elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbet

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌.. అందరి కళ్లు ఇద్దరిపైనే

పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి, రోహిత్‌లు ఆడుతున్న సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఇప్పటికే టి20, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి, రోహిత్‌లు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి వీరిపైనే నిలిచింది. ఇద్దరికి సిరీస్ చాలా కీలకంగా మారింది. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు.

ఇలాంటి స్థితిలో రోహిత్, కోహ్లిలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కానీ అపార అనుభవజ్ఞులైన వీరిని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా వీరికుంది. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టీమిండియాలో చోటు కాపాడు కోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. నిలకడైన ఆటను కనబరిచి నప్పుడే వీరికి జట్టులో స్థానం ఉంటుంది. అంతేగాక రానున్న వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కాపాడుకోవాలంటే ఆడే ప్రతి సిరీస్‌లోనూ సత్తా చాటాల్సిన అవసరం వీరికి ఉంది. ఏమాత్రం విఫలమైన జట్టులో స్థానం గల్లంతు కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోహ్లి, రోహిత్‌లకు చాలా కీలకమని చెప్పక తప్పదు.

కాగా, ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 19న పెర్త్‌లో జరుగనుంది. రెండో వన్డే 23న అడిలైడ్‌లో, మూడో, చివరి వన్డే 25న సిడ్నీలో జరుగుతుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది.

నిరుద్యోగ యువత చెవిలో పువ్వులు

‘అంధులకు చూపు కావాలి.. నిరుద్యోగులకు జాబు కావాలి’ ఇది బీహార్‌లో నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తున్న నినాదం. ప్రభుత్వ ఉద్యోగం దక్కకుంటే కూరగాయలు అమ్ముకోవడమో లేదా కూలిపనులకు వెళ్లడమో తప్పదన్న నిర్వేదనతో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లకు యువత ప్రిపేర్ కావడం బీహార్‌లో కనిపించే జీవన చిత్రం. పాట్నా లోని ఎపిజె అబ్దుల్ కలాం సైన్స్ సెంటర్ బయట పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తుండడం నిత్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు బీహార్‌లో ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు గట్టి ప్రయత్నం చేయలేదనే చెప్పక తప్పదు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాయకులు యువ ఓటర్లను ఆకట్టుకోడానికి ఏవో పథకాలను ప్రకటించి అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్‌డిఎ కూటమి, మరోవైపు విపక్ష నేతలు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వియాదవ్ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పదేపదే భరోసా ఇస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎలాంటి గట్టి అవకాశాలు కల్పించని వారు ఎన్నికల్లోనే దీన్ని తెరపైకి తీసుకు రావడం నవ్వు తెప్పిస్తోంది. ఇదంతా ఓట్ల కోసం నిరుద్యోగులకు లేనిపోని భ్రమలు కల్పించి చెవిలో పువ్వులు పెట్టడమే తప్ప మరేమీ కాదు. ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో చాలామంది యువ ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే తమకు అత్యంత టాప్ ప్రయారిటీ అని అంగీకరిస్తున్నారు. రాష్ట్రం లోని ఓటర్లలో 22 శాతం మంది అంటే 1.63 కోట్ల ఓటర్లు 18 నుంచి 23 ఏళ్ల వారే. వీరిలో 1.5 కోట్ల మంది 20 ఏళ్ల వయసు దాటిన వారే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో 14 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకున్నాక తుది జాబితా విడుదలైంది. ఈ కీలకమైన ఓటర్లను గెలవడానికి పాలనలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్‌డిఎ). విపక్ష గ్రాండ్ అలియన్స్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన హామీని పరాకాష్ఠకు తీసుకెళ్తున్నాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల వివిధ రంగాల్లో నిరుద్యోగులకు లక్షలాది అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేయడమైందని ప్రకటించింది. దీనికి తోడు భవిష్యత్తులో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనేక సందర్భాల్లో హామీ ఇస్తున్నారు.

మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ గత గ్రాండ్ అలియన్స్ ప్రభుత్వకాలంలో తాను డిప్యూటీ సిఎంగా ఉన్నప్పుడు 17 నెలల వ్యవధి లోనే యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమైందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారం లోకి వస్తే ఎన్ని ఉద్యోగాల లభిస్తాయో ఎవరైనా ఊహించవచ్చని ఊరిస్తున్నారు. దీన్ని ఇప్పుడు యువత ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయం లోనే యువత ఉద్యోగాల సమస్య మీకు గుర్తొస్తొందా? ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదు? అన్న ప్రశ్నలు యువతనుంచి ఎదురవుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) 2021 22 ప్రకారం బీహార్‌లో నిరుద్యోగ రేటు 5.9 శాతం వరకు ఉంది. జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు 4.1 శాతం కన్నా బీహార్‌లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉండడం గమనార్హం.

అలాగే బీహార్‌లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసు వారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం కావడం బట్టి బీహార్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తోందో తెలుస్తోంది. బీహార్‌లో ఉద్యోగ అవకాశాలు కరవు కావడంతో లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం నిత్యదృశ్యమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క ప్రభుత్వేతర అనధికారిక ఉపాధి మార్గాల పైన, స్వయం ఉపాధిపైన, క్యాజువల్ ఉద్యోగాల పైన ఆధారపడి బతుకుతున్నారు. బీహార్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం సర్వసాధారణం కాగా, అర్బన్ ఏరియాల్లో తమ నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఒక పనికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు కనిపిస్తుంటారు. వ్యవసాయ రంగంలో ఈపరిస్థితి కనిపిస్తుంది.

