elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobet

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

bets10

casinolevant

casinolevant

casinolevant

casinolevant

nesinecasino

istanbul escort

bahisfair

smartbahis

meritking

meritking giriş

vipslot

imajbet

sekabet

meritking

matbet giriş

jojobet

madridbet

holiganbet

పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకల తేదీలు ఫైనల్ అయ్యాయి. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లి కొడుకు వేడుక జరగనుంది. అక్టోబర్ 28న మెహందీ వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వేడుక ఆనందోత్సవంగా ఉండబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తం అక్టోబర్ 30న రాత్రి 10:35కి హైదరాబాద్‌లో జరగనుంది. మొత్తం వేడుకలు స్టార్‌లతో, సంతోషాలతో మరచిపోలేని ఈవెంట్‌గా జరగనున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి .. ఆరుగురి మృతి

కీవ్: ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ లోని పలు ఇంధన మౌలిక సదుపాయాలను లక్షంగా చేసుకొని బుధవారం కూడా రష్యా దాడులకు పాల్పడినట్టు చెప్పారు.

ఈ దాడిలో 18 మంది గాయ పడినట్టు కీవ్ పరిపాలన అధిపతి తైమూర్ వెల్లడించారు. దాడి కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యుద్ధం ముగింపుపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ పుతిన్‌కు సూచించినప్పటికీ కీవ్‌పై మాస్కో దాడులు కొనసాగిస్తుండడం గమనార్హం.

యూకే వెళ్లే విద్యార్థులకు బ్యాడ్ న్యూస్..

లండన్ : ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు చేదు వార్త. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీలు ఏటా తమ ట్యూషన్ ఫీజులను పెంచనున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు ఉంటుందని యూకె ప్రభుత్వం వెల్లడించింది. విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూకే విద్యాశాఖ మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్సన్ తెలిపారు. ఈమేరకు అక్కడి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ బ్రిడ్జెట్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పూర్తి స్థాయి ఫీజుల వసూలుపై కొన్ని షరతులు వర్తిస్తాయని ఆమె తెలిపారు. నాణ్యమైన బోధనా వ్యవస్థ , విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే యూనివర్శిటీలు గరిష్ఠ ఫీజులు వసూలు చేయొచ్చని పేర్కొన్నారు.

తాజా నిర్ణయంతో యూనివర్శిటీల్లో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని , నైపుణ్యాలు తమ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఎనిమిదేళ్ల తరువాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ యూనివర్శిటీలు తమ ట్యూషన్ ఫీజులను పెంచాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ ఫీజు 9535 పౌండ్లుగా ఉంది. ద్రవ్యోల్బణం ఆధారంగా వచ్చే ఏడాది ఫీజు పెంపు ఉంటుంది. అది ఎంతనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం.

2026 లోనూ ద్రవ్యోల్బణం ఇప్పటిలాగే ఉంటే గనుక, ఫీజులు దాదాపు 400 పౌండ్లు పెరిగి 9900 పౌండ్లు దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఇంగ్లాండ్ లోని విశ్వవిద్యాలయాలు ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. ఖర్చు నియంత్రణలో భాగంగా గతేడాది ఈ యూనివర్శిటీల్లో దాదాపు 12 వేల వరకు ఉద్యోగాల్లో కోతలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయం తమకు ఎంతో ఊరటనిస్తుందని యూనివర్శిటీ యూకే యూనియన్ వెల్లడించింది. 

బాలికను మభ్యపెట్టి పెళ్లి.. నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

 బాలికల భద్రతకు న్యాయవ్యవస్థ కఠినమైన హెచ్చరికగా నిలిచే తీర్పును నల్గొండ పోక్సో కోర్టు బుధవారం వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడు నల్లగొండ జిల్లా, పానగల్లు గ్రామానికి చెందిన గురిజాల చందుకు కోర్టు 32 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.75 వేల జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. 2022లో నల్గొండ టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దర్యాప్తు ఆధ్వర్యంలో నమోదు ఈ కేసు నమోదైంది. పూర్తిసాక్షాధారాలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై తప్పు నిరూపితమైంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. విచారణలో డి. చంద్రశేర్‌రెడ్డి, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ సైదులు, సిఐ రాఘవరావు, లైజనప్స్ ఆఫీసర్ మల్లికార్జున్, నరేందర్, సిడిఒ సుమన్, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన కీలక పాత్ర పోషించారు. కాగా, ఈ తీర్పు సమాజానికి ఒక బలమైన సందేశంగా నిలుస్తుందని, బాలలపై నేరాలకు న్యాయవ్యవస్థ ఎన్నడూ ఉపేక్ష చూపదని స్పష్టమవుతుందని పలువురు వ్యాఖ్యా నించారు.

