ఆసియా కప్.. నేడు భారత్-పాక్ సూపర్ 4 పోరు..

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే సూపర్4 రెండో మ్యాచ్‌కు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటికే లీగ్ దశలో పోటీపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే సంప్రదాయాన్ని సూపర్4లోనూ కొనసాగించాలనే పట్టుదలతో భారత్ ఉంది. పాకిస్థాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. లీగ్ దశలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను ఓడించాలంటే పాకిస్థాన్ సర్వం ఒడ్డి పోరాడక […]




