elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahisExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahisatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

efesbet

jojobet

jojobet 1120

kingroyal

parobet

betplay

Kadıköy Escort

cratosroyalbet

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

iskenderun escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

casinowon

betcio

padişahbet

deneme bonusu

galabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

sekabet

matbet

kingroyal

xnxx

porn

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

kingroyal

teosbet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

meritking

meritking giriş

kingroyal

kingroyal giriş

వెంకీ కుడుముల నిర్మాతగా ‘ఇట్లు అర్జున’

వాట్ నెక్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ తన తొలి ప్రొడక్షన్‌ను ‘ఇట్లు అర్జున’తో ప్రారంభించింది. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వెంకీ కుడుముల, కంటెంట్ బేస్డ్ కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాతగా కొత్త జర్నీని ప్రారంభించారు. నూతన దర్శకుడు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనీశ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్. తాజాగా విడుదలైన ‘సోల్ ఆఫ్ అర్జున’ఈ మూవీ వరల్డ్‌ని అద్భుతంగా చూపించింది. ఈ గ్లింప్స్ కింగ్ నాగార్జున అందించిన మ్యాజికల్ వాయిస్ ఓవర్‌తో ప్రశాంతంగా, కవిత్వాత్మకంగా ప్రారంభమవుతుంది. డెబ్యూ హీరోగా అనీశ్ ఆకట్టుకునే నటన కనబరిచాడు. అనస్వర రాజన్ ఫ్రేమ్‌కు తాజాదనాన్ని తీసుకొస్తుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తూ, గ్లింప్స్‌లోనే కథ భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయానికి చేరువ చేస్తుంది. నాగార్జున మ్యాజికల్ వాయిస్ ఓవర్ ఈ గ్లింప్స్‌కు మెయిన్ హైలైట్‌గా నిలిచింది.

‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేస్తోంది

ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలమ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన గిరిగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 16న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వీడియోలో రోషన్ నటన ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ అద్భుతమైన అల్బమ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తండ్రీ కొడుకు మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ..

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్పా..’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే పవిత్రమైన, గొప్ప అనుబంధాన్ని తెలియజేసే ఈ పాట సినిమాకు ఆత్మ, వెన్నెముక లాంటిది. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను హిందీ, కన్నడ, తెలుగులో విజయ్ ప్రకాశ్.. మలయాళంలో మధు బాలకృష్ణన్ పాడగా, సాహిత్యాన్ని మలయాళంలో వినాయక్ శశికుమార్, తెలుగులో కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, హిందీలో కార్తీక్ ఖుష్, కన్నడలో నాగార్జున శర్మ అందించారు. డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ మూవీని నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా తండ్రీ కొడుకుల మధ్య ఉండే బలమైన, భావోద్వేగా బంధం గురించి మేం చెప్పాలని అనుకున్నాం. దాన్ని ఈ పాట ద్వారా చూపించాం’ అని అన్నారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సమర్జీత్ లంకేశ్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్సి, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వేరెవరికో కాపీరైట్ ఇవ్వలేను

తుఫాను విసురుకి నేలకేసి తలబాదుకునే చెట్టుగా

నా కథను చిత్రించడం సులువు

చినుకు స్పర్శకు తుళ్ళిపడి లేచే చిగురు రూపాన్ని

వాళ్ళు సరిగా గీయలేరు

వాళ్ళకు, కథలో లేని రంగుల్ని

అద్దడం వచ్చి వుండొచ్చు

ఆ కళతో వాళ్ళు

నా బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని చెడగొడతారు

వాళ్ళకు, కథను బిగువుగా అల్లే నేర్పుండొచ్చు

ఆ నేర్పుతో వాళ్ళు నా ప్రవేశ

నిష్క్రమణల మీద హద్దుల్ని గీస్తారు

ప్రతి అంకం, ఇలాగే మొదలవ్వాలి

ఇలాగే ముగిసిపోవాలని

వాళ్ళకు కొన్ని సూత్రీకరణలుండొచ్చు

వాటి అనువర్తనంతో నా కథ

నాది కాకుండాపోతుంది

నేను నా కనురెప్పల మీద కలలుగా పూస్తాను

ఒక్కోసారికి కలలన్నీ తెంపేసుకుని

నీ స్వప్నమూ అవుతాను

వేరొకరైతే, కథ మొత్తాన్ని

హేతువులతో నింపేస్తారు

కథను కొన్నిచోట్ల ఊహలకు వదిలేయడం ఇష్టం

మీరే చెప్పండి ఊహలో, కలలో లేకపోతే

దాన్ని జీవితం అని ఎలాగంటాం?

