Top Story
థ్రిల్లింగ్ సన్నివేశాలతో టీజర్

యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘ముఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవర్‌ఫుల్ టీజర్ విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో సినిమాపై అంచనాలను పెంచింది. ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. Also […]
ఎపి విద్యార్థులకు గుడ్ న్యూస్

అమరావతి: దసరా పండగ సందర్భంగా విద్యార్థులకు ఎపి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయుల కోరిక మేరకు మరో రెండు రోజులు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ అధికారిక ప్రకటన చేశారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. తాజాగా మార్పు చేయడంతో ఎపిలో పాఠశాలలకు మరో రెండు రోజులు అదనంగా సెలవులు వచ్చాయి. పాఠశాల సెలవులు పొడిగించాలని మంత్రి లోకేశ్ ను టిడిపి […]
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం – కాలువలో పడి ముగ్గురు మృతి, మరో చిన్నారి కోసం గాలింపు..!
కీలక రేసింగ్ సన్నివేశాల షూటింగ్‌లో..

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ ‘శర్వా 36’లో స్కిల్ మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. శుక్రవారం మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. ఈ చిత్రంలో మాళవిక […]
మణిపూర్ లో ముష్కరుల దాడి… ఇద్దరు జవాన్లు మృతి

ఇంఫాల్: ఆర్మీ వాహనంపై ముష్కరుల దాడి చేయడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో జరిగింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల 407 టాటా వాహనం నంబోల్ సబెల్ లీకాయ్ ప్రాంతంలోకి రాగానే ముష్కరుల కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి […]
Google Gemini AI photo editing prompt : ఏఐ ప్రాంప్ట్‌లతో పండుగ సీజన్ కోసం పర్ఫెక్ట్ శారీ లుక్..
ట్రైలర్ వచ్చేస్తోంది

2022లో విడుదలైన ‘కాంతార‘ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త రికార్డులు నెలకొల్పింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టర్ షేర్ చేశారు. […]
బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఢీ

నేటి నుంచి సూపర్-4 సమరం రాత్రి 8 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో.. దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగే తొలి సూపర్4 పోరులో బంగ్లాదేశ్ టీమ్‌తో శ్రీలంక తలపడనుంది. లీగ్ దశలో లంక ఆడిన మూడు మ్యా చుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్4లోనూ సత్తా చాటేందుకు లంక సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే ఆటగాళ్లు రెండు జట్లలోనూ ఉన్నారు. నిసాంకా, కుశాల్ మెండిస్, […]
పెద్దారెడ్డి ఇంటి ముందు జెసి ప్రభాకర్ రెడ్డి హంగామా… తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్

అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో తన అనుచరులతో కలిసి టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి హంగామా సృష్టించారు. జెసి ప్రభాకర్ రెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని వైసిపి నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శుక్రవారం తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు […]