Trending
మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్ఎఫ్‌డీబీ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో చేరనున్న ఆంధ్రప్రదేశ్!
బిసిసిఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నిక
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నికలయ్యారు. ముంబైలో జరిగిన బిసిసిఐ వార్షిక సమావేశంలో అధ్యక్షుడిగా మిథున్ ఎంపికయ్యారు. మిథున్ ఢిల్లీ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్‌గా వ్యవహరించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా రఘురామ్ భట్, జాయింట్ సెక్రటరీగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాలను ఎంపిక చేశారు.
మిథున్ ఇప్పటివరకూ భారత్ అరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 157 మ్యాచులు ఆడి 9,714 పరుగులు చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా బిసిసిఐ అధ్యక్షుడిగా మిథున్ ఎంపిక కావడం విశేషం.
రామ్‌చరణ్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ‘పెద్ది’ టీమ్
హైదరాబాద్: గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తెలుగు సినిమాలోకి హీరోగా అడుగుపెట్టి 18 సంవత్సరాలు పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగారు. అయితే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ రామ్ చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో చరణ్ రైలు పట్టాలు దాటుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మా పెద్ది ఇండస్ట్రీలోకి వచ్చి 18 ఏళ్లు పూర్తి కావడం మాకు ఎంతో సంతోషం. తెరపైన ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే.. బయట ఎంతో వినయ విధేయతతో ఉంటారు. తనకంటే ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పర్చుకున్నారు. మాకంతో ఉత్సాహాన్ని కలిగించి సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ది నుంచి చాలా సర్‌ప్రైజ్‌లు వస్తాయి’’ అని పెద్ది చిత్ర యూనిట్ పేర్కొంది.
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా పెద్దిని దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 మార్చి 27 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది
న్యూయార్క్ ను మరిపించే నగరం కడతా: రేవంత్
హైదరాబాద్: తనకు ఇక్కడ భూములు ఉన్నందువల్లే ఫ్యూచర్ సిటి కడుతున్నానని అంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన కోసం కాదని భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ అని అన్నారు. ఫ్యూచర్ సిటి డెవలప్ మెంట్ అథారిటీ భవనానికి సిఎం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రావిర్యాల- ఆమన్ గల్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 సిఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముందుతరాల కోసం ఆలోచించారని, అందువల్లే హైటెక్ సిటి, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఒఆర్ఆర్ వచ్చాయని తెలియజేశారు.
చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతుంటారని, ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయి గురించి చెప్పుకుంటామని అన్నారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలని, ఎన్నాళ్లు విదేశాల గురించి చెప్పుకుంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా అని సూచించారు. తనకు పదేళ్లు సమయం ఇవ్వండని.. న్యూయార్క్ ను మరిపించే నగరం కడతానని, 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? అని రేవంత్ ప్రశ్నించారు.
అభివృద్ధి పనుల వల్ల కొందరికి ఇబ్బందులు కలగవచ్చునని, భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ? అన్ని అవకాశాలు ఉన్నాయని, అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయబోతున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటి నుంచి చైన్నైకి బుల్లెట్ ట్రైన్ వయా అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని, ఫ్యూచర్ సిటీలో 500 ఫ్యార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది తన స్వప్నం అని, హైదరాబాద్ లో ప్రస్తుతం 80 ఫ్యార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయని అన్నారు. ఫ్యూచర్సి సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని, చిన్న చిన్న విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు అని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, తదితరలు పాల్గొన్నారు.
Mumbai rains : ముంబైలో భారీ వర్షాలు- ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్! ప్రజలు ఉక్కిరిబిక్కిరి..
ఏపీ పర్యటనకు రాబోతున్న ప్రధాని మోదీ – కూటమి నేతలతో కలిసి రోడ్ షో, డేట్ ఫిక్స్….!
బిటి రోడ్డు వేయించాలని వినతి
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాటిమట్ల నుండి సదర్శాపురం వరకు బి టి రోడ్డు వేయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్ డి విద్యా సాగర్ ను శనివారం కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ తెలిపారు. పాటిమట్ల నుండి సదర్ షాపూర్ వరకు బి టి రోడ్డు వేయించాలి అని కోరగా తప్పకుండ బిటి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని కుమార్ పేర్కొన్నారు.