elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomcasibom girişcasibom güncel girişalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbet

బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్‌కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు

నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్‌కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు పెట్టినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.8 కోట్లతో నూతన స్కూల్ భవన నిర్మాణం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ అండ్ హైస్కూల్ స్థానంలో కార్పొరేట్‌కు దీటుగా అధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించినట్టు మంత్రి తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా భవనంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన ప్రథమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నల్లగొండ లో పేదల విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే మూడేళ్లలో దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అధునాతన సౌకర్యాలతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. స్కూల్ కు ‘కోమటి రెడ్డి ప్రతీక్‘ ప్రభుత్వ పాఠశాలగా నామకరణం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

అవేం పొగడ్తలు.. మాటలతో ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన పాక్ ప్రధాని

కైరో : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టు లోని షర్మ్ షేక్‌లో శాంతి ఒప్పందంపై దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్టు వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ మాటలకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చివరికి తాను మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ చేతులెత్తేసి , ఇంటికి వెళ్లిపోదామంటూ షరీఫ్‌తో చమత్కరించారు.

షెహబాజ్ మాట్లాడుతూ.. “ఈరోజు చరిత్రలో గొప్ప రోజుల్లో ఒకటి. ఎందుకంటే అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తరువాత గాజాలో శాంతి సాధన అయింది. ఆయన నిజంగా శాంతిని కోరుకునే వాడు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు” అని కొనియాడారు. ఈ సందర్భంగా పాక్ భారత్ మధ్య జరిగిన సంఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. ‘ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారు. భారత్-పాక్ రెండూ అణ్వాస్త్ర శక్తులు. ఆ నాలుగు రోజుల్లో ట్రంప్, ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే, ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవి. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలే వారు కాదు. ఇందుకు గాను నోబెల్ శాంతి బహుమతికి పాక్ ఆయనను నామినేట్ చేసింది. ఇది అందుకునేందుకు ఆయన అర్హుడు. ఇప్పటివరకు ఏడు యుద్ధాలు ఆపారు. ఇది ఎనిమిదవది ’ అంటూ షరీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.

షరీఫ్ ప్రసంగం నేపథ్యంలో అక్కడే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నోటిమీద చేయి వేసుకొని చూస్తూ ఉండిపోయారు. షరీఫ్ ప్రసంగం అనంతరం ఆసక్తికర చోటు చేసుకుంది. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయిన ట్రంప్ ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ … ఇంటికి వెళ్దాం అంటూ చమత్కరించారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం నవ్వులు విరిశాయి. 

పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు..

శ్రీనగర్ : పహల్గాం తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలే కనుక జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి బదులిచ్చాం. కానీ దాయాది ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదు. పహల్గాం తరహాలో మరోదాడికి యత్నించవచ్చు. అందుకే దాని ప్రతి కదలికపై మేం దృష్టి సారించాం. ఈసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, మనం ఇచ్చే సమాధానం మామూలుగా ఉండదు ” అని మనోజ్‌కుమార్ స్పష్టం చేశారు.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ సంఘటనలోఓ కశ్మీరీ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సముద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్ వార్..

బీజింగ్ : అమెరికాచైనా మధ్య ఇటీవల వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్న సంగతి తెలిసిందే. బీజింగ్‌పై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంది. తాజాగా ఇరుదేశాలు నౌకలపై పరస్పర ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా యాజమాన్యం నిర్వహణలో ఉన్న నౌకలు, యూఎస్ నిర్వహించే లేదా ఆ దేశ జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు చైనా మంగళవారం ప్రకటించింది. అయితే చైనా నిర్మించిన నౌకలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అటు అమెరికా కూడా నేటి నుంచి ఈ ఫీజుల వసూలు ప్రారంభించింది.

చివరివరకూ పోరాడతాం: చైనా

మరోవైపు అమెరికా అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించింది. “ వాణిజ్య యుద్ధం.. టారిఫ్‌ల అంశంపై మా వైఖరి స్థిరంగా ఉంది. మీరు (అమెరికాను ఉద్దేశిస్తూ ) యుద్ధం కోరుకుంటే మేం చివరివరకూ పోరాడతాం. అదే చర్చలు కావాలనుకుంటే మా తలుపులు తెరిచే ఉన్నాయి” అని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచం లో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది.

ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది ట్రంప్‌నకు కోపం తెప్పించింది. దీంతో బీజింగ్‌పై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి నవంబరు 1 నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌ల పైనా నియంత్రణ విధిస్తామని వెల్లడించారు.

మరియాకు నోబెల్ .. నార్వేలో దౌత్య కార్యాలయం మూసివేత

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై భగ్గుమన్న వెనెజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నార్వే లోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియా లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వం నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.

అనేక విషయాల్లో తమ విభేదాలు ఉన్నప్పటికీ వెనెజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాదో , దేశ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. వెనెజువెలాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను యూఎస్‌తో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాదోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమం లోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అంకితమిస్తున్నట్టు మచాదో పేర్కొన్నారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్లు పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది మంగళవారం గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…రైలులో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పదో నంబర్ రైల్వే ఫ్లాట్ ఫాం వద్ద అనుమానస్పదంగా కన్పించిన బ్యాగును తీసి పరిశీలించగా గంజాయి చాక్లెట్లు లభించాయి. బ్యాగులో 1.6కిలోల గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బందిని గుర్తించిన గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం ఎక్సైజ్ చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

