elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbetpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

ఇదేంది బై.. బై నెంబర్‌లతో ప్రభుత్వ భూముల కబ్జా!

 కోర్టు కేసుల్లో ఉన్న వాటికి సైతం రిజిస్ట్రేషన్లు

అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వివిధశాఖల అధికారుల

అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు  

మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్థలాలపై కొందరు దొడ్డిదారిన హక్కులు పొందుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న భూముల సర్వేనెంబర్‌లకు బై నంబర్లను వేసి ఆ భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని, దీంతోపాటు మరికొన్ని ప్రాంత్లాలో సర్వే నెంబర్లు వేయకుండానే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు సహకరించడంలో రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ముందువరుసలో ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

నకిలీ పత్రాలను జోడించి

2020 ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి తహసీల్దార్‌లు వ్యవసాయ భూములను, సబ్ రిజిస్ట్రార్‌లు నాన్ అగ్రికల్చర్ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే, ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్ దగ్గర సర్వే నెంబర్‌లకు బై నెంబర్‌లు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, దీంతోపాటు కోర్టు కేసుల్లో ఉన్న భూములను ప్లాట్లుగా చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరికొన్ని కోర్టు కేసులకు సంబంధించి నకిలీ పత్రాలను జోడించి ఆయా భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ఏకంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది.

భారీగా డబ్బు ఆశచూపి

అయితే, కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు, తహసీల్దార్‌లకు భారీగా డబ్బు ఆశచూపి ఆయా భూములను అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, కొన్ని ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా వాటికి ఇంటి నెంబర్‌లను కేటాయించి రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబాదీ, గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌ల కోసం మండలాల ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎన్‌ఓసీలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దానిని అధికారులు తమకు అనుకూలంగా మలుచుకొని డబ్బులు ముట్టచెబితేనే ఎన్‌ఓసి ఇస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం విశేషం. సర్వే నంబర్ లేకపోయినా చాలా ఏళ్లుగా నివాసముంటున్న వారి భూమి మోఖాపై విచారణ చేసి ఎన్‌ఓసిలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ దిశగా అధికారులు చర్యలకు పూనుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని 31,093 సర్వే నంబర్లలో గ్రామకంఠం, ఆబాదీ భూములు

రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలతో ఇళ్లకు పర్మిషన్లు, ఇంటి నంబర్లు రాక యజమానులు తీవ్ర అవస్థ పడుతున్నారు. తెలంగాణలో 31,093 సర్వే నంబర్లలో గ్రామ కంఠం, ఆబాదీ భూములు ఉన్నాయి. గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన భూములను ఈ పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. కొన్నిచోట్ల వాటికి ఆనుకొని ఉండే ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పంచాయతీ, మున్సిపాలిటీ సంస్థల దస్త్రాల్లో నమోదై కావడంతో స్థానికంగా నివాసం ఉండే వారికి రిజిస్ట్రేషన్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.

అనుమతులు లేని అంతస్థులకు…..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఓ మంత్రి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం. ఇక వనస్థలిపురం ఇన్‌చార్జీగా ఉన్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఈ మధ్య పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, కుత్భుల్లాపూర్‌లో సబ్ రిజిస్ట్రార్ 3గా పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్‌పై, గోల్కొండ, బీబీనగర్, భువనగిరి, హయత్‌నగర్, యాదగిరిగుట్ట, పెద్ద అంబర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. అపార్ట్‌మెంట్‌లలో అనుమతి లేని అంతస్థులకు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆదేశాలు ఉన్నా వాటిని సబ్ రిజిస్ట్రార్‌లు పట్టించుకోవడం లేదని, బై నెంబర్‌లతో అధికంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

