Trending
పోలియో చుక్కలు వేసిన కాసేపటికే పసి బాలుడు మృతి
సంగారెడ్డి: పోలియో చుక్కలు వేసిన కాసేపటికే పసి బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో జరిగింది. పల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే 3 నెలల కుమారుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. పోలియో చుక్కలు వేశాక ఇంటికి వచ్చామని, బాలుడు వాంతులు చేసుకున్నాడని వివరించారు. పాలు తాగకుండా ఏడుస్తూనే ఉండడంతో వైద్య సిబ్బందిని నిలదీశామని, అందరికి వేసిన చుక్కలే ఈ బాలుడికి వేశామని తెలిపారు. చిన్నారి ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మూడు నెలల బాబు శవ పరీక్ష నిర్వహిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని నెటిజన్లు సూచిస్తున్నారు. పోలీయో చుక్కలతో చనిపోవడం అనేది జరగదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కడపలో రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య
అమరావతి: ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో మూడో నంబర్ ట్రాక్ పై గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చొని ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గూడ్స్ పైలెట్ సమాచారం మేరకు ఆర్ పిఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Cheaper flight tickets : ఈ క్రెడిట్ కార్డులతో తక్కువ ధరకే విమాన టికెట్లు పొందొచ్చు!
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్
షేక్‌పేట్ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ
నామినేషన్లకు 21వ తేదీ తుది గడువు
నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్.. నవంబర్ 14న కౌంటింగ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేయనున్నది. నేటి నుండి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీ సా.3 గం.ల వరకు నామినేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. 22న నామినేషన్ల పరిశీలన (స్కృటినీ), ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది.
ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. షేక్‌పేట్ తహసీల్దారు కార్యాలయాన్ని నామినేషన్లను స్వీకరించేందుకు ఎన్నికల కార్యాలయంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,367. స్త్రీలు 1,91,590, ఇతరులు 25 మంది ఓటర్లున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు సమయంలో ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు కన్నా మించి వాహనాలను అనుమతించరు. నామినేషన్ సమర్పించే సమయంలో గరిష్టంగా 5 (అభ్యర్థి సహా)మంది వ్యక్తులనుమాత్రమే అనుమతిస్తారు. ఒకే ప్రవేశ మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ మార్గదర్శకాలను జిల్లా ఎన్నికల అధికారులు జారీచేశారు.
ఆన్‌లైన్ ద్వారా..
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు ఇది నియోజకవర్గానికి చెందిన ఓటరైనఒక్కరిని ప్రతిపాదకుడిగా తీసుకోవచ్చునని తెలిపారు.- స్వతంత్ర/గుర్తింపులేని పార్టీ అభ్యర్థులు నామినేషన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పదిమంది ఓటర్లను ప్రతిపాదకులుగా తీసుకోవాలి.- ఇతర నియోజకవర్గ అభ్యర్థులు.. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ఓటర్ల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈఎన్‌సిఓఆర్‌ఈ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్లైన్‌లో నింపవచ్చునని అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి.
ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా సంజీవ్ కుమార్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసిఐ) ఐఆర్‌ఎస్ అధికారి సంజీవ్‌కుమార్ లా ల్‌ను ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా నియమించింది.ఎన్నికల వ్యయ పర్యవేక్షకులు ఎన్నికల ఖ ర్చుల పర్యవేక్షణలో భాగంగా అన్ని కార్యకలాపాలను సమీక్షించడంతో పాటు, ఎన్నికల వ్యయం పై కట్టుదిట్టమైన పర్యవేక్షణను కొనసాగిస్తారు.
ఎస్‌ఆర్‌ఎస్‌పి ఫేజ్2కు దామోదర్ పేరు
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి/తుంగతుర్తి : శ్రీరామ్‌సాగర్ రెండో దశకు మాజీ మం త్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మా ట్లాడుతూ.. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు దామోదర్‌రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ దాదా పు నాలుగు దశాబ్దాల పాటు పార్టీ జెండాను ఈ ప్రాంతంలో ఎగురవేసిన నాయకుడు దా మోదర్‌రెడ్డి అని అన్నారు.