32 మంది మావోయిస్టుల మృతి.. 30మంది లొంగుబాటు, 266 మంది అరెస్ట్

రాంచీ: మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాలు జరిపి ఎన్ కౌంటర్లలో భారీగా మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 1 నుండి సెప్టెంబర్ చివరి వరకు జార్ఖండ్ లో భద్రతా దళాల ఆపరేషన్ లో మొత్తం 266 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని.. 32 మంది మృతి చెందారని.. మరో 30 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని మంగళవారం ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఒక జోనల్ కమాండర్, ఇద్దరు సబ్-జోనల్ కమాండర్లు, CPI(మావోయిస్ట్).. మరో తొమ్మిది మంది ఏరియా కమాండర్లు అరెస్టు అయిన వారిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టులల్లో CPI(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యులు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ, అనుజ్ అలియాస్ సహదేవ్ సోరెన్ ఉన్నారని… ఇద్దరిపై రూ. 1 కోటి చొప్పున రివార్డు ఉందని తెలిపారు.

భద్రతా దళాల ముందు 30 మంది లొంగుబాటు

మొత్తం 30 మంది నక్సలైట్లు, భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిలో జోనల్ కమాండర్ రవీంద్ర యాదవ్, సిపిఐ (మావోయిస్ట్) సబ్-జోనల్ కమాండర్ ఆనంద్ సింగ్, జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జెజెఎంపి) సబ్-జోనల్ కమాండర్ లావ్లేష్ గంజు అలియాస్ లోకేష్ గంజు ఉన్నారని చెప్పారు. జనవరి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల నుండి దోచుకున్న 58 ఆయుధాలు, 11,950 కార్ట్రిడ్జ్‌లు, 18,884 డిటోనేటర్లు, 394.5 కిలోల పేలుడు పదార్థాలు, 228 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు (ఐఇడిలు) సహా 157 తుపాకులు స్వాధీనం చేసుకోవడంతోపాటు 37 మావోయిస్టు బంకర్లను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు.

హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య

హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు పరిష్కారం కాక ముందే మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్‌ఐ) సందీప్ కుమార్ మృతదేహం రోహటక్ – పానిపట్ రోడ్డులోని ట్యూబ్ వెల్ సమీపంలో లభ్యమైంది. పూరన్ కుమార్ అవినీతి కేసును అతడు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ కుమార్ మృతదేహం సమీపంలోనే పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్ ను, స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ అధికారి రికార్డు చేసిన వీడియో ను పరిశీలిస్తున్నారు. వరుసగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల ఆత్మహత్య పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్షాల వత్తిడి నేపథ్యంలో రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కపూర్ ను సెలవుపై పంపివేసింది. గతంలోనే రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ను బదిలీ చేశారు.

సందీప్ కుమార్ తన నోట్ లో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి అధికారి అని, ఆయనకు సంబంధించి చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నానని ఏఎస్ ఐ పేర్కొన్నాడు. చనిపోయే ముందు మొత్తం అవినీతి బాగోతాన్ని బయటపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ నోట్ లో పేర్కొన్నారు. తన మరణం తర్వాత నైనా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని తాను కోరుతున్నట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. పూరన్ కుమార్ అవినీతి కుటుంబాన్ని వదిలి పెట్టకూడదని, అతడు తన స్వార్థం కోసం కులరాజకీయాలను వాడుకొని, వ్యవస్థనే హైజాక్ చేశాడని నోట్ లో ఆరోపించారు.

ఆ వీడియోలో పూరన్ కుమార్ కుల రాజకీయాలు, అవినీతి తో పోలీసు శాఖనే తీవ్రంగా ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునుంచే కులరాజకీయాలను ప్రారంభించి, తన వారిని కింది ఉద్యోగులుగా నియమించుకుని పైళ్ల శోధన చేపట్టాడని సందీప్ పేర్కొన్నాడు. తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి, హింసించి డబ్బువసూలు చేసేవాడని, మహిళా పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని బెదిరిస్తూ, కొందరిపై లైంగిక వేధింపులకు గురు చేశాడని ఆ వీడియోలో ఆరోపించారు.

ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై దర్యాప్తు

అక్టోబర్ 7న 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ చండీగఢ్ లోని సెక్టార్ 11లోని తన నివాసంలోసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఏఎస్‌ఐ సందీప్ కుమార్ కూడా నేడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశం అయింది.పూరన్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రోహ్ తక్ లోని సునారియాలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్ నీత్ పూరన్ కుమార్ ఇంట్లో లేరు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలోని ప్రతినిధివర్గంలో సభ్యురాలిగా జపాన్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు.

రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కుమర్ పై వేటు

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య, అదే కేసు దర్యాప్తు చేస్తున్న మరో ఏఎస్‌ఐ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు దాడి ప్రారంభించడం, మరో పక్క పూరన్ కుటుంబసభ్యులు ఆయనను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర డిజిపీ శతృఘ్న్ కుమార్ ను సెలవులో పంపివేసింది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రోహ్ తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసింది డీజీపీని రాష్ట్రప్రభుత్వం డీజీపీ ని సెలవులోకి పోవల్సిందిగా ఆదేశించినట్లు హర్యానా ముఖ్యమంత్రి మీడీయా సలహాదారు రాజీవి జైట్లీ వెల్లడించారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్ లో డిజీపీ శతృఘ్న్ కుమార్, నరేంద్ర బిజర్నియా లు కూడా కులవివక్షతతో , తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: హరీష్ రావు

 కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయణిస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. జూన్‌లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం, సెప్టెంబర్‌లో -0.15 శాతాలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యం అని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు.

మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్

 జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.