elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

meritking

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డాటాను నవంబర్ 18 లోపు డిఇఒలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే: మంత్రి సీతక్క

బిఆర్‌ఎస్ ఓర్వలేక దుష్ప్రచారం

బిజెపికి బి టీంగా బిఆర్‌ఎస్ పని చేస్తోంది

బిఆర్‌ఎస్‌కు ఓటమి తథ్యం

మంత్రి సీతక్క వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజా స్పందన చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమేనని అన్నారు. బోరబండలో గురువారం మంత్రి సీతక్క విస్తృత ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్వలేక బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పేర్కొన్నారు. బిజెపికి బీ టీమ్ గా బిఆర్‌ఎస్ పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అబద్దాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగిన బీఆర్‌ఎస్‌కు ఓటమి తధ్యమని అన్నారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఓటర్లే స్వయంగా చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారని తెలిపారు.

సెటిల్‌మెంట్‌లకు కేంద్రంగా సిఎం ఇల్లు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం ఇల్లు సెటిల్‌మెంట్‌లకు కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు. నీకింత, నాకింత అనే సెటిల్‌మెంట్లు తప్ప.. రాష్ట్రంలో పాలన లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారని, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కుమార్తె స్వయంగా చెప్పారని అన్నారు. బెదిరింపులు, టెండర్ల రిగ్గింగ్ ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడూ జరగలేదని చెప్పారు.

ఒక మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సిఎం అనుచరుడు రోహిన్ రెడ్డి బెదిరించారని, తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండని మంత్రి కుమార్తె చెబుతున్నారని, బెదిరించింది వాస్తవమేనని పోలీసులు చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ఈ అంశంపైన స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వంటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. సిఎంకు తన పరిపాలన పైన, మంత్రుల పైన ఎలాంటి పట్టు లేదని తేలిపోయిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్ అయ్యాయని, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాంత్రం నిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్‌లోనే మంత్రులు తిట్టుకుంటున్నారని చెప్పారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారని ఆరోపించారు. రెండు మూడు రోజులపాటు తిట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారని ఎద్దేవా చేశారు. ఏం ఉద్దరించారని ముఖ్యమంత్రికి శాలువా కప్పి పిసిసి ప్రెసిడెంట్ సన్మానం చేశారని అడిగారు. 

గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం.. టిజిపిఎస్‌సిపై సుప్రీంకోర్టుకు కవిత లేఖ

గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం.. టిజిపిఎస్‌సిపై సుప్రీంకోర్టుకు కవిత లేఖ

గ్రూప్-1 నియామకాల్లో టిజిపిఎస్‌సి 371డి ఆర్టికల్‌ను తుంగలో తొక్కింది

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసింది

సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకోని సుమోటోగా విచారణ చేపట్టాలి

సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టిజిపిఎస్‌సి రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సిజెఐకి కవిత లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులైన 371-డి ఆర్టికల్‌కు విరుద్దంగా నియామకాలు జరిపినట్లు ఎంతో మంది అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఆమె కోరారు. మా ఉద్యోగాలు మాకే అంటూ తెలంగాణ ఉద్యమం జరిగిందని…ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వు ఆర్టికల్ 371-డి ని సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 371-డి ప్రకారం ఇక్కడి ప్రాంత వాసులకే ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. కానీ, తెలంగాణ సాధించుకున్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్ -1 నియామకాల్లో ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించటమే కాకుండా టిజిపిఎస్‌సి చాలా తప్పులకు పాల్పడిందని సిజెఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ కారణంగా స్థానిక తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిజిపిఎస్‌సి తన చర్యతో అటు రాజ్యాంగంపై ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందని అన్నారు. ఈ అంశంపై అభ్యర్థుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చినప్పటికీ టిజిపిఎస్‌సి పట్టించుకోకపోవటం కచ్చితంగా రాజ్యాంగాన్ని అవమానించటమేనని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థుల్లో రాజ్యాంగంపై, నాయ్యవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకులైన మీరు జోక్యం చేసుకోవటం ద్వారానే తెలంగాణలో అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయి రాసిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 371డి ఉల్లంఘనకు పాల్పడిన టిజిపిఎస్‌సి వ్యవహారాన్ని సుమోటోగా విచారణ జరపాలని కోరారు. ఈ మొత్తం అంశాన్ని విచారించి అవకతవకలు జరిగినట్లు తేలితే గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టిజిపిఎస్‌సి చేపట్టిన గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని సిజెఐకి కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్ లో రౌడీ షీటర్ల ప్రచారం.. కెసిఆర్ సంచలన కామెంట్స్

జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు.

జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.

కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు: మంత్రి పొంగులేటి

నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయండి

రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా చేరిన సబ్ రిజిస్ట్రార్లకు

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-2 నియామల్లో ఎంపికై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14మంది అధికారులు గురువారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి కొత్తగా నియమితులైన సబ్ రిజిస్ట్రార్‌లకు ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో నిరుద్యోగ యువత కన్నకలలు కల్లలై పోయాయని, కొత్త ఉద్యోగాలను సృష్టించడం మాట అలా ఉంచితే, ఉద్యోగాల నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయని ఆయన విమర్శించారు.

20 నెలల పాలనలో సుమారు 70 వేలకు పైగా ఉద్యోగాలు

ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉద్యోగ నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్ధ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందువల్లే 20 నెలల పాలనలో ఇప్పటివరకు సుమారు 70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందని ఆయన వివరించారు.

అంతేగాక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచన మేరకు వివిధ శాఖల తరపున కార్యాచరణను విస్తృతం చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖలో జీపిఓల నియామకం, హౌసింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 350 మంది ఇంజనీర్లు, సర్వే విభాగంలో 3,465 మంది లైసెనస్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు.

కొత్తగా ఉద్యోగాల్లో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని, తద్వారా ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన సూచించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయితీ, నిబద్దత అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చేయాలి: కూనంనేని

మన తెలంగాణ / హైదరాబాద్ : పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ్ రాశారు. రాష్ట్రంలో మార్చి 2024 నుండి పదవీ విరమణ పొంది ఇప్పిటికీ 18 నెలలు గడిస్తున్నాయని, నాటి నుండి నేటి వరకు పదవీ విరమణ పొందిన వారు సుమారు 12 వేల మంది ఉన్నారని, వారికి ఇప్పటి వరకు ఎటువంటి పదవీ విరమణ బకాయిలు అందలేదని ఆయన సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, వారు కుటుంబ బాధ్యతలు తీర్చలేని పరిస్థితిలోకి నెట్టబడ్డారన్నారు.

బకాయిలు విడుదల చేయకపోవడంతో మానసిక ఆందోళనలు తట్టుకోలేక రాష్ట్రంలో కొన్ని మరణాలు కూడా సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మండల పంచాయితి అధికారి, పి. సీతారామ రాజు అశ్వరావుపేటలో పదవీ విరమణ పొంది మానసిక వేదనతో గత నెలలో మరణించారని, రాష్ట్ర వ్యాపితంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వృద్ధాప్యంలో వారికి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. కావున పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కూనంనేని సిఎంకు విజ్ఞప్తి చేశారు.

రాణించిన స్మృతి, ప్రతీకా.. కివీస్ లక్ష్యం ఎంతంటే..

నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో భారత ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీకా రావల్‌లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు స్మృతి, ప్రతీకాల జోడి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీ సాధించిన స్మృతి(109) బేట్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయింది. ఆ తర్వాత కొంత సమయానికే సెంచరీ సాధించిన ప్రతీకా (122) కెర్ర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజ్‌లో ఉన్న జెమీమా పరుగుల వరద పారించింది. 55 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కి కొంత సమయం అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ని 49 ఓవర్లకు కుదించారు. దీంతో 49 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. కివీస్ బౌలింగ్‌లో మైర్, కెర్ర్, బేట్స్ తలో వికెట్ తీశారు.

తుని బాలిక అత్యాచారయత్నం కేసు.. నిందితుడు ఆత్మహత్య

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో తీవ్ర కలకలం రేపిన తుని రేప్ కేసు ఘటనలో నిందితుడైన 63 ఏళ్ల తాటిక నారాయణ రావు చెరువులో శవమై కనిపించారు. గజ ఈతగాళ్లు గాలించి ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం బయటికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో నారాయణ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు తుని రూరల్ పోలీసులు చెప్పారు. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డా డంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు వెల్లడించారు. మైనారిటీ తీరని బాలికపై ఆమె సమ్మతితోగానీ, అసమ్మతితో గానీ లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందికి వస్తుందని భారతీయ చట్టాలు చెబుతున్నాయి.

ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటు రాజకీయంగానూ దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని హంసలవలస వద్ద ఉన్న ఒక తోటలో తాటిక నారాయణరావు అనే వ్యక్తి మైనర్ బాలికతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్న వీడి యో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ అమ్మాయిని తోటకి తీసుకొచ్చి పాడుచేస్తున్నావా? బట్టలు విప్పేసి ఏం చేస్తున్నావంటూ వీడియో తీస్తున్నవారిగా భావిస్తున్న వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆ అమ్మాయి బాత్రూమ్ అంటే తీసుకొచ్చానని నారాయణరావు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ బాలిక దుస్తులు ధరిస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. తాను మున్సిపల్ కౌన్సిలర్‌ను అంటూ వీడియో తీస్తున్న తనను ప్రశ్నిస్తున్న వ్యక్తిని నారాయణరావు గద్దిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.

