elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiscasibomcasibom girişcasibom güncel girişwinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

Holiganbet giriş

padişahbet

tlcasino

bets10

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

betsat

jojobet

holiganbet

jojobet giriş

primebahis

casibom

marsbahis

betnano

matbet giriş

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

casibom

sekabet

xleet

marsbahis

royalbet

otobet

kingroyal

cratosroyalbet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

casibom giriş

grandpashabet

marsbahis

Sweet Bonanza

Mavibet Giriş

holiganbet

deneme bonusu veren yeni siteler

Mavibet

మేఘమథనం.. ఢిల్లీ వ్యర్థ ప్రయత్నం

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ బిజెపి ప్రభుత్వం చేపట్టిన మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం(29.10.25) ఉదయం ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలోని బురారి, ఉత్తర కరోల్‌బాగ్, మయూర్ విహార్, బద్లి తదితరప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించారు. కాన్పూర్ ఐఐటి నుంచి ప్రయోగ విమానం బయలుదేరి 6000 అడుగుల ఎత్తులో రసాయనాలు వెదజల్లినా ఫలితం దక్కలేదు. ఈ ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవలేదు. గత ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం 2023లో ఢిల్లీలో పొగమంచు సీజన్‌లో మేఘమథనం చేపట్టాలని ప్రయత్నించినా వాతావరణం అనుకూలించక విరమించుకుంది. 2024 లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఢిల్లీ వాయునాణ్యతను అత్యవసరంగా మెరుగుపర్చడానికి మేఘమథనం ఆచరణ సాధ్యం కాదని పార్లమెంట్‌కు వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం.

లాహోర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, బీజింగ్ తదితర ప్రపంచం లోని అనేక నగరాల్లో మేఘమథనం ప్రయోగాలు నిర్వహించినా అనుకున్న లక్షాలు సాధించలేక దీన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎంతో వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం వ్యర్థ ప్రయత్నమే తప్ప ఏమాత్రం ఉపయోగం జరగలేదు. ఆకాశంలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నప్పుడే మేఘమథనం పనిచేస్తుంది తప్ప స్వయం సహజ సిద్ధంగా వర్షాన్ని అందించదు. అందువల్ల పొడిగాలులు లేని శీతాకాలంలో కాకుండా వర్షాకాలం లోనే దీన్ని వినియోగిస్తారు. 2023 లో లాహోర్‌లో మేఘమథనం వల్ల కొద్దిసేపు కురిసిన వర్షం గాలి నాణ్యతను మెరుగుపర్చినా, కొన్ని గంటలకే పరిమితమైంది. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మామూలే అయింది.ఈ కారణంగా ప్రపంచం లోని చాలా దేశాలు మేఘమథనాన్ని నమ్ముకోవడం లేదు. అత్యవసరంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించవలసి వచ్చినా దీని గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలకు ఈ వాస్తవాలు తెలిసినవే.

బిజెపి ప్రభుత్వానికి కూడా ఈ సంగతి తెలిసినా ఎందుకు మేఘమథనం చేపట్టిందో అర్థంకావడం లేదు. శీతాకాలంలో మేఘాలు చాలావరకు పశ్చిమ వైపు అలజడులనుంచి ఉత్తరాదికి వ్యాపిస్తుంటాయి. అవి స్వల్పకాలమే ఉన్నా అప్పటికే సహజంగా వర్షాలను తీసుకొస్తాయి. అందువల్ల మేఘమథనం అవసరం ఉండదు. ఎయిర్‌క్రాఫ్ట్ పరిమితుల బట్టి 5 6 కి.మీ మించి ఎక్కువ ఎత్తులో ఉన్న మేఘాలు మేఘమథనానికి వీలుపడవు. మేఘమథనం సరిగ్గా, సమర్థవంతంగా జరగాలంటే ఆకాశం దట్టమైన మేఘాలతో, అనుకూల వాతావరణంతో ఉండాలి. ఢిల్లీలో శీతాకాలం నాడు అలాంటి వాతావరణం కనిపించదు. వర్షం జల్లులు కురియడానికి సిద్ధంగా ఉన్నా అవి నేలపై రాలడానికి ముందే మేఘాల కింద ఉన్న పొడిగాలి వాటిని ఆవిరిగా దహించేస్తుంది. మరో ముఖ్యమైన విషయం మేఘమథనానికి ఉపయోగించే రసాయనాల సామర్థం విషయంలో ఆందోళన నెలకొంటోంది. ఊహించని పర్యవసానాలు ఎదురవుతున్నాయి. సూక్ష్మం గా చెప్పాలంటే అవి ఏమాత్రం పనిచేయవు. ఈ విధంగా నిరాశపరిచే ఈ ప్రయోగం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? దీనికి సమాధానం ఢిల్లీ ప్రభుత్వ బిజెపి వర్గాల్లోనే ఉంది.

గత ఆప్ ప్రభుత్వం 2023లో చేయలేకపోయిందని, ఇప్పుడు తాము చేసి చూపిస్తామని బిజెపి ప్రభుత్వం పంతం పెట్టుకుంది. ఇది సైన్స్ గురించి తగిన పరిజ్ఞానం లేక, రాజకీయంగా సాధించాలన్న ఆలోచన తప్ప మరేం కాదని తెలుస్తోంది. ఐఐటి కాన్పూర్ ఇందులోకి తనకు తాను ప్రవేశించి అన్నివర్గాలను ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. భారత్ మొట్టమొదట 1950 లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెయిటొరాలజీ నేతృత్వంలో పశ్చిమ కనుమల్లో మేఘమథనం జరిగింది. థాయ్‌లాండ్‌లో కృత్రిమ వర్షపాతం సృష్టించేందుకు డిపార్టుమెంట్ ఆఫ్ రాయల్ రెయిన్ మేకింగ్, అండ్ అగ్రికల్చరల్ ఏవియేషన్ అనే ప్రత్యేక విభాగమే ఉంది. ప్రపంచం లో చైనా, అమెరికా దేశాలు భారీ ఎత్తున వాతావరణ మార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో దుర్భిక్ష నివారణకోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కానీ వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించే మార్గాల్లో మేఘమథనం కూడా ఒకటిగా అనుసరిస్తున్నారు. ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని, అలాగే యమునా నదీ జల కాలుష్యాన్ని శ్రీఘ్రగతిలో పరిష్కరిస్తామని బిజెపి గత కొన్నేళ్లుగా వాగ్దానాలు చేస్తోంది. యమునా నదీ కాలుష్యంపై ఆప్ ప్రభుత్వ కాలంలో ఎన్నో వివాదాలు, సవాళ్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

పర్యావరణ సమస్యల పరిష్కారానికి దగ్గరి మార్గాలంటూ ఏవీ లేవు. ప్రపంచంలో ఎక్కడైనా, క్రమబద్ధమైన, శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక, పద్ధతులు, పాలకవర్గాల జవాబుదారీతనం, దీర్ఘకాలిక ప్రణాళికల అమలు వంటి చర్యలతోనే పర్యావరణ పురోగతి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ విస్మరించి కేవలం రాజకీయ ప్రాబల్యంతో వాస్తవాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలతో ఏదీ సాధ్యం కాదు. ఈ పాఠాన్ని ఢిల్లీ బిజెపి ప్రభుత్వం వంట పట్టించుకోవడం తప్పనిసరి. ప్రయోగాలు, ఆవిష్కరణలకు వాటి స్థానం వాటికి ఉంటుంది తప్ప ఆవిష్కరణలు, రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని భర్తీ చేయలేవు. మనం పటిష్టమైన మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను ముందుచూపుతో నిర్మించుకోలేకుంటే ఆకాశం, ప్రకృతి వనరులు, నదులు, పర్వతాలు ఇవన్నీ కలుషితమవుతూనే ఉంటూ మనం మాత్రం పురోగతి అనే భ్రమలో చిక్కుకుపోతుంటాం.