మెహుల్ చోక్సీని అప్పగిస్తాం.. బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు

బ్రసెల్స్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించే విషయంపై బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన్ను భారత్‌కు అప్పగించడంలో తమకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించేందుకు ఇటీవల బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన అప్పగింత ఆమోదం రాజకీయంగా ప్రేరేపించిందని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా బెల్జియం యాంట్వైర్ప్ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు కాదని, గుర్తు చేసింది. అప్పగింతను సమర్థించే తీవ్రమైన అభియోగాలు అతడు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది.

ఛోక్సీపై భారత్ వేసిన అభియోగాలను బెల్జియం చట్టప్రకారం కూడా నేరాలుగానే పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. భారత్ ఆదేశాల మేరకు తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ చాలా కాలంగా ఛోక్సీ చేస్తున్న వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా ఛోక్సీ అప్పగింత అనంతరం అతడిని ఉంచే జైలుకు సంబంధించి భారత ప్రభుత్వం అందించిన వివరాలను బెల్జియం కోర్టు ప్రస్తావించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ (కేసులో మరో ప్రధాన నిందితుడు ) దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వాబార్బుడాకు వెళ్లగా, నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. ఇటీవల ఆంట్రర్ప్ లోని న్యాయస్థానం ఛోక్సీ అప్పగింతకు ఆమోదం తెలిపింది. 

భారత్‌తో మంచి సంబంధాలు.. దివాళీ వేడుకలో ట్రంప

ఇండియా రష్యా చమురు వాటా తగ్గుముఖం

ట్రేడ్, పాకిస్థాన్‌తో సయోధ్య విషయాల ప్రస్తావన

వ్యాపార దిగ్గజాల సమక్షంలో ప్రమిద జ్యోతి

వాఫింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలు చాలా బాగున్నాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, భారత ప్రజలను ఆయన కొనియాడారు. ఎంతో మంచి సంబంధాలు ఉన్న ఇరుదేశాలూ రష్యా ఉక్రెయిన్ చిరకాల యుద్ధం సమసిసోవాలని కోరుకుంటున్నాయని ట్రంప్ చెప్పారు. సుంకాలు, వీసా అంశాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వ్యవహారాల దశలో భారత్ అమెరికా సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ దశలోనే ట్రంప్ ఆశాభావ వ్యాఖ్యలు వెలువడ్డాయి. మంగళవారం వైట్‌హౌస్‌లో రంగుల విద్యుద్దీపాల అలంకరణలతో వేడుక జరిగింది. భారతీయ సంతతి వ్యాపారవేత్తలను, సామాజిక వర్గాన్ని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ముందుగా ట్రంప్ దీపావళి సాంప్రదాయక ప్రమిద దీపం వెలిగించారు. భారతీయులు, ఇండో అమెరికన్లకు ఈ దివ్వెల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడి ఉత్సవానికి ముందే తాను ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. చాలా మంచి సంభాషణ జరిగింది. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వ్యాపార వాణిజ్య విషయాలు ప్రస్తావనకు వచ్చాయని వివరించారు. ఇతర చాలా విషయాలు ముందుకు వచ్చాయి కానీ ట్రేడ్ విషయం కీలకం కదా అన్నారు. ఈ విషయంలో మోడీకి కూడా ఆసక్తి ఉందన్నారు. మోడీ గొప్ప వ్యక్తి, ఆయనతో తనకు ఏండ్ల తరబడి ఆయన తనకు మంచి మిత్రుడని వెల్లడించారు. ప్రదాని మోడీతో భారత్ పాక్ సంబంధాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు.