– సాంబమూర్తి లండ

కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులనే గెలిపించాలి: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుందని ప్రశంసించారు. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు చేరుకున్నాయని పేర్కొన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఇంకా భవిష్యత్ లో అనేక కార్యక్రమాలను కొనసాగిస్తామని, మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామన్నారు. 

ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్ బుక్ ఇన్ ఇండియా

మన దేశ పౌరులపై సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాన్ని సోదాహరణంగా తెలుపు తూ ‘ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్‌బుక్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం 2019లో వచ్చింది. ఇం గ్లీషుతో పాటు ‘ఫేస్ బుక్ కా అసలీ చెహరా’ అని హిందీలో కూడా విడుదల చేశారు. రాబోయే రోజుల్లో సామాజిక మాధ్యమాల చేతుల లో మన దేశం పరాధీనురాలు, పౌరులు కీలు బొమ్మలు అని ఆరేళ్ల క్రితమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పుస్తక రచయిత పరంజయ్ గుహ థాకర్తా, సహ రచయిత సిరిల్ శామ్. పరంజయ్ ఓ సీనియర్ జర్నలిస్టు. తన 35ఏళ్ల జర్నలిస్టు జీవితంలో దేశంలోని అన్ని ప్రధాన ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు.

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల వాడకం వల్ల సమాచారం వెంటనే అందే మాట నిజమే కానీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను అది తప్పుడు, ద్వేషపూరిత సమాచార కర్మాగా రంలా మార్చివేస్తుందని ఈ పుస్తకం పేర్కొ నింది. కాలజ్ఞానంలా ఇందులో చెప్పినట్లే – ఎంతో చైతన్యవంతంగా కదిలే మనుషు లను కూచున్న చోటే గంటల తరబడి కట్టి వేసి ఏదో సాధిస్తున్నామనే భ్రమల్లో ఫేస్ బుక్ పడేసింది. కామెంట్లతో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు అనుకునే రోజులు వచ్చేశా యి. భావజాల తర్కానికి బదులు ద్వేషిం చుకొని, నోటికొచ్చిన బూతులు తిట్టుకునే స్థాయికి ఫేస్ బుక్ తెచ్చింది.

ఇలాంటి సామాజిక మాధ్యమాలు బూ టకపు, వివక్షాపూరిత, రెచ్చగొట్టే వార్తల ను ప్రచారం చేస్తూ, దేశ పౌరుల ఆలోచన సరళిని మార్చివేస్తున్నాయని, పాలకుల పంచన చేరి వ్యాపార విస్తరణ దిశగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని, ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించా రు. దేశంలోని బొగ్గుగని కార్మికులపై ‘కోల్ కర్స్’ అనే డాక్యుమెంటరీ పరంజ య్ నిర్మించారు. దేశంలోని పెట్రోలియం ఉత్ప త్తుల ధరల్లోని అక్రమాలు ఎత్తిచూపుతూ ‘గ్యాస్ వార్స్’ అనే పుస్తకం రాశారు. 2008లో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తొలి వ్యాసం రాసింది ఇతనే. ఇలా సుదీర్ఘ, సాహసో పేత పాత్రి కేయ చరిత్ర గల పరంజయ్ కలం నుండి దేశంలో ఫేస్ బుక్ లీలల గురించి వెలువడిన ఈ పుస్త కం సంచలనం సృష్టించింది. లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయి పాఠకుల మన్ననలు పొందుతోంది.

దేశంలోని వివిధ సంస్థల్లో ఫేస్‌బుక్ పెట్టిన పెట్టుబడుల వివరాలు, జియోకు కోరినంత ఆర్థిక బలాన్ని ఇ చ్చిన ఫేస్‌బుక్ ఉదారతపై అధ్యా యాలుగా ఈ పుస్తకంలో వివరించా రు. తొలి అధ్యాయాల్లో మన దేశం లో ఫేస్‌బుక్ ప్రజలకు ఎలా దగ్గరైం ది, క్రమంగా దేశ పాలకుల అవసరా లు తీర్చుతూ ఎలా ముందుకొచ్చింది అనే వివరాలు ఉన్నాయి. తనకు న చ్చని మీడియా సంస్థలను, జర్నలిస్టు లను, పాలకపక్షాన్ని విమర్శించేవారిని సెన్సార్ పేరిట ఫేస్ బుక్ పక్కన పెట్టిన తీరు వివరిం చారు. ఫేస్‌బుక్‌పై ప్రముఖ పత్రికలు వ్యక్తపరచిన అభి ప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు కట్టడి చేసేలా ఫేస్‌బుక్ నియమాలను మార్చు కుందని కారవాన్ పత్రిక పేర్కొంది. ఫేస్‌బుక్‌కు దే శ శాసనాలపై, చట్టాలపై గౌరవం లేదని, అది లైసెన్స్ లేని తుపాకీ అని ‘ది గార్డియన్’ రాసింది.

మయన్మార్‌లో రోహ్యింగాల పట్ల ద్వేషం పెంచి వేలాది మంది మరణాలకు, వలసలకు ఫేస్‌బు క్ కారణమైందని ఐక్యరాజ్య సమితికి అందిన ఓ రిపోర్ట్‌లో ఉంది. హిందూస్తాన్ టైమ్స్ జర్నలిస్టు చార్లెస్ అస్సేసీ ‘నేనెందుకు ఎఫ్‌బిని హేట్ చేస్తాను’ అనే వ్యాసంలో ‘ముందు అది మను షుల్ని మూగవారిని చేస్తుందని, ఆ తర్వాత వారి జీవితాల్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది’ అని రాశారు. అందుకే అనవసరంగా వేలు ఆడించకూడదు. ప్రతి స్పందన ఫేస్‌బుక్‌కు కొంత ఆదాయాన్ని, కొత్త సమాచారాన్ని అంది స్తుంది అని ఈ పుస్తకం ముందు జాగ్రత్తలు బోధిస్తోంది.

– బద్రి నర్సన్

డేవిడ్ స్జాలైకు ప్రతిష్టాత్మక పురస్కారం.. సమకాలీన జీవన తాత్వికతకు దర్పణం ’ఫ్లెష్’ నవల

సాహితీ జగత్తులో ప్రతిధ్వనించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్, ఈ ఏడాది హంగేరియన్ -బ్రిటీష్ రచయిత డేవిడ్ స్జాలై రాసిన ‘ఫ్లెష్’ నవలకు దక్కింది. ఈ విజయం ఆధునిక కల్పనా సాహిత్య తాత్విక అన్వేషణ సరిహద్దులను మరింత విస్తృతం చేసింది. నిశితమైన జీవిత పరిశీలన, సున్నితమైన భావోద్వేగ చిత్రణలతో ఆధునిక సాహితీప్రియులను ఆకట్టుకుంటున్న స్జాలైకి ఈ పురస్కారం లభించడం, ఆయన రచనా ప్రయాణం లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ద్వారా ఈ బహుమతి గెలుచుకున్న తొలి హంగేరియన్-, బ్రిటీష్ రచయితగా ఆయన చరిత్ర లో నిలిచారు.

డేవిడ్ స్జాలై సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న రచయిత. 1974లో కెనడా లో జన్మించినప్పటికీ, లండన్‌లో పెరిగి, ప్రస్తుతం వియన్నాలో నివసిస్తున్నారు. వివిధ సంస్కృతుల మధ్య పెరిగిన అనుభవం, వలస జీవితంపై ఆయనకు లోతైన అవగాహన కల్పించింది. ఆ అనుభ వం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2016లో ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ నవలకు సైతం బుకర్ ప్రైయిజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన స్జాలై, ఆరు నవలలు, పలు రేడియో నాటకాలు రచించారు. డేవిడ్ స్జలే-అస్తిత్వపు అన్వేషకుడు : ప్రపంచ సాహిత్య వేదికపై నిర్లిప్తత, వాస్తవికత అనే రెండు ధ్రువాల మధ్య నిలబడి ఆధునిక మానవుని అంతరంగ మథనాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన ఈ నవల కేవలం ఒక కథా సంపుటి మాత్రమే కా దు. ఇది సమకాలీన ప్రపంచంలో అస్తిత్వ శూన్యత ను, వలసల వల్ల కలిగే మానసిక విచ్ఛేదనాన్ని, పురుషత్వ నిగూఢ అర్థాలను లోతుగా విశ్లేషించే ఒక సాహిత్య దర్పణం. స్జాలై రచన అనంతమైన శూన్యంలో ఉనికి కోసం పోరాడుతున్న ప్రతి జీవి నిశ్శబ్ద రోదనను ప్రతిబింబిస్తుంది.

