దారితప్పుతున్న ఆత్మగౌరవ ఉద్యమం

భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన వ్యక్తి పెరియార్ ఇవి రామస్వామి. ఆయన గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ఈ ఏడాదికి పెరియార్ ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లవుతుంది. ఆ విప్లవ నాయకుని గురించి మాట్లాడుకోవాలంటే ఆధిపత్యం, అణచివేత, ఛాందస భావాలపై ఆత్మగౌరవ రణభేరి గురించే. ఈ ఉద్యమం తమిళనాడు ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో పెను మార్పులకు సృష్టించింది. దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఉద్యమానికి ఆజ్యం పోసింది. వెనుకబడిన వర్గాలలో చైతన్యాన్ని రగిలించింది. […]
