్లాడు. స్కూటీ రాడ్ విరిగిపోయిందని షోరూమ్ వాళ్లకు చెప్పాడు. షోరూమ్ నిర్వహకులు పట్టించుకోకపోవడంతో ఓలా బైక్‌కు నిప్పు పెట్టి నిరసన తెలియజేశాడు. ఓలా బైక్ రిపేర్‌కు వచ్చినప్పుడు కంపెనీ వారు పట్టించుకోవడంలేదని కస్టమర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చలో బస్సు భవన్ కు పిలుపు… బిఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్టు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్సు భవన్ కు బిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. సామాన్యులపై భారం మోపేలా పెంచిన బస్ టికెట్ చార్జీలను తక్షణమే తగ్గించాలని బస్సు భవన్ ఎదుట ధర్నాకు బిఆర్ఎస్ నాయకులు, ఎంఎల్ఎలు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గులాబీ దండు కదలిరానుంది. బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులంతా బస్సులో ప్రయాణం చేస్తూ నగర నలుమూలల నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌కు చేరుకుంటారు. చలో బస్సు భవన్ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇద్దరు నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం 8.45కు మోహిదీపట్నంలో బస్సు ఎక్కి బస్సు భవన్ కు చేరుకోవాలి, కెటిఆర్ సికింద్రాబాద్ నుంచి బస్సులో ప్రయాణం చేసి ఆర్ టిసి క్రాస్ రోడ్డు చేరుకోవాలి.
వరికోత మిషన్‌ను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు: ఒకరు మృతి
తిమ్మాపూర్: వరికోత మిషన్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుండ్రాత్ సతీష్ అనే వ్యక్తి వరికోత మిషన్‌ను డ్రైవ్ చేసుకుంటూ కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. వరికోత మిషన్‌కు క్లీనర్‌గా గుర్రాల సాగర్ పని చేస్తున్నాడు. తిమ్మాపూర్ శివారులోకి రాగానే వరికోతమిషన్‌ను ఆర్‌టిసి లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో గుర్రాల సాగర్ కిందపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డిలో పిడుగుపాటుకు రైతు మృతి
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లిలో పిడుగుపాటు రైతు మృతి చెందాడు. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అల్లి బుచ్చయ్య(50) అనే రైతు వ్యవసాయ పొలంలో పని చేస్తున్నాడు. ఉరముల మెరుపులతో భారీ వర్షం పడుతోంది. బుచ్చయ్య గడ్డి కోస్తుండగా అతడిపై పిడుగు పడడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు శోఖసంద్రంలో మునిగిపోయారు. అప్పారెడ్డిపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
రంగారెడ్డిలో పిడుగుపడి రైతు మృతి
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లిలో పిడుగుపాటు రైతు మృతి చెందాడు. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అల్లి బుచ్చయ్య(50) అనే రైతు వ్యవసాయ పొలంలో పని చేస్తున్నాడు. ఉరముల మెరుపులతో భారీ వర్షం పడుతోంది. బుచ్చయ్య గడ్డి కోస్తుండగా అతడిపై పిడుగు పడడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు శోఖసంద్రంలో మునిగిపోయారు. అప్పారెడ్డిపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయండి
నేటి నుంచి పూణేలో ఆటా పాట
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గురువారం పూణేలో ప్రారంభమయ్యే నెక్స్ షూటింగ్ షెడ్యూల్ కోసం టీం సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు. అకాడమీ అవార్డు విన్నర్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సాంగ్ ని కంపోజ్ చేశారు.
ఈ సాంగ్ కి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుంది. సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ తన పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న పెద్ది గ్రాండ్‌గా పాన్- ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.