kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxroyalbetroyalbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabet

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

గడ్చిరోలి: ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన తర్వాత నుంచి మావోయిస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. భద్రతా బలగాలు, మావోల మధ్య జరిగే ఎధురుకాల్పుల్లో కొందరు మావోలు మృతి చెందుతుంటే.. మరికొందరు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులకు లొంగిపోయారు. 60 మందితో కలిసి మల్లోజుల గడ్చిరోలి పోలీస్‌ల ఎదుట లొంగిపోయినట్లు ఛత్తీస్గడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నాం. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు’’ అని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పిస్తామని విజయ్ శర్మ హామీ ఇచ్చారు. 1970లో మల్లోజుల అలియాస్ సోను అలియాస్ భూపతి మావోయిస్టు పార్టీలో చేరారు. మావోయిస్టు అగ్రనేత కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీకి ఆయన సోదరుడు. 

ఉగ్రవాదుల ఉచ్చులో పాకిస్తాన్

పొరుగు దేశం పాకిస్తాన్ ఇంటాబయటా పెను సమస్యలతో సతమతమవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసి, ఆ మంటల్లో చలికాచుకుందామనుకున్న దాయాదిని ఇప్పుడవే మంటలు చుట్టుముట్టి, ఊపిరి సలపనివ్వడం లేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దేశాన్ని ఎలా గట్టెక్కించాలో తెలియక పాక్ పాలకులు సతమతమవుతుంటే, ఉగ్రవాదం పెనుభూతమై కోరలు సాచి కబళించబూనడంతో దిక్కుతోచడం లేదు. గాజాలో పెచ్చుమీరుతున్న మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ వారం రోజుల క్రితం ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన తెహ్రీక్ -ఇ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ముఖ్య నగరాల్లో చేసిన ఆందోళనలు ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతగా క్షీణించిందో కళ్లకుకట్టాయి.

ఆ అల్లర్లను అణచివేశామన్న సంతృప్తి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఒక్క రోజైనా మిగలకుండానే అఫ్గానిస్తాన్‌తో ఘర్షణలు పెచ్చుమీరాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఊపిరులూది, ఇండియాపైకి ఎగదోసి వినోదం చూద్దామనుకున్న దాయాది దేశానికి తెహ్రీక్-ఇతాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) సీమాంతర ఉగ్రవాదం ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచి పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ పాక్ ప్రభుత్వానికి కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఇటీవల జరిపిన దాడుల్లో సైనిక నష్టం జరగడంతో పాక్ భగ్గుమంది. టిటిపి ప్రధాన నేతలను మట్టుబెట్టే ఉద్దేశంతో కాబూల్ పై బాంబు దాడులకు తెగబడటంతో తాలిబాన్ ప్రభుత్వం ఎదురు దాడులు ప్రారంభించింది.

ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్, ఆపరేషన్ సిందూర్ ను తప్పుబట్టిన పాకిస్తాన్‌కు సీమాంతర ఉగ్రవాదం ఎంతటి ప్రమాద హేతువో ఇప్పుడు అర్థమవుతున్నట్లుంది. వాస్తవానికి అఫ్గానిస్తాన్ -పాకిస్తాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు మొదటినుంచీ అంతంతమాత్రమే. ఇరుదేశాలనూ విభజిస్తున్న డ్యురాండ్ రేఖను తాము గుర్తించబోమంటూ అఫ్గాన్ మొదటినుంచీ తెగేసి చెబుతూ వస్తోంది. తాలిబాన్ల చేతికి పగ్గాలు వచ్చాక ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థే. 2007లో ఏర్పడిన ఈ సంస్థ షియా వ్యతిరేక ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని, ఆత్మాహుతి బాంబుదాడులకు పాల్పడటంతో అనతికాలంలోనే నిషేధానికి గురైంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఆక్రమణలకు మద్దతు పలికిందన్న కారణంగా పాకిస్తాన్ పై టిటిపి కక్ష గట్టింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు టిటిపిని దారికి తెచ్చేందుకు తాలిబాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఏ ఒప్పందమూ కుదరకముందే ఆయన జైలుపాలయ్యారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రధాని షెహబాజ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే లక్ష్యంగా టిటిపి మరింతగా పేట్రేగిపోతోంది.

