kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXMcasinowonnetbahismilosbetoslobetsonbahissüratbetperabetgalabetrestbet海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişbetlikebetlikekulisbetkulisbetwbahiswbahiskulisbetkulisbetbetovisbetovisbetkolikbetkolikrealbahis girişyakabet girişelexbet girişkulisbet girişwinxbet girişkulisbetkalebetbetkoliktrendbetwinxbetwinxbetpadişahbetyakabetyakabetrealbahisrealbahisyakabetyakabetelexbetelexbetwinxbetwinxbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetkulisbet girişkulisbet girişvizyonbet girişroyalbetroyalbetbetticketbetticketrealbahisrealbahispadişahbetpadişahbetprizmabetprizmabetikimislibetikimislibetkulisbetkulisbetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahis

‘రాక్షసుల ఆగమనం’.. ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ అదిరిపోయిందిగా..

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తేజ్ నటిస్తున్న చిత్రం ఇది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బుధవారం తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘అసుర ఆగమనం’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

ఈ గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. గ్లింప్స్‌లోని ప్రతీ షాట్ అదిరిపోయిందిని ఫ్యాన్స్ అంటున్నారు. చివర్లో ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ చాలాసార్లు ప్రకటించారు. కానీ, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. మరి సినిమాను ఈ ఏడాది తీసుకొస్తారా..? లేదా వచ్చే ఏడాదికి వాయిదా..? పడుతుందో చూడాలి.

హృతిక్‌కు హైకోర్టులో ఊరట.. ఇకపై ఫోటోలు వాడితే..

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుతున్నారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆయనకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. వెంటనే హృతిక్ ఫోటోలను తొలగించాలని ఇ-కామర్స్ వెబ్‌సైట్లకు సూచించింది.

అయితే అనుమతి లేకుండా తన వాయిస్, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫ్యాన్స్ పేజీలలో ఉపయోగించుకుంటున్నారని హృతిక్ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. అభిమానుల పేజీలలో వాడుకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది. హృతిక్ పేరు, డ్యాన్స్ వీడియోలతో ట్యూటోరియల్స్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నటుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారు ప్రజలకు నేర్పించడం కోసం ఆ డ్యాన్స్ వీడియోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందులో వాణిజ్య ప్రయోజనం ఏమాత్రం లేదని.. ఎవరైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

ఆసీస్‌కు విరాట్, రోహిత్.. గంభీర్ లేకుండానే..

న్యూఢిల్లీ: వెస్టిండీస్ సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తొలి బ్యాచ్‌లో కొంతమంది క్రికెటర్లు ఆస్ట్రేలియాలకు పయనమయ్యారు. వీరిలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. స్టార్ బ్యాట్స్‌మెన్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు టెస్ట్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఓపెఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కొంత మంది సహాయక సిబ్బంది కూడా వీరి వెంట ఉన్నారు. అయితే తొలి బ్యాచ్‌లో జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వెళ్లడం లేదు. రెండో బ్యాచ్‌తో కలిసి సాయంత్రం ఆయన ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. ఇక ఆస్ట్రేలియాతో టీం ఇండియా మూడు వన్టేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుండగా.. అక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్ ప్రారంభం అవుతుంది.

సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా?: కవిత

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ఫోటో లేకుండానే జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తన దారి తాను చూసుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ దారులు వేరే అయినప్పుడు తన లైన్ తాను తీసుకోవడం కరెక్ట్ అని దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని తెలియజేశారు. జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని, కెసిఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదని చెప్పారు. బిఆర్ఎస్ నుంచి తన సస్పెన్షన్ కారణాలను విశ్లేషించుకున్నానని, ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా? అని ప్రశ్నించారు.  నిజామాబాద్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని..4 నెలల పాటు కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు. 

