elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbet

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ప్లేయర్ల హవా..

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచి అఫ్గాన్‌కు సిరీస్‌ను సాధించి పెట్టిన రషీద్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రషీద్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన సౌతాఫ్రికా స్టార్ కేశవ్ మహరాజ్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో, జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) నాలుగో ర్యాంక్‌ను సాధించారు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గిల్ 784 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అఫ్గాన్ స్టార్ ఇబ్రహీం జద్రాన్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 ర్యాంక్‌లు ఎగబాకి ఏకంగా రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బంగ్లా సిరీస్‌లో రాణించడంతో ఇబ్రహీం ర్యాంక్ గణనీయంగా పెరిగింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ మూడో, విరాట్ కోహ్లి ఐదో, శ్రేయస్ తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

అంతరిక్షానికి 80 వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు

 అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారు చేయడం , 2026 లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షం లోకి పంపడం , 2035 నాటికి జాతీయ అంతరిక్షకేంద్రం ,చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ ఏర్పాటు , వంటి లక్షాలను ఏర్పర్చుకున్నామన్నారు. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ బిగ్ డేటా వంటివాటిని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వికసిత భారత్‌కు దూతగా 2040 లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణన్ పేర్కొన్నారు. 2027 లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్ర మిషన్ ట్రాక్‌లో ఉందని వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు.పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో ఇస్రో ప్రణాళికలను పంచుకున్న వి. నారాయణను గగన్‌యాన్‌లో భాగంగా తాము మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టుతెలిపారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్ఠాత్మక చంద్రయాన్4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో రెండు లేక మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయనం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ అన్నారు. వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన , నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్ టైమ్‌రైలు , వాహన పర్యవేక్షణలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. 

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో సంచలనం సృష్టించిన ఆఫ్రికా దేశం కేప్ వెర్డె

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆఫ్రికా దేశం కేప్ వెర్డె పెను సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా వేదికగా జరుగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. కేవలం ఐదు లక్షల 25 వేల జనాభా మాత్రమే కలిగిన కేప్ వెర్డె ఆఫ్రికా జోన్ గ్రూప్‌డి పోటీల్లో అద్భుత ఆటను కనబరిచిన మెగా టోర్నీకి దూసుకెళ్లింది.

కీలకమైన మ్యాచ్‌లో కేప్ వెర్డె త్రీ-0 గోల్స్ తేడాతో ఈశ్వతిని టీమ్‌ను చిత్తు చేసింది. ఐస్‌లాండ్ తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి తక్కువ జనాభా కలిగిన రెండో దేశంగా కేప్ వెర్డె అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో 48 దేశాలు పోటీ పడనున్నాయి. ఆఫ్రికా జోన్‌కు 9 బెర్త్‌లు కేటాయించగా ఆరు జట్లు ఇప్పటికే వరల్డ్‌కప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.

ఖైదీలకు ఉరిశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణం?

దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. అయితే, మరణశిక్ష అమలుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం అభిప్రాయం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఉరి ద్వారా మరణశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని లేదా, దోషి ఏ విధంగా తనకు మరణశిక్ష అమలు చేయాలో ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు.ఉరి ద్వారా మరణం క్రూరమైనది, అనాగరికమైనదని, ఉరి వేసిన తర్వాత దోషి మరణానికి చాలా సమయం పడుతుందని. అందువల్ల దాని బదులు నవీన పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు చేయవచ్చునని పిటిషనర్ తరుపు న్యాయవాది రిషి మల్హోత్రా అన్నారు. సైన్యంలో దోషి అలాంటి ఆప్షన్ ఎన్నుకునే వీలు ఉందన్నారు. అమెరికా లోని

50 స్టేట్ లలో కనీసం 40 స్టెట్ లలో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు అవుతున్నదని ,దీని వల్ల ఉరి తీసిన తర్వాత ఆ జీవి చాలా సేపు అనుభవించే వేదన నుంచి విముక్తి లభించవచ్చు నని పిటిషనర్ తరుపు న్యాయవాది వివరించారు.ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో దోషికి అలాంటి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఉరి తీయడం ద్వారా మరణశిక్ష అమలు చాలా పాత విధానం. కొద్ది కాలంగా పరిస్థితులు మారిపోయాయి. సమస్య ఏమిటంటే, ప్రభుత్వం మార్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేదు అని ధర్మాసనం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్ మాట్లాడుతూ, ఖైదీలకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడంలో విధానపరమైన నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసు విచారణ నవంబర్ 11 కు వాయిదా పడింది.

కామన్‌వెల్త్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం

2030లో అహ్మదాబాద్ వేదికగా మెగా పోటీలు

లండన్: ప్రతిష్ఠాత్మకమైన కామన్‌వెల్త్త్ క్రీడలకు భారత్ రెండో ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్‌వెల్త్త్ పోటీలు జరుగనున్నాయి. ఇంతకుముందు 2010లో రాజధానిఢిల్లీలో కామన్‌వెల్త్త్ పోటీలను నిర్వహించారు. తాజాగా రెండోసారి మెగా పోటీలకు భారత్ వేదికగా నిలువనుంది. ఒలింపిక్స్ తర్వాత ప్రపంచ క్రీడల్లో రెండో అతి పెద్ద క్రీడా సంగ్రామంగా కామన్‌వెల్త్ గేమ్స్ పేరు తెచ్చుకున్నాయి. మరో ఐదేళ్ల తర్వాత జరిగే పోటీలను అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు కామన్‌వెల్త్ స్పోర్ట్ బాడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రీడా మైదానం ఈ పోటీలకు వేదికగా ఎంపికైంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీ పడి అహ్మదాబాద్ మెగా క్రీడలను నిర్వహించే ఛాన్స్‌ను దక్కించుకుంది.

నవంబర్ 26న గ్లాస్గోలో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్ ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, ఢిల్లీ తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా అహ్మదాబాద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, కెనడా, భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలతో సహా గతంలో ఆంగ్లేయుల పాలనలో ఉన్న దేశాలు ఈ పోటీల్లో పాల్గొనడం అనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తోంది. ఇక సొంత గడ్డపై జరిగే క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయం.

మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ కన్నుమూత

మహాభారత్ హిందీ సీరియల్ నటుడు పంకజ్ ధీరజ్ బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఈ విఖ్యాత ధారావాహికంలో పంకజ్ ధీరజ్ మహారధి కర్ణుడి పాత్రకు జీవం పోయడం ద్వారా విశేష అభిమానులను పొందారు. 68 సంవత్సరాల ఆయనకు క్యాన్సర్ కబళించివేసింది. ఆయన మృతి వార్తను సినిమా , టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ సిన్టా నిర్థారించింది. తమ సంస్థకు పూర్వపు ఛైర్మన్, తరువాత ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపి , నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రమే ఆయనకు విలే పార్లే సమీపంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.

మహాభారతం సీరియల్‌లో నటించిన పలువురు నటులు , సాంకేతిక నిపుణులు అనేకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సీరియల్‌లో అర్జున పాత్రధారి అయిన అర్జున్ సామాజిక మాధ్యమం ద్వారా తమ సంతాపం తెలిపారు. ఆయనతో ఈ సీరియల్‌లో నటించినప్పటి అనుభవాలతో కూడిన ఫోటోలను జతచేశారు. ధీరజ్ కుమారుడు , నటుడు అయిన నికితిన్ ధీరజ్ తన తండ్రి ఓ సందర్భంలో పేర్కొన్న మాటలను తుది అంకంగా అందరికి వెల్లడించారు. జీవితంలో ఏది వచ్చినా రానివ్వండి, ఎవరేమి చెప్పినా చెప్పనివ్వండి, ఏది జరిగినా జరగనివ్వండి, అంతా శివార్పణం అనుకుని ముందుకు సాగండి అనే తండ్రి సందేశాన్ని అభిమానులకు అందించారు.

డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభం

 మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ -గూగుల్‌తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని క్యాంపస్‌లో నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో ్ సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లు అందించబడతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుండి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ – ఎడ్యుకేషన్ అండ్ ఎడ్‌టెక్స్), సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ – ఎడ్యుకేషన్ అండ్ ఎడ్‌టెక్స్), మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగురవేశారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, మల్లారెడ్డి డీమ్ డ్ టు బీ యూనివర్సిటీ లతో కూడిన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విద్యా ప్రపంచం, డిజిటల్ ఇండస్ట్రీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే కాకుండా, విద్యార్థులు ప్రపంచ టెక్నాలజీ మార్పులకు సన్నద్ధంగా ఉండేలా చేస్తుంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డి మాట్లాడుతూ గూగుల్‌తో ఈ భాగస్వామ్యం కేవలం సాంకేతికతను అనుసంధానించడం మాత్రమే కాదని, ఇది మొత్తంగా విద్యా వ్యవస్థను మార్చగలిగే ఒక విప్లవాత్మక అడుగు అన్నారు. ప్రతి మల్లారెడ్డి విద్యార్థిని ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం పై దృష్టి కేంద్రీకరించామని, విద్యా ప్రావీణ్యాన్ని డిజిటల్ ఆవిష్కరణతో మేళవించడం ద్వారా ‘గూగుల్ క్లౌడ్‌పై డిజిటల్ క్యాంపస్’ తమ విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో సాధికారులను చేస్తుందన్నారు.మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం హైదరాబాద్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ప్రీతి రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా రంగంలో ఈ మార్పు దిశలో ముందంజలో నిలవడం మా గర్వకారణంగా ఉంది. గూగుల్ సాంకేతికతను మా విద్యా బలంతో కలిపి, డిజిటల్ లెర్నింగ్‌కి కొత్త నిర్వచనాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఇంజినీరింగ్ నుండి హెల్త్‌కేర్ వరకు ప్రతి విద్యార్థి ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆవిష్కరణ, సమగ్రత, ప్రతిభను ప్రోత్సహించే తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు.

