Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Casibom

jojobet

parobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

dinamobet giriş

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

galabet

cratosroyalbet

మణుగూరులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా… తప్పిన పెను ప్రమాదం

మణుగూరు: గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గ్యాస్ సిలిండర్ల పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అశోక్ నగర్ లో జరిగింది.  గ్యాస్ సిలిండర్ల లారీ విజయవాడ నుంచి ములుగుకు వెళ్తుండగా అశోక్ నగర్ శివార్లలో బోల్తాపడింది. వెంటనే స్థానికులు పోలీసులు, గ్యాస్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. మరో లారీలో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

యూనిక్ స్పై డ్రామా

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ మధురంగా పాడారు. దినేష్ కాకర్ల లిరిక్స్ కాన్సెప్ట్ ని చాలా ఫన్‌ఫుల్ గా చూపించాయి. 

ఆర్‌ఎక్స్ 100, బేబి మూవీస్‌లా ‘రాజు వెడ్స్ రాంబాయి’

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. అఖిల్ రాజు, తేజస్విని తమ నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే మరొకరి ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈ రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నేను కథ చెప్పగానే వేణు ఊడుగుల మనం సినిమా చేస్తున్నాంరా తమ్ముడు అన్నారు. ఈటీవీ విన్ వారిని సంప్రదిస్తే వాళ్లకూ కథ నచ్చింది. అలా రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది”అని తెలిపారు. ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊరిలోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని ఆధారంగా చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ఈ కథను ఎంటర్‌టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు. ఈటీవీ విన్ వారి వల్లే నేను ప్రొడ్యూసర్‌ను అయ్యాను. 7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి, హీరో అఖిల్, హీరోయిన్ తేజస్వినీ, ఈటీవీ విన్ నితిన్, సాయికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నటుడు చైతు జొన్నలగడ్డ పాల్గొన్నారు. 

‘మాస్ జాతర’తో రవితేజ జాతర చూడబోతున్నాం: సూర్య

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ’మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ “రవితేజలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. రవితేజ ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ జాతర చూడబోతున్నాం. మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “శివుడు పాత్ర చేసిన నవీన్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. మాస్ జాతర చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు”అని తెలిపారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్‌కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. “నా కథ నచ్చి రవితేజ నాకు అవకాశమిచ్చారు. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, భీమ్స్ సిసిరోలియో, శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, విధు అయ్యన్న, శ్రీనాగేంద్ర తంగాల తదితరులు పాల్గొన్నారు. 

కిడ్నాప్… కారులో బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్

ఛండీగఢ్: 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 26 సాయంత్రం సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లిన బాలిక రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల వెతికారు. ఎక్కడి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 27 తెల్లవారుజామున నాలుగు ప్రాంతంలో బాలికను ఇంటి వద్ద దుండగులు వదలి వెళ్లారు. బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం కారులో బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని, అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని పోలీస్ అధికారి విష్ణు మిట్టర్ తెలిపాడు. 

ఫైనల్లో సౌతాఫ్రికా

కదం తొక్కిన వాల్వర్ట్..

చెలరేగిన కాప్

గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి తుది పోరుకు దూసుకెళ్లింది. మహిళలు, పురుషుల విభాగంలో సౌతాఫ్రికా టీమ్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. మారిజానె కాప్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చింది.

అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన కాప్ 7 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. క్లార్క్ రెండు వికెట్లను తీసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ నాట్ సివర్ (64), అలైస్ కాప్సె (50), వ్యాట్ (34), స్మిత్ (27) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమను కెప్టెన్ లౌరా వాల్వర్ట్ అద్భుత సెంచరీతో ఆదుకుంది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లౌరా 143 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 169 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ బ్రిట్స్ (45), కాప్ (42), ట్రియన్ (33) పరుగులు సాధించారు.