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

భిక్కనూరు: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్‌ రూట్‌లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఆ సమయంలో స్కూటీపై ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి, తాత ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు, తల్లి ఘటనాస్థలం లోనే మృతి చెందారు. తాత, నాలుగేళ్ల పాపకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ వారు కూడా మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం : చంద్రబాబు

అమరావతి: డబులు ఇంజిన్ సర్కార్ విధానాలతో ఎపికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర సహకారంతో ఎపికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై సిఎం టెలీకాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గూగుల్ డేటాహబ్ రావడంతో ప్రధాని, కేంద్రమంత్రులు చొరవ ఉందని, గూగుల్ రావడానికి మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని తెలియజేశారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకొచ్చిందని, దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు చేసిన విధ్వంసంతో ఎపి తీవ్రంగా నష్టపోయిందని, గత పాలకుల తప్పులను సరిచేసేందుకు చాలా సమయం పట్టిందని అన్నారు.

యోగాంధ్ర, అమరావతి రీసార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశామని, ఇప్పుడు ప్రధాని పాల్గొనే సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం అని కేంద్రమంత్రులకు సూచించారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని, గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని, హైల్తి, వెల్తి, హ్యాపి ఎపి సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని కోరారు. ప్రధాని మోడీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్దశ రాబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.  

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత

హైదరాబాద్: తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి (97) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శాస్వ విడిచినట్లు కుటుంబసభ్యలు చెప్పారు. 1928లో జన్మించిన బాల సరస్వతి ఆరేళ్ల వయస్సు నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నరు. ఆ పిన్న వయస్సు నుంచే ఆమె పాటలు పాడేవారు. ఆకాశవాఱి కార్యక్రమంతో తెలుగు వారికి బాల సరస్వతి పరిచయమయ్యారు ‘సతీ అనసూయ’ చిత్రంలో ఆమె తొలి పాటను పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తో పాటు పలు భాషల్లో 2వేలకు పైగా పాటలు ఆలపించారు. 

కెటిఆర్ పై విమర్శలు చేసిన ఎంపి అర్వింద్

 హైదరాబాద్: తెలంగాణలో దొంగఓట్లు తెచ్చిందే బిఆర్ఎస్ పార్టీ అని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తెలిపారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశీయులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బిఆర్ఎస్ అని అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. బోధన్ లో 42 దొంగ పాస్ పోర్టులు ఇచ్చిందని మరిచారా అని జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ దందాకు తెరలేపింది కెటిఆర్ కాదా? అని అర్వింద్ ప్రశ్నించారు.   

మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. మోడీ సంతాపం

పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ (79) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన స్వస్థలం ఖడ్పబంద్‌లో మంత్రి రవి నాయక్‌ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని పోండాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఖడ్పబంద్‌లోని నివాసానికి తరలించారు. రవి నాయక్‌కు నేతలు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఆక్ష్నకు భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

రవి నాయక్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు సంతాపం తెలియజేశారు. ‘‘గోవా మంత్రి రవినాయక్ ఆకస్మిక మరణం బాధాకరం. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసినందుకు, అంకితభావంతో ప్రజలకు సేవ చేసిందుకు ఆయన్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించంలో ఆయన ఎంతో ఆసక్తి చూపించే వారు. ఓం శాంతి’’ అని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

కోహ్లీ, రోహిత్‌కి ఇదే చివరి సిరీస్.. బిసిసిఐ రియాక్షన్ ఇదే..

టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒకరి తర్వాత ఒకరిగా అన్నట్లుగా టెస్టులు, టి-20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌లో రో-కోల జోడి తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. అయితే ఈ సిరీస్‌ తర్వాత తమకు బ్యాడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉందనే సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్‌లు వన్డేల నుంచి కూడా రిటైర్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై బిసిసిఐ రియాక్ట్ అయింది. ఢిల్లీలో మంగళవారం బిసిసిఐ ఉపాధ్యక్షఉలు రాజీశ్‌ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్‌ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్‌ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్‌ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్‌- కోహ్లికు ఆసీస్‌ సిరీస్‌ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్‌ శుక్లా పేర్కొన్నాడు.

Wordpress Free Themes and Premium WP Plugins Download