Latest News
మహీకాతో ప్రేమలో పడిన పాండ్యా
ముంబయి: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఓ నటితో ప్రేమలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. నటి, మోడల్ మహీకా శర్మతో పాండ్యా కలిసి తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహీకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు హార్థిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆసియా కప్ టి20లో హార్ధిక్ పాండ్యా గాయపడడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌కు అతడు ఎంపిక కాలేదు. మొదటి భార్య నటాషా స్టన్‌కోవిచ్‌తో హార్ధిక్ పాండ్యా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది.
‘తెలుసు కదా’లాంటి సినిమా ఇప్పటి వరకూ చూడలేదు
మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపు ల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుంటాం. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ వుంది. ఆ పాయింట్ థియేటర్స్‌లో చూడాలి. అది ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. -ఈ సినిమా షూటింగ్‌లో చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటివరకూ నేను చూడలేదు. -ఈ కథని చాలా ఎంజాయ్ చేశాను. నీరజ ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ వున్నాయి.
ఇందులో మూడు పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. -ఇందులో అంజలి పాత్రలో కనిపిస్తాను. నా రియల్ లైఫ్ కి ఆ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేవు. -హీరో సిద్దు ఆన్‌సెట్‌లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్‌గా వుంటారు. ఆయనకి ప్రతి క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ వుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభవాన్నిచ్చింది. -తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మల్లిక గంధ పెద్ద హిట్ అయ్యిం ది. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. శ్రీనిధి, -నా కాంబినేషన్ లో చాలా మంచి సీన్స్ వున్నాయి. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. –నిర్మాత విశ్వ ప్రసాద్‌తో వెంకీ మామ సినిమా చేశాను. ఇది సెకండ్ ఫిల్మ్. సినిమా పట్ల చాలా అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. -పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్‌తో వర్క్ చేయడం గొప్ప అనుభవం. ఇక- హిందీలో నాలుగు ప్రాజెక్ట్ చేస్తున్నాను”అని అన్నారు.
ఎల్‌బి నగర్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురికి గాయాలు
ఎల్‌బినగర్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ ప్రాంతం బిఎన్ రెడ్డి నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్రంగూడ వద్ద థార్ కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. డీవైడర్ దాటి మరో కారును ఢీకొట్టడంతో కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. థార్ కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. కారు యజమాని అనిరుధ్, దినేష్, శివ కూడా త్రీవంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలి యాల్సి ఉంది. అతివేగంతో పాటు మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Best selling cars : ఎగబడి కొంటున్నారు! ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవి..
ChatGPT prompts : చాట్‌జీపీటీ ఎక్కువ వాడుతున్నారా? ఈ 5 ప్రాంప్ట్‌లు చాలా ఎఫెక్టివ్..
Bihar Crime News : గర్ల్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు- రెండో భార్యను తగలపెట్టేశాడు!
తెలంగాణ ఐకానిక్‌గా టీస్క్వేర్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఐకానిక్‌గా టీ స్వ్కేర్ నిర్మా ణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించా రు. నవంబర్ నెల చివరి వరకు వి-హబ్ పనులు ప్రారంభించాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ సెంటర్‌లో ఏఐ హబ్, టీ స్వ్కేర్‌లపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్‌రంజన్, సంజయ్‌కుమార్, సిఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టిజిఐఐసీ ఎండి శశాంక, టిఫైబర్ ఎండి వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వి-హబ్ ఐకానిక్ బిల్డింగ్‌గా ఉండాలని సిఎం సూచించారు.
వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, దీని నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వి హబ్‌లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని, వి హబ్ 24 గంటల పాటు పని చేయాలని ఆయన సూచించారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో భవనాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దీనికోసం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ సూచించారు.
బిసి రిజర్వేషన్లపై రేపు సుప్రీంకు
మన తెలంగాణ/హైదరాబాద్ :బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడం తో ఈ నెల పదమూడున (సోమవారం) సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సిఎం రేవం త్‌రెడ్డి, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీ నాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కు మార్ గౌడ్ ఇంకా పలువురు మంత్రులు జూమ్ మీటింగ్ ద్వారా చర్చించా రు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్విని కూడా జూమ్ మీటింగ్‌లోకి తీసుకుని అభిప్రాయాన్ని తీసుకున్నారు. రిజర్వేషన్లపై ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని వారు ని ర్ణయించారు. సోమవారం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, నా మినేషన్ల దాఖలవుతున్న సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుని ‘స్టే’ వి ధించడం స రైంది కాదని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివో నెం. 9 ప్ర కారం ఎన్నికల ప్రక్రియ కొనసాగించుకోవడానికి అనుమతించాలని కోరాలని నిర్ణయించారు. ‘స్టే’ని ఎత్తివేయించగలగితే
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట ను సునాయసంగా కైవసం చేసుకోవడానికి మార్గం సుగ మం అవుతుందని వారు ఈ భావించినట్లు తెలిసింది. న్యాయవాది అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ సుప్రీం కోర్టులో దాఖలు చేసే స్పెషల్ లీవ్ పిటిషన్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు.బిసి రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని మొదటి నుంచి తాము హామీ ఇస్తూ వచ్చామని, ఈ మేరకే జివో కూడా విడుదల చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. కాబట్టి దీనిపై ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని విధాలా పోరాటం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కోర్టులో నిలబడదని తెలిసి కూడా ప్రభుత్వం జివో జారీ చేసిందన్న విపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని ఆయన మంత్రులకు సూచించారు. మీనాక్షి నటరాజన్ కల్పించుకుని ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించడం లేదని అన్నారు. మీరు ఎంతో కృషి చేశారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని, ఇంకా హైకోర్టు స్టే ఇవ్వకుండా ముందుగానే సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయించారని వీటన్నింటినీ బిసిలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారని ఆమె తెలిపారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా ప్రయత్నిస్తున్నదని బిసిలు అర్థం చేసుకున్నారని చెప్పారు. తనకు వందలాది ఫోన్లు వస్తున్నాయని, ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. విపక్షాలు చేసే విమర్శలను తాను ఇంకా మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామని ఆయన చెప్పారు. జిల్లా పార్టీ నాయకులు కూడా స్థానికంగా విలేకరుల సమావేశాల్లో, సభలు, సమావేశాల్లో ప్రభుత్వం చేసిన కృషిని చెబుతున్నారని ఆయన వివరించారు. కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అడ్డుపడుతున్నదని, దీనికి బిఆర్‌ఎస్ బాసటగా నిలుస్తున్నదని ఆరోపించాలని జిల్లా పార్టీ నాయకులకు సూచించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.