Latest News
తెనాలిలో భారీ చోరీ.. కారు నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్లారు..
తెనాలి: గుంటూరెు జిల్లా తెనాలిలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. తెలంగాణకు చెందిన ఓ ఐఆర్‌ఎస్ అధికారి గురువారం రాత్రి చెంచుపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌కు వివాహానికి హాజరయ్యారు. ఆయన తన కారులో ఓ బ్యాగ్‌ను ఉంచి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు కారు అద్ధం బద్దలు కొట్టి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. పొయిన బ్యాగ్‌లో రూ.5 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం, 3 ఐఫోన్‌లు, పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై తెనాలి పోలీసులకు ఐఆర్ఎష్ అధికారి ఫిర్యాదు చేశారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత… కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడినా గెలిచినా ప్యాక్షనిజం చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనను తాడిపత్రికి రాకుండా టిడిపి కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. హైకోర్డు ఆర్డర్స్ ఉన్నప్పటికి తనని తాడిపత్రికి రానివ్వడంలేదని కేతిరెడ్డి ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గతంలో తాడిపత్రికి కేతిరెడ్డి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తులు ఆయన ఇంటిని చుట్టుముట్టడానికి ప్రయత్నించిన విషయం విధితమే.
‘ఎఫ్16, జేఎఫ్17.. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కూలిన పాక్ యుద్ధ విమానాలు’
గగనతల వ్యవస్థ రక్షణ కోసం ‘సుదర్శన చక్ర’: ఐఎఎఫ్ చీఫ్
న్యూఢిల్లీ: నిర్ధిష్ట లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్‌ని ప్రారంభించి త్వరగా ముంగించామని ఐఎఎఫ్ చీఫ్ ఎపి సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన వివరించారు. శతృవుల స్థావరాలను గురి చూసి కచ్చితంగా కొట్టామని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో కేంద్రం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. సంక్షోభం ఎలా ఎదురుకోవాలో ప్రపంచం భారత్‌ను చూసి నేర్చుకోవచ్చని కొనియాడారు. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. భవిష్యత్ సవాళ్లు అధిగమించేందుకు రక్షణ రంగంలో ప్వావలంబన అవసరమని తెలిపారు.
గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ను తయారు చేస్తున్నామని.. ఐఎఎఫ్ చీఫ్ ఎపి సింగ్ తెలిపారు. సుదర్శన చక్ర తయారీకి త్రివిధ దళాలూ పని ప్రారంభించాయి. మరిన్ని ఎస్-400ల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం అని తెలిపారు.
కారుతో ఢీకొట్టి వ్యక్తి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
కందుకూరు: నెల్లూరు జిల్లా రాళ్ల పాడు వద్ద దారుణంగా హత్య జరిగింది. కారుతో బైకును ఢీకొట్టి, కిందపడిన వ్యక్తిని తొక్కించి దారుణంగా హత్య చేశాడు. నాయుడు, మరో ఇద్దరు బైక్ పై వెళ్తుండగా కారుతో ప్రసాద్ ఢీకొట్టాడు. అక్కడిక్కడే నాయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాళ్లపాడు వద్ద జరిగింది.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే దారకాని పాడుకి చెందిన నాయుడు, ప్రసాద్ కు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. వ్యక్తిగత, ఆర్థిక విభేదాలు, వివాహేతర సంబంధం కారణాలతో హత్యజరిగిందని పోలీసులు తెలిపారు.
సొంతూరులో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న డిజిపి శివధర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డిజిపిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం పెద్దతుండ్లకు బత్తుల శివధర్ రెడ్డి విచ్చేశారు. ఈ దంపతులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. డప్పులు, డోళ్లు , భజంత్రీలు , బాణాసంచాలతో గ్రామస్తులంతా కలిసి వారిని దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. గ్రామంలో నిర్వహించిన భారీ దసరా ఊరేగింపులో శివధర్ రెడ్డి దంపతులు , కుటుంబీకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జమ్మిపూజ నిర్వహించిన తర్వాత గ్రామంలోని ప్రసిద్ధ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి తదుపరి దుర్గామాతకు శివధర్ రెడ్డి హేమలత దంపతులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుండ్ల గ్రామస్థులతో డిజిపి ముచ్చటించారు.
‘మీటింగ్ అని పిలిచారు, ఉద్యోగం తీసేశారు’- భారతీయులను లేఆఫ్ చేసిన అమెరికా సంస్థ!
కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురికి గాయాలు
కామారెడ్డి పట్టణంలో గురువారం అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం రేపాయి. పది రోజుల పాటు ప్రశాంతంగా సాగిన నవరాత్రి ఉత్సవాలు కత్తిపోట్లతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీశాయి కామారెడ్డి పట్టణ సెంటర్ పాయింట్ అయిన పాత బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పాత బస్టాండ్ ప్రాంతంలో దుర్గానవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారికి ఉద్వాసన పలికిన అనంతరం పలు చోట్ల దాండియా ఆడారు. దాండియా వద్ద రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కొందరు యువకులు వెంట తెచ్చుకున్న కత్తులతో దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఆస్పత్రికి తరలించిన పోలీసులు
దాడిలో ఐదుగురు యువకులకు మెడ, పొట్ట, వీపు భాగాలలో గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పోలీసులు జిజిహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులను రాహుల్, మణిరాజు, మణికంఠం, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. జిజిహెచ్ ఎదుట మళ్లీ రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో తెలంగాణ మహిళ స్నానం చేస్తుండగా… వీడియో చిత్రీకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డున అమరావతిలో దారుణం వెలుగులోకి వచ్చింది. విజయవాడలో తెలంగాణ మహిళను వేధింపులకు గురి చేశారు. దుర్గాదేవి దర్శనం కోసం వచ్చిన మహిళ నగ్న వీడియోలను ఇద్దరు యువకులు చిత్రీకరించారు. ఈ సంఘటన విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గవర్నర్ పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తుండగా మహిళను పక్క రూంలో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకులను బాధితురాలు గుర్తించింది. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.