Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet giriş

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

mersin escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

Pusulabet Giriş

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

bettilt

interbahis

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

jojobet

madridbet

kingroyal

meritking

bets10

kingroyal

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

ఉప్పల్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిలా ఉప్పల్ మండలంలోని మల్లికార్జుననగర్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్(42) ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి కానిస్టేబుల్ శ్రీకాంత్ విధులకు హాజరుకావడంలేదు. ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి: పొన్నం

హైదరాబాద్: ఓటర్లు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందన్నారు. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం పేర్కొన్నారు. 

36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం : కోమటిరెడ్డి

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హోమ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్ల కేటాయించామని.. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.60,799 కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని కోమటిరెడ్డి కొనియాడారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు, రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ రహదారి విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. రూ.36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్కకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. 

ఆయన కోసం తూటాకైనా ఎదురెళ్తా: రష్మిక

హైదరాబాద్: నిజాయితీగా చెప్పాలంటే తనని లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి భాగస్వామిగా వస్తే బాగుంటుందని హీరోయిన్ రష్మిక మందనా తెలిపారు. మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ఓ అభిమాని రష్మికను ప్రశ్నించడంతో ఆమె నవ్వుతూ జవాబిచ్చారు. ప్రతి విషయాన్ని తనపై వైపు నుంచి ఆలోచన చేయడంతో పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి కావాలని చెప్పారు. తన కోసం యుద్ధం చేసే వ్యక్తి కవాలని, అలాంటి భాగస్వామని కోసం తాను తుపాకీ తూటాకైనా ఎదురెళ్తానని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలబడిన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానని వివరణ ఇచ్చాడు. నెల రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రెండు కుటుంబాలు బయటకు చెప్పలేదు. రష్మిక మాత్రం పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తన నిశ్చితార్థం విషయం అభిమానులు ఏం అనుకుంటున్నారో అదే నిజం అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పేర్కొన్నారు. 2026లో విజయ్‌తో రిష్మిక పెళ్లి జరుగనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా నటనతో మెరిసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అన్నవస్త్రాల కన్నా అణ్వాయుధాలే మిన్న!

అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం అనేక రంగాలను కల్లోల పరుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కు ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందక ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్‌స్టాంప్స్’ ప్రయోజనాలు అందని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు షట్‌డౌన్ ప్రభావం కారణం గానే విమాన సర్వీస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించలేక 10 శాతం సర్వీస్‌లను తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నుంచి పార్క్ వార్డెన్ల వరకు 1.4 మిలియన్ ఫెడరల్ వర్కర్లు శెలవుపై వెళ్లడమో లేదా వేతనం లేకుండా పని చేయవలసి రావడమో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇటువంటి తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అన్నవస్త్రాలు ప్రజలకు ఎలా అందించాలన్న ప్రయత్నాలకు బదులు అణ్వస్త్రాల పోటీకి అమెరికా ప్రభుత్వం మొగ్గు చూపడం శాంతికాముక దేశాలను కలవరపరుస్తోంది. తాజాగా ఫ్లోరిడా లోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు హితవచనాలు పలుకుతూ మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని బెదిరించడం ఫక్కా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోంది.

దక్షిణ కొరియాలో అక్టోబర్ 29న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కావడానికి కొన్ని నిముషాల ముందు అమెరికా అణ్వాయుధాల పరీక్షను ఇతర దేశాలతో సమానంగా ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ‘రష్యా, చైనా దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అవి వాటి గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో ముందుకు వెళ్తోంది’ అని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చెప్పింది అక్షరాలా సత్యం. నవశతాబ్దంలో ఉత్తరకొరియా బహుళ అణ్వాయుధాలను పరీక్షించింది. కానీ అణ్వాయుధ నిల్వలు కలిగిన అమెరికా, చైనా, రష్యా తదితర అగ్రరాజ్యాలతో సహా ఇతర దేశాలు 1990 నుంచి అణ్వాయుధ పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను అవి పరీక్షించగలవు. ఇప్పుడు అణుశక్తితో నడిచే అస్త్రాన్ని రష్యా సిద్ధం చేసింది. 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ‘బురెవెస్ట్‌నిక్’ అణుక్షిపణిని పరీక్షించింది. అలాగే సముద్ర గర్భ టార్పెడోను ప్రయోగించి పరీక్షించింది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించగానే ట్రంప్ స్పందించి తమ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి చేపడుతోందని ప్రకటించడం విశేషం.