గత ఎనిమిది నెలల్లో టిటిపి 2414 మంది పాక్ పౌరులను హతమార్చినట్లు పాకిస్తాన్‌కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ సంస్థ అధ్యయనంలో తేలింది. తాజాగా టిటిపి పాక్ సైనికులను లక్ష్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అఫ్గాన్-, పాక్ రాజకీయ సంక్షోభంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఆశిస్తున్న చైనా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే విధంగా పాక్ తో వైరం అఫ్గానిస్తాన్‌ను భారత్‌కు దగ్గర చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్నప్పుడే పాక్- అఫ్గాన్‌ల మధ్య ఘర్షణలు తలెత్తడం కాకతాళీయమే అయినా, భారత్ కు ఈ పరిణామం కలిసివచ్చే అంశమే. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ దగ్గర కావడం ఒకింత హర్షించదగిన పరిణామం. అఫ్గాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా, పూర్తిగా ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకోలేదు.

తాజాగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి పర్యటనతో సంబంధాలు మళ్లీ బలోపేతం కానున్నాయి. కాబూల్‌లో నాలుగేళ్ల క్రితం మూసివేసిన దౌత్య కార్యాలయాన్ని మళ్లీ తెరిచేందుకు భారత్ అంగీకరించడం ఒక శుభపరిణామం. అఫ్గానిస్తాన్ పునర్ నిర్మాణంలో భారత్ ఇప్పటికీ తన వంతు పాత్ర పోషిస్తోంది. తాజా బడ్జెట్ లోనూ 25 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు అఫ్గాన్‌తో స్నేహం వెదకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా ఉపయోగపడుతుందని ఆశిద్దాం.

బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో ఫ్యాన్స్ డిమాండ్

నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అభిమానులు కాన్వాయ్ అడ్డుకుని నినాదాలు చేశారు.

ఈశాన్యంలో రగులుతున్న విద్వేషాగ్నులు

ఎన్‌సిఆర్‌బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలు గులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజా లెక్కలు తెలిస్తే, అసలు నిజం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్‌లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది.

  

ఈ మధ్య విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక 2023 మన దేశంలో అంతర్గత భద్రత, సామాజిక ప్రభావాలను తేటతెల్లం చేస్తోంది. గణాంకాలను పరిశీలించేటప్పుడు కాస్తజాగ్రత్త తప్పదు. రాష్ట్రాలలో విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో రిజిస్టర్ అయ్యే కేసులు, రిపోర్ట్ అయ్యే కేసులలో తేడా ఉంటుంది. విస్తృత జాతీయ ధోరణులు విధానపరంగా తక్షణం తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నాయి.సైబర్ నేరాల పెరుగుదల, షెడ్యూల్డ్ తెగలవారిపై తీవ్రంగా పేరిగిన నేరాలు, మహిళలు, చిన్నపిల్లలపై నేరాల ప్రభావం ఈ నివేదికలో సుస్పష్టమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఈ నేరాలు భిన్నంగా ఉన్నాయి. జాతిపరమైన హింసాకాండ, డిజిటల్ విస్తరణతో పెరిగిన సైబర్ నేరాలు, నేరాలను అరికట్టడంలో సంస్థాగత బలహీనతలు ఈ ప్రాంతాన్ని సాంప్రదాయ, కొత్తనేరాల కేంద్రాలుగామార్చాయి. మణిపూర్‌లో జాతుల పరమైన హింస, అసోంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, అనేక రాష్ట్రాలలో మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలు మొత్తంమీద ఈ సమాజాలను, పాలనా యంత్రాంగాలను తీవ్ర వత్తిడికి గురిచేస్తున్నాయి.

2023లో భారతదేశం అంతటా షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టిలు)పై నేరాలు 28.8 శాతం పెరిగాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక స్పష్టం చేసింది. ఇదేదో ప్రమాదవశాత్తూ పెరిగినది కాదు. ఇది ఓ ప్రాంతంలో తిరుగుబాటుకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మణిపూర్‌లో ఎస్‌టిలపై నమోదైన నేరాలు 2022లో ఒకటి ఉంటే, 2023 లో 3,399 నేరాలకు పెరిగాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం 2023 మే నుంచి మణిపూర్ రాష్ట్రాన్ని అతలాకుతలంచేసి జాతిపరమైన హింసగా చెప్పవచ్చు. మణిపూర్ సంక్షోభం వేలాదిమందిని నిరాశ్రయులను చేసింది. గిరిజన గృహాలు, సంస్థలు విధ్వంసానికి దారితీసింది. శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. పాలకుల అసమర్థతను బహిర్గతం చేసింది. మణిపూర్‌లో హింసను తరచుగా జాతి ఘర్షణగా చిత్రీకరించినా అక్కడ హత్యలు, దాడులు గృహ దహనాలు, లైంగిక నేరాలు, ఆస్తుల దోపిడీ వంటి దారుణమైన నేరాలు జరిగాయి. గిరిజన జనాభాను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశాయని ఎన్‌సిఆర్‌బి డేటా స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాలు అక్కడి ప్రజల బాధలకు కొలమానాలు, అసమర్థ పాలకుల పనితీరుకు నిదర్శనాలు.

