kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXMcasinowonnetbahismilosbetoslobetsonbahissüratbetperabetgalabetrestbet海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişbetlikebetlikekulisbetkulisbetwbahiswbahiskulisbetkulisbetbetovisbetovisbetkolikbetkolikrealbahis girişyakabet girişelexbet girişkulisbet girişwinxbet girişkulisbetkalebetbetkoliktrendbetwinxbetwinxbetpadişahbetyakabetyakabetrealbahisrealbahisyakabetyakabetelexbetelexbetwinxbetwinxbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetkulisbet girişkulisbet girişvizyonbet girişroyalbetroyalbetbetticketbetticketrealbahisrealbahispadişahbetpadişahbetprizmabetprizmabetikimislibetikimislibetkulisbetkulisbetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahis

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలంలో విషాదం

మన తెలంగాణ/కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, ఎంచగూడెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఇటికాల నర్సయ్య=స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత=శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి దసరా పండుగకు వచ్చారు. కుటుంబ సభ్యులందరూ వారి బంధువులు చనిపోవడంతో వేరే గ్రామానికి వెళ్లారు. దీంతో వీరిద్దరూ ఇంటి వద్దనే ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్ద బహిర్భూమికి వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. బావి వద్ద చెప్పులు, బట్టలు ఉండటంతో గ్రామస్థులు బావిలో వెతకడంతో ఇటికాల రితిన్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తగూడ ఎస్‌ఐ రాజ్‌కుమార్ స్వయం రంగంలోకి దిగి గ్రామస్థుల సాయంతో మరో బాలుడు జతిన్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

దొంగను వెంటబడి తరిమికొట్టిన బాలిక

నేటి తరంలో పిల్లలు మొబైల్‌ ఫోన్లలో, గేమ్స్‌లో మునిగిపోయి ఉండగా చింతల్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన 13ఏళ్ల భవాని అనే బాలిక అసాధారణ ధైర్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. పట్టపగలే చోరీకి యత్నించిన దొంగను ప్రాణాలకు తెగించి అడ్డుకుని, దొంగతనాన్ని విఫలం చేసింది. చింతల్ భగత్ సింగ్ నగర్‌లోని రోడ్ నంబర్ 12లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న కావలి భవాని, తమ ఇంటి కింద పోర్షన్ లో ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్ దంపతుల తాళం వేసి బయటకు వెళ్ళారని తెలుసుకుని ఈ అవకాశాన్ని గమనించిన ఓ దొంగ, ఇంటి తాళం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. కింది ఇంట్లో ఏదో చప్పుడు వినిపించడంతో పైన ఉన్న భవానికి అనుమానం వచ్చి కిందికి దిగి వచ్చింది. ఇంట్లో దొంగను చూసి భయపడకుండా నువ్వు ఎవరంటూ సూటిగా ప్రశ్నించింది , వెంటనే అక్కడి నుండి పారిపోదాం అనుకున్న ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది.

భవాని వెంటపడి కొద్ది దూరం వెంబడించింది. భవాని ధైర్యాన్ని చూసి భయపడ్డ దొంగ, ఏమీ దొంగతనం చేయకుండానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన చూసిన చుట్టుపక్కల కాలనీ ప్రజలు భవాని ధైర్యానికి ప్రశంసల జల్లు కురిపించారు. ఇంటివారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యం చూపించడం గొప్ప విషయమని, భవాని లాంటి పిల్లలు సమాజానికి స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. భవాని చేసిన సాహసం ఇప్పుడు ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. ధైర్యానికి చిహ్నంగా నిలిచిన ఈ చిన్నారి చర్య సమాజానికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

బిర్లా సైన్సు సెంటర్ కు సెగోడెన్ ఏనుగు దంత శిలాజం

రాష్ట్రంలోని సింగరేణి గనుల్లో లభించిన సెగోడెన్ ఏనుగు దంత శిలాజాన్ని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం బిర్లా సైన్సు సెంటర్ కు అప్పగించారు. దీని ప్రదర్శన కోసం సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫెవిలియన్ ను శనివారం బలరాం సెంటర్ చైర్మన్ నిర్మల బిర్లా తో కలసి ప్రారంభించారు. 2021 లో సింగరేణి శాస్త్రవేత్తలు మేడిపల్లి వద్ద దీనిని కనుగొన్నారని బలరాం అన్నారు. ముందు తరాల కు మన జీవజాలం గురించి తెలిసేలా దీనిని ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దాదాపు 6 వేల సంవత్సరాల క్రితం నుంచి 11 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ సెగోడెన్ ఏనుగులు మన రాష్ట్రంలో ఉండేవని ఇప్పుడు పూర్తిగా అంతరించాయని అన్నారు. బిర్లా సైన్సు సెంటర్ పురావస్తు శాఖ సంచాలకులు మృత్యుంజయ రెడ్డి మాట్లాడుతూ బిర్లా సైన్సు సెంటర్ లో విద్యార్థుల అవగాహన కోసం పలు ఏర్పాట్లు చేశామన్నారు. సెగోడెన్ ఏనుగుల కాలం నాటి వృక్షాల శిలాజలను కూడా ఇక్కడ ఉంచామన్నారు. డైనోసరియం ప్రదర్శన శాల ఆవరణలో నూతనంగా సింగరేణి సంస్థ అందించిన దంతాల శిలాజాన్ని విద్యార్థుల సందర్శనకు అనుమతిస్తామన్నారు.