వరద బాధితులకు సర్కార్ అండ

మన తెలంగాణ/హైదరాబాద్ : వరిధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధా న్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూ చించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సిఎంకు వివరించారు. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు సిఎంతో తెలిపారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సం బంధించిన ప్రాథమిక వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. కేంద్ర ప్ర భుత్వం నుం చి పొందే వరదసాయం అం శాల గురించి అధికారులతో సిఎం 

చర్చించారు. ఈ నేపథ్యంలోనే తుపాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆయన సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజూ కలెక్టర్‌కు నివేదిక అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 24 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని సిఎం రేవంత్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అప్రమత్తంగా వ్యవహారించాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లీంచాలని సిఎం అధికారులకు సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వరంగల్‌లో అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రికి కలెక్టర్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలని, ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలి

వరంగల్‌లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. అవసరమైనన్నీ పడవలను వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని సిఎం సూచించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. హైడ్రా సిబ్బందిని, సహాయ సామగ్రిని కూడా ఉపయోగించుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల గురువారం వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నానని సిఎం అధికారులతో తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని, ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం హామీనిచ్చారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

భారత్ అదరహో..

 కదంతొక్కిన జెమీమా, హర్మన్

 సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం

 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా

నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే తుది పోరులో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ చిరస్మరణీయ ఆటతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా ఉంచిన క్లిష్టమైన 339 పరుగుల లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్ సేన అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలో లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ 5 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి కిమ్ గార్థ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరును ముందుకు నడిపించింది. ఇద్దరు ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. కానీ 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేసిన మంధానను కిమ్ గ్రాథ్ వెనక్కి పంపింది. దీంతో భారత్ 59 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

జెమీమా, హర్మన్ అద్భుత పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ముందుకు సాగారు. వీరికి ఔట్ చేసేందుకు కంగారూ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు జెమీమా అటు హర్మన్ తమ మార్క్ షాట్లతో చెలరేగి పోయారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. వీరిద్దరూ కుదురు కోవడంతో భారత్ లక్షం దిశగా సాగింది. ఆరంభంలో జెమీమా దూకుడుగా ఆడింది. హర్మన్ సమన్వయంతో ఆడుతూ జెమీమాకు అండగా నిలిచింది. ఇదే సమయంలో ఇద్దరు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జోరును మరింత పెంచారు.

హర్మన్, జెమీమా చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత్‌ను పటిష్ఠస్థితికి చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించారు. వీరిని ఔట్ చేసేందుకు కంగారూ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేసిపెవిలియన్ చేరింది. అప్పటికే జెమీమాతో కలిసి 156 బంతుల్లోనే మూడో వికెట్‌కు 167 పరుగులు జోడించింది. హర్మన్ ఔట్ అయినా జెమీమా తన పోరాటాన్ని కొనసాగించింది. ఆమెకు దీప్తి శర్మ, రిచా ఘోష్‌లు అండగా నిలిచారు. ధాటిగా ఆడినదీప్తి 17 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగింది. చెలరేగి ఆడిన రిచా 16 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో 2 ఫోర్లతో 26 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ 8 బంతుల్లో రెండు ఫోర్లతో అజేయంగా 15 పరుగులు సాధించింది. ఇక చారిత్రక బ్యాటింగ్‌ను ప్రదర్శించిన జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. చివరి వరకు క్రీజులో నిలిచిన జెమీమా టీమిండియాకు ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది.

లిచ్‌ఫీల్డ్ శతకం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్ ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్, ఎలిసె పెర్రీ ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. లిచ్‌ఫీల్డ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. చెలరేగి ఆడిన లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లోనే 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు సాధించింది. పెర్రీ 88 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అష్లే గార్డ్‌నర్ 46 బంతుల్లోనే 4 సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేసింది. కీలక సమయంలో భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 338 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ రెండు వికెట్లను పడగొట్టారు.

నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో టి20.. బోణీ కొట్టేదెవరో?

మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టి20 వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు రెండో టి20 కీలకంగా మారింది. ఇందులో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియాలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి. పర్యాటక టీమిండియా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే అభిషేక్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి వైస్ కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇద్దరు వర్షం వల్ల ఆట నిలిపి వేసే సమయానికి క్రీజులో నిలిచారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన గిల్, సూర్యకుమార్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరెగితే టీమిండియా భారీ స్కోరు ఖాయం. అభిషేక్ శర్మ కూడా మెరుగైన ఇన్నింగ్స్‌ను ఆడాల్సి ఉంది. ఇక సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్ వంటి విధ్వంసక బ్యాటర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు విజృంభించిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు కష్టాలు ఖాయమని చెప్పాలి.

అందరి కళ్లు శాంసన్‌పైనే..

ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు సంజూ శాంసన్‌పైనే నిలిచాయి. జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి శాంసన్‌కు నెలకొంది. నిలకడలేమీ అతనికి ప్రతికూలంగా తయారైంది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరోదాంట్లో విఫలం కావడం అలవాటుగా మార్చుకున్నాడు. దీని నుంచి బయట పడితేనే శాంసన్ కెరీర్ గాడిలో పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన మ్యాచ్‌లు శాంసన్‌కు పరీక్షలాంటివేనని చెప్పక తప్పదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. కొంత కాలంగా టి20 ఫార్మాట్‌లో తిలక్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లోనూ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో భారత్‌కు సంచలన విజయం సాధించి పెట్టాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, అక్షర్, హర్షిత్, అర్ష్‌దీప్, బుమ్రా తదితరులతో భారత బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆత్మవిశ్వాసంతో..

మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. వన్డే సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఇది కూడా కంగారూలకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. వన్డే సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా టి20లోకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మిఛెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిఛెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, హాజిల్‌వుడ్, సీన్ అబాట్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కూడా గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు.

బయటకు వచ్చే వారి ప్రణాళిక?

అడవులలోని నక్సలైట్లు విడతలు విడతలుగా మైదాన ప్రాంతంలోకి రావటం మొదలైంది. ఆ విధంగా ఇప్పటికే వచ్చిన వివిధ స్థాయిల నాయకులు, దళ సభ్యులు కొన్ని వందల మంది ఉన్నారు. అడవులలో ఇంకా మిగిలిన వారి సంఖ్య ఎంతైనదీ నిర్దిష్టంగా తెలియదు. ఇదంతా మధ్య భారత ప్రాంతపు విషయం. ఇది కాకుండా తూర్పు రాష్ట్రాలకు వెళ్లే కొద్దీ పరిస్థితులు ఏమిటన్న వార్తలు లేవు. దేశం లో నక్సలైట్లను లేదా నక్సలిజాన్ని 2026 మార్చి చివరి నాటికి పూర్తిగా తుడిచి పెట్టగలమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గడువుకు ఇంకా సరిగా అయిదు నెలల గడువుంది. ఆ ప్రకారం ఆయన ప్రకటన నెరవేరుతుందా లేదా అనేది అట్లుంచి, ఈలోగా నక్సలైట్లు ఏమి చేయవచ్చునన్నది ఒక ప్రశ్న అవుతున్నది. ఇదే పద్ధతిలో మరింతమంది బయటకు రాచ్చునా? అందరూ రాగలరా? కొందరు వచ్చి కొందరు మిగులుతారా? అనే విషయాల గురించి వేచి చూడవలసిందే గాని, ముందుగా ఎవరూ చెప్పలేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విప్లవోద్యమాల దశలను గమనించినపుడు ఇది అర్థమవుతుంది. మరొక కీలకమైన ప్రశ్న నక్సలైట్లును అంతం చేసినా ఆ భావజాలం పోతుందా అన్నది.

ఆ విషయం అట్లుంచితే, ఇక్కడ ప్రస్తుతం బయటకు వస్తున్న వారి సంఖ్య మొత్తంగా కలిపి పెద్దదే. వారి భవిష్యత్తు ప్రణాళిక ఏమి కావచ్చును? బయటకు రావటం లోగడ కూడా జరిగింది. కాని ఒకటీ అరగా. అందువల్ల వారేమి చేయవచ్చుననే ప్రశ్న రాలేదు. తమ వ్యక్తిగత స్థాయిలోనో, కుటుంబపరంగానో తప్ప. ఎవరి పద్ధతిలో వారు స్థిరపడిపోయారు. బయట చట్టబద్ధంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలలో చేరిన వారు ఉన్నారు. కొందరు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వంటి పార్టీలలో చేరారు. బిజెపి గురించి తెలియదు. ఈసారి సంఖ్య వందలలో ఉండటం, కొందరు ముఖ్యులు కూడా కావటం వల్ల ఈ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మీరు కూడా ఇంతకు ముందటి వారి వలెనే వ్యవహరించవచ్చునా? లేక అందుకు భిన్నంగా ఏమైనా చేయవచ్చునా? పౌరహక్కుల సంఘం బాధ్యడొకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాళ్లు బయటకు వస్తున్నారు గాని ఏం చేసేదీ చెప్పటం లేదన్నారు. ఆ మాటను ఆయన వారిని సవాలు చేయటం, వారి ‘నిజ స్వరూప’మని తాను భావించే దానిని ‘బహిరంగ’ పరచటం అనే ధోరణిలో అన్నట్లు అర్థమవుతున్నది. తమ దృక్కోణం నుంచి అది సరైన ధోరణే కావచ్చు. కాని యథాతథంగా చూసినపుడు, వారు అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. తక్షణం చేయదలచిందేమిటో నిర్ణయించుకుని ఉంటారు. భవిష్యత్ కార్యక్రమం అనేది సీరియస్‌గా జరగవలసిన చర్చ. అడవులలో ఎక్కడైక్కడనో ఉండినవారు ఒక చోటికి చేరి, ఈ ప్రశ్నపై రోజుల తరబడి చర్చించే అవకాశం వారికి ఉంటుందనుకోవటం అవాస్తవికం. ఇదే మాటను సూక్ష్మమైన రూపంలో ఆ నాయకులూ చెప్పారు. ఇప్పుడే గదా బయటకు వస్తున్నాము, ఏమి చేయాలో అందరం కలిసి మాట్లాడుకుంటాము అన్నారు వారు. ఏమి మాట్లాడి, ఏమి చేయవచ్చునన్నది మనం వేచి చూడవలసిన విషయం.

ఇన్నిన్ని మాటలు చెప్పుకుని కూడా చివరకు, బయటకు వచ్చే వారి ప్రణాళిక ఏమిటని చర్చించటం ఆశ్చర్యంగా తోచవచ్చు. అవును, కొన్ని కారణాలవల్ల ఇది చర్చించదగినదే. ఇందులోని ఉద్దేశం మాత్రం పౌరహక్కుల బాధ్యుని వంటిది కాదు. కేవలం కొన్ని విషయాలను అర్థం చేసుకోవటమే. పైన అనుకున్నట్లు, గతంలో వలెగాక ఈసారి పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. వారు చెప్తున్నది మౌలికంగా తమ సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోలేదని, ప్రజల కోసం వారి మధ్య ఉండి పని చేస్తూనే ఉంటామని. తమ పోరాట రూపం మాత్రమే మారుతున్నదని, ప్రభుత్వ బలగాలను ఎదుర్కొనగల శక్తి తమ పార్టీకి లోపించిన స్థితి వల్లనే ఉద్యమాన్ని విరమించాలా, ఆయుధాలు వదలాలా అనే చర్చకు కొంతకాలం క్రితమే ఆరంభం జరిగింది తప్ప, యథాతథంగా అంతకు ముందు అటువంటి చర్చ ఏమీ లేదని. ఇతరత్రా కూడా పార్టీలో, ఉద్యమంలో గతం నుంచి ఉండిన లోపాల కారణంగానే పరిస్థితి ఇంత వరకు పరిణమించిందని. మాటలు సరిగా ఇవే కాకపోవచ్చుగాని, భావం మాత్రం ఇదే.

ఇటువంటి పరిస్థితుల మధ్య అంతిమంగా వీరు ఇక ముందు, తమ సిద్ధాంతాల ప్రకారం, మైదాన రాజకీయ, క్షేత్రంలో సామాజిక క్షేత్రంలో ఏమి చేయగలరనుకోవాలి? ఎందుకోసం, ఎటువంటి అవకాశాలు ఉండవచ్ఛు? అటువంటి ప్రశ్నలపై ఇది ఒక స్థూలమైన చర్చ మాత్రమే. బయటకు వచ్చిన విప్లవకారులు తమంతట తాము ఏదైనా చేయదలిస్తే ముందుగా తోచేది స్వయంగా ఒక పార్టీ ఏర్పాటు చేయటం. ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలోకి ప్రవేశించినందున, తమ సిద్ధాంతాలను మేళవిస్తూ అందుకు అనుగుణమైన పార్టీ మేనిఫెస్టో తయారీ. పార్టీ యంత్రాంగం. తెలంగాణ అంతటా సంస్థ విస్తరణ, ఎన్నికలలో పోటీలు. ఈ మొత్తం అన్నింటిలోనూ, తాము అంటున్న తమ సైద్ధాంతిక విశ్వాసాల ప్రతిఫలన. తమ మేనిఫెస్టో గాని, ఆచరణ గాని ఇపుడున్న అన్ని రకాల పార్టీలకు కొట్టవచ్చినంత భిన్నంగా ఉంటేనే ప్రజల దృష్టిని ఆకర్షించగలదు. సదరు ఆకర్షణ కొనసాగేది ఏ విధంగా అన్నది వేరే ప్రశ్న.

