Trending
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత
దంచికొట్టిన జడేజా.. ధోనీ రికార్డును దాటేశాడు..
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దంచికొట్టాడు. విండీస్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు చేశాడు.176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో జడేజా ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతేకాక.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును దాటేశాడు. టెస్ట్ మ్యాచుల్లో సిక్సుల విషయంలో జడేజా ధోనీని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో జడేజా 5 సిక్సులు కొట్టాడు. దీంతో తన టెస్ట్ కెరీర్‌లో 80 సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ధోనీ (78 సిక్సులు)ని దాటేశాడు. ఇక జడేజా కంటే ముందు స్థానాల్లో రోహిత్ శర్మ (88), రిషబ్ పంత్ (90), వీరేంద్ర సెహ్వాగ్(91)లు మాత్రమే ఉన్నారు. వీరిలో ప్రస్తుతానికి రిషబ్ పంత్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.
సోదరి పెళ్లికి హాజరుకాని అభిషేక్.. కారణమిదే..
ఆసియాకప్‌లో టీం ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ అభిషేక్ శర్మ. టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే అభిషేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. అతడి సోదరి కోమల్ శర్మ వివాహం లుథియానాకు చెందిన వ్యాపారవేత్త లవీశ్‌తో అమృత్‌సర్‌లో జరిగింది. ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. అయితే అభిషేక్ మాత్రం ఈ వివాహానికి వెళ్లలేదు.
అందుకు కారణం లేకపోలేదు.. శుక్రవారం ఆస్ట్రేలియా ఎ, ఇండియా ఎ మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ జట్టులో అభిషేక్ కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం అతడు బుధవారమే కాన్సూర్ చేరుకున్నాడు. దీంతో సోదరి వివాహానికి హాజరు కాలేకపోయాడు. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టి-20లు జరుగనున్నాయి.
దసరా ధమాకా.. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు
హైదరాబాద్: దసర పండగ అంటేనే తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ మద్యం అమ్మకాలు జరుగుతాయి. మందుబాబులు మత్తులో మునిగి తేలుతుంటారు. అయితే ఈసారి దసరా పండగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం షాపులు మూతబడ్డాయి. కానీ, చాలా వరకూ ముందే రోజే మద్యం కొనుగోలు చేసి పండగ రోజు ఎంజాయ్ చేశారు. దీంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి.
సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేయగా, అక్టోబర్ 1వ తేదీన రూ. 86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. ఇక సెప్టెంబర్ 26 తేదీ నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. శుక్రవారం మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఒక్కరోజే రూ.300 కోట్ల మద్యం కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో భారత్
అహ్మదాబాద్:vzఆట ముగిసింది. ఈ రెండు రోజుట్టో ప్రత్యర్థి జట్టుపై భారత్‌దై పైయి. తొత బౌలింగ్‌లో విండీస్ కేవలం 162 పరుగులకే ఆలౌట్ చేిసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేస్తోంది. రెండో రోజు భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. కెఎల్ రాహుల్(100), ధృవ్ జురేల్(125), రవీంద్ర జడేజా(104 నాటౌట్) శతకాలతో భారత స్కోర్‌ను పరుగులు పెట్టించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. దీంతో ఈ ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. క్రీజ్‌లో జడేజా (104), సుందర్ (9) ఉన్నారు. వెస్టిండీస్ బౌలింగ్‌లో ఛేజ్ 2, సీల్స్, వారికాన్, పైర్రే తలో వికెట్ తీశారు.
ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ – పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నుంచంటే..?
నా కుతురిని న్యూడ్ చిత్రాలు పంపమని అడిగారు: అక్షయ్ కుమార్
ముంబై: సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రతీ రోజు ఎవరో ఒకరు దాని బారిన పడుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. చాలా మంది సెలబ్రిటీలు కూడా సైబర్ నేరాల వల్ల బాధింపబడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన జీవితంలో సైబర్ నేరాల వల్ల ఎలాంటి కష్టాలు వచ్చాయో వెల్లడించారు. సైబర్ నేరాపై అక్షయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్‌లైన్ గేమ్‌ల మాటున తన కుమార్తె కూడా సైబర్ వేధింపులకు గురైందని అక్షయ్ తెలిపారు. ముంబైలో సైబర్ అవేర్‌నెస్ మంత్ కార్యక్రమంలో అక్షయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘నా 13 ఏళ్ల కుమార్తెకూడా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుండేది. కొన్నిసార్లు పరిచయం లేని వ్యక్తులతో ఆడాల్సి ఉంటుంది. తొలుత బాగా ఆడుతున్నావంటూ సందేశం వచ్చింది. అనంతరం ఎక్కడ ఉంటారు.. అమ్మాయా? అబ్బాయా? అని అడిగారు. అమ్మాయి అని రిప్లై ఇవ్వగానే న్యూడ్ ఫోటోలు పెట్టాలని అడిగారు. నా కుమార్తె ఫోన్ స్విచాఫ్ చేసి నా భార్యకు విషయం చెప్పింది. సైబర్ నేరాలు ఇలా ప్రారంభమై బెదిరింపులు, వేధింపులు ఎదురవుతాయి. నా కుమార్తెకే కాదు దేశంలో చాలా మందికి జరుగుతోంది. చదువుల్లో కూడా సైబర్ నేరాలపై సబ్జెక్ట్ ఉంటే బాగుంటుంది. సైబర్ భద్రత గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యం’’ అని అక్షయ్ కుమార్ తనకు ఎదురైన చేధు అనుభవం గురించి తెలిపారు.
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం – నలుగురు మృతి, అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్లు
విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు: కన్నబాబు
అమరావతి: నర్సీపట్నం మెడికల్ కాలేజీని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి సందర్శిస్తారని వైసిపి మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలో జరిగిన పనులను జగన్ పరిశీలిస్తారు అని అన్నారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన చేస్తారని, వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక చరిత్ర అని కొనియాడారు. విద్య, వైద్య రంగాలను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేస్తున్నారని,10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. తన మనుషులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని, ప్రైవేటీకరణను వైఎస్ఆర్ సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలియజేశారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, కళ్లున్నా కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవగాహనతో మాట్లాడాలని కన్నబాబు సూచించారు. స్పీకర్ సందర్శిస్తే కాలేజీ నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం లేకుంటే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారని, చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు ఛీ కొడుతున్నా సిగ్గు లేదని ధ్వజమెత్తారు. జగన్ పై కక్షతో బాబు మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.