తనిఖీలు చేపట్టని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక జిల్లా అధికారికి ప్రస్తుతం అదనపు బాధ్యతలను సైతం అప్పగించడంతో ఆయన తన పరిధిలోని సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు సిఎంఓలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఆయన చెప్పిందే వేదంగా ఆ శాఖలో జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ అధికారి ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర డిప్యూటేషన్ కోసం డబ్బులు తీసుకొని ఇప్పటివరకు ఆ పని చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ దగ్గరే డబ్బులు తీసుకున్న ఆ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి ఏ విధంగా వసూళ్లు చేస్తున్నారన్న విషయమై విచారణ జరపాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ఐజికి సమయం దొరక్కపోవడంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

లక్కు కిక్కు ఎవరికో?.. నేడు మద్యం షాపులకు డ్రా

ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

కలెక్టర్ల చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం షాపులకు నేడు డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశాలివ్వడంతో అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా (లాటరీ) పద్దతిలో మద్యం షాపుల లైసెన్స్‌ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా నేడు ఉదయం 11 గంటలకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఈ డ్రా ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 34 కేంద్రాల్లో జిల్లాల వారీగా కలెక్టర్‌ల చేతులమీదుగా ఈ డ్రాను నిర్వహించనున్నారు. మొత్తం 95,137 దరఖాస్తులకు గాను రూ.2,854.11 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది.

రంగారెడ్డి డిసి పరిధిలో అధికంగా దరఖాస్తులు…

అధికంగా దరఖాస్తులు రంగారెడ్డి డిసి పరిధిలో వచ్చాయి. దరఖాస్తుల్లో అధికంగా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వచ్చాయి. శంషాబాద్ పరిధిలోని 100 షాపులకు గాను 8,536 దరఖాస్తులు వచ్చాయి. ఇక, రెండోస్థానంలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు నిలిచింది. సరూర్‌నగర్ పరిధిలో 134 షాపులు ఉండగా 7,845 దరఖాస్తులు, మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 114 షాపులకు గాను 6,063 దరఖాస్తులతో మూడోస్థానంలో నిలిచింది. వాటితో పాటు మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 88 షాపులకు గాను 5,168 దరఖాస్తులు, నల్లగొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు, సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 101 షాపులకు గాను 4,432 దరఖాస్తులు, ఖమ్మం పరిధిలోని 122 షాపులకు గాను 4,430 దరఖాస్తులు వచ్చాయి. ఇక, కొత్తగూడెంలోని 88 షాపులకు 3,922 దరఖాస్తులు రావడం విశేషం.

జిల్లాల వారీగా డ్రాలు జరిగే….

అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు రాగా (రత్నా గార్డెన్ మావాలలో) డ్రా నిర్వహించనున్నారు. కొమురం భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680 దరఖాస్తులు (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మంచిర్యాలలో 73 షాపులకు 1,712 (పివిఆర్ గార్డెన్‌లో), నిర్మల్‌లో 47 షాపులకు 3,002 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), జగిత్యాలలో 71 షాపులకు 1,966 రాగా (విరూపాక్షి గార్డెన్)లో, కరీంనగర్‌లో 94 షాపులకు 2,730 (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), పెద్దపల్లిలో 77 షాపులకు 1,507 దరఖాస్తులు రాగా (స్వరూప గార్డెన్‌లో), రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1,381 రాగా, (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), ఖమ్మంలో 122 షాపులకు 4,430 దరఖాస్తులు రాగా (సిక్వేల్ క్లబ్), కొత్తగూడెంలో 88 షాపులకు 3,922 రాగా (కొత్తగూడెం క్లబ్‌లో), జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774 రాగా (ఐడిఓసి కాంప్లెక్స్‌లో), మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2,487 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1,518 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), వనపర్తిలో 37 షాపులకు 757 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మెదక్‌లో 49 షాపులకు 1,920 దరఖాస్తులు రాగా (శ్రీ వెంకటేశ్వర కాంప్లెక్స్‌లో), సంగారెడ్డి 101 షాపులకు 4,432 దరఖాస్తులు రాగా (జెఎస్‌ఆర్ గార్డెన్, పంక్షన్‌హాల్‌లో), సిద్దిపేట్ లో 93 షాపులకు 2,782 దరఖాస్తులు రాగా (సిసి గార్డెన్, కరీంనగర్ రోడ్డు), నల్లగొండలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు రాగా (లక్ష్మీగార్డెన్ హైదరాబాద్ రోడ్డులో), సూర్యాపేట్‌లో 99 షాపులకు గాను 2,771 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2,776 దరఖాస్తులు రాగా (రాధాకృష్ణ పంక్షన్‌హాల్‌లో), కామారెడ్డిలో 49 షాపులకు 1,502 దరఖాస్తులు రాగా (రేణుకాదేవి, కళ్యాణమండపంలో), నిజామాబాద్‌లో 102 షాపులకు 2,786 దరఖాస్తులు రాగా (భారతి గార్డెన్‌లో), మల్కాజిగిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), ( మేడ్చల్‌లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), సరూర్‌నగర్‌లో134 షాపులకు 7,845 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), శంషాబాద్‌లో100 షాపులకు 8,536 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), వికారాబాద్‌లో 59 షాపులకు 1,808 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్‌లో), జనగాంలో 47 షాపులకు 1,697 దరఖాస్తులు రాగా (నందన్ గార్డెన్‌లో), భూపాలపల్లిలో 60 షాపులకు 1,863 దరఖాస్తులు రాగా (ఇల్లెంద్ క్లబ్‌హౌజ్‌లో), మహబూబాబాద్‌లో 59 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా (ఏబి పంక్షన్‌హాల్‌లో), వరంగల్ రూరల్‌లో 63షాపులకు 1,958 దరఖాస్తులు రాగా (నానీ గార్డెన్‌లో), వరంగల్ అర్బన్‌లో 65 షాపులకు 3,175 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్, గోకుల్‌నగర్, హన్మకొండలో) ఈ డ్రాను నిర్వహిస్తారని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

రూ.4.5కోట్ల డ్రగ్స్ స్వాధీనం

మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు ఆదివారం రూ.4.5 కోట్ల విలువ చేసే 4.5 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో హైడ్రోపోనిక్ కలుపు గంజాయిని అక్రమంగా బ్యాంకాక్ నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి తరలిస్తున్న ఓ ప్రయాణికురాలి కదలికలపై అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఆమె తీసుకువచ్చిన సూటుకేసులో రహ స్య పోరలో 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ఎన్‌టిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

కర్నూలు ఘటనలో 19 మృతదేహలు గుర్తింపు

ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

సంచనల విషయాలు బయటపెట్టిన ఎర్రిస్వామి

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు నిర్ధారణ

బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు

బస్సు ప్రమాదానికి, బైక్ యాక్సిడెంట్‌కు మధ్య అదే దారిలో వెళ్లిన మరో రెండు బస్సులు

19 మృతదేహాలు గుర్తింపు..15 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత

19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : కర్నూలు బస్ ప్రమాద ఘటనకు కారణమైన మృతుడు శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి చేసిన ఫిర్యాదుపై ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. శివశంకర్ నిర్లక్షంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి తాను పోలీసులకకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బండి నడిపే ముందు తాను, శివ శంకర్ మద్యం సేవించినట్టు ఎర్రిస్వామి ఫిర్యాదులో వెల్లడించారు. ఎర్రిస్వామి హైదరాబాద్‌లో చెత్త సేకరించే, ప్రాసెస్ చేసే పనిచేస్తారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. శనివారం సాయంత్రమే ఎర్రిస్వామిని ప్రమాద స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి రికార్డు చేసుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దీంతో పాటు రవాణా రంగానికి సంబధించిన నిపుణులను కూడా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలన చేశారు. బస్సు ప్రమాదానికి గురైన రోజు రాత్రి జరిగిన ఘటనపై ఎర్రిస్వామిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరూ బైక్‌పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరారు. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయల్దేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపు కున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని, రోడ్డు మధ్యలో ఉన్న బైక్‌ను పక్కకి తీయాలని అనుకున్నాడు. శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు మంటల్లో చిక్కుకోవడం చూసిన ఎర్రిస్వామి భయపడి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లిపోయాడు.