పార్టీ పెట్టడమే నిర్ణయం అయిన పక్షంలో ఇంతకూ తమ పార్టీలో చేరగల వారెవరు? అడవిలోని దళ సభ్యులలో అధికులు అక్కడి ఆదివాసులే అయినందున తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడే అవకాశమే ఎక్కువ. మైదాన ప్రాంతాలలోని పేదలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనారిటీలు, యువకుల ఆలోచనలు, ఆకాంక్షలు ఒకప్పటివలె వామపక్ష భావజాలానికి సన్నిహితమైన రీతిలో లేవు. వారంతా వివిధ మధ్యేమార్గ పార్టీలు, అవి తమ అధికారం ద్వారా సమకూర్చగలవనుకునే అవకాశాలు, నిజమైన ఉద్యమాలంటూ అవసరం లేని పద్ధతులు, సంక్షేమ పథకాల సౌలభ్యాల మార్గంలోకి మళ్లిపోయారు. అటు నుంచి వెనుదిరగటం ఎంత మాత్రం తేలిక కాని దశ వచ్చి వేసింది. ఆ పరిస్థితుల మధ్య ఈ వర్గాల ప్రజలకు ఇపుడున్న సిపిఐ, సిపిఎం పట్లనే నమ్మకం పోయి వాటిలో చేరటం లేదు. ఇంకా చెప్పాలంటే విప్లవ పార్టీలలో చేరటమూ తగ్గిపోయింది. అటువంటి వాతావరణంలో కొత్తగా వచ్చే వామపక్ష పార్టీలోకి చేరికలు తేలిక కాదు. అంతేకాదు. పైన పేర్కొన్న సామాజిక వర్గాలకు చెందిన వారే నాయకులుగా ఎదిగి వస్తూ తమ సెక్షనల్ అజెండాలను ముందుకు తీసుకుపో జూస్తున్నారు. ఇవి ఏవీ కొత్త పార్టీకి అనుకూలించేవి కావు.

పార్టీల నిర్వహణ విపరీతమైన ఖర్చుతో కూడుకున్నదిగా మారటం మరొక సమస్య. ఆ స్థాయిలో నిధులు సమకూరటం ఒక కొత్త వామపక్షానికి అసాధ్యం. నిధుల సమస్య గురించి ఇప్పటికే గల వామపక్షాలు కూడా మాట్లాడుతుంటాయి. డబ్బు కూడా ఒక ఆధారమనుకుంటే అవేమి వామపక్షాలనే ప్రశ్న రావచ్చు. వివిధ పరిస్థితుల వల్ల అదొక వాస్తవంగా మారిన సంగతి నిజం. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకోగలమనటం శుష్క ఆదర్శవాదమవుతుంది. మన రాజకీయాలు, ప్రజా స్వామ్యం కూడా పేట్రనైజేషన్ (పోషకులు పోషితులు) స్థితిలోకి మారిపోయాయి. ఉన్న కమ్యూనిస్టులే పెద్ద పార్టీల ఎదుట పోషితులుగా నిలుస్తున్నారు. ఇక ప్రజల మాట చెప్పనక్కర లేదు. చివరగా చెప్పాలంటే, సమాజంలో ఆదర్శవాదం గణనీయంగా తగ్గిపోయి వస్తువాదం, వినిమయవాదం, వ్యక్తివాదం పెరుగుతున్నాయి. వీటి ప్రభావాలు కుటుంబ సంబంధాలపైన సైతం పడుతున్నాయి. ఈ విధమైన పరిణామాలు అన్నీ కూడా వామపక్ష రాజకీయాలకు అనుకూలమైనవి కావు.

మరొక పద్ధతి ఒక పార్టీ అంటూ ప్రారంభించి, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి ఆ విధంగా ఉమ్మడి శక్తితో సమాజంలో ఒక వాతావణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించటం. ఇతర వామపక్షాలలో కొందరికి ఇటువంటి ఆలోచనలు ఉన్నట్లున్నాయి. సూత్ర రీత్యా ఇది మంచి ఆలోచనే కావచ్చు. కాని అందులోనూ సమస్యలుంటాయి. ఆ రెండు పార్టీలకు తమలోతమకే కుదరటం లేదు. కారణాలు అనేకం. ఆ రెండింటి మధ్య మూడవ పార్టీకి చోటు అనుమానమే. ఈ మూడవది తమకు పోటీదారు అనుకునే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే వారికి అసలు వామపక్ష స్పృహ, లక్షాలు నిలిచిలేనపుడు, ఇతరులను కలుపుకొని కమ్యూనిస్టు అజెండాను ముందుకు తీసుకుపోయే ఉద్దేశం ఎట్లా కలుగుతుంది? ఈ పరిస్థితులను బట్టి మిగిలేది ఎవరితో వీలైతే వారితో పొత్తు కుదురుకోవటం, ఇక కాదంటే, లోగడ కొందరు మాజీ విప్లవ కారులు చేసినట్లు ఎవరికి తోచిన పార్టీలో వారు చేరటం. అంతటితో సమాధానపడటం. బయటకు వస్తున్న వారు అందుకు చెప్తున్న కారణాలలో ఒకటి ఆరోగ్య సమస్యలు. పెద్ద నాయకులంతా వయసు మీరిన వారే. ఈ రెండు అంశాలు ఉన్నపుడు వారు కొత్త పార్టీ స్థాపన, అందుకోసం పని చేయట మనే నిరంతర శారీరక, మేధోశ్రమను తీసుకోగలరా? బయటకు వచ్చినా పోలీసుల నిఘా వెన్నాడుతూనే ఉంటుంది గనుక ఆ చికాకులను తట్టుకోగలరా? వారికి ఇప్పటికీ తమ సిద్ధాంతంపట్ల అదే కట్టుబాటు నిలిచి ఉన్నా తేలిక కాదు. ఈ చర్చ అంతటి ఉద్దేశం ఒక తఫాను అనంతర పరిస్థితిలోని ఒక కోణాన్ని మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నమే.

టంకశాల అశోక్  

మిము మరువదు ఈ దేశం

వర్తమాన రాజకీయాలు గత చరిత్ర చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. గతం లేనిదే వర్తమానం నడవదని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది? గొప్ప వ్యక్తులు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనప్పటికీ, వారిని గౌరవించడం మన కనీస ధర్మం. ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దండులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తులుగా భావించడం విశేషం. ఇది ఆ వ్యక్తుల విశిష్టతను చాటి చెబుతున్నది. మరణించిన మహా నాయకులను స్మరిస్తూనే వారి చరిత్రను మాత్రం జాతికి చెందిన మహోన్నత సంపదగా భావించలేకపోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ ఇందిరా గాంధీ, సర్దార్ పటేల్‌లు భారత దేశానికి అందించిన సేవలు నిరుపమానం. స్వర్గీయ ఇందిరా గాంధీ దేశానికి మహిళా ప్రధానమంత్రి గా పని చేసి, విశేష ఖ్యాతినార్జించారు. దేశం గర్వించదగిన ఎంతోమంది భరత భూమిపై జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచి, చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆయా రంగాల్లో కనబరిచే ప్రతిభతో కూడిన విశేషమైన కృషి, పట్టుదల మాత్రమే పేరు ప్రఖ్యాతులకు సంపాదించి పెడుతుంది. భారతదేశంలో ఒకప్పుడు మహిళలు సాంప్రదాయాల ముసుగులో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు దూరంగా బతుకీడ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తమదైన శైలిని ప్రదర్శించి ఎన్నో అడ్డంకులను అధిగమించి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికరంగా ల్లో రాణించి, దేశ ఖ్యాతిని నలుచెరగులా విస్తరింపచేసారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఇందిరా గాంధీ స్థానం ప్రత్యేకమైనది.

తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం ఇందిరా గాంధీ రాజకీయ ప్రవేశానికి కారణం కావచ్చునేమో కాని, రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం ఆమె ప్రతిభా సామర్ధ్యాలే ప్రధాన భూమిక పోషించాయి. పరిపాలనలో ఆమె చూపిన తెగువ, దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసనార్హం. నాటి రాజకీయాల్లో అనేక మంది ఉద్దండుల మధ్య, తలలు పండిన రాజనీతిజ్ఞుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం సాధారణమైన విషయం కాదు. అసాధారణ ప్రజ్ఞతో, అనన్య సామాన్యమైన కృషితో, అతిరథ, మహారథులను నిలువరించి, భారత రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషించి, నెహ్రూ తర్వాత అత్యధిక కాలం భారత దేశానికి ప్రధానిగా పని చేసి, దేశానికి మూడో ప్రధానిగా, మొదటి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచి, జనం గుండెల్లో స్థానం సంపాదించిన ఇందిరా గాంధీ రాజకీయ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. అలహాబాద్‌లో పుట్టి, హస్తినకు ఏలికై, చిన్నతనంలోనే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టి, జైలులో నుండి నెహ్రూ పంపే ఉత్తరాల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దుకుని, దాదాపు 16 సంవత్సరాల పాటు భారత దేశ ప్రధానిగా దేశ ఔన్నత్యానికి, దేశ సమైక్యతకు పాటుబడి, ఒకానొక సమయంలో ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అనే విధంగా జనహృదయాల్లో చోటు సంపాదించుకుని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ధీర వనిత ‘ఇందిరా గాంధీ’. రాజకీయాలను సమగ్రంగా వంట బట్టించుకుని, మహామహులనుకున్న వారిని రాజకీయంగా మట్టిగరిపించి, తన శక్తిసామర్థ్యాలతో, ధైర్యసాహసాలతో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన ధీర వనిత ఇందిర. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగిన పోటీలో విజయం ఇందిరాగాంధీనే వరించింది. ఇందిర మంత్రి వర్గంలో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా పని చేసారు.

కేవలం ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతుల మన్ననలు పొందడమే కాకుండా, సామాన్యులకు సైతం బ్యాంకు సేవలు అందుబాటులోకి రావడానికి ఇందిర చూపిన చొరవ ప్రశంసనీయం. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, దేశఐక్యతకు అహరహం శ్రమించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ మొదటి హోం మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన పోషించిన పాత్ర అమోఘం. పటేల్ చూపిన తెగువ వలన భారతదేశం సమైక్యంగా నిలబడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో 565 సంస్థానాలుండగా హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్లు మినహా మిగిలినవి ఇండియన్ యూనియన్‌లో విలీనం కాబడ్డాయి. నైజాం నవాబు అనుమానాస్పద వైఖరి, రజాకార్ల దుశ్చర్యల వల్ల హైదరాబాద్ పాకిస్తాన్ వశమౌతుందని శంకించి పటేల్ సైనిక చర్య చేపట్టాడు. స్వల్ఫకాలం మాత్రమే పదవిలో ఉన్నా, భారతదేశ సమైక్యతకు ఆయన చేసిన కృషి అమోఘం. సర్దార్ పటేల్ జాతీయ వాదానికి, దేశభక్తికి, దేశఐక్యతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆ ఉక్కు మనిషి జన్మదినోత్సవమైన అక్టోబర్ 31 వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఎక్తా దివస్)గా భారత ప్రభుత్వం ప్రకటించింది. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం సర్దార్‌ను భారతరత్న బిరుదుతో సత్కరించింది. ఇందిరాగాంధీ, పటేల్ లాంటి సమర్థులకు జన్మనిచ్చిన భారత ధాత్రి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడి శాశ్వతంగా వెలుగొందుతుంది.  

సుంకవల్లి సత్తిరాజు

9704903463

ధనికులకు దాతృత్వం ఓ ఫ్యాషన్

ముందూ వెనుకా చూడకుండా సంపాదనే లక్ష్యంగా జీవితంలో చాలా భాగం గడిపిన తర్వాత చాలా మంది ధనవంతులకు జీవన విశ్రాంత సమయంలో కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. వందల కోట్ల ఆస్తి ఉన్నా ఎక్కడా తన గురించి ప్రస్తావనే రావడం లేదేమీ అనే బెంగ మొదలవుతుంది. ఎలాగైనా తమ పేరు గొప్పగా మారుమోగిపోవాలనే దుగ్ద వారిని నిలువనీయదు. ఎంత ఖర్చు అయినా పర్వా లేదు, తన పేరు నలుగురిలో నానాలి. యూ ఆర్ గ్రేట్ అని పొగడాలి. అందరిలో మంచి పేరు రావాలంటే సామాజిక సేవనే తగిన తోవ. ఆస్తిపరుడనే పేరు ఎలాగూ ఉంది, దానితోపాటు మంచివాడు, దయామయుడు, కరుణా హృదయుడు అనే ప్రచారం కావాలి. పుట్టినరోజు లాంటి పండుగల రోజున పేదలకు అన్న, వస్త్రదానాలు చేయాలి. అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచాలి. పత్రికల వారిని సాదరంగా ఆహ్వానించి ఆ వార్తలకు ప్రాధాన్యత తెచ్చుకోవాలి. సాహిత్యం, సంగీతం లాంటి లలిత కళలపై ఇష్టం, అభిమానం ఉన్నాయని చెబితే సాంస్కృతిక సంఘాలు వదిలిపెట్టవు. వారి కార్యక్రమాలకు స్పాన్సర్‌గా ఉంటే వ్యక్తిగత గౌరవంతో పాటు కోరినంత ప్రచారం లభిస్తుంది. అడగక ముందే కళాబంధు, డాక్టరేట్ అనే గౌరవాలు పేరు ముందు జత కడతాయి.

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకోవడానికి కాలు కదిలించి సభలు, సమావేశాలకు వెళ్లే అవసరమే లేదు. ఇంటికే ఓ యూట్యూబర్‌ను రప్పించుకొని గంట వీడియో చేస్తే చాలు, చూసేవారి గుండెల్లో కొంతైనా చోటు లభిస్తుంది. మరో యూట్యూబర్‌తో మరో ముచ్చట. పాలు అమ్మి, పూలు అమ్మి.. కష్టపడి ఇంతవాడినైనానని అలా పెయిడ్ వీడియోలలో ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు. ధనం కన్నా గుణమే గొప్పదని, డబ్బుతో అన్నింటిని కొనలేమని కొత్తగా తెలుసుకున్నట్లు ప్రజలకు ఉపదేశం చేయొచ్చు. ప్రయివేటు ప్రాక్టీస్ ద్వారా కోట్లు గడించిన డాక్టర్లు ఆరోగ్య సూత్రాల పేరిట తమ జీవితంలోని విశేషాలను ఏకరువు పెడతారు. ప్రైవేటు విద్యా వ్యాపారం చేసి తరతరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టినవారు తాము దేశానికి ఎందరో ఇంజనీర్లను అందించామని గర్వంగా చెప్పుకుంటారు. ఫార్మా రంగంలో ఉంటే మందుల తయారీ ద్వారా కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టామని చెప్తారు. కానీ వ్యర్థ రసాయనాలు నాలాల్లోకి వదిలి సర్వం విషతుల్యం చేస్తున్న విషయం దాచి పెడతారు. కనీస వేతన చట్టాన్ని కాలరాసిన పారిశ్రామికవేత్తలు కార్మికులను కన్నబిడ్డల్లా చేసుకున్నానని మన చెవుల్లో పువ్వులు పెట్టవచ్చు.

