elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibom girişperabetteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomcasibom girişcasibom güncel girişalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbet

నంద్యాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కానిస్టుబుల్ అరెస్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్‌లో కానిస్టేబుల్ చైన్‌ స్నాచింగ్‌ పాల్పడ్డాడు. అంగట్లో కూర్చున్న మహిళ మెడలోంచి 5 తులాల బంగారు చైన్ లాక్కొన్ని  వెళ్తుండగా స్థానికులు కానిస్టేబుల్ ఆచారిని పట్టుకొని చితకబాదారు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. మ‌ద్యం మ‌త్తులో ముసుగు, హెల్మెట్‌ ధరించి చైన్ స్నాచింగ్‌కు కానిస్టేబుల్ పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు రంగం సిద్ధం చేశారు. కానిస్టేబుల్ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న మోడీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారికి ఆయన పూజలు చేశారు. ప్రధాని మోడీ వెంట సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లు ఉన్నారు. శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట ప్రాంతంలో 1500 మంది సిబ్బంది పహారాగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు పర్యటనకు పిఎం మోడీ వచ్చిన విషయం తెలిసిందే. 

సుమంత్ విషయం నాకు తెలియదు: కొండా మురళీ

వరంగల్: మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్‌డి సుమంత్ విషయం తనకు తెలియదని కాంగ్రెస్ నేత కొండా మురళీ తెలిపారు. కొండా సురేఖ, తన కూతురు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రావడంపై మురళీ స్పందించారు. తన కూతురు, అల్లుడు లండన్‌లో ఉన్నారని, అక్కడ వ్యాపారం చేస్తున్నారన్నారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని, ఏ పార్టీలోనూ లేదన్నారు. భద్రతా కారణాల దృష్టా తాను, కొండా సురేఖ వేర్వేరు కార్లలో ప్రయాణి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్  సిఎం కావాలని తాను, సురేఖ కష్టపడ్డామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఎంఎల్‌సి పదవి ఇస్తామని మాట ఇచ్చారని, సిఎం రేవంత్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన ఇంటికి వచ్చారన్నారు. మంత్రులు అందరి ఇండ్లకు వెళ్లి మాట్లాడే పరిచయాలు తనకు ఉన్నాయన్నారు. తనని ఎందుకు లక్ష్యం చేసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తన సమస్యను పరిష్కరించుకుంటానని వివరణ ఇచ్చారు. ఎవరి తప్పు ఉన్నా సమస్యకు పరిష్కారం జరిగేలా చూస్తానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మినాక్షీ నటరాజన్ తనని మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పారని, మళ్లీ మినాక్షీతో అన్ని విషయాలు మాట్లాడిన తరువాత ఆమె చెప్పినట్లు వింటానని స్పష్టం చేశారు. సుమంత్ కోసం పోలీసులు రావడంతో వారిని మంత్రి కూతురు సుష్మిత అడ్డుకున్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ నాయకులు, మంత్రులతో పలు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఆమెను పదవి నుంచి తొలగించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. 

ప్రస్తుత పరిణామాలపై సిఎంతో మాట్లాడాను: కొండా మురళి

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవు అని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి తెలిపారు. సాయంత్రం కొండా సురేఖ పార్టీ సమావేశానికి వెళ్తారని అన్నారు. ఈ సందర్భంగా హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేనిప్పటి వరకు కొండా సురేఖ ఛాంబర్ కు వెళ్లేదని, సుమంత్ విషయం తనకు తెలియదని, తన బిడ్డ, అల్లుడు లండన్ లో ఉన్నారని అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని ఏ పార్టీలోనూ లేదని కొండా మురళి తెలియజేశారు. తనకు స్మార్ట్ ఫోన్ చూడటం రాదని ఏమైందో తెలియదు అని అన్నారు. తాను, సురేఖ ఎప్పుడూ ఒకే కారులో వెళ్ళమని.. తిరగమని భద్రతా కారణాలవల్ల వేర్వేరు కార్లలో తాను, సురేఖ వెళ్తాం అని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ ఇంటికి వచ్చారని.. తనను ఎందుకు టార్గెట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలపై సిఎంతో మాట్లాడానని, తనకు రేవంత్ ఎమ్మెల్సీ ఇస్తామన్నారని..ఇస్తారు అన్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకొచ్చారో తెలుసుకుని స్పందిస్తానని ఎవరి తప్పు ఉన్నా, సమస్య ముగిసేలా చూస్తానని కొండా మురళి స్పష్టం చేశారు.  