కథన శిల్పం-వచన వైవిధ్యం: స్జాలై రచనా శైలి అసాధారణమైన పొదుపుదనంతో కూడుకున్నది, దీనిని విమర్శకులు ‘శైలీపరంగా అస్థిపంజరం వంటిది’గా అభివర్ణించారు. ఈ పొ దుపుదనం కేవలం శైలిపరమైన ఎంపిక మాత్రమే కాదు, ఇది ఒక తాత్విక వైఖరి. ఆయన గద్యం, అలంకారాలు, విస్తృత వర్ణనల బరువు లేకుండా కేవలం మౌలికమైన సత్యాన్ని మాత్రమే ఆవిష్కరి స్తుంది. ఇది ఒక స్పటికపు అద్దం వలే మౌలికమైన మానవ సత్యాన్ని యథాతథంగా పట్టి చూపిస్తుంది. ఈ సాంద్రమైన భాషా సంవిధానం పాఠకుడికి మ రింత లోతైన భావనా ప్రపంచంలోకి ప్రవేశించే అ వకాశాన్ని కల్పిస్తుంది. దీనికి కారణం ఏమంటే కథలోని కీలకమైన సంఘటనలను, ముఖ్యంగా ఇస్త్వాన్ జీవితంలోని చీకటి కోణాలైన జైలు జీవి తం, యుద్ధ సేవలను రచయిత వివరంగా చెప్ప కుండా ఉద్దేశపూర్వకంగా మౌనాన్ని పాటించడం ద్వారా ఆ ఖాళీలను పూరించాల్సిన భావనాత్మక భారాన్ని పాఠకుడికే బదిలీ చేస్తారు. తద్వారా ఆ హింస నిజమైన భారాన్ని పాఠకులు తమ అంత రంగంలో అనుభూతి చెందేలా ప్రేరేపిస్తుంది. ఈ కథన శిల్పం ద్వారా జీవితంలోని కొన్ని గాయాలు పైకి కనిపించకుండానే మనలో ఎంతగా లీనమైపో యి, మన అస్తిత్వాన్ని ఎలా శాసిస్తాయో రచయిత నిరూపించారు. నవలలోని ఈ నిర్లిప్త కథనం, ఇస్త్వాన్ పాత్ర భావోద్వేగ తిమ్మిరిని పాఠకులకు తెలియజేయడంలో అద్భుతంగా విజయం సాధిం చింది. ఇది స్జాలై ప్రయోగాత్మక కథన శిల్పానికి నిదర్శనం.

నవల అంతరార్థం: ‘ఫ్లెష్’: మానవ బలహీనతల సూక్ష్మచిత్రణ ‘ఫ్లెష్’ కేవలం ఇస్త్వాన్ వ్యక్తిగత కథ మాత్రమే కాదు. కథానాయకుడు ఇస్త్వాన్ జీవిత ప్రయాణం హంగేరీలోని పేదరికం నుండి లండన్‌లో ని సంపన్న వర్గాల సేవకునిగా మారడం, ఈ వ్యవస్థలో ఒక మనిషి కేవలం శారీరక శ్రమకు పరిమితమైన ఒక సాధనంగా ఎలా మారుతాడో విశ్లేషిస్తుంది. అంతే కాకుండా, లండన్‌లోని సంపన్నుల ఇళ్లలో పనిచేస్తూ, వారికి అదృశ్య సేవకుడిగా మారతాడు. ఇస్త్వాన్ తన దేశంలో గౌరవం లేని శ్రమను, విదేశంలో గుర్తింపు లేని శ్రమగా మార్చుకుంటాడు. ఇక్కడ ఇస్త్వాన్ శరీరం కేవలం శ్రమ యంత్రంగా పరిగణించబడుతుంది. అతని వ్యక్తిత్వం, ఆకాంక్షలు పూర్తిగా విస్మరించబడతాయి. ఈ నవల, ఆధునిక కాపిటలిజంలో మాన వ దేహం ఎలా ఒక వ్యాపార వస్తువుగా మారుతుందో లోతుగా తెలియజేస్తుంది.

ఇస్త్వాన్ పాత్రలో స్జాలై ఒక అస్తిత్వ వాద సంక్షోభాన్ని ఆవిష్కరించారు. అతను ఏ సమాజా నికీ పూర్తిగా చెందడు. హంగేరీలో లేడు, లండన్‌లో విలీనం కాలేదు. ఈ మధ్యస్థ స్థితి అతనిలో ఒక శాశ్వతమైన ఏకాంతాన్ని సృష్టిస్తుంది. నవలలోని ఏకాంత దృశ్యాలు ఇస్త్వాన్ ఒంటరిగా తిరుగుతూ, తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును విశ్లేషిం చుకోవడం పాఠకులను కూడా తమ వ్యక్తిగత శూన్యంలోకి ప్రయాణించేలా చేస్తాయి. స్జాలై పురుషత్వం అనే భావనను ప్రశ్నిస్తూ, అది పురుషుడికి బలం ఇవ్వడానికి బదులుగా ఎలా ఒక భారంగా మారుతుందో చూపించారు.ఇస్త్వాన్ హింసాత్మక చర్యలు, భావోద్వేగాలను అణచివేయ డం అనేవి సమాజం అతనికి నేర్పిన విషపూరిత పౌరుషానికి ప్రతిబింబాలు. తన బలహీనతను దా చడానికి అతను శక్తిని ఉపయోగించాలనుకుంటా డు, కానీ అది మరింత బాధను మాత్రమే మిగు లుస్తుంది.