ప్రస్తుత రాజకీయా ల్లో ప్రతి ఒక్కరు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ, రామ్‌రెడ్డి దా మోదర్ రెడ్డి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తులను పేదలకు పంచడమే కాకుండా, తన అత్త గారి కుటుంబ ఆస్తులను కూడా వేలాది ఎకరాలను తుంగతుర్తి ప్రాంత ప్రజలకు దానం చేశారని కొనియాడారు. దామోదర్ రెడ్డికి ఎఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలియజేయాల్సిందిగా తెలిపారని, వారి తరపున సర్వోత్తమ్ రెడ్డికి, దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.
ఫ్లోరైడ్, కరువు ప్రాంతమైన తుంగతుర్తికి శ్రీరామ్‌సాగర్ జలాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్‌ఆర్‌ఎస్‌పి ఫేజ్2కు పెడుతున్నట్లు ప్రజల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. కాగా, సంతాప సభకు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిలు, మాజీ హోంమం త్రి జానారెడ్డితోపాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరై దామన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
బీహార్‌లో ఫిఫ్టీ ఫిఫ్టీ.. బిజెపి, జెడియు చెరో 101 స్థానాల్లో పోటీ
చిరాగ్ ఎల్‌జిపికి 29 చోట్ల అవకాశం
మాంజీ, కుశావా పార్టీలకు ఆరేసి సీట్లు
ఎక్కువ సీట్ల కోసం చిరాగ్ బేరసారాలు
న్యూఢిల్లీ / పాట్నా : బీహార్‌లో ఎన్‌డిఎ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సన్నద్ధం అయింది. ఈ దిశలో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు ఖరారు అయింది.ఈ మేరకు బిజెపి, జెడియులు చెరిసగం అంటే 101 స్థానాలలో పోటీకి దిగుతాయి. కాగా ఎన్‌డిఎలో అంతర్భాగమైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) 29 స్థానాలలో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో తమ కూటమి భాగస్వామ్యపక్షాలలో పూర్తి స్థాయిలో సీట్ల ఖరారు జరిగిందని కేంద్ర మంత్రి, బీహార్ ఎన్నికలకు బిజెపి ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం విలేకరులకు చెప్పారు. ఇప్పుడు కుదిరిన అవగావహన మేరకు కూటమిలోని ఇతర చిన్నపార్టీలు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ నాయకత్వపు హిందూస్థానీ అవామీ మోర్చా( హామ్) ఆరు స్థానాల్లో, ఉపేంద్ర కుశావా సారధ్యపు రాష్ట్రీయ లోక్ మోర్చా ఆరు స్థానాల్లో పోటీకి వీలు కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ఇతర సీనియర్ నేతలతో కూడిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ ముగిసిందనే విషయాన్ని తెలిపింది.
సామరస్య, సృహద్భావపూరిత వాతావరణంలో అన్ని పార్టీలూ సీట్ల పంపిణీకి అంగీకారం తెలిపాయి. ఎన్‌డిఎ నాయకులు, కార్యకర్తలు ఈ సర్దుబాట్ల ప్రక్రియ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి బీహార్ ఎన్‌డిఎ సర్కారు పరిధిలోకి వచ్చేందుకు రంగం సిద్ధం అయిందని కేంద్ర ఎన్నికల కమిటీ తెలిపింది. సీట్ల విషయంలో ఈసారి బిజెపికి చిరాగ్ పాశ్వాన్ పార్టీ, మాంజీ, కుషావాలు ఒకటి రెండు రోజులు చుక్కలు చూపారు. ఎక్కువ సంఖ్యలో సీట్లు కోసం పట్టుపట్టారు. క్రమేపీ బిజెపి సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు పలువురు వారిని రాజీ మార్గానికి తీసుకువచ్చినట్లు వెల్లడైంది. బీహార్‌లో ఎన్‌డిఎకు, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌కు మధ్య పోటీ నెలకొని ఉంది.