రష్యా ప్రయోగించిన ఆ రెండు అణుక్షిపణులు అమెరికా రక్షణ క్షిపణి వ్యవస్థలను అధిగమించేలా డిజైన్ చేశారు. అవి అణ్వాయుధాలను ఎక్కడికైనా తీసుకెళ్ల గలవు. కానీ అవి అణువిస్ఫోటన పరీక్షలు కావు. సోవియెట్ యూనియన్ ఉన్నప్పుడు 1990 లో రష్యా ఆఖరిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. అలాగే 1992 లో అమెరికా ఆఖరి అణుబాంబు పరీక్ష, 1996లో చైనా ఆఖరి అణుపరీక్ష నిర్వహించాయి. అన్ని అణుపరీక్షలను నిషేధిస్తూ 1996లో సమగ్ర నిషేధ ఒప్పందం (సిటిబిటి) కుదిరింది. కానీ అవసరమైన సంఖ్యలో దేశాలు దీనిని ఆమోదించకపోవడంతో ఆ ఒప్పందం అమలు లోకి రాలేదు. ఒప్పందంపై అమెరికా, చైనాలు సంతకాలు చేసినా దాన్ని ఆమోదించడం మాత్రం జరగడం లేదు. రష్యా ఒప్పందంపై సంతకం చేసి ఆమోదం తెలియజేసినా, 2023లో అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన రష్యాలో 4309 అణుక్షిపణులు ఉన్నాయి. తరువాత రెండోస్థానం అమెరికాలో 3700, చైనాలో 1000 అణుక్షిపణులు ఉన్నాయని అంచనా. చారిత్రకంగా అమెరికా అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది.

1030 అణు విస్ఫోటనాలను నిర్వహించింది. తరువాత సోవియెట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, చైనా 45 అణువిస్ఫోటన పరీక్షలను చేపట్టాయి. ఒప్పందం తరువాత మొత్తం 2056 అణుపరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధం కావడం చర్చకు దారి తీస్తోంది. దీన్ని సమర్థిస్తున్నవారు అణ్వాయుధాలు పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోవడం అవసరమని చెబుతున్నారు. అయితే అమెరికా సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ క్రిస్‌వ్రైట్ తమ దేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించబోదని, ఎలాంటి అణు విస్ఫోటనం జరగకుండా కేవలం దేశవాళీ పేలుడు పదార్ధాలతోనే తక్కువ శక్తిగల ప్లుటోనియం 239పై ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షలు చేస్తుందని నవంబర్ 2న చెప్పుకొచ్చారు. అంతరిక్షం, సముద్ర జలాలు మొదలుకొని ఎలాంటి పర్యావరణ వాతావరణంలో కూడా అణుపరీక్షలు చేయరాదని 1963లో పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు అమెరికా తిరిగి అణుపరీక్షలు ప్రారంభిస్తే ఇతర అణ్వాయుధ దేశాలపై కూడా ఆధిపత్య ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనా గతంలో 1964 లో మావో ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటన ప్రదేశం లాప్‌నూర్ వద్ద అణుపరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మిగతా దేశాలపై చూపిస్తుంది. 