ఇరుదేశాల మధ్య ఘర్షణలు వద్దని చెప్పానని, ఇదే తనకు కావల్సిందన్నారు. అసలు వివాదం గురించి మీడియాకు తెలిసిందేనని, అయినా రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు కొనుగోళ్లకు ఇకపై దిగకపోవచ్చునని మీడియాకు చెప్పారు. భారత్ అమెరికా మధ్య రాబోయే రోజులలో మరిన్ని మంచి ఒప్పందాలు కుదురుతాయని కూడా ట్రంప్ వెల్లడించారు. తన మాదిరిగానే మోడీ కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారని, ఇది స్నేహభావ శాంతి సారూప్యం అని విశ్లేషించారు.

అమెరికా నిర్మాణంలో భారతీయ సమాజం కీలకం

అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఇక్కడి భారతీయ వ్యాపార వాణిజ్య వర్గాలు చిరకాలంగా కీలక పాత్ర వహిస్తున్నారని ట్రంప్ కొనియాడారు. వారి ఇక్కడి కంపెనీలను చూస్తే వారి కీలక పాత్ర ఏమిటనేది తెలుస్తుంది. పైగా ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా నిలిచాయని కొనియాడారు. దీపావళి వేడుకలకు వైట్‌హౌస్‌కు ఆహ్వానితులుగా తరలివచ్చిన వారిలో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్‌లతో వైట్‌హౌస్ కళకళలాడింది. అడోబ్ సిఇఒ శంతనూ నారాయణ్, మైక్రాన్ కార్యనిర్వాహకులు సంజయ్ మెహ్రోత్రా, ఐబిఎం సిఇఒ అరవింద్ కృష్ణ వంటి పలువురు వైట్‌హౌస్ వేడుకకు తరలివచ్చారు.

దివ్వె విశ్వాసానికి, చీకటిపై వెలుగు విజయానికి తార్కాణంగా నిలుస్తుంది. అజ్ఞానంపై జ్ఞానం గెలుపు ప్రతీక అని ముందుగా ట్రంప్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి తరలివచ్చిన తొలితరం బారతీయులలో తానూ ఒకడిని అని చెప్పారు. తన తల్లిదండ్రులు ఇక్కడికి చట్టబద్ధంగా వచ్చి స్థిరపడ్డారని వివరించారు. కార్యక్రమానికి అమెరికాలోని బారతీయ రాయబారి వినయ్ మెహన్ క్వాత్రా ప్రత్యేకంగా వచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్‌ను వైట్‌హౌస్ వేడుక నడుమ కలుసుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్లు స్పందించారు. 

రేవంత్‌రెడ్డి సగం పాలనతో ఆగమవుతున్న రైతులు: హరీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సగం పాలనతో రాష్ట్ర ప్రజలతో పాటు రైతులు ఆగమాగం అవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఏ పని చేసినా సగమే చేస్తారు తప్ప పూర్తిగా చేసింది ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ప్రతి పంటను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేయడంతో పాటు బోనస్ ఇస్తామని గొప్పలు చెప్పి, ్డ ధాన్యం కొనుగోలుపై నిబంధనలు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఎకరాకు 18 క్వింటాళ్ల మక్కను కొనుగోలు చేస్తామని రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన సగం పంటను కొనుగోలు చేసి మిగతా పంట బయట అమ్ముకోవాలంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.

రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు గొప్పలు చెప్పి, అధికారంలోకి రాగానే రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి కనీసం 25 నుంచి 30 ఎకరాల మక్కా పంట వస్తుందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అడగంగా అడగంగా అరిగోస పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో దళారులకు తక్కువ దొరకే రైతులు ధాన్యాన్ని విక్రయించి ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సిద్దిపేట మార్కెట్ యార్డులోనే 14 వేల క్వింటాళ్ల మక్క దళారుల పాలైందని అన్నారు. ఒక పంటకు బోనస్ ఇచ్చి మరొక పంటకు ఎగ్గొట్టారని, సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఆయన వెంట వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, నల్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల అరవింద్ రెడ్డి, నర్సింలు, రమేష్ తదితరులు ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ లో మహిళా డాక్టర్ పైదాడి,