వర్తమాన సమాజానికి అద్దం : బుకర్ న్యాయ నిర్ణేతల బృందం ఈ నవలలోని మా నసిక వాస్తవికత, కథన శిల్పంలోని సాంద్రతను అసాధారణంగా ప్రశంసించారు. వారు ఈ నవల ను ‘గాయపడిన ప్రపంచ గ్రంథం’గా అభివర్ణించ డం ద్వారా దాని తాత్వికతను గుర్తించారు. ‘ఫ్లెష్’ మరచిపోయే రచన కాదు. ఇది పాఠకుడిలో లోతైన ప్రశ్నలను రేకెత్తించి, జీవించడంలో ఉన్న నిశ్శబ్ద బాధను, అరుదైన సౌందర్యాన్ని ఏకకాలంలో అను భూతి చెందేలా చేస్తుందని వారు ప్రకటించారు.

సాహిత్యం-సత్యానికి, సంక్లిష్టతకు వారధి: ‘ఫ్లెష్’ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం ద్వారా సాహి త్య కర్తవ్యం కేవలం సౌందర్యారాధన కాదని, నిర్భ యంగా సత్యాన్ని ఆవిష్కరించడం, నిశ్శబ్దంగా ఉన్న గొంతులకు స్థానం కల్పించడం అని డేవిడ్ స్జాలై మరోసారి నిరూపించారు. ఈ నవల సమకా లీన సాహిత్యంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది.

– విర్గో

హైదరాబాద్ బుక్ ఫెయిర్-38వ పుస్తక ప్రదర్శన

పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణ: 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 డిసెంబర్ 19 నుండి మొదలై 29 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్.టి.ఆర్. స్టేడియం) లో జరుగబోతోంది. ఈ మొత్తం రోజుల్లో పన్నెం డు నుండి పదిహేను లక్షలమంది పుస్తకాభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భం గా పుస్తకాల స్టాల్స్‌లో వందల, వేల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. ఆ పదిరోజులు పుస్తకాల పండుగే. ప్రతిరోజూ ఒంటి గంటకు ప్రారంభమయ్యే బుక్ ఫెయిర్‌లో 2 గంటల నుండి 5 గం టల వరకు తెలంగాణ బాలోత్సవం నిర్వహణ లో పిల్లల కార్యక్రమాలు, ఐదింటి నుండి ఆరిం టి వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తరవాత ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమం మూడు సెషన్లుగా సాగుతాయి. ఇందులో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకంపై చర్చలు, ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయి. ఈ మూడు సెషన్లలో రెండు వందల వరకు సాహిత్యకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా పుస్తక ప్రాధాన్యతను తెలుపుతూ ‘బుక్‌వాక్’ ఒకరోజు పుస్తక ప్రేమికులతో కలిపి జరుగుతుంది. ఇంకోవైపు రెండవ వేదికపై కొత్త పుస్తకాలు, వాటి ఆవిష్కరణలు.. అదొక సందడి. 1985లో 38సంవత్సరాల క్రితం ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రతి ఏటా బుక్ ఫెయిర్‌లు నిర్వహిస్తోంది. గత సంవత్సరంలో లాగే 350 స్టాల్స్‌కు పైగా ఈ బుక్ ఫెయిర్‌లో ఉంటాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలనుంచి కూడా పబ్లిషర్స్ వస్తున్నారు.

