elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

casinowon

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

jojobet

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

kingroyal

meritking

madridbet

jojobet

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

betnano

matbet giriş

jojobet giriş

kralbet

kralbet

galabet

süratbet

grandpashabet

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

meritking

meritking

meritking

meritking giriş

meritking güncel

madridbet

casibom

meritking

Sweet Bonanza

sekabet

meritking

meritking

meritking

ఆర్‌ఎక్స్ 100, బేబి మూవీస్‌లా ‘రాజు వెడ్స్ రాంబాయి’

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. అఖిల్ రాజు, తేజస్విని తమ నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే మరొకరి ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈ రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నేను కథ చెప్పగానే వేణు ఊడుగుల మనం సినిమా చేస్తున్నాంరా తమ్ముడు అన్నారు. ఈటీవీ విన్ వారిని సంప్రదిస్తే వాళ్లకూ కథ నచ్చింది. అలా రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది”అని తెలిపారు. ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊరిలోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని ఆధారంగా చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ఈ కథను ఎంటర్‌టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు. ఈటీవీ విన్ వారి వల్లే నేను ప్రొడ్యూసర్‌ను అయ్యాను. 7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి, హీరో అఖిల్, హీరోయిన్ తేజస్వినీ, ఈటీవీ విన్ నితిన్, సాయికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నటుడు చైతు జొన్నలగడ్డ పాల్గొన్నారు. 

‘మాస్ జాతర’తో రవితేజ జాతర చూడబోతున్నాం: సూర్య

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ’మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ “రవితేజలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. రవితేజ ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ జాతర చూడబోతున్నాం. మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “శివుడు పాత్ర చేసిన నవీన్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. మాస్ జాతర చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు”అని తెలిపారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్‌కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. “నా కథ నచ్చి రవితేజ నాకు అవకాశమిచ్చారు. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, భీమ్స్ సిసిరోలియో, శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, విధు అయ్యన్న, శ్రీనాగేంద్ర తంగాల తదితరులు పాల్గొన్నారు. 

కిడ్నాప్… కారులో బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్

ఛండీగఢ్: 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 26 సాయంత్రం సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లిన బాలిక రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల వెతికారు. ఎక్కడి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 27 తెల్లవారుజామున నాలుగు ప్రాంతంలో బాలికను ఇంటి వద్ద దుండగులు వదలి వెళ్లారు. బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం కారులో బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని, అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని పోలీస్ అధికారి విష్ణు మిట్టర్ తెలిపాడు. 

ఫైనల్లో సౌతాఫ్రికా

కదం తొక్కిన వాల్వర్ట్..

చెలరేగిన కాప్

గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి తుది పోరుకు దూసుకెళ్లింది. మహిళలు, పురుషుల విభాగంలో సౌతాఫ్రికా టీమ్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. మారిజానె కాప్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చింది.

అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన కాప్ 7 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. క్లార్క్ రెండు వికెట్లను తీసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ నాట్ సివర్ (64), అలైస్ కాప్సె (50), వ్యాట్ (34), స్మిత్ (27) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమను కెప్టెన్ లౌరా వాల్వర్ట్ అద్భుత సెంచరీతో ఆదుకుంది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లౌరా 143 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 169 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ బ్రిట్స్ (45), కాప్ (42), ట్రియన్ (33) పరుగులు సాధించారు.

సైడ్ మిర్రర్ తాకిందని… యువకుడిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన దంపతులు