యువ ఓటర్ల మనోగతం తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిమాన నాయకులు లేదా పార్టీ ఎవరికి మీరు ఓటేస్తారని అడగ్గా.. కొంతమంది ప్రతి ఐదేళ్లకు పాలనలో మార్పు తప్పనిసరి అని తమ అభిప్రాయం వెలిబుచ్చగా, మరి కొంతమంది ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. మొత్తంమీద రాష్ట్రం కోసం ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిశోర్ బీహార్ యువకుల, ప్రజల వాస్తవ సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో ఒక వర్గం తేజస్వియాదవ్‌పై మొగ్గు చూపుతోంది. ‘ఆయన యువకుడు, అంతేకాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ లాంటి యువకులకు కొత్తగా ఉద్యోగాలు కల్పించడానికి గట్టిగా ఏదో ఒకటి చేయగల’రని నమ్ముతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడిన తరువాత ఎవరైతే అధికారం లోకి వస్తారో వారు ఉద్యోగాల్లో యువతకు ఎక్కువ రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం ఉందని, నూటికి నూరు శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా చూడవలసిన బాధ్యత ఉందని యువకుల నుంచి ఏకాభిప్రాయం వస్తోంది. 

డిసెంబర్ 19 ప్రజాపాలన విజయోత్సవాలు

మన తెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబి నెట్ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏ ర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉ త్సవాలను నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిందని అన్నారు. ఉత్సవాల నిర్వ హణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింద ని, రూ.10,500 కోట్లతో నిర్మించే 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కేబినె ట్ ఆమోదించిందని, త్వరలో టెండర్లు పిల వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలి పారు. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రా లు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతా లు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తర ణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి పేర్కొన్నా రు.

మన్ననూర్ టు -శ్రీశైలం ఎలివేటెడ్ కారి డార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్య యంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ కేబినెట్ తీర్మా నం చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీకప్పులో తుపాన్ లాంటిదని మంత్రి పొంగులేటి అ న్నారు. సురేఖ ఎపిసోడ్‌ను కొందరు సము ద్రంలో తుపానులా సృష్టించారని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని తెలిపారు. ఈ నెల 23న మళ్లీ మంత్రివర్గ సమావేశం జరుగు తుందని వెల్లడించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు ని ర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సం బంధించి రక్షణ శాఖ భూములు వినియో గించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నా యంగా 435.08 ఎకరాల భూములను అ ప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి పొంగులేటి భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు పది ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

హాజరుకాని మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం సుమారుగా 4 గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. అయితే, కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు.

పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2పై క్షుణ్ణంగా పరిశీలించడానికి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ కమిటీకి సిఎస్ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైలు ఎండి, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. మెట్రో 2ఏ, 2బి విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందని మంత్రి తెలిపారు. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలను కేబినెట్ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుందన్నారు. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు.

కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్‌లో కొత్తగా వ్యవసాయ కళాశాలలు

వీటితో పాటు ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని కేబినేట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలలు లేని కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలను పారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ అనర్హతగా ఉన్న నిబంధనను మంత్రివర్గం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని అందులో భాగంగా ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు.

నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి మరో 7 ఎకరాలు

నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసిందని ఆయన అన్నారు.

మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500ల బోనస్

కేంద్రం సహకరించకపోయినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేయగా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించిందన్నారు. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.

వానకాలం సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500ల బోనస్ రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

చిదంబరం చేసింది పెద్ద సాహసమే!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పి. చిదంబరం పెద్ద సాహసమే చేసారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పు నిర్ణయమని, ఆ కారణంగా అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధి తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఆయన ఆ మాటలు పరోక్షంగానో, నర్మగర్భంగానో కాదు, సూటిగానే చెప్పారు. ఆ మాటలు సహజంగానే సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. వారు తనపై విమర్శలు చేసారు. కాని, అంత తీవ్రమైన వ్యాఖ్యలు సాక్షాత్తూ ఇందిరపై చేసినా, తర్వాత మూడు రోజులలోనూ ఈ వ్యాసం రాసే సమయానికి తనపై ఎటువంటి చర్య తీసుకోకపోవటం గమనించదగ్గది. చిదంబరం లోగడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా కూడా పని చేసిన నాయకుడు. మేధావి గానూ గుర్తింపు ఉన్నది. అందువల్ల ఆయన వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేము. ఆయన ఈ నెల 12న, పంజాబ్‌కు పొరుగున గల హిమాచల్‌ప్రదేశ్ పట్టణం కసౌలీలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటూ, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు తీవ్రవాదులను బయటకు రప్పించేందుకు, ఆ దేవాలయ ప్రాంగణాన్ని స్వాధీన పరచుకునేందుకు ఇతర మార్గాలు ఉండేవని, అందుకు బదులు సైనిక చర్యను చేపట్టడం తప్పు నిర్ణయమని అన్నారు. సైనిక చర్య జరిగింది 1984 జూన్ మొదటి వారంలో కాగా, అదే సంవత్సరం అక్టోబర్ 31న, ఇందిరాగాంధిని ఆమె అంగరక్షకులు అయిన ఇద్దరు సిక్కు జవాన్లు తన అధికారిక నివాసంలోనే కాల్చి హత్య చేసారు.

