Latest News
ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: రామచందర్ రావు

హైదరాబాద్: యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గ్రూప్-1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశారు. గ్రూప్-1 అంశంలో టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా […]
కుమారుడిని చంపి డ్రమ్ములో పడేసి.. భార్యపై దాడి… విషమం

అమరావతి: తండ్రి బాలుడిని చంపి అనంతరం భార్యను చంపబోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవనకొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవనకొండలో నరేష్, శ్రావణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. పొలం వద్ద కుమారుడిని చంపేసి నీటి డ్రమ్ములో పడేశాడు. అనంతరం భార్య శ్రావణిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అత్తమామలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని […]
ఆ వార్తల్లో నిజం లేదు: దానం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టికెట్ ఎవరికి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం […]
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 11 నెలల్లో 32% పతనం: ఇది కొనేందుకు మంచి అవకాశమా?
యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసింది: కెటిఆర్

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం సిఎంవొలు డబ్బులు డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నట్లు మంత్రులు, సిఎంవొపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని సూచించారు. ఆరోపణల దృష్ట్యా తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు తావు లేకుండా మళ్లీ పరీక్ష […]
కాలేజీలో కాల్పులు: ఎంబిఎ విద్యార్థి మృతి

లక్నో: కాలేజీ హాస్టల్ రూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక ఎంబిఎ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి త్రీవంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ కుమార్(22) యుపిలో బిమ్ టెక్ కాలేజీలో ఎంబిఎ చదువుతున్నాడు. అదే కాలేజీలో ఆగ్రా చెందిన దేవాన్షు చౌహాన్ పిజిడిఎం చదువుతున్నాడు. ఇద్దరు కాలేజీకి సంబంధించిన ఆర్ సిఐ విద్యావిహార్ హాస్టల్‌లో ఉంటున్నారు. రూమ్‌లో దేవాన్షు, […]