పుస్తకమంటే జ్ఞానం. సర్వజన నేస్తం. అధ్యయనం పట్ల నేటి యువత ఆసక్తి చూపుతున్నది. సమాజ మార్పులో పుస్తకం పాత్ర కీలకం. ఇంటర్నెట్ యుగంలో పుస్తకం ప్రాధాన్యత తగ్గుతున్నదనేది ఒట్టిమాటే. ఉన్నత చదువుల్లో బిజీగా ఉండి కూడా యువత రచనలు చేయడం మంచి పరిణామం. ఆహ్వానించదగినది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పుస్తక ప్రదర్శనలకు ఆదరణ పెరుగుతున్నది. ఆ దిశలోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్ చెప్పుకోదగ్గ పుస్తక ప్రదర్శనగా ఎదిగింది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పుస్తక ప్రియులను ఒక్కచోటకి చేర్చి జాతరను తలపిస్తున్నది. సమాజాన్ని మేల్కొలిపే అక్షర సమూహంగా బుక్ ఫెయిర్ మారింది. డిసెంబరు 19 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో గల అందెశ్రీ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జరుగనున్నది.

జీవితంలో ఎవరైనా కోరుకునేది సుహృద్భావ వాతావరణంలో బతకాలన్నదే. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టుకతో రావచ్చు గాక, వారందరినీ కలిపి ఉంచేది మానవీయతనే. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన చెడకుండా కొనసాగాలంటే దానికి అనుగుణమైన రచనలను సమాజంలోకి వెదజల్లాల్సిన అవసరముంది. అంతిమంగా మనుషులను విభజించని సాహిత్యం రావాల్సిన అత్యావశ్యకత ఉంది. దానికై ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సిన బాధ్యత యువ రచయితలపై ఉందని మేము భావిస్తున్నాము. మానవజాతిని కదిలించే శక్తి పుస్తకానికి ఉంది. అ ధ్యయనం చేయకపోతే ఎదుటివారు చెప్పేదే నిజమనే భావనలోకి కూరుకుపోతాం. డాక్టర్లుగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మరే ఉన్నత ఉద్యోగం లో రాణించాలన్నా సామాజిక స్పృ హ తప్పనిసరి. పుస్తకజ్ఞానం ఉన్నవారే జీవితంలో రాణిస్తారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారినెవరిని పరిశీలించినా అది మనకు కనిపిస్తున్నది. మంచి సమాజం కావాలంటే పుస్తకాలు చదవాలి.

బాలసాహిత్యం కొనుగోలు పెరగటం మంచి పరిణామం. చిన్నపిల్లల తో విరివి గా కథల పుస్తకాలు చదివించాలి. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఏఐ టెక్నాలజీ, సోషల్‌మీడియా ఇంకేం వచ్చినా, పుస్తకాలకు శాశ్వత విలువ ఉంటుంది. పుస్తకం చదివితే వచ్చే మానసికానందం వెలకట్టలేనిది. ప్రభుత్వ తోడ్పా టు మరింత పెరగాలి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. కొన్నేండ్లుగా బుక్ ఫెయిర్ నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియాన్ని ఉచితంగానే ఇస్తున్నది. దీనిలో పుస్తకాల ప్రదర్శనలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారానికి కొన్ని స్టాళ్ళను కేటాయిస్తున్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు సొంత భవనమంటూ లేదు. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు జరుపుకునేందుకు ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండాలి. సాహితీ ప్రముఖులు, పుస్తకాల పబ్లిషర్స్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఉండటానికి కొన్ని రూములతో కూడిన భవనం ఉండాలి. అలాచేస్తే హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత, కదలిక, పనివిధానం పెరుగుతుంది. మరింత మెరుగవుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం సహకరించాలి.

పాఠశాలలు, కళాశాలల్లో సామాజిక, సాహిత్య శాస్త్రాల అధ్యయనం పెరగాలి. పాఠశాలలు, కళాశాలల్లో సామాజిక, సాహి త్య, శాస్త్రాలు చదువుకునే అవకాశాలను పెంచాలి. ఆవైపు పిల్లలను తీర్చిదిద్దాలి. నిజమైన చరిత్రలు నమోదు కావాల్సిన అవసరముంది. మరుగునపడిన పుస్తకాల ప్రస్తావన తెరపైకి తేవాలి. బుక్ ఫెయిర్‌లో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకం అనే థీమ్‌తో ప్రముఖ రచయితలు, కవులతో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చావేదిక నడుస్తోంది. మరుగునపడిన అనేక పుస్తకాల ప్రస్తావన మళ్లీ తెరమీదికి వస్తోంది. కొత్తతరంలో ఆసక్తిని రేకెత్తించి, వాటిని చదవడానికి పురిగొల్పే వాతావరణాన్ని తీసుకురావ డం దీని ముఖ్య ఉద్దేశం.