మణిపూర్‌తో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్‌లోనూ గిరిజనులపై అధికంగా నేరాలు జరిగినట్లు నమోదైంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని గిరిజనులపై జరిగిన దాడులకు, ఈశాన్యప్రాంతంలో దాడులకు తేడా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో గిరిజనులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.అందువల్ల ఇక్కడి గిరిజనులపై నేరాలు స్వల్ప సంఘటనలు కావు, బహుళ జాతులలో తీవ్ర ఉద్రిక్తతలకు సంకేతం. రాజకీయాలను, వనరులకు సంబంధించిన ఘర్షణలను తీవ్రతరం చేస్తాయి. అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో గిరిజనుల గుర్తింపు రాజకీయాలు, భూమి పరులపాలు చేయడం, వలసల వంటి ప్రశ్నలతో ముడిపడి ఉంది. అందువల్ల ఎన్‌సిఆర్‌బి డేటాను శాంతిభద్రతల సమస్యలుగా కాక, పాలనాపరమైన, విధానపరమైన నిర్లక్ష్యానికి సంకేతంగా చూడాలి. స్పష్టమైన రక్షణాపరమైన యంత్రాంగం లేకపోవడం, సామాజికపరమైన హింసపై నెమ్మదిగా స్పందించడం వల్ల గిరిజనుల ఉనికికి ముప్పు ఏర్పడింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం 2023 లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 31.2 శాతం పెరిగిపోయాయి. దేశంలో డిజిటల్ పోలీసింగ్ మౌలిక సదుపాయాల కొరత ఇందుకు ప్రధాన కారణం. సైబర్ నేరాల స్థాయిని ఈ డేటా పూర్తిగా ప్రతిబింబించడం లేదు. ఈశాన్య భారతంలో ఈ మధ్య విపరీతంగా విస్తరించిన ఇంటర్‌నెట్ వ్యాప్తి, సైబర్ నేరాలను అరికట్టే చట్టపరమైన సంస్థలకు పెను సవాల్‌గా మారాయి. డిజిటల్ ఇండియా ప్రచారం, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల విస్తరణ కొత్త సమస్యలను సృష్టించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఆర్థిక మోసాలు, ఫిషింగ్ మోసాలు, ఆన్‌లైన్ ఉద్యోగాల రాకెట్లు, సోషల్ మీడియా దుర్వినియోగంవల్ల లైంగికపరమైన నేరాలు పెరిగిపోయాయని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో సైబర్ నేరాలు అరికట్టడంలో శిక్షణ పొందిన సిబ్బంది, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కొరత తీవ్రంగా ఉంది. సైబర్ నేరాలు సర్వవ్యాప్తి అవుతున్నాయని ఎన్‌సిఆర్‌బి హెచ్చరిక ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సాధారణ నేరాలపై దృష్టి పెట్టే పోలీసు వ్యవస్థలు, ఆన్‌లైన్ మోసం, వేధింపులు వంటి నేరాల పరిష్కారంలో ఇబ్బందిపడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలలో సైబర్‌నేరాలపట్ల అవగాహన పెంచేందుకు ప్రచారం, డిజిటల్ అక్షరాస్యత, పాఠశాల స్థాయిలో సైబర్ నేరాల పట్ల భద్రత బోధించే విద్య తక్కువగా ఉన్నాయి. డిజిటల్ విస్తరణ వేగానికి, డిజిటల్‌పరమైన నేరాలను అరికట్టే యంత్రాంగానికి మధ్య పొంతన లేదు. నేరాలను అరికట్టే యంత్రాంగం కన్నా ఎన్నో రెట్ల వేగంతో నేరస్థులు దోపిడీ చేసేస్తున్నారు.