కేంద్ర మంత్రి పాశ్వాన్ తమ పార్టీకి పది అంతకు మించి ఇవ్వాల్సిందే అని, లేకపోతే తమ పార్టీ ప్రాబల్యం సన్నగిల్లుతుందని వాదించినట్లు తెలిసింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీలలో రెండు దశల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు , ఫలితాల వెల్లడి జరుగుతుంది. చాలా రోజుల ముందునుంచే బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టడం, అనేక రైల్వే లైన్ల వరాలు ప్రకటించడంతో ఈసారి ఎన్‌డిఎ తిరిగి ప్రజల వద్దకు వీటి ఆసరాతో ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు చెందిన జెడియు 115 స్థానాల్లో , బిజెపి 110 స్థానాల్లో పోటీ చేశాయి. కాగా అప్పుడు చిరాన్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జెపి ఎన్‌డిఎతో సంబంధం లేకుండా విడిగా బరిలోకి దిగింది. ఇక ప్రతిపక్ష మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాట్ల చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆర్జేడీ 130కి మించి సీట్లకు పట్టుతో ఉంది. కాంగ్రెస్‌కు 50 సీట్లు అంటోంది. ఈ విషయం తేలాల్సి ఉంది.
అర్ధరాత్రి ఆడపిల్లకు ఆరుబయట ఏం పని?
దుర్గాపూర్‌లో మెడికో రేప్ కేసుపై సిఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆడపిల్లలను అర్ధరాత్రి బయటకు పంపొద్దంటూ హితవు
కోల్‌కతా: దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. రాత్రిళ్లు విద్యార్థినులను వెలుపలకు వెళ్లేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు. రాత్రి 12-30 గంటల సమయంలో ఆమె ఎందుకు కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లారని ప్రశ్నించారు. ఆ విద్యార్థిని బాధ్యత పూర్తిగా ప్రైవేటు మెడికల్ కాలేజీదేనని స్పష్టం చేశారు. ప్రతివిషయానికీ తమ ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాద ని మమత పేర్కొన్నారు.
ఈ ఘటన పట్ల మమతా బెనర్జీ దిగ్భ్రమ వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎవ్వరినీ క్షమించబోమని హెచ్చరించారు. రాత్రి పూట ఆడపిల్లలు బయటకు వెళ్లనివ్వకూడదు. వారు కూడా తమ భద్ర త విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హితవు చెప్పారు. అత్యాచారం జరిగిన ప్రతి సందర్భంలోనూ, రాష్ట్ర ప్రభుత్వా న్ని ఎందుకు బదనాం చేస్తున్నారని మ మత ప్రశ్నించారు. నెల్లాళ్ల క్రితం ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం నాడు కోల్ కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై ఆ స్పత్రి వెనుక ఏకాంత ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది.
ఒడిశాకు చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు దుర్గాపూర్ చేరుకుని న్యూ టౌన్ షిప్ పో లీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన బిడ్డకు బెంగాల్‌లో రక్షణ లేద ని, ఆ మెను తమ రాష్ట్రానికి తీసుకుపోతామని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఆదివా రం తెల్లవారుజామున ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి షేక్ రి యాజ్ ఉద్దీన్, షేక్ ఫిర్దౌష్, అప్పు అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానంతో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆపరేషన్ బ్లూస్టార్ అతిపెద్ద తప్పు
న్యూఢిల్లీ: 1984లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్, సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబ రం పేర్కొన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయాన్ని తీవ్రవాదుల కబ్జా నుంచి స్వా ధీనం చేసుకోవడానికి అప్పట్లో ఆపరేషన్ బ్లూ స్టా ర్ నిర్వహించారు. ఆ నిర్ణయానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారీ మూల్యం చెల్లించారని చిదంబరం వాపోయారు. ఆయితే ఆ నిర్ణయాన్ని ఇం దిర ఒక్కరే తీసుకోలేదని పేర్కొన్నారు. అది సై న్యం, పోలీసులు, నిఘావర్గాల సమిష్టి నిర్ణయం. దీనికి ఇందిరాగాంధీ ఒకరినే నిందించలేమని కేం ద్ర మాజీ మంత్రి అన్నారు.
తాను ఏ సైనిక అధికారులను తాను అగౌరవపరచడం లేదని, కానీ స్వర్ణదేవాలయం నుం చి టెర్రరిస్ట్ లను నిర్మూలించేందుకు అది తప్పుడు మార్గం అని చిదంబరం పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని తిరిగి పొందే సరైన మార్గాన్ని తాము చూపామన్నారు. బ్లూ స్టార్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ తన జీవితాన్నే బలి పెట్టవలసి వచ్చిందని తాను అంగీకరిస్తున్నానని చిదంబరం అన్నారు. కసౌలిలో ఒక సాహిత్య కార్యక్రమంలో ప్రసంగిస్తూ చిదంబరం ఈ ప్రకటన చేశారు.
చిదంబరం ప్రకటనను ఖండించిన కాంగ్రెస్
చిదంబరం ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు కన్పిస్తోందని, చిదంబరం ప్రకటన బిజేపీ పంథాను ప్రతిధ్వనిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషీద్ అల్వి ఆరోపించారు. ఆపరేషన్ బ్లూస్టార్ సరైనదా, కాదా అనేది చ ర్చనీయాంశం. కానీ, 50ఏళ్ల తర్వాత చిదంబరం కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి. ఇందిరాగాంధీ తప్పుడు అడుగు వేశారనడం ద్వారా ఆయన మోదీ మాటనే వల్లెవేస్తున్నట్లు కన్పిస్తోందని రషీద్ అల్వీ విమర్శించారు. చిదంబరంపై ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయన ఏదైనా ఒత్తిడిలో ఉన్నారా అని తాను అనుమానిస్తున్నానని రషీద్ అల్వి అన్నారు.
చిదంబరం వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. పార్టీ ద్వారా ఎన్నో కీలక పదవులు అందుకున్న సీనియర్ నాయకుడు బాధ్యతతో మాట్లాడాలని, పార్టీని ఇరుకునపెట్టే ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొన్నాయి. ప్రస్తుత పంజాబ్ గురించి మాట్లాడుతూ, ఖలిస్తాన్ నినాదాలు చాలా తగ్గిపోయాయి. ఆర్థిక ఇబ్బందులే రాష్ట్రానికి ప్రధాన సమస్య అని చిదంబరం అన్నారు.
స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్
పంజాబ్‌లో తీవ్రవాద నాయకుడు జర్నేల్ సింగ్ భింద్రన్ వాలే నాయకత్వంలో వేర్పాటు వాదులను అణచి వేసేందుకు ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆద్వర్యంలో 1984 జూన్ 1నుంచి జూన్ 8వరకూ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. స్వర్ణదేవాలయ సముదాయం, అకాల్ తఖ్త్‌లో తలదాల్చుకున్న భింద్రన్ వాలే ఆయన అనుచరులు కాల్పులకు తెగపడడంతో సైన్యం ఆపరేషన్‌ను నిర్వహించింది. ఆపరేషన్‌లో ట్యాంక్‌లు, భారీ ఫిరంగులను కూడా ఉపయోగించాల్సివచ్చింది. వందలాదిమంది టెర్రరిస్ట్‌లు, సైనికులు, పౌరులు కూడా చనిపోయారు. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణదేవాలయం పై దాడి సిక్కు సమాజాన్ని తీవ్రంగా బాధించింది. ఆగ్రహజ్వాలలను రేకెత్తించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు 1984 అక్టోబర్ 31న హత్య చేశారు.