సైనిక చర్యకు ముందు కాలంలో, అట్లానే ఇందిరాగాంధి హత్య అనంతర కాలంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ రాష్ట్రం, దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే గాక, ముఖ్యంగా ఉత్తర భారతమంతా అల్లకల్లోమైంది. అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. తదనంతర దాడులలో, అల్లర్లలో వేలాదిమంది పౌరులు, యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమం చాలా కాలం పాటు తీవ్రంగా సాగింది. అదంతా పాకిస్థాన్‌కు గొప్ప అవకాశంగా లభించింది. మొత్తం ప్రపంచంలోని సిక్కులకే గాక, సిక్కు మత గురువులను అమితంగా ఆరాధించే అసంఖ్యాకులైన హిందువులకు కూడా స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య, తదనంతర ‘ఆపరేషను’ పెద్ద మానసికి గాయాన్నే చేసాయి. అప్పటి నుంచి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పంజాబ్ లోనే గాక, పంజాబీలు పెద్ద సంఖ్యలో నివసించే బ్రిటన్, కెనడా వంటి ఇతర దేశాలలోనూ ఆపరేషన్ బ్లూస్టార్ ప్రభావపు ఛాయలు మిగిలి ఉన్నాయంటే, ఆ తీవ్రతను అర్థం చేసుకోవటం కష్టం కాదు. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే, యథాతథంగా సిక్కు తీవ్రవాదంపై, వేర్పాటువాదులపై మాత్రమే చర్య జరిగి ఉంటే, అది ఎంత కఠినమైనది అయినప్పటికీ ఆ తర్వాత ప్రభావాలు, పరిణామాలు ఈ విధంగా ఉండేవి కావు. కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఈ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఇంకా అనుకోవాలంటే, బహుశా ఇందిరాగాంధీపై ఆ దాడి కూడా జరిగేది కాదేమో. దీనంతటికి మూలం స్వర్ణ దేవాలయం వంటి వందల ఏళ్ల అత్యంత పవిత్ర కేంద్రంపై సైనిక దాడిలో, తీవ్రవాదులను కాల్చటం అట్లుంచి ఆ నిర్మాణాలకు సైతం నష్టం కలిగించటంలో ఉంది.

వాస్తవానికి ఇదంతా అప్పటి ఆలోచనాపరులు ముందుగా ఊహించలేనటువంటి దేమీ కాదు. స్వర్ణ దేవాలయ చరిత్ర, పవిత్రత మాత్రమే గాక, మొఘలుల ఆక్రమణ కాలం నుంచి స్థానికుల మహా వీరోచిత ప్రతిఘటనా యుద్ధాలు, సిక్కు మతం పుట్టుక, ఆ మతస్థుల నిబద్ధతలు, గురువుల పట్ల సంపూర్ణ విధేయతల చరిత్ర తెలిసిన వారందరూ ఊహించగలదే. బయట అత్యధికులకు తెలియనిది ఏమంటే, సిక్కు మత ఆవిర్భావానికి ముందు ఆ సరిహద్దు ప్రాంతాలన్నింటా ఉండిన హిందూ కుటుంబాలు, సిక్కు గురువుల పిలుపు మేరకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో యువకుడిని ఆ మతంలోకి స్వచ్ఛందంగా, సంతోషంగా చేర్చారు. ఆ విధంగా ఎన్నెన్నో కుటుంబాలు హిందూ, సిక్కు మతాలతో కూడిన మిశ్రమ మత కుటుంబాలు అయాయి. బ్లూస్టార్ అనంతరం, ఖలిస్థానీ ఉద్యమం ఇంకా ఉధృతంగా సాగుతుండిన కాంలోనే, ఒక జర్నలిస్టుగా అక్కడి గ్రామాలలో పర్యటించిన నేను, వారి ఇళ్లలో గోడలపై గల కుటుంబపు ఫోటోలలో వారి కుటుంబ సభ్యులు హిందువులు, సిక్కులు కూడా ఉండిన చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాను. ఆ విషయమై ప్రశ్నించిన నాకు వారిచ్చిన వివరణను బట్టి, అటువంటి మిశ్రమ మత కుటుంబ సంప్రదాయం గురించి ప్రత్యక్షంగా గమనించాను. ఇటువంటి స్థితి ప్రపంచ మతాలలో మరెక్కడైనా ఉందేమో తెలియదు.

విషయం ఏమంటే, చిదంబరం వివరించకపోవచ్చు గాని, ఆయన అసాధారణమైన వ్యాఖ్యలతో సంబంధం గల ఇటువంటి నేపథ్య విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నా పర్యటన సమయంలో గ్రామాలు, చిన్న పట్టణాల సామాన్య ప్రజల నుంచి విన్నాను. చూసాను. ఆ విషయాలు ఎంతగా తెలియగలిగితే, ఆపరేషన్ బ్లూస్టార్ తప్పిదం మనకు అంతగా అర్థమవుతుంది. స్వర్ణ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకునేందుకు సైనిక చర్యకు భిన్నంగా ఇతర పద్ధతులు ఉండెనని చిదంబరం ఒక మాట అన్నారు. ఆ పద్ధతులు ఏమిటో ఆయన వివరించలేదు. కాని ఆ విషయమై, ఆపరేషన్ అనంతరం కాలంలో జాతీయ స్థాయిలోకొన్ని చర్చలు జరిగాయి. యుద్ధ సమయాలలో కోటలను నెలల తరబడి దిగ్బంధించి అన్ని సరఫరాలను నిలిపి వేసిన పద్ధతులు, లోపలి మనుషులు స్పృహ కోల్పోయేట్లు రసాయనిక వాయువులను వదలటం వంటివి వాటిలో కొన్ని. కాని, ఎందువల్లనైతేనేమి ఇందిరాగాంధి ప్రత్యక్ష సైనిక చర్య పద్ధతిని ఎంచుకుని పెద్ద తప్పునే చేసారు. నేను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కర్ఫూ మధ్య లోపలకు ప్రవేశించి చూసినపుడు, యథాతథంగా దేవాలయానికి జరిగిని నష్టం లేదు గాని, ఆ చుట్టూ గల ఇతర నిర్మానాలన్నీ దెబ్బ తినటాన్ని గమనించాను. సైనిక చర్య గురించి అక్కడి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులు, ఇతరత్రా కనిపించిన కొద్ది మంది యువకులు, లంగర్‌లో భక్తులకు ఆహారం అందజేసే సిబ్బంది, తమ గొంతును పెంచకుండా, బరువైన మొహాలతో, చిన్నచిన్న మాటలుగా చెప్పినవి విన్నాను.