పశ్చిమ బెంగాల్ లోని ఉలుబేరియాలో ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి చేసి, ఆత్యాచారం చేస్తామని బెదిరించారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.కోల్ కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో వైద్యురాలిపై దారుణ అత్యాచారం, హత్య జరిగినన ఏడాది తర్వాత ఈ సంఘటన జరగడంతో అధికార తృమమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పరస్పర విమర్శలకు ఆజ్యం పోసింది.హౌరా జిల్లాలోని ఉలుబేరియాలోని శరత్ చంద్ర చటోపాధ్యాయ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రిలో సోమవారం నాడు ఈ సంఘనట జరిగింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రోగి బంధువులే నిందితులు. వారు సోమవారం మధ్యాహ్నం వైద్యురాలితో ఘర్షణ పడి ఆమెపై దాడి చేశారని ఆరోపించారు. ఆ మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో షేక్ హసిబుల్ అనే వ్యక్తి హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు.అతడితో పాటు షేక్ సామ్రాట్, షేక్ బాబులాల్ అనే వారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తెలియడంతోనే బెంగాల్ లోని వైద్యులకు చెందిన జాయింట్ ఫోరం ఆఫ్ డాక్టర్స్ ఉలుబేరియా ఆస్పత్రిని సందర్శించింది.

విధినిర్వహణలో ఉన్న డాక్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.రాష్ట్రంలో మహిళలు, మహిళా డాక్టర్ల భద్రత విషయంలో నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ దుమ్మెత్తి పోసింది. ఆర్ జి కర్ ఆస్పత్రి ఘటన నుంచి మమత సర్కార్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య విమర్శించారు. తృణమూల్ ఒక దారుణ సమాజాన్ని సృష్టించిందని, ఇక్కడ హోమ్ గార్డ్ లు, పౌర వలంటీర్లు పార్టీలో భాగం అయ్యారని, వారికి పోలీసులు అన్నా లెక్కలేదని ఆయన అన్నారు. ఆస్పత్రులలో డాక్టర్లపై దాడులు అరికట్టే ఏర్పాట్లు లేవని, సిసిటివి కెమెరాలే లేవని ఆయన విమర్శించారు. బెంగాల్ లో మమతా బెనర్జీ పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఉలుబేరియా సంఘటన ను తృణమూల్ ప్రతినిధి అరుణ్ చక్రవర్తి ఖండించారు. ఇది దురదృష్టకరమైనదని అన్నారు. నిందితులు అందరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

రేపు మరోసారి కేబినెట్ భేటీ

మంత్రివర్గం రేపు మరోసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. బిసి రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తుండగా మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ పనులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం కాగా, నేడు మరోసారి కేబినెట్ భేటీ జరుగనుంది.

లెఫ్టినంట్ కల్నల్‌గా నీరజ్ చోప్రా

భారత మేటి జావెలిన్ త్రోయర్ , ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ ఆర్మీలో గౌరవ ప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను ఆయనకు అందజేశారు. ఢిల్లీ లోని సౌత్ బ్లాక్‌లో ఆయన్ను ఆ ర్యాంక్‌తో సన్మానించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్‌ఉపేంద్రద్వివేది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీరజ్‌చోప్రా కుటుంబీకులు కూడా ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది. పట్టుదలకు, దేశభక్తికి నీరజ్‌చోప్రా నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు. ప్రభుత్వగెజిట్ ప్రకారం నీరజ్ చోప్రా నియామకం ఏప్రిల్ 15 న జరిగింది.

జూనియర్ కమీషన్ ఆఫీసర్‌గా నయిబ్ సుబేదార్ ర్యాంకుతో నీరజ్ చోప్రా 2016 ఆగస్టులో భారతీయ సైన్యంలో చేరారు. చోప్రాకు గతంలో పద్మశ్రీ,మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ,అర్జున అవార్డులు దక్కాయి. పరమ విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ కూడా ఆయన గెలుచుకున్నారు. 2020 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2024 వరల్డ్ అథ్లటిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఏషియన్ , కామన్‌వెల్త్ గేమ్స్‌తో పాటు డైమండ్ లీగ్‌ల్లోనూ అతను స్వర్ణ పతకాలు సాధించారు.నీరజ్ చోప్రా తన జావెలిన్‌ను అత్యుత్తమంగా 90.23 మీటర్లదూరం విసిరి రికార్డు సృష్టించారు.