మహేశ్వరంలో రేవ్ పార్టీ భగ్నం…. 56 మంది అరెస్టు

హైదరాబాద్: ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి రిసార్ట్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ యాజమానితో పాటు 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. యువతులతో ముజ్రా, అర్ధనగ్న డ్యాన్స్, క్యాసినో సైతం ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెస్క్యూ హోమ్ కు 20 మంది యువతులు పంపించారు.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్ రాకేష్ రెడ్డికి చెందిన ‘కే చంద్రశేఖర్ రెడ్డి’ అనే రిసార్ట్ పై పోలీసుల దాడి చేశారు. గాజులరామారంలో వేద అగ్రి ఇన్‌వరేషన్ పేరుతో తిరుపతిరెడ్డి, ఇబ్రహీంపట్నం రాందాస్ పల్లిలో రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలు తయారు చేసేవారు. తమ ఉత్పత్తులను భారీగా డీలర్లకు విక్రయించుకోవడంతో వారికి పార్టీ ఇచ్చేందుకు మంగళవారం రాత్రికి రాకేష్ రెడ్డికి చెందిన రిసార్ట్‌ను తిరుపతి రెడ్డి, సైదారెడ్డి  కిరాయికి తీసుకొని రేవ్ పార్టీ నిర్వహించారు. 

అన్నదమ్ములకు మధ్య గొడవతో వదిన మృతి

హైదరాబాద్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ములకు మధ్య గొడవ వదిన ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం… రమేశ్. సురేష్ అన్నదమ్ములు కొండాపురం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుండగా అడ్డుగా వదిన వచ్చింది. దీంతో ఆమెకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తమ్ముడు సురేష్ ను అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. 

వదిన ప్రాణం తీసిన అన్నదమ్ముల మధ్య గొడవ

హైదరాబాద్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ములకు మధ్య గొడవ వదిన ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం… రమేశ్. సురేష్ అన్నదమ్ములు కొండాపురం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అన్నదమ్ములు కత్తితో కొట్టుకుంటుండగా అడ్డుగా వదిన వచ్చింది. దీంతో ఆమెకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తమ్ముడు సురేష్ ను అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. 

కన్నతల్లిదండ్రులపై సైకో కత్తి దాడి

రంగారెడ్డి: అర్ధరాత్రి కన్నతల్లిదండ్రులపై సైకో కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గండిపేటలోని ఇఐపిఎల్ అపెలా అపార్ట్ మెంట్ లో తల్లి భారతి, తండ్రి రవీందర్ రెడ్డిలు నివసిస్తున్నారు. దంపతుల కుమారుడు రఘుపాల్ రెడ్డి  కాలేజీలో ఎల్ఎల్ బి చదువుతున్నాడు. గత అర్థరాత్రి రఘుపాల్ రెడ్డి తన తల్లిదండ్రులను కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దంపతులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రఘు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నాడు. తల్లిదండ్రులు తనను మానసికంగా వేదిస్తున్నారని, తనకు మతి స్థిమితం సరిగ్గా లేదని, తనకు వైద్యం చేయించాలని చూస్తున్నారని తెలియజేశారు. తనకు ఏమి కాలేదని, తనని తల్లిదండ్రులు కావాలనే మానసికంగా వేదిస్తుండడంతో   తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశానని వివరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

వాకింగ్ చేస్తుండగా మహిళ గొంతుకోసి…

విశాఖపట్నం: వాకింగ్‌కు వెళ్లిన వివాహిత గొంతు కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కయపాలెం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెక్కుడు రాయి కాలనీలో శ్రావణ సంధ్య(30) అనే మహిళ నివసిస్తోంది. భర్తతో గొడవలు రావడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఆమె వద్దే ఉంటున్నారు. పెద్ద కుమారుడిని హాస్టల్‌లో ఉంచి చదవిస్తుండగా చిన్న కుమారుడికి మతిస్థిమితం లేకపోవడంతో తన దగ్గరే ఉంచుకుంటుంది. చిన్న కుమారుడికి వచ్చిన పెన్షన్ డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. ఇంటికి సమీపంలో కార్పెంటర్ శ్రీనుతో ఆమెకు గొడవలు ఉన్నాయి. శ్రీను ఆమెతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. ఇటీవల అతడిని గట్టిగా మందలించడంతో ఆమెపై అతడు కక్ష పెంచుకొని పగతో రగిలిపోతున్నాడు. బుధవారం సాయంత్రం సంధ్య వాకింగ్‌కు వెళ్లింది. అదే సమయంలో శ్రీను ఫుల్‌గా మద్యం తాగి కత్తితో ఆమె పీక కోశాడు. అనంతరం అతడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

‘ఎస్‌వైజి’ని అందరూ ఎంజాయ్ చేస్తారు

మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ క్రేజీ పాన్ -ఇండియా చిత్రం ఎస్‌వైజి (సంబరాల యేటిగట్టు)తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది. ఈ ఈవెంట్‌లో దర్శకులు వశిష్ట, దేవకట్ట, విఐ ఆనంద్, నిర్మాత వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ “నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా ఇది.

సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మా నిర్మాతలు నిరంజన్, చైతన్య ఖర్చుకి వెనకాడకుండా సినిమాను నిర్మించారు. డైరెక్టర్ రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నారు. తన విజన్ అందరికీ నచ్చుతుంది. ఇది అద్భుతమైన సినిమా”అని అన్నారు. ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ రోహిత్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ అయినంతగా ట్రాన్స్‌ఫర్మేషన్ మిగతా వారికి అంత సులభం కాదు. అద్భుతమైన టీంతో చేసిన సినిమా ఇది”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో పొడ్యూసర్ చైతన్య రెడ్డి, పళని స్వామి తదితరులు పాల్గొన్నారు.