ఓటుహక్కుపై పడకూడదు వేటు

అమెరికానే కాదు, ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర్ మేయర్‌గా గెలిచాడు. ఇది ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆధిపత్యం, అణచివేతలు ఎల్లకాలం సాగవనే సత్యాన్ని ఓటు శక్తి ద్వారా న్యూయార్క్ ప్రజలు నిరూపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహూల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హర్యానాలో జరిగిన గత ఎన్నికల్లో ఓట్ల గోల్ మాల్‌కు, ఓట్ల చోరికి పాల్పడి ఏ విధంగా గెలిచిందో అనేక ఉదాహరణలతో వివరించారు. అమెరికాలో జరిగిన జోహ్రాన్ మమ్దాని విజయంగానీ, ఓట్లను తొలగించి బిజెపి గెలిచిందనే వార్త గానీ ఈ రెండు ఓటు శక్తిని నిరూపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో కత్తులు, బాణాలు, తుపాకులు ఏ విధంగా రాజ్యాలను గెలుచుకోవడానకి ఉపకరించాయో ఆధునిక కాలంలో ఓటు హక్కు కూడా అటువంటి పాత్రను పోషిస్తుంది. జోహ్రాన్ మమ్దాని భారతీయ సంతతికి చెందినవాడు కావడం ఒక విశేషం. ఇదే విధంగా హైదరాబాద్‌కు చెందిన గజాలా హష్మి వర్జినియా గవర్నర్‌గా గెలిచింది. గజాలా హష్మి కూడా ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ పార్టీకి చెందిన అభ్యర్థి.

ఆధునిక ప్రజాస్వామ్య వ్వవస్థలో ఓటు హక్కు అనేది సాదాసీదా పరికరం కాదు, ఇది ఒక వ్యవస్థ రూపురేఖలు మార్చగలిగే అధునాతన ఆయుధం. ఓటు హక్కు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే మొదట్లో మన దేశంతో సహా ఏ దేశంలోనైన కేవలం సంపన్న వర్గాలకే ఓటు హక్కు ఉండేది. అప్పుడు అది ఒక రకంగా పాక్షిక ప్రజాస్వామ్యమే. ఒక రకంగా అది సంపన్న స్వామ్యమే. అయితే భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు సార్వజనీన ఓటు హక్కు కోసం అంటే కులం, మతం, ధనిక, పేద, అక్షరాస్యత, నిరాక్షరాసత, ఆడ, మగ తేడా లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని పట్టుబట్టి సాధించిపెట్టారు. నిరక్షరాస్యులు, పేదలు ఓటు హక్కును సరైన పద్ధతిలో ఉపయోగించలేరని వాదించిన వాళ్ళున్నారు. అయితే భారత దేశంలో అనుభవం దానిని తప్పని రుజువు చేసింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక చర్యలకు పూనుకున్న ప్రభుత్వాలు నడిపిన పార్టీలను ఓడించి, ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసమేనని ప్రజలు రుజువు చేశారు.

అయితే గత పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. దీనికి రుజువులు కూడా చూపెడుతున్నారు. అయితే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని మనం భావిస్తున్నాం. అది రుజువైంది కూడా. రాజ్యాంగ రచనా సమయంలో కొంతమంది అప్పుడే పేదలు, చదవులేని వారికి ఓటు హక్కు వద్దని మాట్లాడారు. దానికి వాళ్ళు చూపెట్టిన కారణం, ఈ ఆధునిక పద్ధతులు వాళ్ళకు అర్థం కావని చెప్పారు. అయితే అప్పుడేమో కానీ ఇప్పుడు దీని అంతరార్థం అర్థమవుతున్నది. ఓటు ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బలం. ఒక శక్తి. అది అందివస్తే పేదలు ముఖ్యంగా నిమ్నకులాలు తమ మాట వినవనే వాళ్ళుకు తెలుసు. అప్పుడేమో చట్టపరంగా, విధాన నిర్ణయంగా అడ్డుకోవాలని చూశారు. అయితే ఇప్పుడు ఓటు హక్కు శక్తి తెలిసి వచ్చింది. కాబట్టి, తమకు అనుకూలంగా లేని సమూహాల, కులాల, మతాల ఓట్లను తొలగిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది 75 ఏళ్ళ కింద ఆనాటి ఆధిపత్య కులాలు, సంపన్నవర్గాలు చేసిన కుట్రకు ఇది కొనసాగింపు మాత్రమే.

