Trending
విండీస్‌తో టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా
అహ్మదాబాద్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ని 162 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పేసర్లు మహ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాషించారు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా జవగల్ శ్రీనాథ్ రికార్డును సమం చేశాడు.
బుమ్రా, శ్రీనాథ్ తలో 24 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో (25), ఇషాంత్ శర్మ (27), మహ్మద్ షమీ (27) ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక మ్యాచ్‌లో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో గ్రీవ్స్‌దే 32 అత్యధిక స్కోర్. ప్రస్తుతం భారత్ 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ (50), గిల్ (14) ఉన్నారు.
‘కాంతార ఛాప్టర్ 1’ పై.. ఎన్టిఆర్ ప్రశంసలు
రిషబ్ శెట్టి హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ సినిమాను అభినందిస్తూ.. జూ.ఎన్టిఆర్ పోస్ట్ పెట్టారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
‘‘అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నందకు ‘కాంతార ఛాప్టర్ 1’ టీమ్‌కు నా అభినందనలు. ముఖ్యంగా రిషబ్‌శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. ఆయనపై నమ్మకంతో ఈ ప్రాజెక్టును నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌తో పాటు చిత్ర బృందంలోని ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతారా ఛాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ వేడుకతకు ఎన్టిఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
ఇక 2022లో వచ్చిన కాంతారకు ఈ సినిమాను ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడులైన ఈ సినిమా థియేటర్ చూసి జనాలు ఆధ్యాత్మిక అనుభూతితో బయటకు వస్తున్నారు. మరి కాంతారా లాగా ఈ సినిమా సూపర్ హిట్ అయి.. భారీగా కలెక్షన్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పండగవేళ విషాదం.. దేవదర్శనానికి వెళ్తూ.. తండ్రి, కొడుకు దుర్మరణం
ఉరవకొండ: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండగ వేళ జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఉరవకొండ పాతపేటకు చెందిన సుంకన్న(40), భార్య కల్పన, కుమారుడు సన్నీ, కుమార్తె భవాని ద్విచక్ర వాహనంపై వజ్రకరూరు మండలం కడమలకుంటలో సుంకలమ్మ ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్యాపిలి వద్ద గుర్తు తెలియని వాహనం.. వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుంకన్న, సన్ని(8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కల్పన, భవానీని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. పండగపూట చోటు చేసుకున్న ఈ ఘటన బాధత కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.
విశాఖలో ఈదురుగాలుల బీభత్సం – ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, తీరం వెంబడి అల్లకల్లోలం…!
కొడుకు పేరు చెప్పిన వరుణ్ దంపతులు.. ఏం పేరంటే..
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్ దసరా రోజు శుభవార్త తెలిపారు. వరుణ్-లావణ్య దంపతులకు సెప్టెంబర్ 10న పండంటి మొగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి బారసాల జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్వదినాన.. తమ కుమారుడి పేరును వరుణ్ దంపతులు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ‘ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ అనే పేరు పెట్టాం. మీ అందరి దీవెనలు కావాలి’ అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు.
2017లో ‘మిస్టర్’ అనే సినిమాలో వరుణ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. అక్కడ ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వీరిద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ప్రభుత్వం ఉద్యోగం కోసం.. బిడ్డను సమాధి చేసిన తల్లిదండ్రులు..
ప్రభుత్వం ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడే పుట్టిన చిన్నారిని సజీవ సమాధి చేసిన ఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకుంది. కన్నతల్లి కూడా ఇందుకు సహకరించింది. అడవిలో శిశువు ఏడుపును స్థానికులు విని రక్షించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిశువు తల్లిదండ్రులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి ఉపాధిని పరిమితం చేస్తూ.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలకు తండ్రైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బబ్లూకు తన ఉద్యోగం పోతుందనే భయం పట్టుకుంది. మూడో కొడుకు ఉన్నట్లు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, అతడి భార్య మళ్లీ గర్భం దాల్చింది. దీంతో శిశువు పుట్టగానే చంపేద్దామని, లేదంటే తన ఉద్యోగం పోతుందని భార్య రాజకుమారిని కూడా ఒప్పించాడు. సెప్టెంబర్ 23 తెల్లవారుజామున భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బబ్లూ చిన్నారిని తీసుకెళ్లి అడవిలో బండరాళ్ల మధ్య సజీవ సమాధి చేశాడు.
మూడు రోజుల అనంతరం చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. శిశువుకు చింద్వారా జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
‘చంద్రబాబు గారు… కనీసం మీకు చీమ కుట్టినట్లైనా లేదా..?’ ఆల్మట్టి ఎత్తు పెంపుపై వైఎస్ జగన్ ప్రశ్నలు
చెలరేగిన భారత బౌలర్లు.. వెస్టిండీస్ ఆలౌట్
అహ్మదాబాద్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో కెప్టెన్ ఛేజ్, హోప్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నించారు. కానీ, భారత బౌలర్ల ముందు వాళ్ల ఆశలు ఫలించలేదు.
హోప్(26)ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఛేజ్(24) సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో జెస్టిన్ గ్రీవ్స్ పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. కానీ, అతని ప్రయత్నాన్ని బుమ్రా విఫలం చేశాడు 32 పరుగుల వద్ద గ్రీవ్స్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 44.1 ఓవర్లలో వెస్టిండీస్ 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీశారు.
‘సంబరాల ఏటి గట్టు’ ప్రీ గ్లింప్స్.. మీరు ఓ లుక్కేయండి..
హైదరాబాద్: ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాల తర్వాత హీరో సాయి దుర్గ తేజ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్రస్తుతం అతను చేస్తున్న చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. రోహిత్ కెపి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో సినిమా చూడాలనే ఉత్సాహం నెలకొంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అంతగా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. అయితే దసరా పండగ సందర్భంగా గురువారం సినిమా ప్రీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నట్లు ఇందులో ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మిస్తున్నారు. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.