kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişbetlikebetlikekulisbetkulisbetwbahiswbahiskulisbetkulisbetbetovisbetovisbetkolikbetkolikrealbahis girişyakabet girişelexbet girişkulisbet girişwinxbet girişkulisbetkalebetbetkoliktrendbetwinxbetwinxbetpadişahbetyakabetyakabetrealbahisrealbahisyakabetyakabetelexbetelexbetwinxbetwinxbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetkulisbet girişkulisbet girişvizyonbet girişroyalbetroyalbetbetticketbetticketrealbahisrealbahispadişahbetpadişahbetprizmabetprizmabetikimislibetikimislibetkulisbetkulisbetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel giriş

ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ.. పట్టుబడిన రాజకీయ ప్రముఖులు

పోలీసుల అదుపులో 25 మంది యువకులు, 8 మంది యువతులు

లింగంపల్లి సప్తగిరి ఫామ్‌హౌస్‌లో గుట్టుగా నిర్వహణ

రూ.2.45 లక్షల నగదు, విలువైన మద్యం సీసాలు, 11 కార్లు స్వాధీనం

పట్టుబడిన వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు

అయినా..పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు

మీడియాకు సమాచారం ఇచ్చేందుకు పోలీసుల నిరాకరణ

పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

మన తెలంగాణ/మంచాల: నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ సమీపంలో గల సప్తగిరి ఫామ్‌హౌస్‌లో బుధవారం రాత్రి కిట్టీ పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది యువతులు, 25 మంది యువకులు ఉన్నారు. వారి నుండి రూ.2.45 లక్షల నగదుతో పాటు 11 కార్లు, 25 సెల్‌ఫోన్లు, విలువైన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ఫామ్‌హౌస్ నిర్వాహకుడు రుద్రశెట్టి సప్తగిరి ఈ ముజ్రా పార్టీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ముజ్రాపార్టీలో పాల్గొన్న యువతీ, యువకుల పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ మధు తెలిపారు. కాగా, ముజ్రా పార్టీ నిర్వహిస్తూ పట్టుబడిన వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. దీంతో నిందితులను మీడియా కంట పడకుండా పోలీసులు ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్ నుండి పంపించి వేశారు. మీడియా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ముజ్రా పార్టీలో పట్టుబడిన వారి పట్ల పోలీసులు చూపిన ప్రేమ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకరి ప్రాణం తీసిన రూ.10 వేలు

మన తెలంగాణ/నల్లబెల్లి: రూ.10 వేల అప్పు ఒకరి ప్రాణం పోడానికి కారణమైంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన రమేశ్, సురేష్ ఇద్దరు అన్నదమ్ములు. రమేశ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 8 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. అనంతరం గీసుకొండ మండలం, మచ్చాపురం గ్రామానికి చెందిన స్వరూప (35)తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. నాలుగు నెలల కిందట తమ్ముడు సురేష్ రూ.10 వేలు అప్పుగా రమేశ్‌కు ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో ఇటీవలే పంచాయితీ సైతం పెట్టాడు.

ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన డబ్బులు ఇవ్వాలంటూ తన అన్నతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి క్షణికావేశంలో సురేష్ కత్తితో అన్నపై దాడి చేశాడు. పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి వెళ్లగా ఆమెపై కూడా దాడికి దిగాడు.ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా.. రమేశ్‌ను మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. 

