Latest News
బతుకమ్మ వేడుకలకు ప్రపంచ సుందరి ఒపాల్ సుచాతా చువాంగ్ శ్రీ
రష్మికకు మరో బంపర్ ఆఫర్.. బాలీవుడ్ హిట్ సీక్వెల్‌లో చాన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు కాక్ టెయిల్ 2, తామ్మా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన ప్రాంచైజీ దోస్తానా 2 చిత్రంలో హీరోయిన్ గా అమ్మడికి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. విక్రాంత్ మాస్సే కథానాయకుడిగా కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా దోస్తానా 2 ని తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ ని హీరోగా తీసుకుని అటుపై అతడిని తప్పించి విక్రాంత్ కు అవకాశం ఇచ్చారు.అయితే ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించారు ఫిల్మ్‌మేకర్స్.
తాజాగా రష్మిక మందన్నను కరణ్ సంప్రదించాడు. ఈ సినిమా చేసేందుకు రష్మిక సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తుది నిర్ణయం చెప్పడానికి మాత్రం కొంత గడువు కావాలని కోరిందట. అందుకు కరణ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక కూడా సీరియస్ గా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టడంతో దొస్తానా 2కి ఎలాంటి అడ్డకులు చెప్పే అవకాశం లేదు.
పాకిస్థాన్ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా
రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు
ఆ స్టార్ కారణంగానే డ్యాన్స్‌లో నైపుణ్యం: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తనకి డ్యాన్స్ ఇంత పర్ఫెక్ట్‌గా రావడానికి కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తమన్నా మాట్లాడుతూ.. “నేను అల్లు అర్జున్ కారణంగానే డ్యాన్స్‌లో ఉండే నైపుణ్యాలను నేర్చుకున్నాను. నేను బద్రీనాథ్ సినిమా చేసే సమయంలో అల్లు అర్జున్ నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆయన నుండే నేను డ్యాన్స్ పర్ఫెక్షన్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్ ఇచ్చిన సలహా డ్యాన్స్ ను మెరుగుపరచడంలో సహాయపడింది. అందుకే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఒప్పుకుంటున్నాను” అని పేర్కొంది.