బెంగళూరు: సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని, కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి చంపేశారు.ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెపి నగరప్రాంతంలోని శ్రీరామ లేఅవుట్లో ఎనిమిది రోజుల క్రితం దర్శన్ అనే యువకుడు తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మనోజ్ కుమార్- ఆరతి శర్మ అనే దంపతులు కారులో ప్రయాణం చేస్తున్నారు. దంపతుల కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో దంపతులు ఇద్దరు యువకులతో గొడవకు దిగాడు. అనంతరం యువకులు బైక్‌పై వెళ్తుండగా రెండు కిలో మీటర్లు వెంబడించారు. కారుతో బైక్‌ను అతివేగంతో ఢీకొట్టారు. వెంటనే అక్కడి కారులో దంపతులు పారిపోయారు. దర్శన్, వరుణ్‌లు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందగా వరుణ్ ఐసియులో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో కారు విడిభాగాలు పడిపోవడంతో దంపతులు ముఖానికి మాస్క్ పెట్టుకొని వాటికి తీసుకెళ్లారు. అక్కడి సిసి కెమెరాలో రికార్డయ్యింది. జెపినగర్ పోలీసులు దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

హిందూపురంలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో 15 మంది క‌ల్లుతాగి అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. క‌ల్తీ క‌ల్లు మూలంగానే త‌మవారు అనారోగ్య బారిన‌ప‌డ్డార‌ని కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. వైద్యులు వారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్లీ కల్లు తాగి బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. టిడిపి ఎంఎల్ఎ బాలకృష్ణ ఇలాకాలో క‌ల్తీ క‌ల్లు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కల్తీ విచ్చలవిడిగా అమ్ముతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లు అమ్మేవారికి స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో వారిపై ఈగ కూడా వాలడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితుల కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నాయి.

మొంథా పంజా

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వా యుగుండం మొంథా తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. తుఫాను దాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతాకులమయింది. పంట పోలాలు చెరువులను తలపించాయి, కల్లాల్లో ధాన్యం నీట మునిగిపోయింది, పలు చోట్ల ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామా సిద్దిపేట యాద్రాది భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, జగిత్యాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ఇళ్లు మునిపోయాయి. కుండపోత వర్షానికి హన్మకొండ బస్‌స్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ, ఈస్ట్‌కోస్ట్ రైళ్లు నిలిచిపోయాయి. డోర్నాకల్ రైల్వే ట్రాక్‌పై రెండు అడుగుల మేర నీరు చేరడంతో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ నిలిపివేసి, ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఐదు గంటల పాటు మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.

రైల్వే ట్రాప్‌పై నీరు తగ్గకపోవడంతో తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్‌కు పంపించారు. గుండ్రాతిమడుగు నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్ పంపిన అధికారులు రైల్వే ట్రాక్‌పై నీటిని తరలించే చర్యలు చేపట్టారు. కాజీపేట-విజయవాడ మార్గం లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలోని చెన్నారావు పేటలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో వరద నీరు చేరింది. నెక్కొండ, నర్సంపేట ప్రధాన రహదారిలోని పాతముగ్ధుంపురం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. పాకాల వా గు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామచంద్రాపురం గ్రామాలకు, వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడురు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం వరగల్ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు చేరడంతో పోలీసులు ఒక వైపు తాత్కాలికంగా రహాదారిని మూసివేశారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. మొంథా తుఫాను దాటికి ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహాం 19 అడుగులకు చేరడంతో పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

ఖమ్మం జిల్లా నిమ్మవాగులో కొట్టుకుపోయిన లారీ

కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలోని జాన్నారంఅంజనాపురం గ్రామాల మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతుంది. ఈ వాగును డిసిఎం లారీ దాటించే ప్రయత్నం చేయడంతొ వరదలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహానికి మధ్యలోకి వెళ్లిన తరువాత బ్రిడ్జి పిల్లర్‌కు తగిలి లారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న స్థానికులు దిగిరావాలని కోరినా డ్రైవర్ మురళి(32) వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌తో సహా లారీ వరద ఉదృతికి కొట్టుకుపోయింది.