ప్రజల రక్తమాంసాలను పీల్చడానికి ప్రైవేటు విద్య, వైద్యం అనేవి పదునైన కోరలున్న వ్యాపార జాగిలాలు. వాటిలో కోట్లు కొల్లగొడుతూ ప్రజలకు గొప్ప మేలు చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చేతి వైద్యం చేసేవారు తప్ప మెడిసిన్ చదివిన వారందరు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేవారు. జనాభా పెరిగి సర్కారు దవాఖానాలు సరిపోక ప్రైవేటు హాస్పిటళ్లు మొదలయ్యాయి. అలా సేవ పేరుతో వైద్య వృత్తి నిలువు దోపిడీకి సెంటర్ అయింది. కాలక్రమంగా మెడిసిన్ చదవడమే సొంత ప్రాక్టీస్ కోసం అన్నట్లు మారిపోయింది. వీలయినంత త్వరగా ఓ భారీ భవంతి కట్టేసి కార్పొరేట్ స్థాయికి మారిపోవాలనేదే నేటి డాక్టర్ల కల. వృత్తిలో పైకెదగడం మంచిదే కానీ, ఎదగడమే లక్ష్యంగా జనాన్ని మోసం చేయకూడదు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టకూడదు. వృత్తి నైతికతకు భంగం రానీయవద్దు. వీటిని పాటిస్తే గుట్టలుగా ధనం పేరుకుపోయి అవకాశమే లేదు. చాలా చోట్ల యాభై, వంద రూపాయల ఫీజుతో నలభై, యాభై ఏళ్లుగా ప్రాక్టీస్‌చేస్తున్న డాక్టర్లు ఉన్నారు. వారికి వృత్తి ధర్మం తప్ప ప్రచారం అక్కరలేదు. అదీ నిజమైన జీవన సాఫల్యం. అయితే వీరివైపు ప్రభుత్వాలు కన్నెత్తి చూడవు. నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో తమ కార్పొరేట్ వైద్యశాలలు విస్తరిస్తున్న డాక్టర్ల మెడలో పద్మ పతకాలు అలరిస్తుంటాయి. ప్రభుత్వాలు, పత్రికలు, సంస్థలు అన్ని ఈ ఢాంబిక జీవితానికే గుర్తింపునిస్తున్నాయి.

అడ్డంగా సంపాదించాక మీడియా ముందుకొచ్చి తాము పనివాళ్లను సర్వెంట్స్ అని కాకుండా హెల్పర్స్ అని గౌరవంగా పిలుస్తామని అంటారు. పక్కన కూచున్న వారి పిల్లలు తమకు డాడీ పేదలను ప్రేమించడం నేర్పారని సుద్దులు చెబుతారు. డ్రైవర్ కూతురు పెళ్ళికి వెళ్ళినామనే మాటను ఎన్నో మెట్లు దిగామన్నట్లు ఘనంగా చెబుతారు. పనివాళ్ల పిల్లల చదువుల బాధ్యత తమదే అంటారు. ఇవన్నీ చెబుతారు కాని తులతూగే ధనరాశులు ఎలా కూడబెట్టారో చెప్పరు. పన్ను ఎగ్గొట్టడానికి ఎన్ని దొంగ దారులు వెదికారో బయటపెట్టరు. ఉద్యోగుల జీతభత్యాల పెంపు విషయంలో వీరెంత కఠినంగా ఉంటారో ఆ పని వాళ్లకే తెలుసు. నెలకు లక్ష తీసుకుంటున్నట్లు సంతకం పెట్టి అందులో సగమైనా చేతికందని శ్రమజీవులు వీరి హాస్పిటల్, కాలేజీల్లో ఎందరో ఉంటారు. ఒక పత్రికాధిపతి, ఒక మహానటుడు తమ పనివారలకు అయిదు రూపాయలు పెంచడానికి కూడా గింజుకొనేవారట. వారి కీర్తిప్రతిష్ఠల ధగధగల ముందు ఇవి కానరావు. నిజాయితీగా సంపాదించి, అందులోంచి ఎంత మేరకు దానం చేస్తున్నావన్నది మాత్రమే దాతృత్వానికి కొలబద్దగా నిలుస్తుంది. చార్మినార్ దగ్గర ఓ చిరు వ్యాపారి రోజూ యాభై మందికి రొట్టెలు పంచిపెడతారట. నల్గొండలో ఓ రిటైర్డ్ టీచర్ తన సొమ్మునంతా ఓ లైబ్రరీ కోసం వెచ్చించారట. ఓ వృద్ధురాలు కోట్లు విలువ చేసే తమ ఇంటిని ప్రభుత్వానికి రాసిచ్చారట. ఇలాంటి త్యాగాలు ఎక్కడో లోపలి పేజీల్లో చిన్న వార్తగా వస్తాయి. వీరిది కేవలం దాతృత్వం కాదు, మహా మానవత్వం. నలుగురికి సాయపడడంలో వీరిది ఫ్యాషన్ కాదు పాషన్, జీవన కాంక్ష.

బద్రి నర్సన్, 94401 28169

ఓరుగొల్లు..ఖమ్మం మున్నీరు

మన తెలంగాణ /వరంగల్ బ్యూరో/ఖమ్మం బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో బుధవారం నుండి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన కుంభవృష్టి కి చెరువులు తెగి వరంగల్ మహా నగరాన్ని వరదలు ముంచెత్తి జలదిబ్బంధo చేశాయి. ఈ హఠాత్తు పరిణామంతో ప్రజలు దిక్కుతోచక ప్రా ణాలు కాపాడుకోవడానికి బిల్డింగుల పైకి బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో బిల్డింగ్ టెర్రస్‌ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. తమను కాపాడేవారు లేరా అంటూ గురువారం తెల్లవారు జాము నుండి ప్రజలు ఆర్తనాదాలు పెట్టినా వరదల నుండి గురువారం రాత్రి వరకు వారిని బయటికి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కన్నీరే మిగిల్చింది.భారీగా పంటన ష్టం జరిగింది. మున్నేరు పొంగింది. గురువారం సాయంత్రానికి 25అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోపాల్పూర్ ఊర చెరువు తెల్లవారుజామున తెగిపోవడంతో ఆ వర ద హనుమకొండ జిల్లా కేంద్రంలోని అమరావతి నగర్, సమ్మయనగర్ కాలనీ, గోపాలపురం, టిఎన్జీవోస్ కాలనీ, విద్యారణ్యపురి, నహీంనగర్, రెడ్డి కాలనీ, డబ్బాల నుండి

వరద ప్ర భావం నాగారం చెరువుకు చేరుకుంది. అయితే ఈ కాలన్నింటిని తెల్లవారుజామునే వరదలు ముంచెత్తడంతో ఆ ఇండ్లలోకి నీరు చేరడం వల్ల సర్వం కోల్పోయిన ఇంటి యజమానులు పిల్లా పాపలతో పక్కనున్న బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల కట్టు బట్టలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారు. గురువారం ఉదయం అధికారులు అందుబాటులోకి రావడంతో వారికి వాటర్ బాటిల్స్ టిఫిన్స్, ఆహారం డ్రోన్ల ద్వారా సరఫరా చేశారు. మంత్రి సురేఖ, ఎంపీ కడియం కావ్య ఎంఎల్‌ఎ రాజేందర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్లు సత్యశారదలు క్షేత్రస్థాయిలో గురువారం ఉదయం నుండి ముంపు ప్రాంత ప్రజలను వరదల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వరదలు నుండి వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. భారీ ఎత్తున వరదలు ముంచేతడం వల్ల ఉధృత స్థాయిలో ప్రధాన రహదారులపైనే నడుముల వరకు నీళ్లు ప్రవహించాయి. ఈ పరిస్థితిలో వరంగల్ చుట్టూ వరదలు చుట్టుముట్టి నగరాన్ని దిగ్బంధం చేశాయి. ఎటునుండి ఎటు వెళ్లాలన్నా కూడా నగరంలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది.

వరద ముంచెత్తిన విధానం….

బుధవారం ఉదయం నుండి తుఫాన్ ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండగా వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ చెరువులు, కుంటలు నిండాయి ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఉన్న ధర్మసాగర్ చెరువుకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆ చెరువు కట్ట నీటి ప్రవాహనికి తట్టుకోలేక తెగిపోయింది. ఆ చెరువు నీరు అంతా సోమిడి చెరువులో కలిసి ఆ చెరువు మత్తడి ద్వారా ఉధృతంగా ప్రవహించింది. దీంతో గోపాలపూర్ ఊర చెరువు లోకి అధికంగా నీరు రావడంతో చెరువు కట్ట పూర్తిగా ధ్వంసమైంది. ఈ పరిణామంతో మూడు చెరువుల వరద నీరు హన్మకొండ జిల్లా కేంద్రాన్ని గురువారం తెల్లవారు జామున ముంచింది. హనుమకొండలోని అమరావతినగర్ సమ్మయ్యనగర్, విద్యారణ్యపురి టీవీ టవర్ కాలనీ, గోపాలపురం,టీఎన్జీవోస్ కాలనీ, పలు కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటు చూసినా వరద ఉధృతి ప్రవహించడంతో ఏమి తోచని పరిస్థితుల్లో ఆయా కాలనీలో ఉన్న ప్రజలందరూ వారి వారి భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు.

వరంగల్ తూర్పులో ముంపు…

బుధవారం నుండి గురువారం తెల్లవారుజామున వరకు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరదలు నగరాన్ని వరదలు చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలో వెళ్లాలన్న ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం ఉదయం వరకు టెర్రస్‌పైలో ఉన్న ప్రజలకు ఆహారం అందించిన అధికారులు ప్రజాప్రతినిధులు వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఉన్నాయి హంటర్ రోడ్ లోనే సిఐ ఎస్సార్ గార్డెన్ పరిధిలో భారీ ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటు చూసినా నీటితో నిండి ఉన్న ప్రాంతాలు కనిపించాయి. భద్రకాళి చెరువు శిఖం హంటర్ రోడ్డుపై భాగంలో వరదలు భారీగా ప్రవహించడం వల్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గురువారం రాత్రి వరకు వరదలు తగ్గకపోవడంతో ప్రజలు భవనాలపైనే ఉండిపోయారు.

వరంగల్‌హన్మకొండకు తెగిన సంబంధాలు

వరంగల్ నుండి హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారులు వరదలతో నిండిపోయాయి. వరంగల్ నుండి వస్తున్న భద్రకాళి వాగు వరద ములుగు రోడ్డు జంక్షన్లో నిలిచిపోయాయి .అలంకార్ కాపు వాడ ములుగు రోడ్డు వరకు భారీ ఎత్తున నీరు చేరడం వల్ల బస్సులు సైతం వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు గురువారం రాత్రి వరకు అటు రాకపోకలను అనుమతించలేదు. అదేవిధంగా హనుమకొండ నుండి వరంగల్ చేరుకోవడానికి హంటర్ రోడ్‌లోని సిఎస్‌ఆర్ గార్డెన్ ఖమ్మం బైపాస్ బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద పెరిగి నీరు ప్రవహిస్తుండడంతో అటు కూడా వాహనాలను అనుమతించలేదు. వరంగల్ అండర్ బ్రిడ్జి మునిగిపోవడం వల్ల ఖమ్మం వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ నర్సంపేట నుండి వరంగల్ హనుమకొండ కు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితిలు ఉన్నాయి. కరీంనగర్ నుండి రావాల్సిన బస్సులు పరకాల నుండి డైవర్ట్ చేశారు.

ములుగు రోడ్డు నుండి రావాల్సిన వాహనాలను పోచం మైదానం నుండి ములుగు రోడ్డు ఆరేపల్లి కు తరలించి అక్కడ నుండి పరకాలకు తరలించారు పెద్దమ్మ గడ్డ కు వెళ్లే హంటర్ రోడ్డు బ్రిడ్జి పై నుండి భద్రకాళి చెరువు వాగుల వరద భారీగా వస్తున్నందున వాహనాలను పరిమిత సంఖ్యలో అనుమతించారు. వరంగల్ నుండి హనుమకొండకు వెళ్లాలన్న వయా రంగశాయిపేట నుండి బట్టుపల్లి కాజీపేట మీదగా వెళ్లాల్సి ఉంది పరకాల ములుగుకు వెళ్లాల్సిన వాహనాలు భీమారం నుండి జాతీయ రహదారిపై ములుగు రోడ్డు ఎన్‌ఎస్‌అర్ వద్దకు చేరుకుంటున్నాయి. గురువారం రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉండడంతో నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకు పోయింది.

ట్రాక్టర్ల పై పరిశీలన…

హనుమకొండ వరంగల్ పట్టణాల్లో ముంచేతిన వరదలను పరిశీలించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సత్య శారదలో ట్రాక్టర్లపై వరదల్లో ప్రయాణించి వరద ఉధృతిని అంచనా వేశారు. వరద తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలను టెర్రస్‌పై నుండి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు సహా. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దించి వారి సాయంతో కొన్ని ప్రాంతాల్లోనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఎఫ్‌టిఎల్ ప్లాట్లకు టిడిఆర్?

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ప్లాట్లు కొనుగోలుచేసిన వా రికి నష్టం జరుగకుండా కొత్త ప్లాన్‌ను హైడ్రా రూపొందిస్తోంది. ప్రస్తతుం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్లలో బిల్డింగ్‌లు నిర్మించరాదనీ, అ నుమతులు మంజురు కావనీ, ప్లాట్ల యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించిన హైడ్రా.. వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లను మంజూరు చేయడం ద్వారా వా రికి మద్దతుగా నిలవాలని ప్లాన్ చేసింది. హైడ్రా పరిధి(ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం)లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వెబ్‌సైట్ ఆధారంగా 455 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ల లో ప్లాట్లు చౌకగా వస్తున్నాయని మధ్యతరగతి ప్రజలే అధికంగా కొనుగోలు చేస్తారనీ, వారు ఏండ్లతరబడి చేసిన కష్టం కాస్త బురదపాలు కా వద్దని వారికి టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించినట్టు సమాచారం. ఈమేరకు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వారి కష్టార్జితం నీటిపాలైతే.. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికి రోడ్డునపడే అవకాశాలు ఉన్నందున వారి ప్లాట్లకు తగిన ధర పలికేట్టు టీడిఆర్‌లు ఇచ్చేదిశగా హైడ్రా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఆరు చెరువుల పునరుద్ద్ధరణ..

గ్రేటర్‌లో ఆరు చెరువులను పునరుద్దరించాలని హైడ్రా నిర్ణయించింది. ఇందులో బతుకమ్మ కుంట (అంబర్‌పేట్), బుమ్రుఖ్ దావాలా (రాజేంద్రనగర్), తమ్మిడి కుంట (ఎన్ కన్వెన్షన్), సున్నం చెరువు (మాదాపూర్), నల్ల చెరువు (కూకట్‌పల్లి), నల్ల/పెద్ద చెరువు (ఉప్పల్)ల కలుషితాన్ని అరికట్టడానికి డీవాటరింగ్, డీసిల్టింగ్, ఇన్‌ఫ్లో చానెళ్లను పునరుద్ధరించడం, మురుగునీటి మార్గాలను నిరోధించడం వంటివి నివారిచడం జరుగుతుంది. ఈపాటికే బతుకమ్మకుంటతో పాటు కూకట్‌పల్లి నల్ల చెరువు పునరుద్దరించడం దాదాపు పూర్తికావచ్చింది.

రాజేంద్రనగర్‌లోని బూమ్రుఖ్‌దౌలా చెరువు పనులు ప్రారంభించింన హైద్రా వీటి ద్వారా నగరంలోని చెరవులకు స్పూర్తిగా నిలపాలని హైడ్రా నిర్ణయించింది. ఈ 6 చెరువుల ఎఫ్‌టీఎల్ లను, బఫర్‌జోన్‌లను గుర్తించడంతో ఆందులో ప్లాట్లున్నాయి. అవి పూర్తిగా తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో ఆ ప్లాట్ల ధరలకు అనుగుణంగా ప్లాట్ల యజమానులకు టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించార. ఈమేరకు జీహెచ్‌ఎంసి అధికారులకు లేఖ రాసి ఒప్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు హైడ్రా ప్రతిపాదనలను సిద్దం చేసి, సర్కారుకు, జీహెచ్‌ఎంసికి పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

డబుల్ ధమాకా

చెరువులు, కుంటల పరిరక్షణ చర్యల్లో భాగంగా తొలగించిన, మున్ముందు తొలగించాల్సిన ప్లాట్లకు నగదు పరిహారానికి బదులుగా టీడీఆర్ ఇచ్చే విషయంపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి హైడ్రా కసరత్తు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులతో పాటు గ్రేటర్ వెలుపల 270 చెరువులు ఉన్నాయి. వీటి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్ల విలువకు రెట్టింపు విలువను కట్టించి అందుకు సమానంగా ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లు జీహ్‌చెంసి, హెచ్‌ఎండిఏలతో మంజూరు చేయించనున్నది హైడ్రా. ప్లాటు విలువ మార్కెట్(ప్రభుత్వ) ధర రూ. 10 లక్షలుగా ఉంటే.. ఆ ధరను రెట్టింపుగా రూ. 20 లక్షలుగా టిడిఆర్ బాండ్స్‌ను అందించాలని హైడ్రా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం ప్రభుత్వ ధరకు అదనంగా అంతే ధర అంటే రెట్టింపు ధర వచ్చేలా టిడిఆర్‌లను మంజూరు చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించి గ్రేటర్, హెచ్‌ఎండిఏల ద్వారా టిడిఆర్‌లు అందించేందుకు హైడ్రా సిద్దమవుతోంది.

మైనారిటీ నేతను అడ్డుకుంటున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్: అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బిజెపి కుట్రలు చే స్తోందని, అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కా లం కెప్టెన్‌గా వ్యవహారించారని, క్రికెట్‌తో దేశానికి ఎంతో సేవ చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ నేత అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీ సుకోవడంతో ఆ రెండు పార్టీలు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాయని ఆయన విమర్శించారు. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరని, అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీ డాకారుడికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తుంటే బి జెపి అడ్డుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. అజారుద్దీన్‌పైన బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి కుట్ర చే స్తున్నాయని, బిజెపి, బిఆర్‌ఎస్‌లు తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సహకారంతోనే బిజెపి రాష్టంలో 8 సీట్లు గెలుచుకుందని ఆయన అన్నారు.

గవర్నర్‌పై బిజెపి ఒత్తిడి

జూబ్లీహిల్స్‌లో తమకు గెలిచే అవకాశం లేదని బిజెపి కి తెలుసనీ అందుకే బిఆర్‌ఎస్‌కు లాభం చేయడం కోసం ఆలస్యంగా బలహీనమైన అభ్యర్థిని బిజెపి ప్రకటించిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలు ఎవరూ బిజెపికి ఓటు వేయరని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్‌కు లాభం కలిగించడం కోసమే అజారుద్దీన్‌ను మంత్రి కాకుండా బిజెపి అడ్డుకుంటోందన్నారు. అ జారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌పైన బిజెపి ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. గతంలో రాజస్థాన్‌లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుందని, గంగానగర్ జిల్లా కరణ్‌పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పా ల్ సింగ్‌ను డిసెంబర్ 30న రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుందని, ఆయన ఉప ఎన్నిక అభ్యర్థి అని, మంత్రివర్గంలోకి బిజెపి తీసుకుందన్నారు. ఉపఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బిజెపి నాయకులు అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే ఉందని, ప్రమాణ స్వీకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బయట జరుగుతుందని భట్టి పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో మీరెలా చేశారు? : పిసిసి చీఫ్

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలనే లోపాయికారీ ఒప్పందంలో భాగంగా బిజెపి రాజకీయాలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మ క్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. క్రీడాకారుడిగా, రాజకీయ నేతగా అజారుద్దీన్ ప్రజలకు సేవలదించారని అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించామని ఆయన తెలిపారు. ఇప్పుడు మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని, మైనార్టీని మంత్రిని చేస్తున్నారన్న అక్కసుతో రాజకీయం చేస్తోందన్నారు. బిజెపి పాలిత రాజస్థాన్‌లో 20 రోజుల్లో ఎన్నికలు ఉండగా సురేంద్ర పాల్‌ను మంత్రిని ఎలా చేశారని, ప్రశ్నించారు. మంత్రిని చేసినా సురేంద్ర పాల్ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

మైనార్టీలపై విషం : ఎంపి చామల

బిజెపి, బిఆర్‌ఎస్‌లు మైనార్టీలపై విషం కక్కుతున్నాయని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించా రు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పార్టీలు అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుం డా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. మైనార్టీలు అంటే ఎందుకు అంత కడుపుమంట అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండవద్దా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే మతాల మధ్య చిచ్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం కల్ల అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తాము ఓడిపోతే ప్రభుత్వం పడిపోవాలని కెటిఆర్ ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెటిఆర్ మాటలతో కుట్ర, కుతంత్రం అంతా బయటపడిందన్నారు.