19 మృతదేహాలు గుర్తింపు.. 15 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత

ఈ ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ప్రయాణికుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక మృతదేహం మినహా మిగతా డెడ్‌బాడీస్‌ను డీఎన్‌ఏ టెస్టుల అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు తీసుకున్న చర్యలు, తుది నివేదిక వివరాలను కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్‌పి వెల్లడించారు. వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదంలో చనిపోయిన వారి మృత దేహాలు తీవ్రంగా కాలిపోవడంతో, వాటిని గుర్తించడం కష్టమైంది. ఈ క్రమంలో ఎపి ప్రభుత్వం మృతదేహాలకు, వారి కటుుంబసభ్యులకు డిఎన్‌ఎ టెస్టులు నిర్వహించింది. ఆ నివేదిక ఆధారంగా గుర్తించి వాటిలో 15 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. మరో నాలుగు మృతదేహాలను బంధువులు రాగానే అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ జరిగింది. త్రిమూర్తి హైదరాబాద్‌కు వచ్చి రిజర్వేషన్ లేకుండా ఆరంగర్ సర్కిల్ వద్ద బస్సు ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అలా బస్సు ఎక్కిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు మొబైల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ అతను అందుబాటులోకి రాలేదు. దానితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కర్నూలుకు బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత ఆ అంతుచిక్కని 19వ వ్యక్తికి డిఎన్‌ఏ టెస్ట్ జరిపి అమృతదేహం త్రిమూర్తిదే అని వైద్యులు ధ్రువీకరించారు. దీనితో బస్సు దుర్ఘటనలో మరణించిన మొత్తం 19 మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.

బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు

ప్రమాదానికి గల కారణాలపై నెలకొన్న అనుమానాలపై ఎస్‌పి విక్రాంత్ పాటిల్ స్పందించారు. ఈ ప్రమాదంపై జరిగిన విచారణలో భాగంగా వచ్చిన నివేదిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని నివేదికలో తేలినట్లు స్పష్టం

బైక్ డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నారని పోలీసులు నిర్ధరించారు. ’సిసి వీడియోలో ఆయన వైఖరి మద్యం సేవించినట్టు ఉంది. శవ పరీక్ష లో అదే నిజమని తేలింది’ అని పోలీసులు తెలిపారు. ”ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ), కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. మృతుడి విస్సెరా నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది” అని కర్నూలు ఎస్‌పి ప్రకటించారు.

ఎమ్మెల్యేలకూ డిసిసి పదవులు

 కొన్నిచోట్ల ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం వర్తించదు

మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం 

హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో హైకమాండ్‌కు ప్రతిదీ తెలుసు

మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదు

కెటిఆర్, హరీశ్‌రావులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది

కెసిఆర్‌ను గౌరవిస్తాం కానీ..రాష్ట్రాన్ని దివాళా తీయించారు

పదేళ్లలో కవితకు అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా?

మెట్రో రెండోదశకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే అడ్డంకి

ఢిల్లీలో మీడియాతో పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇష్టాగోష్టి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఎమ్మెల్యేల్లో కొందరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రుల పంచాయితీ ముగిసిందని ఆయన తెలిపారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో ఏఐసిసి అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సాధ్యమైనంత త్వరలో పూర్తి అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే అధ్యక్ష పదవిని కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలూ ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంలో తప్పేమి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి జోడు పదవులు ఉండరాదన్న నిబంధన ఉందని, ఒకరికి రెండు పదవులు దక్కితే అందులో ఏదైనా ఒకటి రాజీనామా చేయాలన్న నియమం ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నికైతే జోడు పదవుల్లా చూడాల్సిన అవసరం లేదని, ఆ నియమం దీనికి వర్తించదని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్యే ఉన్నట్లయితే పార్టీకి మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురికి పదవులు ఇవ్వడం పై మీడియా ప్రస్తావించగా, చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడే వారికి ఈ నిబంధన వర్తించదని, ఉన్నఫలంగా తెరపైకి వచ్చి పదవి కోరితే ఇవ్వడం కుదరదని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అభివృద్ధి కోసం పని చేయాలని ఆయన తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదాల గురించి ప్రశ్నించగా, అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. మంత్రి కొండా సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సమాచార లోపం కారణంగా తలెత్తిన వివాదం సమిసిపోయిందన్నారు. అక్కడక్కడా తలెత్తిన వివాదాలూ పరిష్కారమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని మహేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కులాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్టీ అన్నింటికీ సుప్రీం అని గుర్తు చేసారు. అక్కడ హైదరాబాద్‌లో ఏమి జరుగుతుందో ఢిల్లీలో అధిష్టానానికి తెలియదనుకోవడం అమాయకత్వం అవుతుందన్నారు. తామంతా అధిష్టానం రాడార్ పరిధిలోనే ఉన్నామన్న విషయాన్ని అందరూ గుర్తించుకుంటే బాగుంటుందని అన్నారు. ఎంతటి వారైనా పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. అధికారులు, మంత్రులెవరైనా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన తెలిపారు.