కూసుమంచి మండంలంలోని పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. చింతకాని మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నాగులవంచ-పాతర్లపాడు మధ్య బండి రేపు వాడు రహదారిపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతొ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. కారేపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ అండ్ బి మధ్యలో చిన్న వంతెనపై నీళ్లు ప్రవహిస్తుండటంతో ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో నీరు ప్రవహించడంతో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి, అవుసలికుంట మధ్య కారు దాటుతున్న సమయంలో పక్కకు కొట్టుకుపోయింది. తాడూరు మండలం గోవిందపల్లి వద్ద వాగు దాటుతున్న గొర్రెల మందలోని గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కెఎల్‌ఐ కాలువ ఉప్పొంగి ప్రవహిస్తూ వరద నీరుత కలెక్టరేట్ ఆవరణలోకి భారీగా చేరుకుంది. భారీ వర్షానికి నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిండి -హాజీపూర్ మధ్య కాజ్ వే కోతకు గు రైంది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీ శైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. మండలంలోని తీగలపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కి వెళ్లే ప్రధాన రహదారి ఏడుదల జలాశయం కట్టపై బుదర పేరుకుపోయింది. దీం తో మూడు రోజుల నుంచి ఆర్టీసి బస్సులను నిలిపివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలంలో బైరాపూర్ గ్రామ సమీపంలోని వంతెన పై నుంచి సిమెంట్ పైపుల చుట్టే రక్షణగా ఉన్న మట్టి కోతకు గురికావడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చారకొండ మండలం ఎర్రవల్లి, గోక రం గ్రామాల మధ్య రదారిపై వాగు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండంటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలంలొ మూడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కోడేరు-పసుపుల, బావాయిపల్లి-పెద్దకొత్తపల్లి-ఖానాపూర్-సాతాపూర్ గ్రామా ల మధ్య వాగులు పొంగతంతొ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సూర్యాపేటలో బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై చెట్టు కూలి మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ(45) తానం చర్ల నుండి మద్దిరాలకు తన వ్యవసాయ క్షేత్రాన్ని వెళుతున్న క్రమంలో చందుపట్ల గ్రామ శివారులో కొత్త పాఠశా సమీపంలో ఈదురు గాలికి రోడ్డుపై ప్రయాణిస్తున్న అతనిపై చెట్టుకూలింది దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అంబటిపల్లి నుండి లింగాలకు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో కారును వాగు దాటించే ప్రయత్నం చేయడంతో వరద ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో హుటాహుటిన జెసిబి సహాయంతో కారును, వెంకటరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో కురుస్తున్న వర్షాలకు గోకారం, చంద్రయాన్‌పల్లి, ఎర్రవల్లి గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. నాంపల్లి మండలంలోని రాందాస్ తండా వద్ద శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగానికి రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది.

నల్గొండ జిల్లా దేవరకొండ మడమడకలో గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. దేవర కొండ మండలం కొమ్మేపల్లిలో వరద నీరు పాఠశాలను చుట్టుముట్టడంతో అధికారులు తాడు సహాయంతో సుమారు 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగం ఆర్ అండ్ బి రోడ్డు కాజ్వే పై నుండి ప్రవాహం కొనసాగుతుండడంతో రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. చండూరు వైపు నుండి నాంపల్లి ద్వారా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మర్రిగూడెం ద్వారా హైదరాబాదు వైపు మళ్ళించారు. నాంపల్లి నుండి కొండమల్లేపల్లి వైపు రాకపోకలకు ఉపయోగించే ఆర్ అండ్ బి రోడ్డు ముష్టిపల్లి కట్టకింద వాగు పై ఉన్న బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం వెళుతుండడంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి.

137 రైళ్లు పూర్తిగా, ఏడు రైళ్లు పాక్షికంగా రద్దు

మొంథా తుఫాను ధాటికి దక్షిణ మధ్య రైల్లే 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. దీంతో పాటుగా 30 రైళ్లను దారి మళ్లించింది. అనేక రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. పలు గూడ్సురైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు

తుఫాను ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 31.6 సెం.మీ వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

అలర్ట్‌గా ఉండండి

మన తెలంగాణ/హైదరాబాద్ : వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కల్ల్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను సిఎం రేవంత్ ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రా ల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూ చించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగ ల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇత ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. మొంథా తుఫాను ప్రభావంపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు.