భారత్ హెల్ప్ కావాలి: అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్ : రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఓ వైపు భారత్‌పై సుంకాల మోత మోగించిన అమెరికా, చైనా విషయంలో మాత్రం మన సాయం కోరుతోంది. అరుదైన ఖనిజాలపై బీజింగ్ నియంత్రణను ఎదుర్కొనేందుకు భారత్, ఐరోపా మద్దతు కావాలని ఆశిస్తోంది. ఈమేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై తాజాగా స్కాట్ బెసెంట్ స్పందించారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని బీజింగ్‌పై ఆయన విమర్శలు చేశారు.

“ఇది చైనాకు , ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురి పెట్టింది. మేం అలా జరగనివ్వం. బీజింగ్ దూకుడును మేం అడ్డుకుంటాం. ఇందుకోసం ఇప్పటికే మిత్ర దేశాలను సంప్రదిస్తున్నాం. చైనాను ఎదుర్కొనేందుకు మాకు భారత్, ఐరోపా దేశాల మద్దతు కావాలి ” అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అమెరికా మంత్రి వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కోరుకుంటుంటే.. చైనా ఆర్థిక యుద్ధం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

25 నుంచి జాగృతి జనం బాట

 క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను వినేందుకు ఈ నెల 25 నుంచి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లాల్లో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్‌ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. నాడు చెప్పిందే నేడు తాను మళ్లీ చెబుతున్నానని సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణ జాగృతి కట్టుబడి పని చేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదని ఇది విధానపరమైన నిర్ణయం అని దీనికోసం జాగృతి పని చేస్తుందన్నారు.

కేసీఆర్ పేరు చెప్పి బతకాలని లేదు : కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్ర నిర్వహించబోతున్నామని కవిత క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్‌ఎస్ సభ్యురాలిని కూడా కాదని అందుకే నైతికంగా కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయబోతున్నామని, అంత మాత్రాన కేసీఆర్‌ను అవమానించినట్లు కాదన్నారు. కేసీఆర్ అనే చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడటానికి తాను చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఆ చెట్టు నీడ నాది కానప్పుడూ ఆ చెట్టుపేరు చెప్పి బతకాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. తాను తన దారి వెతుక్కుంటున్నానన్నారు. కేసీఆర్ కూతురుగా పుట్టడం జన్మజన్మలకు తాను చేసుకున్న అదృష్టం అని అయితే దారులు వేరవుతున్నప్పుడు తాను ఇంకా వారి పేరు చెప్పుకోవడం నైతికంగా మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు. పరిష్కారాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుందన్నదని విమర్శించారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా ఒక్క రూపాయి కూడా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా ఉందన్నారు.

జిల్లాల వారీగా టూర్ షెడ్యూల్ : నిజామాబాద్ – అక్టోబర్ 25, 26. మహబూబ్నగర్ – అక్టోబర్ 28, 29, కరీంనగర్ – అక్టోబర్ 31, నవంబర్ 1, ఆదిలాబాద్ – నవంబర్ 3, 4, వరంగల్ / హన్మకొండ – నవంబర్ 8, 9, నల్గొండ – నవంబర్ 11, 12, మెదక్ – నవంబర్ 14, 15, ఖమ్మం – నవంబర్ 17, 18, రంగారెడ్డి – నవంబర్ 20, 21, నారాయణపేట – నవంబర్ 23, 24, కామారెడ్డి – నవంబర్ 27, 28, గద్వాల్ – నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లి – డిసెంబర్ 3, 4, యాదాద్రి భువనగిరి – డిసెంబర్ 6, 7, భూపాలపల్లి – డిసెంబర్ 9, 10, మంచిర్యాల – డిసెంబర్ 12, 13, సిద్దిపేట – డిసెంబర్ 15, 16, భద్రాద్రి కొత్తగూడెం – డిసెంబర్ 18, 19, మెద్చల్ – మల్కాజిగిరి – డిసెంబర్ 21, 22, నాగర్కర్నూల్ – డిసెంబర్ 27, 28, రాజన్న సిరిసిల్ల – జనవరి 3, 4, సూర్యాపేట – జనవరి 6, 7, జనగామ – జనవరి 10, 11, ఆసిఫాబాద్ – జనవరి 17, 18, సంగారెడ్డి – జనవరి 20, 21, వికారాబాద్ – జనవరి 24, 25, ములుగు – జనవరి 27, 28, జగిత్యాల – జనవరి 30, 31, మహబూబాబాద్ – ఫిబ్రవరి 2, 3, నిర్మల్ – ఫిబ్రవరి 5, 6, వనపర్తి – ఫిబ్రవరి 8, 9, హైదరాబాద్ – ఫిబ్రవరి 12, 13.

అఫ్గాన్‌-పాక్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమలు లోకి వచ్చింది. ఉభయ దేశాల మధ్య తాజాగా సంఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఒప్పందంపై ప్రకటించింది. సానుకూల పరిష్కారం కోసం ఉభయ దేశాలు విశ్వసనీయమైన ప్రయత్నాలు చేయడానికి అంగీకరించాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ వల్ల దౌత్యపరమైన చర్చలకు వీలవడమే కాక, తదుపరి ప్రాణనష్టం జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని పాక్ విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.