‘కె-ర్యాంప్’ ట్రైలర్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చించేశాడు..

గత ఏడాది ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది మార్చిలో ‘దిల్ రుబా’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈసారి గట్టిగా సక్సెస్‌ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ‘కె-ర్యాంప్’ సినిమాతో ముందుకొచ్చాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నవ్వులు పూయిస్తోంది. కిరణ్ యాక్టింగ్ చించేశాడని అభిమానులు అంటున్నారు. హీరోయిన్ యుక్తి తరేజా కూడా తన నటనతో మెప్పించింది. ఇక ట్రైలర్‌లో అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ముద్దు సీన్లు ఉన్నాయి. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ ఈ సినిమాను నిర్మించారు.

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు

న్యూఢిల్లీ: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోడీని కలిసినట్లు రామ్ చరణ్ సోషల్‌మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు.

ఆర్చరీ లీగ్‌ ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించారు. ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ ఈ లీగ్‌లో పోటీ పడ్డాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

రానా సమర్పణలో బూతు సినిమా.. పక్కా ‘ఎ’ సర్టిఫికేట్..

ఈ మధ్యకాలంలో సినిమాల్లో అడెల్ట్ కంటెంనట్ క్రమంగా పెరిగిపోతుంది. ఇంతకాలం వెబ్ సిరీస్‌లకు పరిమితమైన ఈ అడల్డ్ కంటెంట్ ఇప్పుడు సినిమాకు వచ్చేస్తుంది. సెన్సార్ బోర్డు అలాంటి సినిమా కత్తిరింపులు వేస్తున్నా.. మరికొన్ని సినిమాలకు మాత్రం ‘ఎ’ సర్టిఫికేట్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

‘35’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వదేవ్ హీరోగా, బింధుమాధవి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. ఈ సినిమాని శశాంక్ శ్రీవాస్తవ్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో బూతు సన్నివేశాలు లేకపోయినా.. బూతులు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఇక పోతే ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిర్మించడం విశేషం. రానా ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. టీజర్‌లో ‘కిడ్స్ పక్కకెళ్లి ఆడుకోండి’, ‘పాన్ మసాలా మూవీ’, ‘జానర్ అడగొద్దు’ వంటి క్యాప్షన్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అంతేకాక చిత్రం విడుదల తేదీ ఆక్టోబర్ 31, నవంబర్ 14, డిసెంబర్ 5 తేదీలను పేర్కొని.. ఏ తేదీ కావాలో మీరే నిర్ణయించుకోమన్నారు. మరి టీజర్ చూపించినట్లే సినిమాలో కూడా బూతులు ఉంచుతారా.. అనేది వేచి చూడాలి.

గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకమని ఎన్నోసార్లు చెప్పాం: ఉత్తమ్

హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకెక్కిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలో ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా హనుమ కొండలో ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినప్పటికి వరిసాగులో రికార్డు సాధించామని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల నుంచి ఒక్క చుక్క కూడా నీరు ఎత్తిపోయలేదని తెలియజేశారు. బిఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకమని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని, కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపునకు కూడా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కృష్ణా జలాల్లో 511 టిఎంసిలు ఎపి ప్రభుత్వం తీసుకోవచ్చని సంతకాలు చేసిందని, కృష్ణాజలాల్లో తెలంగాణకు కేవలం 299 టిఎంసిలు చాలని సంతకం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.  ఇప్పుడు కృష్ణా జలాల్లో 70 శాతం తెలంగాణకే కేటాయించాలని తాము వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. కృష్ణా బేసిన్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  

బనకచర్ల కోసం డీపీఆర్ టెండర్లు పిలుస్తుంటే మీరేం చేస్తున్నారు..? సీఎం రేవంత్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. బనకచర్ల, ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.బనకచర్ల అప్రైజల్‌కు ఎలా వస్తుందని..?  కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఎట్ల స్వీకరిస్తుందని నిలదీశారు.

జడేజా మ్యాజిక్.. రెండో రోజు ఆట ముగిసేసరికి స్కోర్ ఎంతంటే..

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా మ్యాజిక్ చేశాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ.. బాల్‌తో విండీస్ ఆటగాళ్లకు హడలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మరోసారి తడబడింది. 21 పరుగుల వద్ద ఓపెనర్ క్యాంప్‌బెల్(10) సుదర్శన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత చంద్రపాల్, అథనాజ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, 87 పరుగులు వద్ద చంద్రపాల్(34) రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే 106 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్‌లో అథనాజ్‌(41) జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, ఆ వెంటనే కెప్టెన్ ఛేజ్(0) జడేజా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో 43 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో హోప్(31), ఇమ్లాచ్(14) ఉన్నారు.

టి స్క్వేర్ నిర్మాణం తెలంగాణ ఐకానిక్ గా ఉండాలి: రేవంత్

హైదరాబాద్: టి స్క్వేర్ లో ఆపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్ లెట్లు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. నవంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులు ప్రారంభించాలని అన్నారు. ఐసిసిసిలో ఎఐ హబ్, టి స్క్వేర్ పై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టి స్క్వేర్ నిర్మాణం తెలంగాణ ఐకానిక్ గా ఉండాలని, ఎఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ కోసం స్టాఫ్ కాలేజ్ ను పరిశీలించాలని సూచించారు. ఎఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ప్రముఖ ఎఐ సంస్థల ప్రతి నిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.