చదువు జ్ఞానానికి సింబల్. ప్రస్తుతం చదువుకోవడం జ్ఞానానికి సింబల్ అనే భావన నుంచి ఉద్యోగం కోసం చదువు అనే పరిస్థితి ఉంది. విద్యాలయాల్లో చదువుల నిర్వచనం మారి మార్కులతో విద్యను కొలిచే పద్ధతి వచ్చింది. దీంతో జనరల్ బుక్స్ చదవడం మానేసి ఆ సబ్జెక్ట్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఉద్యోగాల సాధనకు పనికొచ్చే చదువే ముందుకొస్తున్నది. అందుకే సాహిత్య, సామాజిక, శాస్త్రాలను చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్న ది. ఇది నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు పరికించి చూస్తే రాయడం, చదవడం, అచ్చువేయడం వైపు యువత ఎక్కువ దృష్టి సాధించడం శుభపరిణామం. కొందరు ఇండ్లనే గ్రంథాలయాలుగా మార్చుతున్నారు. గ్రామాల్లో వాటిని నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం.

రాబోయే కాలంలో సాంస్కృతిక రంగాల్లో ఒక పునర్జీవనం, కొత్త చైతన్యం రాబోతున్నది. యువతను అధ్యయనం, రాయడం వైపు మళ్లించే బాధ్యత సామాజిక సంఘాలపైనా, ప్రభుత్వాలపైనా ఉంది. బుక్ ఫెయిర్‌ల లక్ష్యం పుస్తకాలు అమ్మడం, కొనడం అనే ప్రక్రియ మాత్రమే కాదు. పుస్తకాలను ప్రజల దగ్గరకు విస్తృతంగా చేర్చడం, మెరుగైన సమాజం దిశగా అడుగులు వేసేలా పౌరుల ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉండాలి. ఈ పది రోజుల్లో కూడా పుస్తకాల మీద చర్చలు, సాహి త్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, స్కూల్, కాలేజీ పిల్లలు బుక్ ఫెయిర్‌ను సందర్శించేలా చేయడం ద్వారా పుస్తకాలు చదివే సంస్కృతి వైపు వారిని నడిపించే బాధ్యతను బుక్ ఫెయిర్ తలకెత్తుకున్నది.

ఇంతితై.. వటుడింతైనట్టుగా చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో నాలుగైదు పబ్లిషింగ్ సంస్థలు, సెల్లర్స్‌తో ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ గణనీయమైన స్థాయికి నేడు చేరుకున్నది. మనదేశంలో కలకత్తా, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్ లాంటి బుక్ ఫెయిర్లతో పాటు జాతీయ స్థాయికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎదుగుతుందనే ఆశ ఉన్నది.

-కవి యాకూబ్, (అధ్యక్షుడు) మలుపు బాల్రెడ్డి, (ఉపాధ్యక్షుడు) ఆర్.శ్రీనివాస్ (వాసు) కార్యదర్శి

మహిళతో కొలికపూడి వీడియోలు… సోషల్ మీడియాలో వైరల్

అమరావతి: ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపి కేశినేని చిన్ని మధ్య టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. వరుస పోస్టులతో ఎంపి వర్గానికి ఎమ్మెల్యే కొలికపూడి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇటీవల కొలికపూడి ఓ మహిళతో ఉన్న ఫోటోను చిన్ని వర్గీయులు విడుదల చేశారు. టిడిపి సోషల్ మీడియా గ్రూపుల్లో కొలికపూడి ఫోటో చక్కర్లు కొట్టింది.  కౌంటర్ గా ఇద్దరు నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోస్టు చేశారు.  తిరువూరుకు చెందిన బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావులు మహిళలతో ఉన్న ఫోటోలను కొలికపూడి విడుదల చేయడంతో వైరల్ గా మారాయి. రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా? అంటూ పోస్టులు పెట్టారు. కొలికపూడిపై ఎంపి చిన్ని వర్గం రగిలిపోతుంది.  ఎఐతో తయారు చేసి ఫోటోలు విడుదల చేశారంటూ ఎంపి కేశినేని చిన్నిపై కొలికపూడి వర్గం మండిపడుతుంది. 

టిడిపిలో ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపి చిన్ని వర్గీయులకు కొలికపూడి వరసగా షాక్ లు ఇస్తున్నారు.  విస్సన్నపేట మండల టిడిపి నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా ?’ అంటూ విమర్శలు గుప్పించారు. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే  కేశినేని నిజంగా రాయల్ అని దుయ్యబట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో హాట్ టాపిక్ గా మారాయి. 