అయితే 75 ఏళ్ళ తర్వాత ఈ ఓట్ల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓటు హక్కు అనే దానిని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఇది కేవలం ఓటు హక్కుతో మొదలై ఓటు హక్కుతో ముగిసిపోయేది కాదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వానికి ప్రాతిపదిక. ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇది ప్రజలను పాలనలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశం. కానీ ఇది ఈ రోజు ముగింపుకు వచ్చినట్టు కనపడుతున్నది. ఎవరైతే ప్రభుత్వాలకు అనుకూలంగా లేరో, ఎవరైతే ఈ పాలన మారాలని అనుకుంటున్నారో వారికి ఓటు హక్కు లేకుండా చేయడమంటే, రాజకీయ ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడడమే. బీహార్, అసోం, హర్యానాలలో ఇదే జరిగినట్టు విమర్శలున్నాయి. ఇది నూటికి నూరు పాళ్ళు అవాంఛనీయం.

ఇలా జరిగే ప్రమాదముందని, 75 ఏళ్ళ కిందట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక కూడా చేశారు. 1949, నవంబర్ 25వ తేదిన రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం చేస్తూ ‘జనవరి, 26, 1950 నుంచి మనం వైరుధ్య జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే విధానం ద్వారా రాజకీయ సమానత్వాని సాధించుకున్నాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా అసమానతులు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లుతోంది’ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఈ రోజు అద్దంలో ప్రతిబింబం లాగా కనిపిస్తున్నాయి. దాని ఫలితమే ఓటు హక్కును దుర్వినియోగం చేస్తూ, ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడమే.

గత 75 సంవత్సరాలుగా ఆర్థిక ప్రగతి ఎంతో సాధించిందని మన దేశం గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు అభివృద్ధికి దూరంగా జరిగిపోయారు. ఆర్థిక రంగం రోజు రోజుకు గుత్తాధిపత్యం సంపాదించుకుంటున్నది. గతంలో వృత్తులు ఉన్న సమూహాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగి ఉండేవి. ఈ రోజు అన్ని పారిశ్రామికాధిపతులు, కార్పొరేట్లు ఆక్రమించుకున్నారు. దీనితో ఆర్థిక స్వాలంబనను కలిగి ఉన్న ప్రజలు పరాధీన బతుకులు అనుభవిస్తున్నారు. గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండోది ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ ద్వారా శ్రమ చేసే శక్తి ఉన్న యువతి యువకులు నిరుద్యోగులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాంప్రదాయకంగా తరతరాలుగా అనుభవిస్తున్న ఆర్థిక స్వాతంత్య్రం ఈ రోజు కార్పొరేట్లు చెప్పుచేతుల్లోకి వెళ్ళాయి.

అంతేకాకుండా గతంలో కన్నా చాలా ఎక్కువ ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయి. ఇందులో ఆధిపత్య కులాలు ఆర్థికంగా లాభపడితే నిమ్న, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసులు ఆర్థిక పరాన్నజీవులుగా తయారయ్యారు. గత పదేళ్ళలో అదానీ కంపెనీ ఆస్తుల పెరుగుదల చూస్తే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాగలదు. అంతేకాకుండా కేవలం 10 శాతం కుటుంబాలు దేశంలో సంతృప్తిగా ఉన్నాయి. మిగతా 90 శాతంలో పది శాతం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మధ్య తరగతి వర్గాలు, మిగిలిన 80 శాతం కుటుంబాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాయి. ఉచితాల పేరుతో చేతులు ఉన్న పని చేయని అవిటి వాళ్లులాగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా, బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు ఉన్నారు. అదే విధంగా సామాజికంగా ఈ దేశం కులాలుగా విడిపోయి ఉన్నవి. కులాలు ఒకదానికొకటి విడివిడి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ, తక్కువ అనే సామాజిక సంబంధాలను కలిగి ఉన్నాయి. సనాతన పేరుతో నడుస్తున్న హిందూ వ్యవస్థ కులాలను పెంచి పోషిస్తుందే. కానీ వాటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దానికి సాక్షాలుగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, కులాంతర వివాహాలు జరిగితే ఆ వ్యక్తులపై దాడుల, హత్యలు ఈ దేశంలో సామాజిక సమానత్వాన్ని ఒక అందుకోలేని ఆకాశంగా తయారు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలలో వివక్షకు, అసమానతలకు, అణచివేతలకు గురవుతున్న ప్రజలు వ్యవస్థ మీద, ప్రభుత్వాలమీద తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో ప్రభుత్వాల భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కును దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అందువల్ల సామాజిక, ఆర్థిక సమానత్వలు సాధించనంత వరకు రాజకీయ ప్రజాస్వామ్యం ఒక నిజమైన అబద్ధం.   