చిదంబరం అన్న ‘పెద్ద తప్పు’ ఎంతటి పెద్ద తప్పో అర్థం చేసుకోవటం ఎంతమాత్రం కష్టం కాదు. బ్లూస్టార్‌కు ముందు వెనుకల పరిణామాలను దృష్టిలోకి తీసుకున్నపుడు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. అవి పలుమార్లు చర్చకు వచ్చినవే. అయినా, సందర్భం ఏర్పడింది గనుక రెండు మాటలు క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం. పంజాబ్ రాజకీయాలు మొదటి నుంచి అకాలీదళ్, కాంగ్రెస్‌ల చుట్టూ తిరుగుతుండేవి. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు ఇందిరాగాంధీ, అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ సలహా ప్రకారం సిక్కులను చీల్చేందుకు సంత్ జర్నేల్ సింగ్ భిండ్రావాలేను ప్రోత్సహించి రాజకీయాలలోకి తెచ్చారు. అదే వ్యక్తి క్రమంగా సిక్కుల హక్కులు, పంజాబ్ హక్కుల పేర మిలిటెంట్‌గా మారి ఏకు మేకయ్యాడు. ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఇక తర్వాతి పరిణామాలు తెలిసినవే. బ్లూస్టార్ తప్పుకన్న ముందు కాలంలోనే ఇందిరాగాంధీ చేసిన ఒరిజినల్ తప్పు అది. ఇక బ్లూస్టార్ తర్వాత చేసిన తప్పు ఆపరేషన్ ఉడ్‌రోజ్. దీని గురించి బయటి దేశం విన్నది తక్కువ. దాని వల్ల కలిగిన హాని చాలా ఎక్కువ. అది నా పర్యటనలో విస్తారంగా విన్నవిషయం. ఈ కొత్త ఆపరేషన్ కింద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గ్రామాలను చుట్టుముట్టి యువకులను నిర్బంధించటం, హింసించటం సాగించాయి. తీవ్రవాదం అన్నది లేకుండా చేయాలన్నది ఉద్దేశం. కాని అందుకు విరుద్ధంగా జరిగింది. యువకులు భయపడి పాకిస్థాన్‌కు పారిపోవటం, అక్కడ కొద్ది రోజుల శిక్షణతో ఆయుధాలు, డబ్బుతీసుకుని రావటం, హింసా చర్యలకు పాల్పడటం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున జరిగింది. సరిహద్దు జిల్లా లైన పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, అమృత్‌సర్, తరణ్ తారణ్, ఫిరోజ్‌పూర్‌లలోని పలు ప్రాంతాలలో పట్టు సంపాదించి వాటిని విముక్త ప్రాంతాలుగా ప్రకటించారు. అక్కడ కొన్ని చోట్లకు స్వయంగా వెళ్లిన నేను, భద్రతా బలగాల కదలికలు, నియంత్రణ ఎంత పరిమితంగా ఉండిందో గమనించాను.

చివరకు పరిస్థితిని అదుపు చేసేందుకు చాలా కాలం పట్టింది. ఇది బ్లూస్టార్‌కు ముందు, తర్వాతల పరిస్థితులు కాగా, ఇందిరాగాంధి హత్య అనంతరం ముఖ్యంగా ఢిల్లీతోపాటు పలు హిందీ రాష్ట్రాలలో జరిగిన సిక్కు వ్యతిరేక హింసాకాండ తెలిసిందే. అపుడు ఢిల్లీలో నివసిస్తుండిన నేను అటువంటి ఘటనలు అనేకం గమనించాను. ఆ విధంగా, చిదంబరం అన్న ‘పెద్దతప్పు’కు ముందు వెనుకలు చాలానే ఉన్నాయి. ఇవేవీ రహస్యం కాదు. చర్చలు జరగనివీ కాదు. చిదంబరం ఎందువల్ల ఇపుడీ ప్రస్తావన చేసారో తెలియదుగాని, అందుకు ఆయనను ఆక్షేపించిన వారికి కూడా అవి తెలిసిన విషయాలే. అందుకే కావచ్చు వారు విషయాన్ని అంతకన్న ముందుకు తీసుకుపోవటం లేదు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా, జాతి అయినా, దేశమైనా ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు గ్రహించటం వల్ల భవిష్యత్తుకు ఉపయోగం ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు ఇందిరాగాంధి వెంటనే ప్రధాన మంత్రి స్థానంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ఏ పాఠాలూ నేర్వలేదు. ఆ వెనుక జరిగిన ఎన్నికలలో, ఒక మహావృక్షం కూలితే భూమి కంపించటం సహజమంటూ సిక్కు వ్యతిరేక హింసాకాండను బాహాటంగా సమర్థించారు. పత్రికల అడ్వర్టయిజ్‌మెంట్లు అంతే సమర్థనా పూర్వకంగా ఇచ్చారు. ఇవి కూడా నేను స్వయంగా విన్నవి, చూసినవి. ఈ ధోరణికి కొనసాగింపా అన్నట్లు, శ్రీలంక వివాదంలో పెద్ద మనిషి మధ్యవర్తి త్వానికి పరిమితం కావటానికి బదులు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్) పేరిట సైన్యాన్ని పంపగా, ఆ దళాలు ప్రత్యక్ష చర్యలలో పాల్గొన్నాయి. అది చివరకు రాజీవ్‌కు ప్రాణాంతకమైంది. ఇటువంటి తప్పులు ఇంకా ఉన్నాయి గాని ఆ చర్చకు ఇది సందర్భం కాదు.

టంకశాల అశోక్  

డ్రగ్స్ మాఫియాకు ‘ఈగల్’ కళ్లెం

హైదరాబాద్ మహా నగరాన్ని పట్టిపీడిస్తోన్న ‘మత్తు’ను వదలించేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భాగ్యనగరాన్ని డ్రగ్స్ విక్రయాలకు, తయారీకి అడ్దాగా చేసుకున్న మాఫియా భరతం పట్టేందుకు ఉక్కుపాదం మోపుతోంది. నిన్నటివరకు క్రయవిక్రయాలపై దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం… డ్రగ్స్ తయారీ ముఠాలపై కూడా డేగకన్ను పెట్టింది. నగరంలో డ్రగ్స్ ఊసేలేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ విక్రయాలు జోరందుకుంటుండటాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రముఖులు నివసించే ప్రాంతాలనుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ విక్రయాలు కొనసాగడం ప్రభుత్వానికి సవాల్‌గా మారడంతో సరఫరాతో పాటు తయారీ ముఠాల ఆగడాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. పబ్‌లు.. వీకెండ్ పార్టీలు, రిసార్టు ఫంక్షన్లపై నిఘా పెట్టింది. పరిశ్రమల పేరిట గుట్టుగా డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాల భరతం పడుతోంది. ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిన తరువాత నగరంలో డ్రగ్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నగరంతో పాటు శివార్లలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈగల్ టీమ్ ముందుగా నగరంలో క్రయవిక్రయాలు, సరఫరాపైనే దృష్టి సారించగా, మహారాష్ట్ర పోలీసులు నగరంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నాకే అప్రమత్తమైన నగర పోలీసులు దూకుడు పెంచింది.

ముంబయిలో బంగ్లాదేశ్ మహిళ డ్రగ్స్‌తో పట్టుపడగా… విచారణలో చర్లపల్లిలో వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో తయారీ వెలుగు చూసింది. సుమారు రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ దందా నగరంలోని చర్లపల్లి కేంద్రంగా సాగుతున్నట్లు… ఇక్కడినుంచే దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు తెలియడంతో నగరవాసులతో పాటు పోలీసులు విస్తుపోవల్సివచ్చింది. ఈ కేసులో రూ. 11.58 కోట్ల ముడి సరకులతో పాటు 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసు బోయిన్‌పల్లిలో బట్టబయలయ్యింది. ఓ తయారీదారుడు స్కూల్ నిర్వహకుడే కావడం విశేషం. తన పాఠశాలలోనే డ్రగ్స్ తయారీ చేస్తూ ఈగల్ టీమ్‌కు దొరికిపోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బోయిన్‌పల్లిలో మేధా స్కూల్‌ను నిర్వహిస్తున్న జయప్రకాష్‌గౌడ్ పాఠశాల రెండో అంతస్థులోనే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. పాఠశాలలో అల్ఫోజోలుం తయారీ చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు కంపౌండ్‌లకు భారీగా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

పాఠశాలలో డ్రగ్స్ తయారీని సీరియస్‌గా పరిగణించిన అధికార యంత్రాంగం పాఠశాలను సీజ్ చేసి నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత వారం జీడిమెట్ల సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో గుట్టుగా డ్రగ్స్‌ను తయారీ చేస్తున్నారన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించి రూ. 72 కోట్ల విలువజేసే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో నలుగురు నిందితులను కూడా అరెస్టు చేసింది. ఏకంగా ఫ్లాట్‌లోని ఎపిడ్రిన్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పోలీసు వర్గాలను సైతం నివ్వరపరిచింది. నగరంతోపాటు శివార్లలో ఈగల్ బృందం నిఘాను మరింత ముమ్మరం చేస్తోంది. డ్రగ్స్ విక్రయాలు, తయారీపై ఉక్కుపాదం మోపి… హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈగల్ టీమ్ పేర్కొంటుంది.

ఎం.వి. శివశంకర్

93953 45694

భవిష్యత్ భారతీయులదే

మన తెలంగాణ / అమరావతి : 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక సహకారం అందిస్తోందని చెప్పారు. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ‘అమెరికా వెలుపల తమ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతున్నట్లు గూగుల్ సీఈఓ స్వయంగా చెప్పారన్నారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్, సబ్-సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని,

ఈ సబ్- సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్‌వేగా మారనుందని మోదీ తెలిపారు. గురువారం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 16 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా ఏపీ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తుండటంతో అభివృద్ధి వేగంగా సాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు సభలో పాల్గొన్నారు. సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, రాష్ట్రంలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని ప్రధాని మోదీ అన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం : రూ.9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు, రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్‌లకు, రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య 4వ లైన్‌కు, రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

మోదీ లాంటి నాయకుడిని చూడలేదు : చంద్రబాబు

మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందనడంలో సందేహం లేదన్నారు.

25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని తెలిపారు.మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామన్నారు. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని, జీఎస్టీ తగ్గింపుతో 99 శాతం వస్తువులు 5 శాతంలోపు పరిధిలోకి వచ్చాయన్నారు.

దేశం కోసం పనిచేసే కర్మయోగి మోదీ : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశ సేవే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు.

కూటమి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని, కనీసం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా సమష్టిగా పనిచేస్తామని, రాబోయే తరాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్

పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి నిరంకుశ నిజాం పాలనను వణికించిన అక్షర వీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్. ప్రజలకోసం కలంపట్టి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఈ మహాధీరుడు జర్నలిజం చరిత్రలో అసమాన స్థానాన్ని సంపాదించాడు. ఆయన జీవితం ఒక కలం యోధుడి ధైర్యానికి, నిబద్ధతకు, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. స్వేచ్ఛా భావన, న్యాయం, ప్రజా హక్కులకోసం పోరాటమే ఆయన ఆత్మ స్ఫూర్తి. 1920 అక్టోబర్ 17న ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడు గ్రామంలో హబీబుల్లా ఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లా ఖాన్ జన్మించాడు. వారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌నుంచి నిజాం రాష్ట్రానికి వలసవచ్చి ఇక్కడే స్థిరపడింది. బాల్యంలోనే విద్యా ప్రతిభ, చిత్రకళా నైపుణ్యంతో షోయబ్ పేరు తెచ్చుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి బిఎ, జర్నలిజం డిగ్రీలు పూర్తి చేసి, బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. తన కుమారునిలో గాంధీ పోలికలు ఉన్నాయని భావించి తండ్రి షోయబుల్లా గాంధీ అని ప్రేమతో పిలిచేవాడు. ఆ పేరుకు తగ్గట్టే షోయబ్ నిబద్ధత, ధైర్యం, నిజాయితీతో కూడిన మార్గంలో నడిచాడు.

ఆ కాలం తెలంగాణ అగ్నిగోళంలా మండుతున్న సమయం. నిజాం పాలనలో ప్రజలు ఊపిరి పీల్చలేని స్థితి. పత్రికలపై ఉక్కుపాదం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రాణపణం. అయినా షోయబ్ వెనుకడుగు వేయలేదు. ప్రజాస్వామ్య భావాలతో, జాతీయోద్యమ స్ఫూర్తితో ఆయన జర్నలిజాన్ని తన ఆయుధంగా ఎంచుకున్నాడు. మొదటగా ఉర్దూ పత్రిక ‘తేజ్’ లో ఉప సంపాదకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయన కలం అగ్నిజ్వాలలతో రగిలింది. నిజాం ప్రభుత్వ దోపిడీ, రజాకార్ల దౌర్జన్యాలను ఎండగడుతూ నిర్భయంగా రాశాడు. ఫలితంగా ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది. ఆ తర్వాత ఆయనకు వేదికగా ‘రయ్యత్’ పత్రిక దొరికింది ముందుముల ముల్కి నర్సింగరావు నిర్వహించిన ఈ పత్రికలో షోయబ్ స్వేచ్ఛా రాతలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. కానీ ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం మూసివేసింది. ప్రజాహక్కుల కోసం సొంత పత్రిక అవసరమని భావించి షోయబుల్లా ఖాన్ భార్య, తల్లి నగలను అమ్మి ‘ఇమ్రోజ్’ పత్రికను స్థాపించాడు.

మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహకారంతో ఈ పత్రిక 1947 నవంబర్ 17న తొలి సంచిక విడుదల చేసింది. ‘ఇమ్రోజ్’ అంటే ఉర్దూలో ‘ఈ రోజు’. ఈ పేరు వెనుక షోయబ్ సంకల్పం ఉంది ప్రజా స్వేచ్ఛ కోసం పోరాటం నేటి నుంచే ప్రారంభం కావాలి! ‘ఇమ్రోజ్’ సంపాదకీయాలు నిజాం పాలనను వణికించాయి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలనే ఆయన అభిప్రాయం ధైర్యంగా, స్పష్టంగా వ్యక్తమైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నిజాం పాలన అంతం కావాలి, హైదరాబాద్ భారతదేశంలో భాగం కావాలి అని ఆయన రాసిన పదాలు ఆ కాలంలో విప్లవ స్ఫూర్తి కలిగించాయి. షోయబ్ రాతలు కేవలం రాజకీయ విమర్శలు కాదు; అవి సామాజిక చైతన్యం కూడా. నిజాం పాలనలో బలహీన స్థితిలో ఉన్న పేద ముస్లిం కుటుంబాల బాధలను, రజాకార్ల దుశ్చర్యలను ఆయన ధైర్యంగా బహిర్గతం చేశాడు. నిజాంకు వ్యతిరేకంగా నిలబడిన ముస్లిం మేధావుల వాణిగా నిలిచాడు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టుల పోరాటాలు -అన్నింటికీ ఆయన పత్రిక వేదిక అయింది. 1948 ఆగస్టు 19న రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ సభలో షోయబ్ చేతులు నరికి వేస్తామని బహిరంగంగా బెదిరించాడు. ఆ బెదిరింపు రెండు రోజులకే వాస్తవమైంది. 1948 ఆగస్టు 21 రాత్రి -కాచిగూడ రైల్వేస్టేషన్ రోడ్‌లోని ‘ఇమ్రోజ్’ కార్యాలయంలో పని ముగించుకుని బావమరిది ఇస్మాయిల్ ఖాన్ తో ఇంటికి వెళ్తున్న షోయబ్‌పై పదిమంది రజాకార్లు దాడి చేశారు. ఆయన కలం పట్టిన కుడిచేయిని నిర్దాక్షిణ్యంగా నరికి, తీవ్ర గాయాలతో ఆయనను నేలకూల్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇస్మాయిల్ ఖాన్‌ను కూడా గాయపరిచారు. రక్తమడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న షోయబుల్లా ఖాన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, 1948 ఆగస్టు 22 తెల్లవారుజామున ఆయన ప్రాణాలు విడిచాడు.

నిజాం సర్కారు ఆయన అంతిమ యాత్రను కూడా నిషేధించింది. అయినప్పటికీ ప్రజల ప్రేమ, గౌరవం అణగదీయలేకపోయింది. పోలీసు బందూకుల మధ్య, ప్రజల కన్నీరుతో గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో షోయబుల్లా ఖాన్ ఖననం జరిగింది. ప్రజా స్వేచ్ఛకోసం, తెలంగాణ చరిత్రలో మానవ హక్కుల స్వరంగా నిలిచిన షహీద్ షోయబుల్లా ఖాన్ జీవితం తెలుగు పత్రికా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. కలం యోధుడు, సత్యవాది, స్వేచ్ఛా ప్రియుడు -ఆయన కీర్తి కాలాతీతం. ఆయన చెప్పిన ప్రజల హక్కుల కోసం రాయడం నేరం అయితే, ఆ నేరం పునరావృతం చేస్తాను అనే స్ఫూర్తి నేటి పాత్రికేయులకు మార్గదర్శకం. అసమాన కలం యోధుడు షహీద్ షోయబుల్లా ఖాన్ ఒక పత్రికా వీరుడు, ఒక ప్రజాయోధుడు, ఒక అమర త్యాగధనుడు. జర్నలిజం ధైర్యానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన షోయబుల్లా ఖాన్ స్ఫూర్తి ప్రతి పాత్రికేయుని కలంలో వెలుగుతూనే ఉంటుంది.

రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 42% బిసి రిజర్వేషన్ల అమలు జీఓపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పె షల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు జోక్యం చేసుకోలేమని తెలిపింది. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభా వం పడొచ్చని, ఈ దశలో పిటిషన్‌ను స్వీ కరించబోమని చెబుతూ జ స్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూ డిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చే సిం ది. రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలు జీఓ నెంబర్ 9పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దా ఖలు చేసింది.

ఈ పిటిషన్ గురువారం వి చారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల తో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రకా రం తదుపరి విచారణ చేపట్టాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల తో ఎన్నికలకు వెళ్లవచ్చని చెప్పింది. హై కోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని, అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. స్టేను ఎత్తి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ వేసింది. అయితే ప్రభుత్వ వాదనలు వినడాని కంటే ముందే తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ మాధవరెడ్డి కెవియట్ పిటిషన్ వేశారు.

ప్రభుత్వ వాదనలు ఇలా

ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, బిసి బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని తెలిపారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బిసి రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని వివరించారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వాదించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామని, గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కోర్టుకు చెప్పారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని,

రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని వాదించారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి, అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందని, కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు. బిసి జనాభా డేటా ఆధారంగానే బిసిల రిజర్వేషన్లు పెంచినట్టు కోర్టుకు వివరించారు. దీనిపైన స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవన్నారు. ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ తరపు వాదనలు ఇలా

ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్లు పెంచుకునే మినహాయింపులు ఉన్నాయి కదా? అని ప్రశ్నించింది. ప్రతివాది మాధవరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. షెడ్యూల్ ఏరియా గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉందని, జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదని కోర్టు తీర్పును గుర్తు చేశారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవని కోర్టుకు తెలిపారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించిందని, మహారాష్ట్ర, -మధ్యప్రదేశ్ పిటిషన్లలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందని వివరించారు.

హైకోర్టుపైనే ఆశలు

బిసి రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న ఒక అవకాశం పూర్తికాడంతో ప్రభుత్వం ఆశలు హైకోర్టుపైనే ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా హై కోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పు డు అందరి చూపు హైకోర్టు వైపు మళ్లింది. ఈ అంశంలో ఇప్పటికే విచారణ జరుపుతున్న హై కోర్టు తదుపరి విచారణ ఆరు వారాలకు వాయి దా వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇ చ్చింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? హైకోర్టులో ఎ లాంటి వాదనలు వినిపించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

జోక్యం చేసుకోలేం

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్ల అంశంపై బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఇసి రివిజన్ చే స్తోందని, ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్ర స్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందంటూ అభ్యర్థి మాగంటి సునీత, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లంచ్ మోషన్ పిటిషన్ల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను గురువారం హైకోర్టు విచారించింది. బిఆర్‌ఎస్ తరఫున న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్‌లో సంబంధం లేని 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు నమోదు అయ్యారని, బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. ఇసి తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ సుప్రీం కోర్టులో బిహార్ ఎలక్షన్లపై విచారణ నడుస్తోందని, నామినేషన్ల చివరి తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కోర్టుకు తెలిపారు. బిఆర్‌ఎస్ రిప్రజెంటేషన్లపై ఎన్నికల అధికారిని ఆదేశించామని, నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 8 వేలు అయితే బిఆర్‌ఎస్ వాళ్లు 12 వేలు అని చెబుతున్నారని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని వాదన వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పటికే ఎలక్టోరల్స్‌ని ఇసి రివిజన్ చేస్తోందని ఈ సమయంలో బోగస్ ఓట్లపై ఇసికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.

ఆశన్న లొంగుబాట

రాయ్‌పూర్/న్యూఢిల్లీ: మావోయిస్టుల మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆ శన్న లొంగిపోయారు. చత్తీస్‌గఢ్‌లో గురువారం ఆయన , వేర్వేరు చోట్ల మొత్తం 170 మంది నక్సలైట్లు లొంగిపోయారు. కేంద్రం పద్మవ్యూహం, అ మిత్ షా చక్రబంధంలో చిక్కిన అజ్ఞాత మావోయి స్టు పార్టీకి ఇది మరింత ఎదురుదెబ్బ అయింది. చత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణువేవ్ సాయ్ సమక్షంలో ఈ నక్సల్స్ బృందం జగదల్పూరులో పోలీసుల ముందు ఆయుధాలతో పాటు సరెండ ర్ అయింది. అయితే ఇక్కడ ఆయనతో పాటు ఎందరు నక్సల్స్ లొంగిపోయారనేది అధికారికం గా వివరించలేదు. కానీ ఆయనతో పాటు మావోయిస్టు పార్టీకి చెందిన పది మంది పలు స్థాయిల అగ్రనేతలు సరెండర్ అయినట్లు ఆ తరువాత ఓ జాబితా వెలువరించారు. ఆశన్నను పట్టుకుంటే రూ కోటి పారితోషికం అని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు ఆయనతో పాటు లొంగిపోయిన వారిలో రాణిత (ఎస్‌జడ్‌సిఎం, మాడ్ డివిసి కార్యదర్శి,),