మెట్రో ఫేస్ టూకు కిషన్ రెడ్డి అడ్డంకి

మెట్రో ఫేస్ టూకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారని ఆయన విమర్శించారు. మెట్రో ఫేస్ టూని త్వరితగతిన పూర్తి చేయించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన చేసిందేమిటని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

చిల్లరగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిల్లరగా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందన్నారు.

కెసిఆర్‌ను గౌరవిస్తాం..

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఉద్యమ నేతగా గౌరవిస్తామని ఆయన తెలిపారు. కెసిఆర్ పాలన గాడి తప్పిందని, రాష్ట్రం దివాళా తీసిందని ఆయన విమర్శించారు. బనకచర్ల విషయంలో కెసిఆర్ ఉదాసీనంగా వ్యవహారించారని ఆయన విమర్శించారు. గత పదేళ్ళ పాలనలో కవిత భాగస్వామిగా ఉన్నప్పుడు అమరవీరులు ఎందుకు గుర్తు రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

అనిశ్చితిలోనూ పురోగతి

చెక్కుచెదరని ఇండియాఆసియాన్ భాగస్వామ్యం

2026 మారిటైమ్ సహకార సంవత్సరం కాబోతుంది

ఆసియాన్ సదస్సునుద్దేశించి వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రసంగం

ఆసియాన్ సభ్య దేశంగా ఈస్ట్ తైమూర్

న్యూఢిల్లీ: భారత్ ఆసియాన్ సమగ్ర, ప టిష్ట వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరత, ప్రగతికి బలీయ పు నాది అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సముద్ర మార్గాల సహకారం ది శలో వచ్చే ఏడాది 2026 ఆసియాన్ ఇండియా సంవత్సరం అవుతుందని చెప్పారు. మలేసియాలోని కౌలాలంపూర్ లో ఆదివారం ఆరంభమైన రెండు రోజుల ఇండియా ఆసియాన్ సదస్సును ఉద్ధేశిం చి ప్రధాని మోడీ వర్చువల్‌గా మాట్లాడా రు. భారతదేశపు విన్నూత తూర్పు ప్రాంత సహకార దృక్పథం దిశలో ఆసియాన్ వేది క అత్యంత కీలకమైనదని తెలిపారు. ఆసియాన్ కేంద్రీకృత విధానాలను, దృక్పధా న్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూ వస్తోందిని చెప్పారు. ప్రస్తుత అనిశ్చితతల దశలోనూ ఇండియా ఆసియాన్ భాగస్వామ్యం చెక్కుచెదరకుండా నిలిచింది. ఎంతగానో పురోగతి సాథించిందని తెలిపారు. ఇటువంటి విశిష్ట సమ్మేళన ప్రక్రియతో ప్రపంచ స్థాయిలో ప్రగతి సుస్థిరతకు మరింత సజావైన బాటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర సహకారం అనేది మిత్రబంధాలను బలోపేతం చేస్తుంది. ఇందుకు భారత్ ఆసియాన్ కలిసికట్టు పయనం ఉపయుక్తం అవుతుంది.

ప్రస్తుత సవాళ్ల దశలో సముద్ర జలమార్గాల భద్రత, సముద్ర వనరుల ఆర్థిక రంగం బ్లూ ఎకానమి అత్యంత కీలకం అయింది. అందుబాటులో ఉన్న విస్తారిత సముద్ర తీర ప్రాంతాలు, సముద్ర మార్గాల ఉనికి నేపథ్యంలో ఇండియా ఆసియాన్ రెండంచెల సహకారం దోహదకారి అయిందని ప్రధాని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకునే 2026 మారిటైం సహకార సంవత్సరం అవుతుందని ప్రధాని ప్రకటించారు. విద్యా, పర్యాటకం, శాస్త్ర సాంకేతికత , ఆరోగ్యం, హరిత ఇంధనం, సైబర్ సెక్యూరిటీలలో పరస్పర సహకారం విస్తృతం అవుతోందని తెలిపారు. ఇక మానసిక మానవ సంబంధాల దిశలో ప్రధానమైన సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ , ప్రజల మధ్య సత్సంబంధాల దిశలో కూడా సహకారం ఇనుమడిస్తుందని ప్రధాని తెలిపారు.

ఈ ప్రాంతంలో ఆసియాన్ అత్యంత ప్రధాన శక్తివంతమైన బలీయ వేదిక అవుతుంది. భారత్‌తో పాటు, అమెరికా, చైనా , జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ఈ సంప్రదింపుల ప్రక్రియలో ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాల వేదిక అయిన ఆసియాన్ తొలుత కేవలం ఐదు దేశాలతో 1967 ఆగస్టులో ఏర్పడింది. ఇప్పుడు 11 దేశాలు సభ్యదేశాలు ఉన్నాయి. భారత్ ఈ ఆసియాన్ వేదిక సభ్య దేశం కాకపోయినా ప్రతి ఏటా జరిగే సదస్సులో సంప్రదింపుల క్రమంలో పాల్గొనడం, నిర్మాణాత్మక పాత్రతో వెలుపలి కీలక శక్తిగా మారింది.

ఆసియాన్‌లోకి ఈస్ట్ తైమూర్..

కౌలాలంపూర్ ఆసియాన్ దశలో ఈ గ్రూప్‌లో ఈస్ట్ తైమూర్ సభ్యదేశంగా చేరింది. ఈ చేరికను వేదిక ద్వారా స్వాగతించారు. ఇన్నేళ్ల తమ కల ఇప్పటకీ నెరవేరిందని ఈ నేపథ్యంలో తైమూర్ ప్రధాని క్సనానా గుసామా ఆనందం వ్యక్తం చేశారు. 1990 తరువాత ఆసియాన్ విస్తరణ ఇదే తొలిసారి. ఈ చేరికతోనే ఇక్కడ ఆసియాన్ సదస్సు ఆరంభం అయింది. ఈ సదస్సుకు భారత్, చైనా, రష్యా, అమెరికా , దక్షిణ కొరియా దేశాల ప్రతినిధి బృందాలు ఉన్నత స్థాయి నేతల సారధ్యంలో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఆరంభంలోనే థాయ్‌లాండ్, కాంబోడియాలు సరిహద్దు ఘర్షణల తాత్కాలిక విరమణను పొడిగించే ఒప్పందంపై సంతకాలకు దిగాయి. సమావేశానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ హాజరయ్యారు. ఘర్షణల నిలిపివేత అత్యంత కీలకమైన విషయం అన్నారు. 

నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

నవంబర్ 1లోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి..

లేకపోతే 3 నిరవధిక బంద్ చేపడతాం

హైదరాబాద్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్

3 లక్షల మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహిస్తాం

ఫతి చైర్మన్ రమేష్ వెల్లడి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు నవంబర్ 3 నుంచి బంద్ చేపట్టాలని ప్రైవేట్ యాజమాన్యాలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్‌తో పాటు 3 లక్షల మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రతినిధులతో కలిసి చైర్మన్ రమేష్ సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్మన్ రమేష్ మీడియాతో మాట్లాడూతూ, నవంబర్ 1వ తేదీలోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని వెల్లడించారు.

ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ చేపడతామని, ఈ లాంగ్‌మార్చ్‌లో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. 3 లక్షల మంది ఉద్యోగులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వాన్ని పెండింగ్ బకాయిలు విడుదల చేయమంటే కాలేజీల్లో తనిఖీలు గుర్తుకు వస్తున్నాయని మండిపడ్డారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని అన్నారు. ఒక్క పోలీసును కూడా కాలేజీల్లోకి రానివ్వం అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దసరాకి రూ.600 కోట్లు ఇస్తామని చెప్పి స్వల్పంగా నిధులు విడుదల చేశారని, దీపావళి నాటికి రూ.1200 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికీ వాటి గురించి ఎలాంటి కదలిక లేదని అన్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం తాము ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మంత్రులు తమకు సహకరించడం లేదని అన్నారు.ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుంటే తాము కాలేజీలు నడపలేమని తేల్చిచెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని.. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎడ్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్లను అభ్యసిస్తున్న 15 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఎక్కువ మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆధారపడి ఉన్నారని అన్నారు. వారంతా సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు కృష్ణారావు, సునీల్‌కుమార్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

40ఏళ్లే బతికినా..ప్రజలపై చెరగని ముద్ర

నిజాంకు సవాల్‌గా నిలిచిన కొమురం భీమ్

 ‘మన్‌కీ బాత్’లో కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆదివాసీల పోరాటయోధుడైన కొమురం భీమ్ సేవలు అమోఘమైనవని ప్రధాని నరేంద్ర మోడి కొనియాడారు. ప్రతి నెలా నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 12 7 వ కార్యక్రమంలో ప్రధాని మోడి ప్రసంగించారు. ప్రధాని తన ప్రసంగంలో కొమురం భీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌ను దోచుకోవడానికి బ్రిటీష్ పాలకులు అన్ని మార్గాలూ ఉపయోగించారని ఆయన తెలిపారు. ఆ సమయంలో బ్రిటీష్ పాలకులు నిజాం పాలనను బలపరిచారని అన్నారు. పేదలు, గిరిజనులపై నాడు జరిగిన వేధింపులు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల భూములను నిజాం పాలకులు లాక్కున్నారని ఆయన విమర్శించారు. అటువంటి కష్టకాల సమయంలో ఇరవై ఏళ్ళ యువకుడు ఆ అన్యాయాలను ఎదురొడ్డి నిలిచారని ప్రధాని వివరించారు. ఆ కుర్రాడి గురించి తెలియని వారంతా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ రోజుల్లో నిజాం గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడేందుకూ అవకాశం లేదని, అలా ఎవరైనా మాట్లాడితే నేరం అయ్యేదని ఆయన తెలిపారు. ఆ కుర్రాడే నిజాం అధికారి సిద్దిఖీని బహిరంగంగా సవాల్ చేశారని, చివరకు మట్టుబెట్టారని ఆయన తెలిపారు. ఆ కుర్రాడి వీరత్వం గురించి తెలుసుకున్న బ్రిటిషర్లు మట్టుపెట్టాలని ప్రయత్నించగా, తప్పించుకుని అసొం చేరుకున్నారని. ఆ కుర్రాడే కుమురం భీమ్ అని ప్రధాని మోదీ చెప్పారు.

సైనికులు హత్య చేశారు

1940లో నిజాం సైనికులు కొమురం భీమ్‌ను హత్య చేశారని ఆయన తెలిపారు. నిజాంకు చాలా కాలం సవాల్‌గా నిలిచిన కొమురం భీమ్ నలభై ఏళ్ళు బ్రతికారని ఆయన చెప్పారు. ఆదివాసీల పోరాట యోధుడైన కొమురం భీమ్ ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఆయన తెలిపారు. కొమురం భీమ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన చెప్పారు. సంస్కృత భాష, వందేమాతరం, కాఫీ ఉత్పత్తులు, సర్దార్ పటేల్ జయంతి గురించి కూడా ప్రధాని మోదీ సుదీర్ఘంగా వివరించారు. ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోడి మనక్ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వీక్షించారు. ఇదేవిధంగా జిల్లాల్లోనూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ వీక్షించారు.