మైనర్ బాలికపై అత్యాచారం కేసుపై సంబంధిత తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు మాట్లాడారు. ‘బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కూతురిపై లైంగిక దాడి జరిగినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. విచారించినప్పుడు, తునిలోని కొండవారిపేటకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తాటిక నారాయణరావు బాలికకు తాను తాతనని చెప్పి ఆ మైనర్‌ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. సిసిటివి కెమెరాలో కూడా రికార్డ్ అయింది. వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం‘ అని సీఐ వెల్లడించారు. తాత అని చెప్పి బాలికను నారాయణ రావు బయటికి తీసుకెళ్లినట్లు స్కూల్ రిజిస్టర్ లో నమోదై ఉందన్నారు. “గతంలో కూడా ఆయన స్కూలు వద్దకు వచ్చి బాలికకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చేవాడు. ఆ బాలిక కూడా ఆయన తన తాత అని చెప్పింది. మొన్న వచ్చినప్పుడు బాలికకు రక్తహీనత ఉందని, ఇంజెక్షన్ కోర్సు వేయిస్తున్నామని, ఇప్పటికి మూడు అయ్యాయని, 4వది వేయించాలని చెబితేనే పంపించాం” అని గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అమ్మాయి ఏడస్తుండటాన్ని చూసి, ఏం జరిగిందని అడిగితే, జరిగిన విషయం చెప్పినట్లు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు.

గతంలోనూ రెండుసార్లు బయటికి తీసుకెళ్లినట్లు తన కూతురు చెప్పిందని బాలిక తల్లి పేర్కొన్నారని ఆయన చెప్పారు. ‘అనంతరం, బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు‘ అని సిఐ చెన్నకేశవరావు తెలిపారు. నిందితుడిపై రేప్, కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కాలకృత్యాలకని చెప్పి పోలీసు వాహనం దిగి

ఈ కేసుకు సంబంధించి నిందితుడు నారాయణరావును బుధవారం మధ్యాహ్నం సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించా రు. ‘అనంతరం, ప్రొసీజర్ ప్రకారం నిందితుడికి వైద్య పరీక్షల కోసం తరలించాం. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ఆయన కుమారుడికి అరెస్ట్ సమాచారం అందించేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత, రాత్రి 10 గంటలకు వాళ్లబ్బా యికి అరెస్టు సమాచారం ఇచ్చాం. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు రాత్రి 10.20 గంటలకు పోలీసులు జీపులో బయలుదేరారు. దారిలో కోమటి చెరువు వద్దకు వచ్చేసరికి కాలకృత్యాలు తీర్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తే పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు పక్కనే ఉన్న పాక కిందకు వెళ్లారు.

కొద్దిసేపటికి నిందితుడు పైకి లేవడం కనిపించింది, ఆ తర్వాత చెరువులో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి చూడడంతో ఆయన కనిపించలేదు. చెరువులో దూకేశారా? లేదా పారిపోయారా? అని వెతకడం ప్రారంభించారు” అని తుని రూరల్ సిఐ చెన్నకేశవ రావు తెలిపారు. “రాత్రి చెరువులో గాలించాం. చీకటిపడడంతో ఉదయం గాలింపు చర్యలు చేపట్టాం. గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది‘ అని సిఐ వెల్లడించారు. నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రాజకీయ దుమారం

అయితే, నారాయణరావు బాలికతో తోటలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎపిలో రాజకీయ దుమారం రేగింది. నిందితుడు నారాయణ రావు మెడలో టిడిపి జెండా ఉన్న ఫోటోలను వైసిపి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టిడిపి నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారని మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి అన్నారు. హత్యలు, అత్యాచారాలు చేస్తూ కాలకేయుల్లా మారారంటూ విమర్శలు చేశారు. ‘ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది‘ అని అన్నారు. తుని ఘటన తెలుసుకుని షాక్‌కి గురయ్యానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు. ‘సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇటువంటి ఘటనలకు పాల్పడే వారెవరైనా ఉక్కుపాదంతో అణచి వేస్తాం‘ అని ఆయన తన పోస్టులో వెల్లడించారు. బాధితురాలికి ధైర్యం కల్పించేలా కౌన్సిలింగ్ ఇప్పించి, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది‘ అని తెలుగుదేశం పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయి‘ అని ఆ పార్టీ ఆ పోస్టులో రాసింది.

ఎవరీ నారాయణరావు?

