Trending
మునిగిన శివాలయం… మూసీలో చిక్కుకున్న పూజారి కుటుంబం
హైదరాబాద్: మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పొంగిప్రవహిస్తోంది. 30 ఏళ్ల తరువాత అత్యంత భారీగా మూసీ ప్రవాహం ఉందని అధికారులు వెల్లడించారు. మూసీ వరద తాకిడికి శివుడి దేవాలయం మునిగిపోయింది. వరద పొటెత్తడంతో శివాలయం పైనే పూజారి కుటుంబం తలదాచుకుంది. సహాయం కోసం శివాలయం పైకెక్కి పూజారి ఆర్తనాదాలు చేస్తోంది. పురానాపూల్ వద్ద స్మశానవాటిక నీటిలో మునిగిపోయింది. లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ లోకి వరద నీరు చేరడంతో జాతిపిత సమాధి మునిగిపోయింది.
భారీ వర్షాలు కురవడంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. చాదరఘాట్ వద్ద చిన్ని బ్రిడ్జి వరద ప్రవాహంలో మునిగిపోయింది. ఎంజిబిఎస్ లో మోకాల్లోతు వరద ప్రవహిస్తుంది రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షానికి హైదరాబాద్ విలవిలలాడిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ తీరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూసీ ఉధృతితో పరివాహక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అప్పుడు కొట్టుకపోయాడు… ఇప్పుడు మృతదేహం లభ్యం
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలలో కొట్టుకుపోయిన మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 13 రోజులు తర్వాత నాగోల్ సమీపంలోని మూసీ నద వద్ద మృతదేహం లభించింది. ఒక్క మృతదేహాన్ని కూడా వెతలేకపోయారని కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తడంతో మామ, అల్లుడ్లు అర్జున్, రామా కొట్టుకపోయిన విషయం తెలిసిందే. అర్జున్ మృతదేహం 75 కిలో మీటర్ల దూరంలోని వలిగొండలో లభించింది. శుక్రవారం నాగోల్ సమీపంలోని మూసీలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి ఈ నెల 14వ తేదీన కొట్టుకుపోయిన రామాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
నల్లగొండలో అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో యూరియాను అక్రమంగా తరలిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి యూరియా లోడ్‌ను అక్రమంగా తరలిస్తూ ఫెర్టిలైజర్స్ షాపు యజమాని, స్థానిక రాజకీయ నాయకుడు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలోని ప్రియాంక ఫెర్టిలైజర్స్ షాపుకు యూరియా లోడ్ వచ్చింది. అర్ధరాత్రి సమయంలో లారీ నుండి ఆటోలోకి యూరియాను అక్రమంగా తరలిస్తుండగా రైలు షాపు యజమానిని పట్టుకున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో యూరియా లారీని పక్కదారి పట్టిస్తూ కొందరు రాజకీయ నాయకులు దొరికారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో యూరియా కోసం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అక్రమ తరలింపుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని వారు మండిపడుతున్నారు.
యోగా కోసం ప్రత్యేక పరిషత్..! 4 ప్రాంతాల్లో ప్రచార కేంద్రాలు
అరే ఏంట్రా ఇది… అప్పర్ బెర్త్‌లో అండర్వేర్లు, బనియన్లు ఆరేసుకున్నాడు!
Google : గూగుల్‌కి 27ఏళ్లు! చిన్న ఆలోచన నుంచి కోట్లాది మంది రోజు వాడే సెర్చ్ ఇంజిన్ వరకు..
ప్రయాణికులు ఎంజిబిఎస్ బస్టాండుకు రావొద్దు: సజ్జనార్
హైదరాబాద్: మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజిబిఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిందని టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఈరోజు ప్రయాణికులు ఎంజిబిఎస్ కు రావొద్దు అని సూచించారు. ఎంజిబిఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని తెలియజేశారు. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జెబిఎస్ నుంచి నడుస్తున్నాయని, వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నడుస్తున్నాయని, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. పొరపాటున ఎమ్ జి బిఎస్ కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్ని లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని సజ్జనార్ వివరించారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రయాణికులు వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకు ఎంజిబిఎస్ కు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
నీట మునిగిన ఎంజిబిఎస్ బస్టాండ్
హైదరాబాద్: మూసీ నది పొంగి ప్రవహిస్తుండడంతో ఎంజిబిఎస్ బస్టాండ్ నీటిలో మునిగిపోయింది. ఎంజిబిఎస్ బస్టాండ్ లో నీళ్లు మోకాల్లోతు రావడంతో రాకపోకలను నిలిపివేశారు. బస్టాండు లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కు కపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బయటికి రాలేక లోపల ప్రయాణికులు ఉండిపోయారు. బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులు తీసుకొని వచ్చేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులు ఒక్కొక్కరుగా చేతులు పట్టుకొని బయటికి వస్తున్నారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిన వరద తీవ్రత పెరిగింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండి పేట గేట్లు ఎత్తడంతో వరద బీభత్సం సృష్టించింది. మున్సిపల్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. మూసీ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవాహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.