ఫస్ట్ ఫేస్ ఫలితాలే రిపీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. మొదటి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ, రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగించింది. 193 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు, 29,913 వార్డు స్థానాలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. రాత్రి 11 గంటల వరకు ప్రకటించిన 3,867 సర్పంచి స్థానాలకు, 29,831 వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,217 సర్పంచి స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 1,180, బిజెపి మద్దతుదారులు 262 స్థానాల్లో గెలుపొందారు. 618 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 4,331 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా, 5 స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాంతో 3,911 సర్పంచి స్థానాలకు, 29,913 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో మొత్తం 12,832 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,070 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు.

లాటరీలో వరించిన విజయం

మెదక్ మండలం చీపురుదుబ్బతండా గ్రామ సర్పంచి ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది. చీపురుదుబ్బతండా పంచాయతీకి మోటు కాడి తండా, నైలి తండా అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 3 తండాల్లో కలిపి 377 ఓట్లు ఉండగా, 367 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దుతులో పోటీ చేసిన కేతావత్ సునీతకు 182, బిఆర్‌ఎస్ మద్దతులో పోటీ చేసిన బీమిలికి 182 ఓట్లు లభించాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది. దీంతో ఆమె సర్పంచిగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

ఒక్క ఓటుతో విజయం

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచిగా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో శ్రీవేద, స్వాతి ఇరువురు పోటీ పడగా 426 ఓట్లకు 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు రాగా ఒక్క ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

వార్డు సభ్యురాలే సర్పంచిగా గెలుపు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచిగా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామంలో ఆరో వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అటు వార్డు సభ్యురాలిగా, ఇటు సర్పంచి ఎన్నికై రోజా డబుల్ ధమామా సాధించారు. వార్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయనున్నారు.

సర్పంచిగా గెలిచిన మాజీ వార్డు సభ్యుడు

యాదాద్రి భువనగిరి జిల్లా కొండమగుడు గ్రామానికి ఇదివరకు వార్డు సభ్యులుగా సేవలందించిన కడెం పాండును ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ సర్పంచిగా బలపరచింది. 32 ఏళ్ల వయసు గల పాండు సర్పంచిగా గెలుపొందడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవతున్నాయి. కాగా, కొండమడుగు గ్రామంలో 12 వార్డులకు 6 వార్డులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలువగా, 5 వార్డులు బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒక్క వార్డు కూడా గెలువకుండా కడెం పాండు సర్పంచిగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓటేసిన పలువురు ప్రజాప్రతినిధులు చేగుంట మండలం రుక్మాపూర్‌లో ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తి సింగపూర్ నుంచి వచ్చి ఓటేశారు. సిద్దిపేట జిల్లా పోతారంలో దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొప్పాపూర్‌లో మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్‌రావు దంపతులు ఓటు వేశారు. భూంపల్లిలో రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట సిపి విజయ్ కుమార్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

85.86 శాతం పోలింగ్

రెండో విడత పల్లెపోరు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తమ గ్రామ పరిపాలకులను ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఓటేశారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది. అందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం, జగిత్యాలలో 78.34 శాతం, భదాద్రి కొత్తగూడెంలో 82.65 శాతం నమోదైంది. అలాగే నిర్మల్‌లో 82.67 శాతం, వికారాబాద్‌లో 82.72 శాతం, ములుగులో 82.93 శాతం, నాగర్‌కర్నూల్‌లో 83.98 శాతం, పెద్దపలిలో 84.15 శాతం, నారాయణపేటలో 84.33 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.41 శాతం, మంచిర్యాలలో 84.59 శాతం, మహబూబాబాద్‌లో 85.05 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 85.25 శాతం, రంగారెడ్డిలో 85.30 శాతం, కామారెడ్డిలో 86.08 శాతం, కరీంనగర్‌లో 86.58 శాతం, మహబూబ్‌నగర్‌లో 86.62 శాతం, కొమురం భీం అసిఫాబాద్‌లో 86.63 శాతం, అదిలాబాద్‌లో 86.68 శాతం, సంగారెడ్డిలో 86.96 శాతం, వనపర్తిలో 87.05 శాతం, జోగులాండ గద్వాల్‌లో 87.08 శాతం, హన్మకొండలో 87.34 శాతం, వరంగల్‌లో 88.11 శాతం, సిద్దిపేటలో 88.36 శాతం, జనగాంలో 88.82 శాతం, నల్గొండలో 88.52 శాతం, మెదక్‌లో 88.74 శాతం, సూర్యాపేటలో 88.80 శాతం, ఖమ్మంలో 91.21 శాతం పోలింగ్ నమోదైంది.