రాజేంద్రనగర్ లో నడిరోడ్డుపై గొంతుకోసి హత్య?

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని మృతదేహం రక్తం మడుగులో పడి ఉంది. అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీ సాయంతో ఆధారాల […]