–  మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)

గురునానక్ బోధనలు శిరోధార్యం

భారతదేశంలో మతం, అందులో నుంచీ పుట్టిన వర్ణ వ్యవస్థ, కులం వ్యవస్థ మనుషుల మధ్య అంతరాలకు కారణమైనవి. సామాజిక వైషమ్యాలను సృష్టించాయి. ప్రపంచ దేశాలతో పోలుస్తే ఇది భిన్నమైన కుట్రపూరితమైన అణచివేత అని చెప్పవచ్చు. వీటికి వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతం బౌద్ధం. అనంతరం ఈ విలువలకు దగ్గరున్నది సిక్కు మతం. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు. సిక్కు మతం సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవానికి కృషి చేసింది. సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్. ఆయన 1469లో నన్కానా సాహెబ్ జన్మించారు. ఏట కార్తీకమాసంలో గురునానక్ జయంతి జరుపుకుంటారు. ఆయన హిందూ, ఇస్లాం మత గ్రంథాలు అధ్యయనం చేసి, అన్ని మతాల సామరస్యాన్ని, ఏక దేవతా సిద్ధాంతాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ సిద్ధాంతాన్ని ఉద్బోధించారు. చివరికి ‘గురు గ్రంథ్ సాహిబ్’ అనే మత గ్రంథానికి ప్రేరణ ఇచ్చారు.

గురునానక్ ప్రత్యేకంగా అణచివేయబడిన వర్గాల విముక్తినీ కోరుకున్నారు. ఈ క్రమంలో గురునానక్ సిద్ధాంతాలను ప్రభావితమైన కొందరు దళితులు కూడా సిక్కు మతంలో చేరారు, వారు అక్కడ గౌరవం, సమానత్వం పొందగలిగారు. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ సంత్ రవిదాస్ శిష్యుడే. సిక్కు మత గ్రంథమైన ఆదిగ్రంథ్‌లో చెప్పులు కుట్టే చమార్ సంత్ రవిదాస్ బోధనలే అధికంగా ఉన్నాయి. ఆయన బోధనలతో ఉత్తర భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంగా జీవిస్తూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రవిదాస్ మాదిగలకు ప్రశాంతమైన జీవితం స్వరాజ్యంలో లేదంటే శ్మశానంలో లభిస్తుందనీ చారిత్రక వాస్తవాన్ని చెప్పాడు. గురునానక్, సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలతో ప్రభావితమై కాన్షిరాం విప్లవం సృష్టించాడు. బహుజన రాజ్యాధికారానికి పునాది వేశాడు. నేడు ఆయన చైతన్యంతోనే బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. సిక్కు మతంలో పురుషుల పేరు చివర ‘సింగ్’ అనే పదం చేర్చి మానసిక పరివర్తనగావించారు. దీనర్థం ‘సింహ’ (lion). ఇది ఈ చారిత్రకంగా దేశమూలవాసులుగా సమానత్వం, ధర్మం, రాజసత్వం, బలహీనుల రక్షించడం, ధైర్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్త డాక్టర్ విశారదన్ మహరాజ్ ఊరి బయట జీవిస్తున్న మాదిగలకు ‘మహారాజులు’గా నామకరణం చేశాడు. మాదిగలు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన మహారాజులనే చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆత్మనూన్యత వీడి మళ్ళీ మహారాజులుగా (పాలకులుగా) పునర్జీవింపజేయడానికి 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గురునానక్ కుల, మతాలను తిరస్కరించడం, సమానత్వాన్ని ప్రచారం చేయడం వంటి గొప్ప ఆదర్శాలతో అంబేద్కర్ ప్రేరేపితుడయ్యారు. గురునానక్ దళితులకు అత్యధిక గౌరవం ఇచ్చిన మత నాయకుడని, ఆయన బోధనలు దళితుల విముక్తి మార్గంగా ఉన్నాయని గుర్తించారు. చారిత్రకంగా భారత మనువాద సమాజంలో అట్టడుగు కులంగా దళితలు కులంపేరుతో తీవ్రంగా పీడనకు గురైనారు. ఈ క్రమంలో అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పోరాటంలో గురునానక్ నాయకత్వంలోని మత, సామాజిక విప్లవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ముంబయిలో ఉన్న గురునానక్ ఖల్సా కళాశాల స్థాపన అంబేద్కర్ ఆలోచనతో ఏర్పడింది. అన్ని వర్గాల వారికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో దీనికి ప్రోత్సాహించారు. భారతదేశంలో ఇప్పటికీ కుల, మత ఉన్మాదాలు హెచ్చరిల్లుతున్నాయి. వీటి పేరుతో చాపకింది నీరులా దుర్విచక్షణ కొనసాగుతుంది. దీంతో అట్టడుగు అణగారినవర్గాలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వం అణచివేయబడుతుంది. ఆధిపత్య సాంస్కృతిక భావజాలం, ప్రభుత్వ విధానాలే దీనికి ప్రధాన కారణం. ఇవీ ప్రజలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతిమంగా సామాజిక సంఘర్షణలకు కారణమవుతున్నాయి. కావున దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలను కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఉంది. దీనికి గురునానక్ సామాజిక ఐక్యత తత్వం అవసరం. మరోవైపు ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తిని, అస్తిత్వ వాదాన్ని అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మెజారిటీ ప్రజల హక్కులకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. దీనికి విరుద్ధంగా భారత పరిపాలన, విధానాలు కొనసాగుతున్నాయి. దీంతో పీడితవర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతుంది. నేడు సామాజిక న్యాయ పోరాటానికి గురునానక్ విలువలు, భారత రాజ్యాంగ సూత్రాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది.