తునిలోని కొండవారిపేటకు చెందిన నారాయణ రావు గతంలో 2009 నుంచి 2011 వరకు పట్టణ ఎస్‌సి, ఎస్‌టి సెల్ అధ్యక్షుడిగా చేశారని తెలిసిందని సిఐ వెల్లడించారు. అయితే, ఏ పార్టీ అనేది తెలియదన్నారు. కొండవారి పేటలో సెటిల్మెంట్లు చేస్తుంటారని తెలిసిందని ఆయన అన్నారు. గతంలో ఆయనపై ఏ పోలీస్ స్టేషన్‌లోనూ ఎలాంటి కేసులూ లేవని, ఆ పేటలోనే ఏదో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారని తెలిసిందన్నారు.

ఇదిలా ఉండగా, “మా నాన్న చేసింది తప్పే. పరువు పోయిందని ప్రాణం తీసుకున్నాడు. అని నారాయణ రావు కుమారుడు సురేష్ చెప్పారు. అయితే ఆయన ఎలా చనిపోయాడో పోలీసులు మాకు చెప్పాలి అని ఆయన కోరారు.

బీహార్ ఎన్నికలు.. ఇండియా కూటమి సిఎం అభ్యర్థి ఖరారు

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ పేరు ప్రకటించారు. గురువారం ఇండియా కూటమికి చెందిన అగ్రనేతల భేటీ తరువాత తేజస్వీ తమ కూటమి అభ్యర్థి అనే విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు కూటమిలో బీటలు తలెత్తకుండా ఉండేందుకు, సంఘటితంగా ప్రచారానికి దిగేందుకు , గందరగోళానికి తెరదించేందుకు సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిక్కిరిసిన ప్రెస్‌మీట్‌లో నేతలు ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సిఎం తేజస్వీ యాదవ్ అవుతారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా కూటమిలోని చిన్న భాగస్వామ్యపార్టీలు వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ (విఐపి) అధ్యక్షులు ముఖేష్ సహాని, రాష్ట్రంలోని బలహీనవర్గాలకు చెందిన నేతలను సహ ఉప ముఖ్యమంత్రులు చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ తెలిపారు.

బీహార్‌లోని సంక్లిష్ట సామాజిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సిఎం అభ్యర్థి, కొన్ని సీట్లపై సర్దుబాట్ల వ్యవహారం కూటమిలో చిలికిచిలికి గాలివాన అయ్యే ముప్పు దశలో పరిస్థితిని చక్కదిద్దేందుకు గెహ్లోట్ బుధవారమే పాట్నాకు వచ్చారు. తోటి సీనియర్ నేత ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్‌తో చాలా సేపు మాట్లాడారు. సిఎం పేరు, డిప్యూటి సిఎంల విషయంలో ఇప్పటి నిర్ణయానికి పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆమోదం ఉందని గెహ్లోట్ చెప్పారు. ముందుగా వారితో మాట్లాడటం జరిగింది. తరువాతి క్రమంలో ఇప్పుడు నిర్ణయాన్ని సంకీర్ణ భాగస్వామ్యపక్షాల నేతలందరం కలిసి ప్రకటిస్తున్నామని తెలిపారు.

ఈ వేదిక నుంచే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా మాట్లాడారు. తనపై మరోమారు నమ్మకం ఉంచినందుకు మహాఘట్‌బంధన్ నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని, నేరాలకు పాల్పడే వారు ఎవరైనా శిక్షించితీరుతామని ప్రకటించారు. ఈ విషయంలో చివరికి తన నీడను కూడా సహించేది లేదన్నారు. ఇప్పుడు తమ తరఫున సిఎం ఎవరనేది తెలియచేశాని ఆ తరువాత కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం సారధి పవన్ ఖేర్ తెలిపారు. ఇక ఎన్‌డిఎ వంతు వచ్చింది. వారి సిఎం అభ్యర్థి ఎవరనేది తెలియచేస్తారా? అని నిలదీశారు. కూటమి అంటే సమూహం, ఏక వ్యక్తి ప్రాతిపదికం (ఒన్ మెన్‌షో) కాదని కాంగ్రెస్ పార్టీ గురువారం స్పష్టం చేసింది.

బీహార్‌లో పూర్వపు మహాఘట్‌బంధన్, ఇప్పటి ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడి నడుమ తీవ్రస్థాయి విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. కూటమిలో ఒన్ మెన్ షో ఉండదు. పరస్పర విశ్వాసం, కలిసికట్టు ప్రాతినిధ్యంతోనే ముందుకు సాగుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తమ మధ్యవిభేదాల సృష్టికి యత్నించిన వారు ఇప్పుడు చతికిల పడిపోతారని పవన్ ఖేర్ స్పందించారు. అంతా తామే తమదే అనుకునే బిజెపి రకం , అందులోని నేతల తంతు తమది కాదని ఇప్పుడు తాము ప్రజల వద్దకు మరింత స్పష్టమైన రీతిలో ముందుకు సాగుతామని వెల్లడించారు.