Latest News
ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే…అంతం కాదు: రాజ్‌నాథ్

భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగరంగ వైభవంగా వేడుక మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ అరంభం మాత్రమే…అంతం కాదు..’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ […]
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

ముల్లాన్‌పూర్: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళా టీమ్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే […]
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కార్ సంకల్పం: పిసిసి చీఫ్

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ప్రకాశం హాలులో జరిగిన మహిళా సాధికారత సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పరంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి కార్పోరేషన్ల నుంచి కుట్టు మిషన్ల […]
తీన్మార్ మరో పెరియార్ అవుతాడు

దగ్గర్లోనే బిసిల తలరాత మార్చే రోజు పార్టీలన్నీ సంపదను దోచుకుంటున్నాయి మాజీ డిజిపి, ఏఐబిఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు మన తెలంగాణ / హైదరాబాద్: : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయపార్టీని ప్రారంభించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్‌పి)ని ఏర్పాటుచేశారు. తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన సభా కార్యక్రమంలో పలువురు బిసి ప్రముఖల సమక్షంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను రెండు […]
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.82 మీటర్ల దూరంలో విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ కోసం నిర్దేశించిన 84.50 మీటర్ల మార్క్‌ను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. దీంతో అతను మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగే ఫైనల్లో నీరజ్ స్వర్ణం కోసం పోటీపడనున్నాడు. పోలండ్ […]
జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ.. ట్రైలర్ చూసేయండి..

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ‘పరమ్ సుందరి’ సినిమాతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జాన్వీ నటిస్తున్న మరో చిత్రం హోం బౌండ్ (Homebound). ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో […]
త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ.., 3000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు నిర్ణయం : మంత్రి గొట్టిపాటి
చొరబాటుదారులను కాపాడేందుకే కాంగ్రెస్ ర్యాలీలు: అమిత్‌షా

న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్లడించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఢిల్లీ లోని త్యాగరాజ్ స్టేడియంలో స్థానిక ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. “చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇటీవల ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించింది. వారి ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. దేశ […]
అమెరికా నేతలు అవినీతిపరులు.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్

ఇస్లామాబాద్: ఓ పక్క పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతి పరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. పాక్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడుతూ “ మేము లంచాలు స్వీకరించామని తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నాం. […]