– సంపతి రమేష్ మహారాజ్

– 7989579428

పొలంలో కాల్పులు.. వ్యక్తి మృతి…. దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి

లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ప్రియురాలి భర్తను ప్రియుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అగ్వాన్‌పూర్ గ్రామంలో అంజలి, రాహుల్ అనే దంపతులు నివసిస్తున్నారు. అంజలి అదే గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధానికి రాహుల్ అడ్డగా ఉండడంతో అతడిని చంపాలని ప్రియుడు ప్లాన్ వేశాడు. అగ్వాన్‌పూర్ గ్రామ శివారులో పొలంలో రాహుల్ పని చేసుకుంటుండగా అజయ్ తుపాకీ తీసుకొని అతడిపై కాల్పులు జరిపాడు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై మూడు బుల్లెట్ గాయాలు కనిపించాయి. దారిదోపిడీదారులు డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. అజయ్‌తో అంజలి పారిపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులు అజయ్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

త్రిముఖం.. ఎవరికి సుముఖం?

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక గీటురాయిగా మారనుంది. ఇది కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికగా కొట్టిపారేయలేని పరిస్ధితి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండమ్. రెండు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి జవజీవాలను నిర్ధారించే ఎన్నిక. అటు కేంద్రంలో పాలనతోనూ, ఇటు రాష్ట్రంలో అధికారంపైనా దృష్టిసారించిన బిజెపి భవిష్యత్తును ఖరారుచేసే ప్రజాభిప్రాయ వేదిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను ఈ మూడు ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందువల్లే గతంలో హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఓట్ల సమరాంగణంలో కోట్ల రూపాయిలను ఖర్చు చేసే పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది.ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీచేసేందుకు నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగనుంది. 4 లక్షలకు పైగా ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 58 మంది పోటీపడుతున్నారు. వీరిలో బిఆర్‌ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బిజెపి పక్షాన లంకల దీపక్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులు కాగా, వీరి మధ్యే పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.