2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం పెరిగాయని, దేశవ్యాప్తంగా 1,77,335 కేసులు నమోదయ్యాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక హెచ్చరిస్తోంది. 96 శాతం కేసులలో నేరస్థులు బాధితులకు బాగా పరిచయమున్నవారు. పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా ఇళ్లు, పాఠశాలల పొరుగునే ఉన్న ప్రాంతాలలో జరుగుతున్నాయని చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలలోనూ ఈ నేరాలు ఎక్కువే. చట్టపరంగా నిషేధం ఉన్నా, అసోంలో బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపుల రేటు దేశంలోనే అత్యధికం. లైంగిక నేరాలనుంచి పిల్లల రక్షణ చట్టం (పోస్కో) ముఖ్యంగా టీనేజ్‌లో పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాల విషయంలో దుర్వినియోగం చర్చలకు దారితీసింది. ఈ నేరాల విషయంలో పిల్లలకు, పెద్దలకూ కూడా అవగాహన పెంచాల్సిన తక్షణ ఆవశ్యకతను ఎన్‌సిఆర్‌బి స్పష్టం చేసింది. ఇక్కడి సామాజిక కట్టుబాట్ల కారణంగా బాధితులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. మహిళలపై నేరాలు జాతీయ స్థాయిలో 0.4 శాతం అంటే స్వల్పంగా పెరిగాయి. వరకట్నాలకు సంబంధించిన మరణాలు మాత్రం 14.9 శాతం పెరిగాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పోలిస్తే, ఇక్కడ వరకట్నాలు తక్కువే. కానీ, మహిళలపై హింస, గృహ హింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమ రవాణా తీవ్రస్థాయిలోనే ఉంది. మానవ అక్రమ రవాణా కేసులు నమోదైన రాష్ట్రాలలో దేశంలోనే అసోం ఒకటి. మహిళలు, మైనర్ల శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ కోసం రాష్ట్ర, జాతీయ సరిహద్దులను దాటి మానవ రవాణా చేస్తున్నారు.

ఎన్‌సిఆర్‌బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలుగులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజా లెక్కలు తెలిస్తే, అసలు నిజం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్‌లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఏజెన్సీల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థను మరింత బలహీనపరుస్తోంది. సరిహద్దు నేరాలు ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, మయన్మార్ అంతటా నెట్‌వర్క్ కలిగిన నేరస్థులకు కళ్లెం వేసేందుకు పటిష్టమైన నిఘా అవసరం. విదేశీ సర్వర్‌ల ద్వారా సాగే సైబర్ నేరాలను అరికట్టేందుకు, సిఇఆర్‌టి -ఇన్, సిబిఐకు చెందిన సైబర్ యూనిట్ వంటి జాతీయ సంస్థల సహకారం ఎంతైనా అవసరం.

ఈశాన్య రాష్ట్రాల దృక్కోణం నుంచి ఎన్‌సిఆర్‌బి 2023 నివేదికను పరిశీలిస్తే మూడు సందేశాలు అందుతాయి. 1. పాలనాపరమైన వైఫల్యం దుర్బలత్వాన్ని పెంచుతుంది. జాతి ఘర్షణలను రాజకీయంగా, పాలనాపరంగా పరిష్కరించకపోతే, నేరపూరిత విపత్తులుగా మారతాయని మణిపూర్ హింస స్పష్టం చేస్తుంది. ముందుగానే ఘర్షణలను పరిష్కరించడం, సమాజ పరంగా సంభాషణలు జరపడం, తటస్థ పోలీసింగ్‌తో కూడిన యంత్రాంగం నిర్మాణం అవసరం. 2. డిజిటల్ నేరాలకు కళ్లెం వేసేందుకు డిజిటల్ పాలనా యంత్రాంగం అవసరం. సాధారణ పోలీసులు వాటిని అరికట్టలేరు. ఈశాన్య రాష్ట్రాలలో సైబర్ ల్యాబ్‌లు, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు, సైబర్ అవగాహనకోసం ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాలలో పెట్టుబడి పెట్టాలి. స్కూళ్లు, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో డిజిటల్ విజ్ఞానం చేర్చి, విద్యార్థులలో సైబర్ నేరాల వైపు పోకుండా అవగాహన పెంచాలి. 3. పేద, బలహీన వర్గాలను రక్షించేందుకు చట్టపరమైన సంస్కరణలతోపాటు, సామాజిక సంస్కరణలు కూడా అవసరం. పోస్కో, వరకట్న నిషేధ చట్టం వంటి వాటిని సున్నితంగా అమలు చేయాలి. ఎన్‌సిఆర్‌బి 2023 డేటా కేవలం లెక్కలు అని కొట్టి పారేయకూడదు. అది అభివృద్ధి చెందుతున్న సమాజం ఆందోళనలకు అద్దం. ప్రభుత్వాలు, చట్టం అమలు చేసే సంస్థలు, పౌరసమాజం ముందున్న సవాల్ ఏమిటంటే, ఈ లెక్కలను పరిమితి చేసి, భద్రత, న్యాయబద్ధమైన విధానాన్ని అనుసరించడం. ఎన్‌సిఆర్‌బి నివేదిక నేరాల గురించి కన్నా పాలనా సంక్షోభం గురించి ఎక్కువ చర్చించింది. ఈశాన్య భారతంలో ఉన్నంత పాలనా పరమైన సంక్షోభం భారతదేశంలో ఎక్కడా కన్పించదు. ఈ సంక్షోభాన్ని, సమస్యను తక్షణం పరిష్కరించడం ఎంతైనా అవసరం.

గీతార్థ పాఠక్

అర్జున్‌కు సువర్ణావకాశం.. తిరిగి జట్టులో చోటు..

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ తనని తాను నిరూపించుకోవడానికి కెరీర్ మొదటి నుంచి కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా.. అతని కెరీర్ మాత్రం ఇంకా సెట్ కాలేదు అనే చెప్పుకోవాలి. ఐపిఎల్‌లో అడపదడప మ్యాచ్‌లు ఆడిన అర్జున్ దేశవాళి క్రికెట్‌లో మాత్రం సత్తా చాటాడు. కానీ, గత ఏడాదిగా అతడు మైదానంకి దూరమయ్యాడు. అయితే తాజాగా అర్జున్‌ని ఓ సువర్ణావకాశం వరించింది. రంజీ ట్రోఫీ 2025-26కి గాను గోవా జట్టులో అతడికి చోటు దక్కింది. దీంతో గత ఏడాది డిసెంబర్ తర్వాత అర్జున్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐపిఎల్‌ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ భాగమైనప్పటికీ.. అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను చివరిగా అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడాడు.

2025-26 సీజన్‌లో గోవా ఎలైట్ గ్రూప్‌లో భాగంగా ఉంది. అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడుతోంది. ఆ తర్వాత మ్యాచ్‌లలో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళతో గోవా ఆడనుంది. ఈ టోర్నీలో గోవా క్రికెట్ జట్టుకు దీప్రాజ్ గావోంకర్ నాయకత్వం వహిస్తున్నాడు. కొత్త సీజన్‌కి ముందు ఢిల్లీ నుంచి గోవాకి మకాం మార్చిన స్టార్ ఆల్ రౌండర్ లలిత్ యాదవ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.

కల్తీ మద్యప్రవాహం ఆగేనా?

తెలంగాణలో అక్రమమార్గంలో రవాణా అవుతున్న కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ సత్ఫలితాలు సాధించేనా… తెలంగాణ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే రెవెన్యూ వనరుల్లో అబ్కారి శాఖ చెప్పుకోదగ్గ రెవెన్యూ సమకూర్చుతూ పెద్దన్న జిఎస్‌టి రెవెన్యూకు తోడుగా ఉందనే చెప్పుకోవచ్చు. గత పది సంవత్సరాలుగా ఎక్సైజ్ ఆదాయం 400 శాతం పెరిగిందని సాక్షాత్తు ఆ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రెవెన్యూ అంచనాల ప్రకారం ఎక్సైజ్ ఆదాయం 2025- 26 సంవత్సరానికి గాను రూ. 54,193 కోట్లుగా నిర్ధారించి ఆ దిశగా ప్రభుత్వం, ఆ శాఖ యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే అనుకున్నట్లుగా కాకుండ ఆగస్టు 2025 నాటికి మొత్తం అనుకున్న టార్గెట్‌కు 28.09 శాతం మాత్రమే సాధించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ చట్టం 1968 ప్రొహిబిషన్ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వం రెవెన్యూ కంటే ప్రజల్లో మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై, నాటుసారా వల్ల కలిగే ఆరోగ్య సమస్యపై, వాటి ప్రభావం నుంచి తాగుడుకు బానిసైనవారికి డిఆడిక్షన్ సెంటర్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేందుకు సమీక్ష సమావేశంలో అబ్కారి మంత్రి తెలిపారు. అబ్కారి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని, ఎట్టి పరిస్థితుల్లోను కల్తీ మద్యం గ్రామాల్లో ప్రవేశించకుండ కట్టుదిట్టం చేయాలని సూచించారు.

ఎక్సైజ్ కమిషనర్ చేకూరి హరికిరణ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజివీ, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తూ అసలు మద్యాన్ని మరిపించేలా ఊడలా పాకుతున్న కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కుపాదంతో అణచివేయాలని గట్టిగ కోరారు. ఇదే కాకుండా ఎక్సైజ్ డ్యూటీ చెల్లించని ఎన్‌డిపిఎల్ మద్యం రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి విచ్చలవిడిగా పారుతుండడం తెలంగాణ ఖజానాను కలవరపరుస్తోంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తూ, అవసరమైతే అబ్కారి ఉద్యోగులకు రివాల్వర్‌లూ అందచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఖాళీ మద్యం సీసాల్లో ఖరీదైనా బ్రాండ్లుగా మరిపిస్తూ, నకిలీ మద్యాన్ని అంటగట్టే ముఠాలు బార్లకు, మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ముఠాలు హైదరాబాద్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, ఇతర రాష్ట్రాల మద్యంతోపాటు కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా దోచుకుంటున్నాయి. నకిలీ మద్యం ముఠాల ఆగడాలను కట్టడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గణనీయంగా కృషి చేస్తోందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, సింథటిక్ డ్రగ్స్ సరఫరాను కట్టడి చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

నల్లబెల్లం తయారీ, అమ్మకంపై నిషేధించాలని, పట్టుకున్న నల్లబెల్లాన్ని సేంద్రియా ఎరువుల కోసం రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. అంతేకాకుండా నిషేధిత డ్రగ్స్ తయారీపై గట్టి నిఘా ఉంచి నాచారం, చర్లపల్లి వంటి పారిశ్రమికవాడల్లోనూ ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండాలని, అధికారులను అప్రమత్తంగా ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలనుంచి ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రనుంచి రెక్టిఫయిడ్ స్పిరిట్‌ను అక్రమ రవాణా కాకుండా నియంత్రించాలని, నిఘా విభాగం పటిష్టం చేయాలని నిశ్చయించింది. అంతే కాకుండా ఎన్‌డిపిఎల్ మద్యం అక్రమంగా గోవా, హర్యానా, గుర్గాన్, కోల్ కత్తా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలించకుండా చెక్ పోస్టులను పటిష్టపరిచారు. స్టేట్ టాస్క్‌ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎన్‌డిపిఎల్‌ను కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖంగా వడ్డెర బస్తీ, సుందరయ్య నగర్, ఖురషీద్ నగర్‌లో దేశిదారు అక్రమంగా తరలించే వారిని అబ్కారి అధికారులు అరెస్ట్ చేస్తున్నా ఆగడాలు ఆగడం లేదు.

మహారాష్ట్ర నుంచి వచ్చే దేశిదారు పలు రుచుల్లో లభిస్తుండటంతో స్థానికులు అలవాటుపడి బానిసలుగా మారి దానికే అలవాటుపడ్డారు. ఈ దేశిదారు రాష్ట్ర ఆదాయానికి గణనీయంగా గండికొడు తుంది. ఇటీవలి దసరా ఉత్సవాలను ఆసరా చేసుకుని దేశిదారు అక్రమంగా తెలంగాణ జిల్లాల్లోకి ప్రవహిస్తున్నా అబ్కారి అధికారులు అడ్డుకట్టవేయలేక పోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న తూ తూ మంత్రంగా విధులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని పెంగంగా పరీవాహక ప్రాంతాల గ్రామాల నుంచి దేశిదారు ఏరులై పారుతున్నది. ముఖ్యంగా భీంపూర్ మండలంలోని కరంజి, జైనథ్ మండలంలోని ఆనందపూర్, పెండల్వడ, కౌటా, పిప్పల్‌వాడ, సాంగిడి గ్రామాల వారు పెంగంగా నుంచి దేశిదారును అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ నది దాటిస్తూ ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవహించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న దేశిదారును అబ్కారి అధికారులు అప్రమత్తంగా ఉండి అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆరెంజ్, మ్యాంగో, సోంఫ్ ఫ్లేవర్లతో లభించే దేశిదారుకు తెలంగాణ ప్రజలు బానిసలై ధనప్రాణాలు కోల్పోకముందే అబ్కారి అధికారులు మేల్కొవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మహ్మద్ సాబీర్

98492 31002

(ఆదిలాబాద్

జిల్లా ప్రతినిధి)

గిన్నిస్ రికార్డు అంత గొప్పా?

పర్వదినాలను ప్రజలు సంబరంగా జరుపుకోవడానికి ప్రభుత్వాలు సకల ఏర్పాట్లు చేయాలి. సదుపాయాల కల్పనే ప్రభుత్వ సామర్థ్యానికి రికార్డులు కావాలి. తెలంగాణలో మహిళలు ఘనంగా జరుపుకొనేది బతుకమ్మ పండుగ. పేద మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ 2024 లో చేయలేదు. ఈ పండుగకు ఇస్తామన్న మాట కూడా దాటి పోయింది. తమ పేరు కోసం మాత్రం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను మరో రకంగా ఘనంగా జరిపింది. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా ప్రభుత్వం సెప్టెంబర్ 29న హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో భారీ బతుకమ్మ ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెండు ప్రపంచ రికార్డులను నిర్వాహకులకు అందజేశారు.

63 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహాబతుకమ్మకు ఒక రికార్డు, బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు తిరుగుతూ ఆడి పాడినందుకు మరో రికార్డు లభించాయి. ఈ రికార్డు పత్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మేయర్ విజయలక్ష్మిలు అందుకున్నారు. అదే రోజు మంత్రి జూపల్లి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి రెండు రికార్డులను ముఖ్యమంత్రికి అందజేశారు. వాటిని సాధించేందుకు అన్ని విధాలా సహకరించిన సిఎంకు మంత్రి, ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మను గిన్నిస్ బుక్‌తో ముడిపెట్టడం గత ప్రభుత్వంతోనే మొదలైంది. 2016 లో ఎల్‌బి స్టేడియంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళల సంఖ్య ఆధారంగా అప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. అప్పుడు, ఇప్పుడు కేరళలోని ఓనం పండుగ సాధించిన రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఈ ఏర్పాటు జరిగాయి. ఓనం సందర్భంగా 2023 లో కేరళలోని త్రిసూరులో 7027 మంది స్త్రీలు సాంప్రదాయిక తిరువాతిర నృత్యంలో పాల్గొని రికార్డు సాధించారు.

దీని నిర్వహణ కేరళ ప్రభుత్వం కాకుండా ఒక మహిళా స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. 9 వేల మంది స్త్రీలను స్టేడియంకి రప్పించి ఆ రికార్డును తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తిరగ రాసింది. లండన్ కేంద్రంగా ఉన్న గిన్నిస్ సంస్థ ఈ సంవత్సరమంతా అందజేసిన కొత్త ప్రపంచ రికార్డులను జోడించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ – 2026’ పుస్తకాన్ని తెస్తుంది. ఈ పుస్తకం కాపీలు ఏడాదికి 35 లక్షల దాకా అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలోని 40 భాషల్లో ఇది లభిస్తుంది. ఇంగ్లీషు ప్రతి ధర రూ. 3 వేల దాకా ఉంటుంది. క్లబ్ లో తాగుతూ కొందరు మిత్రులు సరదాగా వేసుకున్న ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో వాటి సేకరణ మొదలుపెట్టారు. అవి వింతగా ఉండటంతో పుస్తకంగా తెచ్చారు. అలా ఈ రికార్డుల ప్రయాణం మొదలై మంచి లాభదాయక వ్యాపారంగా సాగుతోంది. రికార్డు సాధించిన వారికి ఈ సంస్థ ఎలాంటి పారితోషికం ఇవ్వదు. రికార్డును నమోదు చేసుకోవాలని అనుకొనేవారే నిర్వహణ వ్యయాన్ని భరించాలి. వ్యక్తిగతంగా సాధించే రికార్డు కోసం ఆయా వ్యక్తులు వీడియో రూపంలో రుజువులను, చూసిన వారి ధ్రువీకరణలు నమ్మి రికార్డు పత్రాన్ని పంపుతారు. సాధారణంగా ప్రభుత్వాలు ఈ రికార్డుల కోసం తాపత్రయపడవు. మామూలుగా వ్యక్తులే ఏదో కొత్తది సాధించి గిన్నిస్ బుక్‌లో ఎక్కాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రికార్డులకు ఇవి అవి అనే ప్రత్యేక నియమాలేవి లేవు. మీసాలు, గోర్లు పెద్దగా పెంచినా గిన్నిస్ వరల్డ్ రికార్డే. మరొకరు సెంటీ మీటరు ఎక్కువ పెంచినా పాత రికార్డు బుక్ లోంచి తొలగించబడుతుంది.