ఎపిలో మరో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి కన్నకూ తురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ తండ్రి మద్యం మత్తులో కొన్ని రోజుల క్రితం తన రెండో కుమార్తె (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. అయితే చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో నిజం బయటపడింది. కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి బాలికపై అఘాయిత్యం జరిగిందని నిర్ధరించారు. దీంతో కంగుతిన్న బాలిక తల్లి.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

తండ్రికి కఠిన శిక్ష విధించాలి

గ్రామంలోని ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ తండ్రికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మళ్లీ ‘మన సమాజం ఎటు పోతుందో?‘ అనే ప్రశ్నను తలెత్తిస్తోంది. పాప కుటుంబానికి మద్దతుగా మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ముందుకు వచ్చాయి. ఆ పాపకు వైద్య సహాయం, మానసిక కౌన్సెలింగ్ అందించేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే స్పందించాలని సూచిస్తున్నారు. పాఠశాలలు, గ్రామ స్థాయి స్థాయిలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమాలు అత్యవసరమని కోరుతున్నారు. ఈ ఘటన మరోసారి మన సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచింది. రక్షణనివ్వాల్సిన తండ్రే దాడి చేసేవాడిగా మారితే, పిల్లల భవిష్యత్తు ఎలా సురక్షితం అవుతుంది? చట్టం తన పని చేస్తుందేమో కానీ, ఇలాంటి మృగాలకు శిక్షతో పాటు సామాజిక అవమానమే పెద్ద పాఠమని ప్రజలు అంటున్నారు.

తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానం.. సజ్జనార్ ఫైర్

హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు

పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ఇది పొరపాటు కాదు.. జీవితాలను నాశనం చేసే నేరమన్న సజ్జనార్

మన తెలంగాణ/హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని సీనియర్ ఐపిఎస్ అధికారి విసి సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై వారి చర్యలు ఉగ్రవాద చర్యల కన్నా ఏమాత్రం తక్కువ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 20 మంది ప్రాణాలను బలిగొన్న కర్నూలు బస్సు ప్రమాదం నిజానికి ప్రమాదం కాదని, అది ఒక తాగుబోతు బైకర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన దారుణ మారణకాండ అని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కర్నూలు ప్రమాద ఘటన వివరాలను సజ్జనార్ పంచుకున్నారు. బి. శివ శంకర్ అనే బైకర్ మద్యం మత్తులో తన బైక్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు.

తెల్లవారుజామున 2:24 గంటలకు ఓ పెట్రోల్ బంకులో బైక్‌లో ఇంధనం నింపుకున్న దృశ్యాలు సిసిటివి ఫుటేజీలో నమోదయ్యాయని, సరిగ్గా 2:39 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు. అతని బాధ్యతారాహిత్యం క్షణాల్లో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మద్యం తాగి వాహనాలు నడిపేవారు ప్రతీ విషయంలోనూ టెర్రరిస్టులే. నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను. వారు ప్రాణాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తారు. ఇలాంటి చర్యలను ఎప్పటికీ సహించబోం,‘ అని సజ్జనార్ స్పష్టం చేశారు.

ఇకపై హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. మద్యం మత్తులో పట్టుబడిన ప్రతి ఒక్కరూ చట్టం యొక్క పూర్తి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అమాయకుల జీవితాలను ప్రమాదంలో పడేసే వారి పట్ల ఎలాంటి కనికరం, మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పారు. డ్రంక్ డ్రైవింగ్‌ను ఒక పొరపాటుగా చూడటం సమాజం మానుకోవాలని, అది జీవితాలను నాశనం చేసే నేరమని, దానికి తగ్గ శిక్ష కచ్చితంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.