మిగిలిన 55 మందికి కనీసం డిపాజిట్ దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ ముగ్గురిలో సునీత, దీపక్ రెడ్డి ఒసిలు కాగా, నవీన్ యాదవ్ బిసి కులానికి చెందినవారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం (నెంబర్ 61) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి. ఈ నియోజవర్గంలో ఆరు డివిజన్లు, సుమారు 146 కాలనీలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అత్యంత సంపన్నమైనదన్న ప్రచారానికి భిన్నంగా ఇక్కడ దినసరి కూలీలు, సినీ కార్మికులు, పేద మధ్య తరగతి ప్రజలే అత్యధికులు.నియోజకవర్గంలో ముస్లింలు బిసి కులాల తర్వాత ఒసి. ఎస్‌సి కులస్ధుల సంఖ్యే ఎక్కువ. 2009లో ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నిక కాగా, మాగంటి గోపీనాథ్ 2014 లో టిడిపి తరపున, 2018, 2023లో టిఆర్‌ఎస్ తరపున పాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో గోపీనాథ్ 80,549 (43.95%) ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 64,212 (35.03%) బిజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి 25,866 (14.12%) ఓట్లు, ఎంఐఎం అభ్యర్ధి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 (4.28%) ఓట్లు పొందారు. గోపీనాథ్ 16,337(8.91%)ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై విజయం సాధించగా, పోటీలో ఉన్న 19 మందిలో 16 మంది డిపాజిట్లు కోల్పోయారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 55 శాతం కంటే తక్కువగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పేద మధ్య తరగతి వారే ఎక్కువ. అయితే ఈసారి ఉప ఎన్నికల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున ఈసారి 4 లక్షల ఓట్లలో 75 శాతం వరకు ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎవరు లక్షన్నర ఓట్లు సాధిస్తారో వారిని విజయం వరించే అవకాశాలున్నాయి.

ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే.. బిజెపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఈసారి కూడా అధిష్టానం ఆలోచించి చాలా ఆలస్యంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బిజెపి తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందరరావు ముందుండి ప్రచారం సాగిస్తున్నారు. కిరాయికి జెండా పట్టుకునే వారు కాకుండా కేవలం కార్యకర్తలే ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా దీపక్ రెడ్డికి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడంతో త్రిముఖ పోటీలో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అభిమానం ఉన్నప్పటికీ అసెంబ్లీ స్థాయిలో అంతగా ఆదరించకపోవచ్చునని పలువురి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో కంటే ఈసారి దీపక్‌రెడ్డి గణనీయంగా ఓట్లను సాధించగలరని అంచనా. వాస్తవానికి ఇక్కడ హిందూ ముస్లిం అనే పోటీ లేకుండా ఎంఐఎం ఏకంగా తమ అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో బిజెపి తన ట్రంప్ కార్డును వినియోగించే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ అజారుద్దీన్‌కు మంత్రి పదవిని ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్‌ను, గత పదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందంటూ బిఆర్‌ఎస్‌పైనా నిప్పులు కురిపించింది.

ఇవన్నీ ఆశించిన స్థాయిలో బిజెపికి ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశాలు లేకపోయినా రానున్న కాలంలో మాత్రం తప్పకుండా ప్లస్ పాయింట్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 33% ముస్లిం ఓటర్లు ఉన్నందున బిజెపికి ఇక్కడ గెలుపు అందని ద్రాక్షగా మిగిలే సూచనలే కనిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆమెకు కుటుంబపరంగా కూడా ఇటు నామినేషన్ సమయంలోనూ, అటు ప్రచారాలు పరాకాష్టకు చేరుకున్న సమయంలోనూ సవాళ్లు తప్పలేదు. దివంగత గోపీనాథ్ రెండవ భార్య అయిన సునీత విషయంలో బిఆర్‌ఎస్ మొదటినుంచి స్ధిరాభిప్రాయంతోనే ఉంది.ఆమె పేరును బిఆర్‌ఎస్ బాస్ కెసిఆర్ స్వయంగా ప్రకటించి మరీ ఖర్చులకు డబ్బులిచ్చి పంపారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాకపోవడం ఒక విధంగా లోటే అని చెప్పాలి. కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా మారి ఇటు కాంగ్రెస్, అటు బిజెపికి బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. మరో స్టార్ హరీశ్ రావు కూడా ప్రచారం పీక్‌కు తీసుకువెళ్లే సమయంలోనే తండ్రి మృతి కారణంగా దాదాపు 11 రోజుల పాటు ప్రచారానికి దూరమయ్యారు. బిఆర్‌ఎస్ తరపున మిగిలినవారి ప్రచారం పెద్దగా ప్రభావం చూపకపోయినా మంచివ్యక్తిగా గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి, గతంలో కెసిఆర్ అమలు చేసిన పెన్షన్లు ఇప్పటికీ చాలా మంది మదిలో ఉండిపోయాయి. అంతేగాక గోపీనాథ్ పెద్దకర్మ నుంచి దాదాపు ఈ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ చాపకిందనీరులా తమ ప్రచారానికి తెరతీసింది.

ఈసారి బిసిల ప్రతినిధిగా పోటీలోఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు.. ఈసారి అత్యధిక శాతం ముస్లింల, బిసిల మద్దతుతోపాటు యువత క్రేజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు దాదాపు మంత్రి వర్గం, పిసిసి కార్యవర్గం కాళ్లకు బలపంకట్టుకొని తిరుగుతున్నందున సహజంగానే కాంగ్రెస్ వైపు కొంత ఆర్భాటం కనిపిస్తోంది. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లతో పాటు 70 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఆరు డివిజన్లకు మంత్రులను కేటాయించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజక వర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అంతకుముందే సుమారు 400 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు, 14 వేల కొత్త రేషన్ కార్డుల ఇలా కొన్ని జనాకర్షక పథకాలను ప్రజల్లోకి జొప్పించారు. వామపక్షాల మద్దతు, కోదండరాం వంటి ప్రముఖుల సహకారం, సినీ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు, హీరో సుమన్ ఇంటింటి ప్రచారం, దివంగత పిజెఆర్ తనయ, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రచారాలు, మాలమహానాడు, 132 బిసి కులాల మద్దతు ఇవన్నీ నవీన్ యాదవ్‌కు కలిసొచ్చే అంశాలే. నవీన్‌యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తదితరులను రౌడీలుగా పేర్కొంటూ బిఆర్‌ఎస్ చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

గతంలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని పెంచాయి. దీంతో వివిధ సంస్ధలు పోటీపడి సర్వేలు ప్రారంభించాయి. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రోజుకు కనీసం 10కిపైగా సర్వే కోసం ఫోన్లు వస్తూ ఎవరికి ఓటు వేస్తారంటూ వేధించాయి. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని గమనిస్తే వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ కనిపించే అడ్డాకూలీలకు అడ్డగోలు డిమాండ్ ఏర్పడింది. ఒక్కొక్కరికి 600 రూపాయిల నుంచి 800 వరకూ ఇస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తూ జెండాలు మోసేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ భారీ ఖర్చుకు తెరతీశాయి. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పలు ప్రాంతాల్లో హైడ్రా బూచిని చూపిస్తూ కాంగ్రెస్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కెసిఆర్ హయాంలోనే పెన్షన్లు వచ్చాయన్న కృతజ్ఞత కొంతమేర పెన్షనర్లలో ఉన్నా కాంగ్రెస్ మాత్రం కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తోంది. కాగా ఎవరెంత ప్రచారం చేసినా ఆఖరి మూడు రోజుల్లో పోల్ మేనేజిమెంట్ కీలకం కానుంది. ఈ ప్రయత్నంలో సఫలమైన వారికి ఆధిక్యత లభించనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనిస్తే కనీసం 5 వేల మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఊహాగానాలే వినిపిస్తున్నాయి. అయినా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా ప్రకటనలు ఇవ్వడానికి మూడు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.

–  దిమిలి అచ్యుతరావు

(సీనియర్ జర్నలిస్ట్)

హృదయాన్ని తాకే భావోద్వేగాలతో..

దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రమణి కళ్యాణం. శుక్రవారం చిత్రబృందం అధికారికంగా టైటిల్ లుక్‌ను లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్ ని లాంచ్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్‌తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతున్నారు. రమణి కళ్యాణం తన అందమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి.