elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbet

దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారు: రేవంత్

హైదరాబాద్: మన జాతి పిత మహాత్మ గాంధీ భారతదేశానికి పర్యాయపదం అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గాంధీ కుటుంబం కూడా దేశానికి అదే విధంగా స్ఫూర్తినిచ్చిందని అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్బావన యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..గత 35 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగుతోందని, భారత్ లో అన్ని మతాల సహజీవనం స్ఫూర్తినిస్తుందని తెలియజేశారు. తమపై పోరాడిన మహాత్మాగాంధీని బ్రిటీషర్లు ఏమీ చేయలేకపోయారని, స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు గాంధీని పొట్టనపెట్టుకున్నారని గాంధీని హత్య చేసిన వారు బ్రిటీషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులని తెలియజేశారు. దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి ఇందిరాగాంధీ అసువులు బాసారని, ఇందిరాగాంధీ వారసత్వం, త్యాగాలను రాజీవ్ గాంధీ పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారని, మతసామరస్యం దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటపుడు సద్బావన యాత్ర చేశారని, దేశ సమగ్రతను కాపాడడానికి చివరకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

వర్షం అంతరాయం… శ్రేయస్ ఔట్… టీమిండియా 52/4

పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 52 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం పడుతుండడంతో ఆటను రెండో సారి నిలిపివేశారు. మ్యాచ్ ను 32 ఓవర్లకు కుదించారు.  రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా డకౌట్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 11 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్ లో ఫిలిప్ప్ కు క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్(14), కెఎల్ రాహుల్(04) ఉన్నారు. 

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టడం కాదు…కూలగొట్టడం: కెటిఆర్

హైదరాబాద్: రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆ పార్టీలో పలువురు నేతలు చేరారు. రాజేంద్రనియోజకవర్గానికి చెందిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్, మాజీ ఎంపిపి చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, పాశం యాదగిరి కూతురు పాశం పల్లవి, అల్లుడు అంజిబాబు, తదితరలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ నాశనమైందని, తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని, తెలంగాణ ప్రజల ఆస్తి కరిగిపోయిందన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కోటీ మందిని కోటీశ్వరులు చేయడం కాదు మహిళల పుస్తెలు ఎత్తుకోకపోతే చాలు అని చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. అరాచక పాలనతో ఎవరు సంతోషంగా లేరని, ఆక్రమణల పేరుతో పేదలు ఇండ్లు కూలగొడుతున్నారని కానీ పెద్దల ఇండ్లు ఎందుకు కూలగొడుతలేరని ప్రశ్నించారు. పేదల స్థలాలు మాత్రమే కనిపిస్తున్నాయి?, పెద్దల స్థలాలు కనిపించడం లేదా? అని హైడ్రాను నిలదీశారు. ఆరు గ్యారెంటీలె ఇంకెప్పుడు అమలు చేస్తారని అడిగారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారని, కోటీ 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారన్నారు. మూసీగా అడ్డంగా కడుతున్న వారిని ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. పేదల వద్ద పత్రాలు ఉన్న రాత్రికి రాత్రే కూలగొడుతున్నారని దుయ్యబట్టారు. పాలించడానికి కండకాదు, గుండె కావాలని, రేవంత్‌కు పాలన చేతగాక మాజీ సిఎం కెసిఆర్ అప్పు చేశారని మాట్లాడుతున్నారని, నెలకు పది వేల కోట్లు రేవంత్ అప్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టడం కాదు ఇండ్లు కూలగొట్టడం అని ఎద్దేవా చేశారు.

అసలు ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది: సబితా

హైదరాబాద్: నిందితుడికి మంత్రి కొండా సురేఖ ఆశ్రయం ఇవ్వడం సరైందేనా? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కొండా సురేఖ ఇంట్లో నిందితుడు ఎందుకు ఉన్నారు? అని అడిగారు. కొండా సురేఖ ఇంటిపైకి వెళ్లేందుకు పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మహిళా నేతల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని కొండా సురేఖ కారులో తీసుకెళ్తే పోలీసులు చర్యలు తీసుకోరా? అని, ఈ అంశంలో అసలేం జరిగిందని ఎక్కడ సెంటిమెంట్ జరిగింది? అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా ఓఎస్ డికి గన్ ఇచ్చి సిమెంట్ కంపెనీ డైరెక్టర్‌ టేబుల్ పై గన్ పెట్టి బెదిరించారని ఆరోపణలు చేశారు.

అసలు ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అని నిలదీశారు. అసలు ఈ సెటిల్ మెంట్ పై పోలీసులు విచారించారా లేదా? అని మంత్రి కుమార్తె ఏకంగా సిఎంపై ఆరోపణలు చేస్తే వివరణ ఎందుకు ఇవ్వలేదు? అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సదరు సిమెంట్ కంపెనీ డైరెక్టర్‌ స్టేట్ మెంట్ పోలీసులు తీసుకున్నారా? తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలన్నారు.  రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడే ఈ సెటిల్‌మెంట్‌లో కూర్చున్నారని, అంటే కచ్చితంగా సిఎం ఇందులో హస్తం ఉందని సబితా ఆరోపణలు చేశారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

తిరుమల: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత తన భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకోగానే టిటిడి అధికారులు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో కవిత దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలోని హాథిరాం బావాజీ మఠం బార్సీ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన భోగ్ భండార్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తిరుమలలో బంజారాల ఆరాధ్య దైవం అయిన హాథిరాం బావాజీ మఠంలో తమకు తగిన స్థానం కల్పించాలని దక్షిణ భారతదేశంలోని బంజారా సాధు సంత్ ల పక్షాన నిలబడి ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించానని ఆమె తెలిపారు.

చెట్టును ఢీకొని ద్విచక్రవాహనంపై ఇద్దరు మృతి

అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా లో నల్లమాడ మండలం గోపేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును ఢీకొని ద్విచక్రవాహనంపై ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం వాహనదారుల నిర్లక్ష్యమేనని పోలీసులు భావిస్తున్నారు.   

బిసి బంద్ లో షాపులపై దాడి…. 8 మంది అరెస్టు

హైదరాబాద్: బిసి బంద్ నేపథ్యంలో దాడులకు పాల్పడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిసి బంద్ సందర్భంగా బిసి జెఎసి నేతలు విద్యానగర్ నుండి బర్కత్‌పురా వరకు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళ్తున్న సమయంలో పలు షాపులు, షోరూంలు, పెట్రోల్ బంక్‌లు ఓపెన్ చేసి ఉండడంతో వాటిపై ఆందోళనకారులు దాడి చేశారు. 8 మంది బిసి జెఎసి ప్రతినిధులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం జరిగిన బిసి బంద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం విధితమే. షాపులపై బిసి సంఘం నాయకులు రాళ్లతో దాడి చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట పరిధిలో బిసి బంద్ నేపథ్యంలో బజాజ్ షో రూమ్, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పై తెరిచి ఉండడంతో వాటిపై  రాళ్లు విసిరి బలవంతంగా బిసి నాయకులు మూయించిన విషయం తెలిసిందే. 

విరాట్, రోహిత్, గిల్ ఔట్… టీమిండియా 37/3

పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం పడుతుండడంతో కొంచె సేపు ఆటను నిలిపివేశారు. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా డకౌట్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(06), అక్షర పటేల్(7) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

పాలమూరులో కోరలు చాస్తున్న గంజాయి

ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు ముఖ్యంగా పాలమూరు పట్టణంలో గంజాయి కోరులు చాస్తూ బుసలు కొడుతోంది. రోజురోజుకు గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. ఇప్పటి దాక హైదరాబాద్ నగరాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ ముఠాలు ఇప్పుడు పాలమూరుపై కన్నేశాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణలు గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే గంజాయి మత్తు ఎలా గమ్మత్తుగా యువతను పెడదారిలోకి నెడుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. గంజాయిని అరికట్టాల్సిన పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయం లేక పోవడం, ఉదాసీనంగా ఉండడంతో గంజాయి బ్యాచ్‌లు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నా, ఇక్కడ ఆయన ఆదేశాలు అమలు కావడం లేదనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ది ఉమ్మడి పాలమూరు జిల్లానే కావడం గమనార్హం. ఇద్దరు పెద్దలు ఉన్న జిల్లాలో గంజాయి మూడుపువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం దర్జాగా సాగుతుందంటే పరిస్ధితులు ఇక్కడ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీంలు గట్టి నిఘా వేయడంలో విఫలం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

జిల్లా కేంద్రంలో తిష్ట వేసిన ముఠాలు

ముఖ్యంగా జిల్లా కేంద్రంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసులు, నిఘా నేత్రాల కళ్లుగప్పి ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లార్లు ఈ దందా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వన్‌టౌన్, బండ్లగేరి, మినీ ట్యాంక్ బండ్, మోటార్ లైన్, వీరన్నపేట, రైల్వేస్టేషన్ రోడ్, ప్రేమ్‌నగర్, మర్లు, రూరల్ ప్రాంతాల్లోనూ విక్రయాలు రహస్యంగా జరుగుతున్నాయి. ఆరు గ్రాముల గంజాయి ప్యాకెట్ ధర రూ. 400 నుంచి రూ. 500 దాక విక్రయిస్తున్నారు. వీటి విక్రయాలు వెనుక హైదరాబాద్ ముఠాల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ముఠా ఇక్కడి కొన్ని ముఠాలతో చేతులు కలిపి ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోకి గద్వాల జిల్లా మీదుగా కర్నాటక, నారాయణపేట మీదుగా మహారాష్ట్ర నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, నల్లమల్ల నుంచి నాగర్‌కర్నూలు జిల్లాలకు సరఫరా అవుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలు కూడా ఇప్పుడు గంజాయి మత్తులో జోలపాటగా మారింది.

