elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbet

సచివాలయం ఎదుట సెర్ప్ ఉద్యోగులు ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని సెర్ప్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ఐకెపి విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విఓఏలకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయం ఎందుట ఆందోళనకు దిగారు. విఓఏలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, హెచ్‌ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విఓఏ ఉద్యోగ భద్రత, రూ.20 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారన్న ఆ హామిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్యూరెన్స్, సోషల్ సెక్యూరిటీ సౌకర్యంతో పాటు సిసి పోస్టులకు విఓఏలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 58ను వెంటనే రద్దు చేయాలన్నారు. డిజిటలైజేషన్ దృష్ట్యా ల్యాప్టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ బిల్లు సదుపాయం కల్పించాలన్నారు.

కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: మహేశ్ కుమార్ గౌడ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో బూత్‌స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్‌ఎస్ శకం ముగిసిందని, జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపిక జరిగిందన్నారు. కెటిఆర్ పదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడైనా ఊహించారా..? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్ట కాలంలో తోడుగా ఉండే నాయకుడు కావాలని నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రజలకు కావాల్సింది సెంటిమెంట్ కాదని, అభివృద్ధి అని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చింది కెటిఆర్ కాదా? అని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. యువత చెడు వ్యస నాలకు బారిన పడిన విషయం కెటిఆర్ మరిచిపోలేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని, జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే నవీన్‌యాదవ్ గెలవాల్సిన అవశ్యకత ఉందన్నారు. జూబ్లీహిల్స్ సీటు గెలవడం ఖాయమని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిసిసి అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో ఏఐసిసి ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ ఎంపి అజారుద్దీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. హుజూర్‌నగర్ లో మెగా జాబ్‌మేళా

మన తెలంగాణ/హుజూర్‌నగర్: పట్టణంలోని పేర్ల్ ఇన్పినిటి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి వారి సహకారంతో 150 కంపెనీలతో మెగా జాబ్‌మేళాను ఈ నెల 25న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు. క్యూర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, లాంటి ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేసిన వారు అలాగే చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులని.. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జాబ్‌మేళాకు వచ్చేటప్పుడు ఐదు జిరాక్స్ ప్రతులతో హాజరవ్వాలని తెలిపారు.

ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం : మోడీ

అమరావతి: అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. నన్నూరు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్ లో నేను జన్మించానని, విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశిస్సులు పొందానని, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని కొనియాడారు. సైన్స్,ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఎపిలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ కు సరైన విజన్.. సరైన నాయకత్వం అవసరం ఉందని, ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ రూపంలో ఎపికి శక్తివంతమైన నాయకత్వం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని, 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని  మోడీ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని, ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని ప్రశంసించారు. 2047 నాటికి మన దేశం.. వికసిత్ భారత్ గా మారుతుందని, 21 శతాబ్దం, 140 కోట్ల భారతీయుల శతాబ్దం అని ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందని అన్నారు. ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమని అన్నారు. ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుందని, దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగిందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందని, ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోందని మోడీ స్పష్టం చేశారు.   

బిసి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో నిలబడవు : తలసాని

హైదరాబాద్: బిసిలకు చట్ట పరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించం అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే.. నామినేషన్లు వేయకండి అని రిజర్వేషన్లపై మోసగించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎల్లుండి నిర్వహించే బంద్ కు బిఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని, బంద్ కు ఆర్టిసి, మెట్రో, దుకాణాలు, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరూ బంద్ లో పాల్గొనాలని, ఎల్లుండి జరగాల్సిన సునీత నామినేషన్ కార్యక్రమం వాయిదా వేశారని తెలియజేశారు. బిసి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో నిలబడవు అని చెబుతూనే ఉన్నామని అన్నారు. అన్ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం డ్రామాలు ఆడాయని తలసాని విమర్శించారు. 

120 మంది నక్సల్ తో కలిసి లొంగిపోనున్న ఆశన్న

హైదరాబాద్ : 1991 లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ములుగు జిల్లాకు చెందిన ఆశన్న 1999 లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం అధిపతిగా నియామకం అయ్యారు. 2023 లో అలిపిరిలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పేల్చివేత ఘటనలో, 2000 అప్పటి హోం మంత్రి మాధవరెడ్డిని చంపిన ఘటనలో ఆశన్న ఉన్నారు. సుమారు 120 మంది నక్సల్ తో కలిసి ఆశన్న పోలీసుల ఎదుట అలియాస్ రూపేష్ లొంగిపోయే అవకాశం ఉంది. 

120 మంది నక్సల్స్ తో కలిసి లొంగిపోనున్న ఆశన్న

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత  ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నాడు. ఆశన్న అలియాస్ రూపేష్ సుమారు 120 మంది నక్సల్ తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. ములుగు జిల్లాకు చెందిన ఆశన్న1991 లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.  1999 లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం అధిపతిగా నియామకమయ్యారు. 2003లో అలిపిరిలో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పేల్చివేత, 2000 అప్పటి హోంమంత్రి మాధవరెడ్డిని చంపిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆశన్న ఉన్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో మంగళవారం గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. 

పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం పాల్గొన్న గవర్నర్, యెన్నం

మహబూబ్ నగర్: పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం నాల్గవ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కు పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం పాలమూరు విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో గవర్నర్ 12 మంది స్కాలర్స్ కు పి హెచ్ డి పట్టాలను, 83 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణ రెడ్డి తొలి గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి హెచ్ డి స్కాలర్స్ లను బంగారు పతకాల గ్రహితలను, తొలి డాక్టరేట్ గ్రహీత మన్నె సత్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎపి జితేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి, పాలమూరు ఉపకులాపతి జి.ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

మరో రికార్డు చేరువలో రోహిత్

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. మూడు వన్డేలు, ఐదు టి20లు రెండు మధ్య జరుగనున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సృష్టించనున్నాడు. అంతర్జాతీయంగా రోహిత్ 500వ మ్యాచ్ ఆడనున్నాడు. టీమిండియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లో సచిన్ టెండూల్కర్(664) ముందువరసలో ఉండగా తరువాత వరసగా విరాట్ కోహ్లీ(550), ఎంఎల్ ధోనీ(535), రాహుల్ ద్రవిడ్(504) ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ 499 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ 273 వన్డేలు, 159 టి20లు, 67 టెస్టులు ఆడాడు.

వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అక్షర పటేల్, కెఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్, అర్షదీప్, ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్(కీపర్), కుల్‌దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ 

ఎస్ ఎల్ పిపై విచారణకు సుప్రీం నిరాకరణ

హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన ఎస్ఎల్ పిని సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై పిటిషన్లను ఉన్నతా న్యాయం స్థానం విచారించలేమని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టుకు సుప్రీం పేర్కొంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సలహా ఇచ్చింది.