సైడ్ మిర్రర్ తాకిందని… యువకుడిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన దంపతులు

బెంగళూరు: సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని, కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి చంపేశారు.ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెపి నగరప్రాంతంలోని శ్రీరామ లేఅవుట్లో ఎనిమిది రోజుల క్రితం దర్శన్ అనే యువకుడు తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మనోజ్ కుమార్- ఆరతి శర్మ అనే దంపతులు కారులో ప్రయాణం చేస్తున్నారు. దంపతుల కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో దంపతులు ఇద్దరు యువకులతో గొడవకు దిగాడు. అనంతరం యువకులు బైక్‌పై వెళ్తుండగా రెండు కిలో మీటర్లు వెంబడించారు. కారుతో బైక్‌ను అతివేగంతో ఢీకొట్టారు. వెంటనే అక్కడి కారులో దంపతులు పారిపోయారు. దర్శన్, వరుణ్‌లు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందగా వరుణ్ ఐసియులో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో కారు విడిభాగాలు పడిపోవడంతో దంపతులు ముఖానికి మాస్క్ పెట్టుకొని వాటికి తీసుకెళ్లారు. అక్కడి సిసి కెమెరాలో రికార్డయ్యింది. జెపినగర్ పోలీసులు దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

హిందూపురంలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో 15 మంది క‌ల్లుతాగి అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. క‌ల్తీ క‌ల్లు మూలంగానే త‌మవారు అనారోగ్య బారిన‌ప‌డ్డార‌ని కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. వైద్యులు వారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్లీ కల్లు తాగి బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. టిడిపి ఎంఎల్ఎ బాలకృష్ణ ఇలాకాలో క‌ల్తీ క‌ల్లు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కల్తీ విచ్చలవిడిగా అమ్ముతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లు అమ్మేవారికి స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో వారిపై ఈగ కూడా వాలడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితుల కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నాయి.

మొంథా పంజా

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వా యుగుండం మొంథా తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. తుఫాను దాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతాకులమయింది. పంట పోలాలు చెరువులను తలపించాయి, కల్లాల్లో ధాన్యం నీట మునిగిపోయింది, పలు చోట్ల ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామా సిద్దిపేట యాద్రాది భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, జగిత్యాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ఇళ్లు మునిపోయాయి. కుండపోత వర్షానికి హన్మకొండ బస్‌స్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ, ఈస్ట్‌కోస్ట్ రైళ్లు నిలిచిపోయాయి. డోర్నాకల్ రైల్వే ట్రాక్‌పై రెండు అడుగుల మేర నీరు చేరడంతో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ నిలిపివేసి, ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఐదు గంటల పాటు మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.

రైల్వే ట్రాప్‌పై నీరు తగ్గకపోవడంతో తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్‌కు పంపించారు. గుండ్రాతిమడుగు నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్ పంపిన అధికారులు రైల్వే ట్రాక్‌పై నీటిని తరలించే చర్యలు చేపట్టారు. కాజీపేట-విజయవాడ మార్గం లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలోని చెన్నారావు పేటలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో వరద నీరు చేరింది. నెక్కొండ, నర్సంపేట ప్రధాన రహదారిలోని పాతముగ్ధుంపురం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. పాకాల వా గు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామచంద్రాపురం గ్రామాలకు, వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడురు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం వరగల్ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు చేరడంతో పోలీసులు ఒక వైపు తాత్కాలికంగా రహాదారిని మూసివేశారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. మొంథా తుఫాను దాటికి ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహాం 19 అడుగులకు చేరడంతో పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

ఖమ్మం జిల్లా నిమ్మవాగులో కొట్టుకుపోయిన లారీ

కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలోని జాన్నారంఅంజనాపురం గ్రామాల మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతుంది. ఈ వాగును డిసిఎం లారీ దాటించే ప్రయత్నం చేయడంతొ వరదలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహానికి మధ్యలోకి వెళ్లిన తరువాత బ్రిడ్జి పిల్లర్‌కు తగిలి లారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న స్థానికులు దిగిరావాలని కోరినా డ్రైవర్ మురళి(32) వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌తో సహా లారీ వరద ఉదృతికి కొట్టుకుపోయింది.

కూసుమంచి మండంలంలోని పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. చింతకాని మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నాగులవంచ-పాతర్లపాడు మధ్య బండి రేపు వాడు రహదారిపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతొ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. కారేపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ అండ్ బి మధ్యలో చిన్న వంతెనపై నీళ్లు ప్రవహిస్తుండటంతో ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో నీరు ప్రవహించడంతో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి, అవుసలికుంట మధ్య కారు దాటుతున్న సమయంలో పక్కకు కొట్టుకుపోయింది. తాడూరు మండలం గోవిందపల్లి వద్ద వాగు దాటుతున్న గొర్రెల మందలోని గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కెఎల్‌ఐ కాలువ ఉప్పొంగి ప్రవహిస్తూ వరద నీరుత కలెక్టరేట్ ఆవరణలోకి భారీగా చేరుకుంది. భారీ వర్షానికి నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిండి -హాజీపూర్ మధ్య కాజ్ వే కోతకు గు రైంది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.

శ్రీ శైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. మండలంలోని తీగలపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కి వెళ్లే ప్రధాన రహదారి ఏడుదల జలాశయం కట్టపై బుదర పేరుకుపోయింది. దీం తో మూడు రోజుల నుంచి ఆర్టీసి బస్సులను నిలిపివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలంలో బైరాపూర్ గ్రామ సమీపంలోని వంతెన పై నుంచి సిమెంట్ పైపుల చుట్టే రక్షణగా ఉన్న మట్టి కోతకు గురికావడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చారకొండ మండలం ఎర్రవల్లి, గోక రం గ్రామాల మధ్య రదారిపై వాగు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండంటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలంలొ మూడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కోడేరు-పసుపుల, బావాయిపల్లి-పెద్దకొత్తపల్లి-ఖానాపూర్-సాతాపూర్ గ్రామా ల మధ్య వాగులు పొంగతంతొ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సూర్యాపేటలో బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై చెట్టు కూలి మృతి

సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ(45) తానం చర్ల నుండి మద్దిరాలకు తన వ్యవసాయ క్షేత్రాన్ని వెళుతున్న క్రమంలో చందుపట్ల గ్రామ శివారులో కొత్త పాఠశా సమీపంలో ఈదురు గాలికి రోడ్డుపై ప్రయాణిస్తున్న అతనిపై చెట్టుకూలింది దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అంబటిపల్లి నుండి లింగాలకు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో కారును వాగు దాటించే ప్రయత్నం చేయడంతో వరద ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో హుటాహుటిన జెసిబి సహాయంతో కారును, వెంకటరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో కురుస్తున్న వర్షాలకు గోకారం, చంద్రయాన్‌పల్లి, ఎర్రవల్లి గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. నాంపల్లి మండలంలోని రాందాస్ తండా వద్ద శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగానికి రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది.

నల్గొండ జిల్లా దేవరకొండ మడమడకలో గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. దేవర కొండ మండలం కొమ్మేపల్లిలో వరద నీరు పాఠశాలను చుట్టుముట్టడంతో అధికారులు తాడు సహాయంతో సుమారు 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగం ఆర్ అండ్ బి రోడ్డు కాజ్వే పై నుండి ప్రవాహం కొనసాగుతుండడంతో రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. చండూరు వైపు నుండి నాంపల్లి ద్వారా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మర్రిగూడెం ద్వారా హైదరాబాదు వైపు మళ్ళించారు. నాంపల్లి నుండి కొండమల్లేపల్లి వైపు రాకపోకలకు ఉపయోగించే ఆర్ అండ్ బి రోడ్డు ముష్టిపల్లి కట్టకింద వాగు పై ఉన్న బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం వెళుతుండడంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి.

137 రైళ్లు పూర్తిగా, ఏడు రైళ్లు పాక్షికంగా రద్దు

మొంథా తుఫాను ధాటికి దక్షిణ మధ్య రైల్లే 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. దీంతో పాటుగా 30 రైళ్లను దారి మళ్లించింది. అనేక రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. పలు గూడ్సురైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు

తుఫాను ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 31.6 సెం.మీ వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.