ఈ సందర్భంగా  అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయని, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లీంచారని, ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తీవ్ర వర్ష ప్రభావం ఉన్నచోట ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సిఎం ఆదేశించారు.

నగర, పురపాలక, పంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా

వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సిఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సిఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సిఎం ఆదేశించారు.

తుఫాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, పంచాయతీలకు సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సిఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దు: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ లెవెల్లో హై అలర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. మాన్సూన్ సీజన్‌లో ఎలాగైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామో ప్రస్తుతం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాజ్ వేలు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ అయితేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి

తుఫాను ప్రభావం నేపథ్యంలో కురుస్తున్న భారీవర్షాలపై బుధవారం రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రి పొంగులేటి ఆరా తీశారు. భారీ వర్షాల వల్ల జన జీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి మంత్రి పొంగులేటి సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రాగల 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులతో మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణ యం తీసుకుంది. ఇంతవరకు మంత్రివర్గంలో మైనార్టీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ స్థానంలో క్రికెట్ మాజీ కెప్టె న్ అజారుద్దీన్‌కు చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో ఆజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు సమాచారం పంపించినట్టుఅధికార వర్గాల సమాచారం. కాగా ఉప ఎన్నిక జరుగునున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మై నారిటీ ఓటర్లు అధికంగా ఉండటం ఆ వర్గం

ఓ టర్లకు గాలం వేయడానికే అజారుద్దీన్‌కు మం త్రివర్గంలో స్థానం కల్పించాలన్న నిర్ణయానికి కారణమనిరాజకీయవర్గాలు అంచనా వేస్తున్నా యి. ఈ అంశంపై పిసిసి అధ్యక్షుడు బి. మ హేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, మంత్రివర్గంలో మైనారిటీ స్థానం కల్పించాలన్న ఆలోచన ఎప్ప టి నుంచో ఉందని, ఇప్పుడు ఆ అవకాశం అజర్‌కు దక్కబోతుందన్నారు. ఇలా ఉండగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలిసింది.

ప్రతిష్టాకరంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై తన పట్టును నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇప్పటికే పదకొండు మంది మంత్రులను, ఒక ఎంపీని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్‌ఛార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని అధిష్ఠానానికి పంపించడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకున్నట్టు సీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుండగా,

మరోవైపు పార్టీలో సీఎం వ్యతిరేక వర్గీయులు కూడా అధిష్ఠానానికి తరుచు ఫిర్యాదు చేస్తోన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అటు ప్రతిపక్షానికి, ఇటు స్వపక్షంలో విపక్షానికి ఈ రెండింకి చెక్ పెట్టడానికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకొని ఏ విధంగా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది.ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబు ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా దీని ప్రభావం ఉంటుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది.

అజర్‌నే ఎందుకు?

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కే మంత్రివర్గంలోకి తీసుకోవడానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్త్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గతంలో 2014 మజ్లీస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో ఆయన్నే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. గతంలో నవీన్ యాదవ్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు మైనార్టీ వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహత్మక ఎత్తుగడగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు మరింత మెరుగు అయినట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నిర్ణయం వల్ల మంత్రివర్గంలో జిహెచ్‌ఎంసి పరిథిలో ప్రాతినిధ్యం లేదన్న విమర్శకు కూడా చెక్ పెట్టినట్టు అయిందని చెప్పవచ్చు. రెండేళ్ళుగా మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరూ లేరు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఉన్న సంగతి తెలిసిందే.

సిఎం రేవంత్‌రెడ్డితో అజారుద్దీన్ భేటీ

మైనారిటీ నేతల ధన్యవాదాలు

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. అజర్‌ను శుక్రవారం మంత్రివర్గంలోకి తీసుకోనున్నందున ఆయన ముఖ్యమంత్రిని కలిసి తనకు కల్పిస్తున్న అవకాశానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, ఇంకా పలు ముస్లిం సంస్థల నాయకులూ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర మంత్రివర్గంలోకి మైనారిటీ వర్గానికి అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.