elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet giriş

నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె రెండు నామినేషన్ సెట్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. భారీ ర్యాలీకి, రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసినందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి 100 మీటర్ల వరకు ఆంక్షలను ఆర్‌ఓ సాయిబాబా అమలు చేస్తున్నారు.

షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసిన సందర్భంలో మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థితో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్‌లు, శ్రీధర్‌రెడ్డి, వెంగళరావు నగర్ కార్పోరేటర్ దేదీప్య ఉన్నారు. నామినేషన్ రెండో సెట్ దాఖలు చేయు సందర్భంలో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటి రామారావు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్‌రెడ్డి, యూసుఫ్‌గూడ కార్పోరేటర్ రాజ్‌పటేల్‌లు పాల్గొన్నారు.

10 మంది 13 నామినేషన్లు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు మూడో రోజు 10 మంది 13 సెట్లుగా తమతమ నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజుల్లో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 30 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈ నెల 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బిసి బంద్‌కు బిజెపి మద్దతు: రాంచందర్ రావు

బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎసి నాయకుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిసి తమ బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బంద్‌కు మద్దతు పలికారు. బిసిలకు న్యాయం జరగాలని డిమాండ్‌తో బిసి జెఎసి చేపట్టిన ఉద్యమానికి పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు.

బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని అన్నారు.బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలను మోసం చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయలేక ఇతరులపై నెపం వేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ తమదేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బిసిలు ఉన్నారని ఆయన వివరించారు. బిసిలకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కొనసాగించాలని ఆయన బిసి సంఘాలను కోరారు. బిసి సంఘాలు ఇచ్చిన బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్ రావు కోరారు.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దల ఆగన్ (భరత్ కుమార్)కు, ఆదిలాబాద్‌కు చెందిన జాశ్విన్ (25)తో 2020లో వివాహం జరిగింది. వారికి జోయల్ (4), జాట్సన్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన పిల్లలిద్దరిని తీసుకొని జాశ్విన్ నిద్ర చేసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రి కిషన్ కామారెడ్డి చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఆదిలాబాద్ నుండి కామారెడ్డి వచ్చింది. జాశ్విన్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డిలోని తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం చిన్న బాబుకు టీకా వేయించేందుకు సమీప బంధవు అయిన ఆశా వర్కర్ జంగంపల్లిలో ఉండటంతో అక్కడకు జాశ్విన్ స్కూటీపై ఇద్దరు పిల్లలతోపాటు తండ్రితో కలిసి వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారి బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారు వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో కిషన్ (50), అతని కూతురు జాశ్విన్, మనవడు జోయల్ అక్కడిక్కక్కడే మృతి చెందగా 4 నెలల బాబు జాట్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతురాలు జాశ్విన్ భర్త ఆగన్.. చింతకాని మండలం, చిన్నమండల గ్రామంలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. కాగా, జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరగడంతో గ్రామస్థులు, వాహనదారులు గుమిగూడడంతో, కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. మృతదేహాలపు మార్చురీకి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణం లోకి ప్రవేశిస్తున్నాయని, ముందుముందు భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్, అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరిన్ని ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్టార్‌లింక్ ఉపగ్రహ జీవితకాలం దాదాపు ఐదునుంచి ఏడేళ్లు ఉంటుందని, అనంతరం వాటంతట అవే కక్ష నుంచి తొలగి భూమిపై రాలిపోతాయన్నారు.

ఒక్కోసారి ఉపగ్రహాల్లోని వ్యవస్థల్లో తలెత్తే వైఫల్యాలు లేదా సౌర కార్యకలాపాల వల్ల కూడా అవి పడిపోతాయన్నారు. అయితే ఖగోళంలో ఇలాంటి ఉపగ్రహాలు , రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువై , కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షలో ఉన్న ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉంటుందని , ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్, సౌర కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు స్టార్‌లింక్ తరచూ కక్ష లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ ఏర్పడి, మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందన్నారు. రాబోయే పదేళ్లలోమస్క్ సంస్థ మరో పదివేల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేశారు.

కెస్లర్ సిండ్రోమ్ అంటే ?

కెస్లర్ సిండ్రోమ్ అనేది ఖగోళ వ్యర్థాలకు సంబంధించిన చైన్ రియాక్షన్ . ఇక్కడ భూ కక్షలో శిథిలాల సంఖ్య పెరిగినప్పుడు ,అవి ఒకదానికొకటి ఢీకొని మరిన్ని శిథిలాలను సృష్టిస్తాయి. దీనివల్ల ఉపగ్రహాలకు , భవిష్యత్ అంతరిక్షపరిశోధనలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.

టపాకులు కాల్చండి.. పర్యావరణాన్ని కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్‌క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకూ పటాకులు కాల్చడానికి కొన్ని షరతులను విధించింది. దివాలీ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా గ్రీన్‌క్రాకరీస్‌ను కాల్చాల్సి ఉంటుంది.

