Latest News
ఫ్రెండే రేప్ కు పాల్పడ్డాడు
తన స్నేహితుడే తనకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డాడని, అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు తీశాడని ఓ ఎంబిబిఎస్ విద్యార్థిని ఆరోపించింది. ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఒక హోటల్ లో 20 ఏళ్ల యువకుడు తనకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేశాడని 18 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థిని ఆరోపించింది. సెప్టెంబర్ 9న ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.నిందితుడు – తన తోటి వైద్య విద్యార్థి – స్నేహం పేరుతో తనను హోటల్ ఆపిల్ కు రప్పించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడికి చేరుకున్న తర్వాత తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. తన అశ్లీల చిత్రాలు, వీడియోలు చిత్రీకరించిన వాటని వైరల్ చేస్తానని బెదిరించాడని కూడా ఆ అమ్మాయి ఆరోపించింది. నేరం చేస్తున్నప్పుడే వాటిని చిత్రీకరించాడని పేర్కొన్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేయలేదు. ఆ మహిళ హర్యానాలోని జింద్ నివాసి, ఆమె ఢిల్లీలోని రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ హాస్టల్ లో నివసిస్తోంది.
కొడుకు చేతిలో తండ్రి హతం
తల్లిదండ్రులను కుమారుడు సముదాయించే క్రమంలో తండ్రిని చేతులతో వెనక్కి నెట్టి వేయడంతో ఇనుప యంత్రంపై పడి తండ్రి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దామర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. షాబాద్ సీఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని దామర్ల పల్లి గ్రామానికి చెందిన కమ్మరి సదానందం చారి (65) మద్యం సేవించి ఇంటి వద్ద భార్య కమ్మరి సుజాతతో గొడవకు దిగాడు. అది గమనించిన వారి కుమారుడు కమ్మరి రమేశ్ గొడవ పడవద్దని తల్లిదండ్రులను వారించేందుకు ప్రయత్నం చేశాడు. మృతుడు కమ్మరి సదానందం చారి కుమారుడిని మా ఇద్దరి మధ్యలో ఎందుకు వచ్చావంటూ కొట్టాడు. ఆగ్రహించిన కమ్మరి రమేశ్ తండ్రిని చేతులతో నెట్టి వేశాడు. పక్కనే ఉన్న ఇనుప యంత్రంపై మృతుడు కమ్మరి సదానందం చారి పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కమ్మరి సదానందం చారిని వైద్యులు పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని భార్య కమ్మరి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు షాబాద్ సీఐ వెల్లడించారు.
యూరప్‌లో ‘రాజా సాబ్’
విశాఖ ఇందిరానగర్‌లో దోపిడీ దొంగల బీభత్సం
ఎపిలోని విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్‌లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ ఇంట్లో వృద్ధురాలు, ఆమె మనవడిని బంధించిన దొంగలు నగదు, బంగారం అపహరించారు. మొత్తం13 తులాల బంగారం, 3 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న కారు తాళం తీసుకొని కారుతో సహా ఉడాయించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్‌లో ఎల్లయమ్మ, ఆమె మనవడు కృష్ణ కాంత్ నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఇంటి వెనుక వైపు నుంచి ముగ్గురు దొంగలు ఎల్లయమ్మ ఇంట్లో చొరబడ్డారు. ఎల్లయమ్మ బెడ్ రూమ్‌లో నింద్రించగా, మనవడు హాల్‌లో పడు కున్నాడు. ముఖాలకు మాస్కులు పెట్టుకుని ఉన్న ముగ్గురు దుండగులు ముందుగా దొంగలు ఎల్లయమ్మ వద్దకు వచ్చి ఆమె రెండు చేతులు కట్టేశారు. అనంతరం అరవకుండా ముఖానికి ప్లాస్టర్ అంటీంచారు. ఆమె చేతికి ఉన్న బంగారు గాజులన్నీ తీసుకున్నారు.
అనంతరం బీరువా ఓపెన్ చేసి అందులోని నగదు, నగలు తీసుకున్నట్లు బాదితురాలు ఎల్లయమ్మ వెల్లడించింది. ఆ తర్వాత హాల్లో నిద్రిస్తున్న ఆమె మనవడు కృష్ణ కాంత్ దగ్గరకు వచ్చి దాడి చేశారు. చేతుల కట్టి డైమండ్ రింగ్ ఉందని తీసుకున్నారు. వచ్చిన ముగ్గురు హిందీలో మాట్లాడుతున్నారని అతడు తెలిపాడు. వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న కారు తాళాలు తీసుకొని కారులో పారిపోయినట్లు వివరించాడు. ‘మా నాన్న హైదరాబాద్ వెళ్లారు. ఘటన జరిగిన వెంటనే నేను పోలీసులకు కాల్ చేశాను. వెంటనే పోలీసులు వచ్చి వెరిఫై చేశారు. బయట రాష్ట్రానికి చెందిన ముఠాగా అనిపిస్తోంద’ని మనవడు కృష్ణ కాంత్ పోలీసులకు తెలిపాడు. దీనిపై క్రైమ్ ఎస్‌ఐ మహరూఫ్ మాట్లాడుతూ ముగ్గురు దొంగలు హిందీలో మాట్లాడుతున్నట్టు బాధితులు చెప్పారు. ప్లాస్టిక్ వైర్లతో బంధించి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. సిపి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ ఆధారాలను సేకరిస్తుంది. సిపి ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నాం. కారు మారికవలస ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందింది. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో డైవర్ట్ చేసేందుకు లోకల్ గ్యాంగ్ కూడా హిందీలో మాట్లాడే అవకాశం లేకపోలేదు. సాధ్యమైనంత త్వరగా కేసును చేదిస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు.
అమెరికాకు అరుదైన ఖనిజాలను నౌకలో ఎగుమతి చేసిన పాకిస్తాన్ సర్కార్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
కాళేశ్వరం, మల్లన్నసాగర్ కెసిఆర్ కష్టార్జితం:హరీశ్‌రావు
మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన సిఎం రేవంత్
ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లారు. మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించేందుకు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సిఎం రేవంత్ చర్చించినట్టుగా తెలిసింది. ఇటీవల ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతుండగా ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాట్ సర్జరీ చేసిన విషయం విధితమే. అందులో భాగంగా సిఎం బెంగళూరుకు వెళ్లారు. తిరిగి రాత్రి 10.30 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చారు.
ఆర్టీఐ నూతన లోగోను ఆవిష్కరించిన సిఎం రేవంత్‌రెడ్డి
20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్టీఐ నూతన లోగోను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవిలు ఉన్నారు.