భాస్కర్ (డివిసిఎం పి1 32,) నీలా అలియాస్ వందే, దీపక్ పాలో ఇతరులు ఉన్నారని వెల్లడించారు. మల్లోజుల తోడుగా 60 మంది నక్సలైట్లు ఒక్కరోజు క్రితం గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ముం దు అస్త్ర సన్యాసం తరువాత జనజీవన స్రవంతిలోకి వస్తామనే ప్రకటన వెలువరించిన మరుసటి రోజే ఆశన్న బృందం లొంగిపోయింది. దీనితో దండకారణ్యంలో నక్సల్స్ ప్రాబల్యం పడిపోయింది. ఇది చివరికి ఉనికికే ముప్పుగా దారితీసింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అయిన తక్కళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ప్రస్తుత ములుగు జిల్లాలోని వెంటకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. అక్కడి బిక్షపతిరావు, సరోజన దంపతుల పెద్ద కుమారుడు వాసువేవరావు. చిన్ననాటనే విప్లవోద్యమాలకు ఆకర్షితులై, ఆర్‌ఎస్‌యు నాయకత్వం, కాకతీయ విశ్వవిద్యాలయంలో వామపక్ష భావజాల ప్రచారంలో చురుకుగా ఉంటూ వచ్చిన ఆయన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడు.నక్సల్స్ బాటలో ముందుకు సాగి ఆశన్నగా అగ్రస్థాయికి చేరాడు.

సంచలనాల ఘటనల్లో సూత్రధారి

పాత పలు కీలక నక్సల్స్ ఘటనల్లో ఆయన ప్రధాన పాత్ర ఉంది. ఐపిఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద దాడి యత్నంలో ఆయననే కీలక పాత్ర పోషించాడనే కేసులు ఉన్నాయి. 2024 నవంబర్‌లో ఆశన్న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడనే ప్రచారం జరిగింది. తరువాత ఇది నిజం కాదని తేలింది. 60 సంవత్సరాలు పైబడ్డ ఆశన్న లొంగుబాటు, ఆయనతో పాటు కేడర్ ఏకంగా 170 మంది సరెండర్ అయిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఆశన్న చాలాకాలంగా పార్టీలో వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్నారు. బసవరాజు మరణం తరువాత తనకు అగ్రనాయకత్వం దక్కుతుందని ఆశించారు. అయితే కుదరలేదు. దీనితో అంతర్గతంగా కుమిలిన ఆయన ఇప్పుడు అదును చూసుకుని లొంగిపోయారని వెల్లడైంది.

ఆశన్న సరెండర్‌పై సస్పెన్స్

ఒక్కరోజు క్రితమే ఆశన్న ఇతర సభ్యులు గురువారం సరెండర్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే మధ్యాహ్నం వరకూ కూడా ఆయన ఎక్కడ సరెండర్ అయ్యారనేది మీడియాకు స్పష్టత రాలేదు. అయితే ఆ తరువాత సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటన వెలువరించడం, ఆశన్న సరెండర్ అయ్యారని చెప్పడం, నక్సలైట్లు జనజీవన స్రపంతిలోకి మిగిలిన మర్యాద మార్గంగా వచ్చి చేరాలని లేకపోతే భద్రతా బలగాలే ఇతరత్రా చేయాల్సిన చర్యకు దిగుతాయని పేర్కొనడం, ఇదే సమయంలో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఉన్నతాధికారుల ఎదుట ఆశన్న ఆయనతో పాటు పలువురు నక్సల్స్ లొంగిపోయినట్లు వార్తలు, ఫోటోలు వెలువడటం జరిగింది. చాలారోజుల ముందుగానే ఆశన్న తన బృందంతో స్థానికంగా పోలీసు రక్షణలో ఉండి ఉంటారని, సరెండర్ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారని ఇప్పటి పరిణామాలతో స్పష్టం అయింది. కాగా శుక్రవారం మధ్యప్రదేశ్ లేదా చత్తీస్‌గఢ్ వేదికలుగా మరో నక్సల్స్ నేత భారీగా దళాలతో పాటు భద్రతాబలగాల ముందు లొంగిపోతారనే వార్తలు నిర్థారణ కాలేదు.

లొంగిపొండి.. లేదా అణచివేత తప్పదు

నక్సల్స్‌కు కేంద్ర మంత్రి అమిత్‌షా హెచ్చరిక

న్యూఢిల్లీ : ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ లోని అబుజ్‌మడ్, ఉత్తర బస్తర్ అనే రెండు డివిజన్లు ఇప్పుడు నక్సల్స్ నుంచి విముక్తి పొందాయని, మోడీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని, ఎవరైతే నక్సలైట్లు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని స్వాగతిస్తామని, ఇంకా తుపాకీతో ఉద్యమం కొనసాగించాలనుకునే వారు భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. నక్సలిజం మార్గంలో ఇంకా ఉన్నవారు ఆయుధాలను విడిచిపెట్టి జనస్రవంతి లోకి రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని సూచించారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మహారాష్ట్రలో మరో 61 మంది లొంగిపోయి జనస్రవంతి లోకి వచ్చారని,మరునాడు గురువారం ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది తమ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోయారని వెల్లడించారు.

దీంతో రెండు రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోవడం నక్సలిజంపై పోరులో పెద్ద విజయంగా అభివర్ణించారు. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే వీరి నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్ర వాదాన్ని అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. ఒకప్పుడు తీవ్రవాద స్థావరాలుగా ఉండే అబుజ్‌మడ్, ఉత్తరబస్తర్ డివిజన్లు నేడు నక్సల్స్ నుంచి విముక్తి పొందాయని వెల్లడించడం అమితానందం కలిగిస్తోందన్నారు. ఇప్పుడు దక్షిణ బస్తర్‌లో నక్సలిజం జాడ ఉందని, దీన్ని భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 2100 మంది నక్సల్స్ లొంగిపోయారని, 1785 మంది అరెస్టయ్యారని, 477 మందిని నిర్మూలించడమైందని అమిత్‌షా వివరించారు.