అంతేకాకుండా నిర్ణీత వేళలను కూడా ఖరారు చేశారు. ఢిల్లీ, పరిసరాలలో వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలతో ఇప్పటివరకూ ఎటువంటి పటాకులు పేల్చడాన్ని అనుమతించడం లేదు. వీటిపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది. తాము ఈ విషయంలో మధ్యస్థ సమతూకతను పాటించి ఆదేశాలను వెలువరించామని, ఒక పరిమిత మోతాదులో బాణాసంచ కాల్చడానికి అనుమతిని కల్పించాం.

ఇక ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీకి రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ తెలిపారు. దివాళి రోజు తరువాతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. ఇక దుకాణాలలో అనుమతించిన సరుకు క్యూఆర్ కోడ్ ఉన్నవే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగంపై ఉంటుంది. ఇందుకోసం తగు విధంగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి. నిబందనలను అంతా పాటించేలా చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం: మంత్రి పొన్నం ప్రభాకర్

 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటు చోరీ ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉద్యమిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలలో దొంగ ఓట్లను నమోదు చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు.

ఓట్‌చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందో లేదో చూడాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, బంక చందు, చిత్తారి రవీందర్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దొంతి కాంతమ్మకు సిఎం నివాళులు

వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం బుధవారం మధ్యాహ్నం హన్మకొండ జిల్లా కేంద్రంలోని పిడిఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఎంఎల్‌ఎ తల్లి స్మాకర దినం కార్యక్రమానికి సిఎం వస్తున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి పలువురు తన మంత్రివర్గ సహచరులతో కలిసి దొంతి కాంతమ్మకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాంతమ్మ మృతికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులతో వేదికపైనే వారితో మాటాడారు. అనంతరం ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాధవరెడ్డి కుటుంబ సభ్యులతో ప్రజలు, కార్యకర్తల ముందుకు చేరుకొని అభివాదం చేశారు. కార్యక్రమం మొత్తం 45 నిమిషాల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి పర్యటన ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపిలు కడియం కావ్య, బలరాంనాయక్, ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, కెఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

* గ్రూపులకు చెక్ పెట్టిన సిఎం పర్యటన

సిఎం రేవంత్‌రెడ్డికి నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి మధ్య గ్రూపుల తగాదాలు ఉండేవి. కొన్ని కారణాల వల్ల మాధవరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే పరిస్థితి లేకుండా ఉండేది. ప్రస్తుతం మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందడంతో ఆమె స్మారక దినం రోజు సిఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వరంగల్‌కు చేరుకొని ఆయనను, వారి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణులకు గ్రూపు తగాదాలు లేవని సంకేతం ఇచ్చినట్లు ఉంది. మాధవరెడ్డి తల్లి మృతి చెందినప్పటి నుంచి పార్టీకి చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో పాటు మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రతీ రోజు దొంతిని కలిసి పరామర్శలు కొనసాగించారు. రేవంత్‌రెడ్డి ఎంఎల్‌ఎ దొంతి తల్లి మృతి చెందిన రోజే ఫోన్ ద్వారా పరామర్శించి పెద్దకర్మ రోజు వస్తానని, అదే రోజు ప్రోగ్రాం ఫిక్స్ చేశారు.

అయితే, ఈ కార్యక్రమానికి సిఎం రాకపోవచ్చని పార్టీ వర్గాల్లో కొంతమంది చర్చించుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్‌రెడ్డి సహచర ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడానికి ఒక మెట్టు దిగి స్వయంగా దశదినకర్మలో పాల్గొనడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొన్న తరుణంలో రేవంత్‌రెడ్డి అన్నింటినీ పక్కనపెట్టి పార్టీ ముఖ్యమన్న రీతిలో సిఎం స్థాయిలో ఎంఎల్‌ఎ తల్లి పెద్దకర్మకు హాజరుకావడం అన్ని వర్గాలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాలోని అందరు ఎంఎల్‌ఎలతో పాటు దొంతికి కూడా సిఎంతో నేరుగా సంబంధాలు ఇప్పటినుంచి ఉంటాయని నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాల్పులతో దద్దరిల్లుతున్న ఆఫ్ఘన్ – పాక్ సరిహద్దులు

ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దులు పరస్పర కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. తాజాగా జరిగిన ఘర్షణల్లో రెండు పక్షాలకు చెందిన సైనికులు డజన్ల సంఖ్యలో చనిపోయారు.ఇటీవల కాలంలో రెండుదేశాల మధ్య సరిహద్దు పోస్ట్ ల విధ్వంసకాండ సాగుతోంది. మంగళవారం జరిగిన ఘర్షణల్లో చాలా ప్రాణనష్టం జరగడంతో పరస్పరం నిందిచుకుంటున్నాయి. శాంతి చర్చలకు పాకిస్తాన్ మంత్రులను అనుమతించేందుకు ఆఫ్ఘనిస్తాన్ నిరాకరించింది. దీంతో ఘర్షణల నివారణకు ఆఫ్ఘన్ తో చర్చలకు మధ్య మధ్యవర్తిత్వం వహించవలసిందిగా పాకిస్తాన్ కతార్, సౌదీ అరేబియాలను వేడుకుంటోంది.ఆఫ్ఘన్ మంత్రి భారత పర్యటన పై అక్కసుతో ఉన్న పాక్ ఇదే సమయంలో డ్రోన్లు, వైమానిక దాడులకు కాందహార్ ప్రావిన్స్ పై విరుచుకుపడడంతో ఇప్పట్లో ఉద్రిక్తతలు సద్దుమణిగే అవకాశాలు కన్పించడం లేదు. పాకిస్తాన్ గతవారం కాబూల్ లోని తెహ్రీక్ – ఇ- తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) శిబిరాలను టార్గెట్ చేస్తూ, పాక్ దాడులు చేసిన తర్వాత మొదలైన పరస్పర దాడులు సద్దుమణగలేదు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో సాయుధ ఘర్షణలు జరగడం ఇదే ప్రథమం.

కాందహార్ ప్రావిన్స్ లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో మంగళవారం భారీ ఆయుధాలతో విరుచుకుపడడంతో పాక్ కొత్త యుద్ధానికి తెరలేపిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఈ కాల్పుల్లో 15 మంది పౌరులు చనిపోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.వారిలో మహిళలు పిల్లలే ఎక్కువ. ఆఫ్ఘన్ జరిపిన ప్రతీకార దాడుల్లో పెద్ద సంఖ్యలో పాక్ సైనికుల మృతి, పాక్ ఆయుధాలు, సెర్బియా నుంచి పాక్ కొనుగోలు చేసిన టూ-55 ట్యాంక్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ యోధులు. వీడియో విడుదల.మరో పక్క తమ నైరుతి, వ్యాయవ్య ప్రాంతంలో రెండు పోస్ట్ లపై తాలిబన్ల దాడిని తిప్పికొట్టామని ఈ సందర్భంగా 30 మంది, స్పిన్ బోల్డాక్ సమీపంలో 20 మందిని హతమార్చినట్లు పాక్ ప్రకటించింది. కాందహార్ లో పాక్ వైమానిక దాడులు జరిపింది. గతవారంలో తాలిబన్లు డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ దళాలపై పెద్దఎత్తునదాడి చేసి 58 మంది పాక్ సైనికులను చంపివేశారు. 20 పాక్ భద్రతా స్థావరాలను ధ్వంసం చేశారు.

మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ సరిహద్దు.. డజన్ల మంది సైనికులు మృతి

కాబూల్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయమై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణపై మాట్లాడటం కోసం అఫ్గన్ వెళ్లేందుకు పాకిస్థాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ అఫ్గాన్ వారిని అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలను సంప్రదించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ బుధవారం ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్‌లో స్పిన్‌బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని ఆస్పత్రి వర్గాలు గాయపడిన వారిలో 80 మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని వెల్లడించాయి.

అఫ్గాన్ దళాలు ప్రతీకార దాడులకు పాల్పడ్డాయని, భారీ సంఖ్యలో పాక్‌సైనికులు హతమయ్యారని పాకిస్థాన్ ఆయుధాలను, ట్యాంకులను స్వాధీనం చేసుకోవడమైందని తాలిబన్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. అఫ్గాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను , సైనిక పోస్ట్‌లను దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. తాలిబన్లు వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో సరిహద్దు పోస్టులను కూల్చివేశారని ఆరోపించారు. దాదాపు 30 మంది అఫ్గాన్ సైనికులు హతమయ్యారన్నారు. స్పిన్‌బోల్‌డాక్‌లో మరో 20 మంది చనిపోయారన్నారు. కాందహార్‌లో పాక్ జెట్ విమానాలు దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్‌లో ఖోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్‌అహ్రర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు.

చమన్ జిల్లాలో తాలిబన్ల దాడులకు నలుగురు పౌరులు గాయపడ్డారని పాక్ ఆరోపించింది. పాక్ ప్రభుత్వం మీడియా ప్రకారం , ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ దళాలు, తెహ్రీక్ ఇతాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా తమ భూభాగం లోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాలు బలంగా స్పందించాయని, టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణలతో సరిహద్దుల్లో వేలాది మంది నిర్వాసితులయ్యారు.

మధ్యవర్తిత్వానికి సిద్ధం: జేయూఐఎఫ్ చీఫ్

పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై ‘జమైత్ ఉలేమా ఈఇస్లాం ఫ్లజ్ పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గతంలో పాక్‌అఫ్గాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలకపాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అఫ్గాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025‘లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్బయోటెక్‘, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్‌లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు.

సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ‘గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్‌టెక్‘ ఆవిష్కరణ హబ్ గా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆస్ట్రేలియా – తెలంగాణ‘ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ‘ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది‘ అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.