డేటింగ్ పేరుతో ఛీటింగ్

 డేటింగ్ సైట్ ద్వారా నగరంలోని మలక్‌పేటకు చెందిన యువకుడు(32)ని సైబర్ నేరస్థులు మోసం చేశారు. డేటింగ్ చేస్తామని చెప్పి బాధితుడి నుంచి రూ.6,49,840 కొట్టేసి మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యువకుడు డేటింట్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి అందులోని వివరాలు తెలుసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేశాడు. తర్వాత యువకుడికి జూలై 9వ తేదీన వాట్సాప్ కాల్ చేశారు. ఫోన్ చేసిన యువతి తన పేరు తాన్యా శర్మగా పరిచయం చేసుకుంది. రూ.1,950 చెల్లిస్తే తనతోపాటు యువతులు ఉన్న ఫ్రెండ్‌షిష్ గ్రూప్‌లో చేర్పిస్తానని చెప్పింది. దీంతో యువకుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ప్రీతి, రితిక యువకుడికి ఫోన్ చేసి పలు కారణాలు చెప్పి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. చెల్లించిన డబ్బులు తిరిగి పంపిస్తామని చెప్పడంతో బాధితుడు పలుమార్లు రూ. 6,49,840.11 పలు బ్యాంక్ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్ పంపకాల్లో తేడా రావటం వల్లనే మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సామాన్యుడికో న్యాయం మంత్రులకు ఓ న్యాయమా..? అని ప్రశ్నించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎసిబి ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ నడుచుకుంటూ వస్తే పోలీసులు కేసు పెట్టారని, తమ పార్టీ నేత క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్టు పెడితే పది కేసులు పెట్టారని మండిపడ్డారు. మంత్రికి సంబందించిన మనిషిపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. డెక్కన్ సిమెంట్ వారిని బెదిరించిన సిఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి,కొండా సురేఖ ఒఎస్‌డి సుమంత్‌పై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు కొండా సురేఖ నివాసం వద్ద ప్రేక్షకులుగా మారిపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఉత్తమ్,రేవంత్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయట పడుతాయని అన్నారు.సచివాలయంలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యవహారాలు ప్రైవేట్ గెస్ట్ హౌజుల్లో జరుగుతున్నాయని ఆరోపించారు. రోహిన్ రెడ్డి,సుమంత్ గన్‌లు పెట్టి ఎలా బెదిరిస్తారు..? అని నిలదీశారు.

వారి దగ్గరకు తుపాకులు ఎలా వచ్చాయని అడిగారు. కొండా సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయటపడ్డాయని వెల్లడించారు.కమిషన్ల కోసం మంత్రులు బాహాటంగా కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. అడ్లూరి లక్ష్మణ్,వివేక్,పొన్నం ప్రభాకర్,సీతక్క,పొంగులేటిలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. మాఫియా డాన్‌ల చేతికి రాష్ట్రం వెళ్లిందా..? అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులతో ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన బానోతు రవి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు కట్టలేదని ఆరోపించారు. తెలంగాణ భవన్ ముందట ఇంటెలిజెన్స్ పెట్టె బదులు రోహిణ్ రెడ్డి,ఫహీమ్ ఖురేషి,తిరుపతి రెడ్డి గెస్ట్ హౌజ్‌ల దగ్గర నిఘా పెట్టొచ్చుకదా..? అని అడిగారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక్క భూ యాజమాని సుఖంగా లేరని, ఆర్‌ఆర్ టాక్స్ భాదితులు ఎక్కువయ్యారని ఆరోపించారు. గురుకులాల్లో మరణ మృదంగం కొనసాగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, మాఫియా పాలన పోవాలంటే రేవంత్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలవకపోతే మాఫియా పాలన పెరిగిపోతుందని అన్నారు. కేబినెట్ సమావేశంలో మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసి తమకు పాలన చేతకావడం లేదని తప్పుకోవాదని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మాఫియా కేబినెట్ సంస్కృతి మొదలైందని ఆరోపించారు.

సచివాలయం ఎదుట సెర్ప్ ఉద్యోగులు ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని సెర్ప్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ఐకెపి విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విఓఏలకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయం ఎందుట ఆందోళనకు దిగారు. విఓఏలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విఓఏ ఉద్యోగ భద్రత, రూ.20 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారన్న ఆ హామిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్యూరెన్స్, సోషల్ సెక్యూరిటీ సౌకర్యంతో పాటు సిసి పోస్టులకు విఓఏలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 58ను వెంటనే రద్దు చేయాలన్నారు. డిజిటలైజేషన్ దృష్ట్యా ల్యాప్టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ బిల్లు సదుపాయం కల్పించాలన్నారు.

కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: మహేశ్ కుమార్ గౌడ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో బూత్‌స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్‌ఎస్ శకం ముగిసిందని, జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపిక జరిగిందన్నారు. కెటిఆర్ పదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడైనా ఊహించారా..? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్ట కాలంలో తోడుగా ఉండే నాయకుడు కావాలని నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రజలకు కావాల్సింది సెంటిమెంట్ కాదని, అభివృద్ధి అని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చింది కెటిఆర్ కాదా? అని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. యువత చెడు వ్యస నాలకు బారిన పడిన విషయం కెటిఆర్ మరిచిపోలేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని, జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే నవీన్‌యాదవ్ గెలవాల్సిన అవశ్యకత ఉందన్నారు. జూబ్లీహిల్స్ సీటు గెలవడం ఖాయమని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిసిసి అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో ఏఐసిసి ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ ఎంపి అజారుద్దీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. హుజూర్‌నగర్ లో మెగా జాబ్‌మేళా

మన తెలంగాణ/హుజూర్‌నగర్: పట్టణంలోని పేర్ల్ ఇన్పినిటి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి వారి సహకారంతో 150 కంపెనీలతో మెగా జాబ్‌మేళాను ఈ నెల 25న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు. క్యూర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, లాంటి ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేసిన వారు అలాగే చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులని.. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జాబ్‌మేళాకు వచ్చేటప్పుడు ఐదు జిరాక్స్ ప్రతులతో హాజరవ్వాలని తెలిపారు.

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం : మోడీ

అమరావతి: అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. నన్నూరు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్ లో నేను జన్మించానని, విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశిస్సులు పొందానని, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని కొనియాడారు. సైన్స్,ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఎపిలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ కు సరైన విజన్.. సరైన నాయకత్వం అవసరం ఉందని, ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ రూపంలో ఎపికి శక్తివంతమైన నాయకత్వం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని, 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని  మోడీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని, ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని ప్రశంసించారు. 2047 నాటికి మన దేశం.. వికసిత్ భారత్ గా మారుతుందని, 21 శతాబ్దం, 140 కోట్ల భారతీయుల శతాబ్దం అని ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందని అన్నారు. ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమని అన్నారు. ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుందని, దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగిందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందని, ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోందని మోడీ స్పష్టం చేశారు.   

బిసి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో నిలబడవు : తలసాని

హైదరాబాద్: బిసిలకు చట్ట పరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించం అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే.. నామినేషన్లు వేయకండి అని రిజర్వేషన్లపై మోసగించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎల్లుండి నిర్వహించే బంద్ కు బిఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని, బంద్ కు ఆర్టిసి, మెట్రో, దుకాణాలు, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరూ బంద్ లో పాల్గొనాలని, ఎల్లుండి జరగాల్సిన సునీత నామినేషన్ కార్యక్రమం వాయిదా వేశారని తెలియజేశారు. బిసి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో నిలబడవు అని చెబుతూనే ఉన్నామని అన్నారు. అన్ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం డ్రామాలు ఆడాయని తలసాని విమర్శించారు. 

120 మంది నక్సల్స్ తో కలిసి లొంగిపోనున్న ఆశన్న

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత  ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నాడు. ఆశన్న అలియాస్ రూపేష్ సుమారు 120 మంది నక్సల్ తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. ములుగు జిల్లాకు చెందిన ఆశన్న1991 లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.  1999 లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం అధిపతిగా నియామకమయ్యారు. 2003లో అలిపిరిలో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పేల్చివేత, 2000 అప్పటి హోంమంత్రి మాధవరెడ్డిని చంపిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆశన్న ఉన్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో మంగళవారం గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. 

Wordpress Free Themes and Premium WP Plugins Download