ఎక్కువ పెన్సిళ్లు నోట్లో పెట్టుకున్నవాడు, ముక్కుతో టైపు చేసినవాడు, ఒంటికాలిపై ఎక్కువ దూరం నడిచినవాడు రికార్డు బ్రేకర్సే. దుబాయ్‌లో ఉండే రామ్ కుమార్ ఒంటి చేత్తో ఇప్పటికి 50 గిన్నిస్ రికార్డులు కొట్టేశాడు. సెంచరీ ఆయన టార్గెట్ అంట. ఇలా చిన్నాచితకా స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ పోతే గిన్నిస్ రికార్డు ఒక లక్ష్యమా అనిపిస్తుంది. ప్రభుత్వాలకు ఇది అవసరమా అని సామాన్యుడు కూడా అనుకుంటాడు. నిజానికి ఎవరైనా చేసిన గొప్ప విషయం రికార్డుల్లోకి ఎక్కాలి కానీ రికార్డుల కోసమే ఒక పని చేయడం అనేది అర్థం లేని విషయమే. ఒక నటుడు ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సినిమాల్లో నటించడం ఒక వరల్డ్ రికార్డే. కానీ ఆయన రికార్డు కోసం అన్ని సినిమాల్లో నటించలేదు.

ఎంతో శ్రమపడి అన్ని అవకాశాలను పొందగలిగాడు. అనుకోకుండా రికార్డు దాటేశాడు. దాన్ని ఇంకొకరు దాటాలంటే కష్టసాధ్యంగా లేదా అసాధ్యంగా ఉండాలి. రికార్డు కొన్నేళ్లయినా నిలవాలి.అదీ రికార్డు అంటే. వీటితో పోల్చితే మన ప్రభుత్వం సాధించిన బతుకమ్మ రికార్డులు దాటేయడం తేలికే. వచ్చే సంవత్సరం ఒక వ్యక్తి తలచుకున్నా ఈ రికార్డులను బద్దలు కొట్టొచ్చు. 65 అడుగుల బతుకమ్మ పేర్చడం ఖర్చు, శ్రమతో కూడుకున్నదే కానీ పెద్ద కష్టమైన పనేమీ కాదు. అలాగే అమ్మలక్కల లెక్క దాటించడం కూడా సుసాధ్యమే. ఇలా చూస్తే ప్రభుత్వం భ్రమలో ఉందా లేక జనాన్ని మభ్యపెడుతుందా అనే అనుమానం కలగక మానదు. ప్రజాధనం పనికిరాని రికార్డుల కోసం కాకుండా ప్రజా ప్రయోజనం కోసం వెచ్చించబడాలి.

రెండు టెస్టులో టీమిండియా గెలుపు… సిరీస్ కైవసం

ఢిల్లీ: రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది.  వెస్టిండీస్ జరుగుతున్న రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ ను 2-0తో భారత జట్టు వశం చేసుకుంది. రెండో టెస్టులో వెస్టిండీస్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 35.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలుపొందింది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో(58) కదంతొక్కాడు. ధృవ్ జురెల్ ఆరు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గిల్ 13 పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్‌లో జస్టీన్ గ్రీవస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగులు చేసి వర్రికన్ బౌలింగ్‌లో అండర్సన్ ఫిలిప్‌కు క్యాచ్ మైదానం వీడాడు. రెండో టెస్టులో ఎనిమిది వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కే అవకాశం ఉంది.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248

వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్: 390

గిల్ ఔట్.. టీమిండియా 108/3

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. గెలుపుకు 13 పరుగుల దూరంలో టీమిండియా ఉంది.  గిల్ 13 పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్‌లో జస్టీన్ గ్రీవస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగులు చేసి వర్రికన్ బౌలింగ్‌లో అండర్సన్ ఫిలిప్‌కు క్యాచ్ మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(48), ధృవ్ జురెల్(0) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248

వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్: 390

పెట్రోలు పోసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

సూర్యాపేట: అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోట్యాతండాలో భూక్యా లచ్చు(65), భూక్యా వీరమ్మ(60) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుకలు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. గత కాలంగా దంపతులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. పిల్లలకు బారం కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గది లోపల గడియ పెట్టుకొని వృద్ధ దంపతులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. గదిలో నుంచి పొగలు, కేకలు వినిపించడంతో తండా వాసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరమ్మ అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. లచ్చు మాత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.