మాట్లాడితే దాడులే:  గంజాయికి అలవాటు పడిన యువత మత్తులో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. మత్తులో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ప్రధానంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యన ఉన్న యువతనే ఈ గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా పేద కాలనీల్లోని పేద యువతనే దీని మత్తుకు చిత్తు అవుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ చేసి దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న సాయిచరణ్ గత నెల 16వ తేది వన్‌టౌన్ నుంచి బండ్లగేరి మీదుగా రాత్రి వెళ్తున్న సమయంలో బండ్లగేరి దగ్గర ఉన్న 7 మంది అడ్డగించారు. అప్పటికే గంజాయి సేవించిన ఆ బ్యాచ్ లో ఉన్న కొందరు సాయిచరణ్‌ను డబ్బులు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో కడుపులో గుద్ది తీవ్ర గాయాలకు గురిచేశారు. ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడికి కుడివైపున ఒక అవయవం పూర్తిగా దెబ్బతిందని వైద్యులు చెప్పారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక కాలనీలో కొందరు యువత రాత్రి సమయంలో ఇళ్లపై దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మినీ ట్యాంక్ బండ్, పట్టణ సమీపంలో బైపాస్, రియల్ ఎస్టేట్ వెంచర్లలలో ఈ దందా జరగడమే కాకుండా గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయికి అలువాటుపడిన యువత ఇంకా ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడే ప్రమాదాలు లేక పోలేదు.

మచ్చుకు కొన్ని సంఘటనలు:  ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో బాలనగర్ మండల పరిధిలోని గుండేడు నుంచి గుడిత్యాల వెళ్లేదారిలో ఉన్న కిరాణ షాపులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురుపై దాడులు చేసి లక్ష విలువ చేసే 1.2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రయాలు జరుపుతున్న కిషన్, నేనావత్ కృష్ణ, అతని భార్య లాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్ పరిధిలోని మయారి పార్క్ దగ్గర గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ఇటీవల నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, రూ. 5 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఊట్కూర్ మండల పరిధిలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 125 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గద్వాల జిల్లాలో మహరాష్ట్ర నుంచి గద్వాలకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లాలో ఏకంగా 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్లలో 6 నెలల వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత ఏడాదిలో 22 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కేవలం గంజాయి పట్టుబడ్డవి మాత్రమే. అయితే పట్టుబడకుండా రహస్యంగా ఈ గంజాయి అమ్ముతున్న చీకటి దందా పెద్దగానే జరుగుతున్నట్లు సమాచారం.

చట్టం ఏమి చెబుతోంది?: గంజాయి, డ్రగ్స్ విక్రయించినా, తాగినా చట్టం ప్రకారం శిక్షార్హులే. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్) 1985 ప్రకారం పది సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ కేసు కింద పోలీసులు నమోదు చేస్తే తాను నేరం చేయలేదని నిందితుడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో బెయిల్ రావడం చాలా కష్టం. కొందరు తెలిసో తెలియకనో ఈ గంజాయి వలలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పట్టుబడితే ఇక జైలు జీవితం గడపాల్సిందే. ఇక గంజాయి, డ్రగ్స్ సేవించే వారికి కూడా చట్టంలో కఠినంగా ఉన్నాయి. గంజాయి సేవిస్తే రక్తనమూనాలో ఆ ఆనవాళ్లు 48 గంటల పాటు ఉంటుంది. గంజాయి తాగినట్లు పోలీసుల వద్ద ఉన్న కిట్లలో నమోదైతే కేసులు నమోదు చేస్తారు. బెయిల్ అంత త్వరగా రావడం కష్టమే. ఇక నేరం రుజువైతే ఏడాది జైలు శిక్ష, జరిమానాలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. 

– బిజి. రామాంజనేయులు

90598 95411

(బ్యూరో ఇంచార్జీ

మహబూబ్‌నగర్) 

నల్లగొండలో వాటర్ ట్యాంక్ కూలి తల్లీకుమారుడు మృతి

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఇంటి పైనున్న వాటర్ ట్యాంక్ పడి తల్లీ కుమారుడు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పి నాగమణి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ప్రారంభించింది. రేకుల షెడ్డు పై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. రేకులపై బరువు ఎక్కువగా ఉండడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో తల్లి పి నాగమణి(32), కుమారుడు వంశీకృష్ణ(6) ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.