elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Sweet Bonanza

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

ultrabet güncel giriş

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

madridbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

matbet

kingroyal

madridbet

kingroyal

diyarbakır escort

kulisbet

vaycasino

vaycasino

betgaranti giriş

jojobet

యంగ్ ఇండియా స్కూళ్లు.. సమస్యలే సవాళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి విద్యా విజన్ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’. ఆయన ఎక్కడ మాట్లాడినా అదే విషయం చెబుతుండడాన్ని బట్టి ఆయన ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి గత రెండేళ్ళు విద్యామంత్రిగా సైతం ఆయన పోకడలో ఒకింత కన్ఫ్యూజన్ ఒక మేరకు కనిపిస్తోంది. అసలు రేవంత్ చెబుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నేటి ప్రాపంచిక అవసరాల కనుగుణమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన విద్యనందించే లక్ష్యం! మంచిదే. దాని సాధ్యాసాధ్యాలు పరిశీలన చేస్తే రేవంత్ విద్యకు కేటాయిస్తానని చెబుతున్న 15% బడ్జెట్ సరిపోతుందా! అనుమానమే. ఒకవేళ దీర్ఘకాలిక ప్రణాళిక అమలు జరిపినా దాని పర్యావసానాలు ఎటు దారితీస్తాయి? తెలంగాణలో విద్యా సమానత, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఉనికి, పర్యావసానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు ముందు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మాణ స్వరూపం పరిశీలన చేద్దాం. 25 ఎకరాల సువిశాల స్థలం. కోట్లాది రూపాయల విశాలమైన తరగతి గదుల నిర్మాణం, 124 మంది ఆధునిక శిక్షణ పొందిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, 2600 మంది విద్యార్థుల సామర్థ్యం, ఒక్కో పాఠశాల నిర్మాణానికి 200కోట్ల రూపాయల వ్యయం వెరసి ఈ పాఠశాల స్వరూప స్వభావం.

ఇంత భారీ స్థాయి ప్రణాళికతో రూపొందించిన 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపన జరిపారు. ఇప్పటికే ఈ పాఠశాలల నిర్మాణం కోసం రూ. 15,600 కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 200 పాఠశాలలకు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తానంటున్న ఈ పాఠశాలలు కనీసం మండలానికి ఒకటి ఏర్పాటు చేసినా 634 మండలాల్లో యంగ్ ఇండియా పాఠశాలలకు 1,26,800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే మన రాష్ట్ర ఏడాది బడ్జెట్. మొత్తం పాఠశాలలు పూర్తి అయితే 16 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించినట్లు అవుతుంది. ఆలోచన మంచిదే! కానీ, ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు చూద్దాం. 2023 -24 విద్యా గణాంకాలు ప్రకారం రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. లక్షమంది సుశిక్షితులైన బోధనా సిబ్బంది ఉంది. మరో వెయ్యి కెసిఆర్ స్థాపించిన రెసిడెన్షియల్ స్కూల్స్, కేంద్రం స్థాపించిన కెజిబివి, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. వీటి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే అనాలోచితంగా రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపన వలన ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నమోదు తగ్గిపోయింది. ఈ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ విధానం కనీసం మండలానికి ఒకటి నిర్మించినా 16 లక్షల మంది విద్యార్థులు నమోదు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో తగ్గిపోనున్నది.

ముఖ్యమంత్రి నియమించిన విద్యా కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం 19 వేల ప్రాథమిక పాఠశాలల్లో 13 వేల పాఠశాలల్లో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 5 వేల పైచిలుకు ఉన్నత, 4 వేల పైచిలుకు ప్రాథమికోన్నత పాఠశాలలది అదే పరిస్థితి. అంటే బోధనా సిబ్బంది ఉండి, పిల్లలు లేని మూడొంతులు పాఠశాలల్లో ప్రజాధనం కొన్నెండ్లుగా పాలకులు వేతనాలు రూపంలో వృథా చేస్తున్నారు. తెలంగాణకు కేటాయించిన 23 వేలకోట్ల రూపాయలు విద్యా బడ్జెట్‌లో సుమారు 18 వేల కోట్లు వేతనాలకే ఖర్చు అవుతుంది. అంటే యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభం అయితే, ప్రభుత్వ పాఠశాలలన్నీ, రెసిడెన్షియల్ పాఠశాలలు అన్ని దాదాపు మూతపడతాయి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా వసతులు, నాణ్యమైన విద్య అందే పాఠశాలలనే ఎంపిక చేసుకుంటారు. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల చొప్పున 15 వేల 800 ఎకరాల పంట భూములు సేకరించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఎకరం భూమి వేసుకున్నా 30 వేల ఎకరాల విలువైన పాఠశాలల స్థలాలు నిరుపయోగంగా మిగులుతాయి. గత 3 దశాబ్దాలుగా కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన సర్వశిక్షా అభియాన్ తరగతి గదులు పడావు పడతాయి? వీటన్నింటికీ మించి సర్వశిక్షా అభియాన్ నిర్ణయించిన ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల, మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల, కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ‘అందుబాటు’ అనే సమస్య తలెత్తుతుంది.

ఒకవేళ రవాణా సౌకర్యం కల్పించినా తలకు మించిన భారమే. ఇంత చేసి 16 లక్షల మంది విద్యార్థులకు ‘యంగ్ ఇండియా స్కూల్స్’ లో ప్రవేశం కల్పిస్తే ప్రస్తుత గణాంకాలు ప్రకారం ప్రభుత్వ పాఠశాల ల్లో ఉన్న 24 లక్షల మందిలో 8 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం ఏమిటి? వారికి మన విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం విద్యా సమానత, పిల్లవాడు తాను నచ్చిన పాఠశాలలో విద్యా నేర్చుకునే హక్కును నిరాకరించినట్లే కదా? అప్పుచేసి పప్పుకూడులా లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఉన్న భూములు వినియోగం చేసుకోకుండా మరో 15 వేల ఎకరాల పంట భూములు సేకరించి, లక్ష కోట్లకుపైగా నూతన నిర్మాణాలు చేయడంలో పారదర్శకత ఎంత? యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం, భూసేకరణలో కమీషన్ల దందాను, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకోబోతుంది? ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించాల్సిన సమయం ఇది. కనుక ప్రపంచ విద్యా స్థాయి అందుకోవాలనే రేవంత్ రెడ్డి ఆలోచనలు స్వాగతిస్తూనే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ పర్యావసానాలు, సంస్కరణ గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఆకునూరి మురళి, కె. కేశవరావు లతో రెండు కమిషన్లు వేసిన ప్రభుత్వం వాటి సిఫార్సులు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ సంస్కరణలో పరిగణనలోనికి తీసుకొన్న దాఖలాలు కనిపించడం లేదు? వీటన్నింటికీ మించి గత కొన్ని దశాబ్దాలుగా పాలకులే విద్యా బాధ్యతల నుండి వైదొలిగేందుకు, లేక ప్రజల అవసరాలకు తగ్గ పాఠశాల వ్యవస్థ మార్పులు అందించలేకపోయిన పర్యావసానంగా కుప్పలుతెప్పలుగా పెరిగిన ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో చూస్తుంది.

37 లక్షల విద్యార్థుల నమోదు ఉన్న 12 వేల పైచిలుకు ప్రైవేటు పాఠశాల వ్యవస్థలోనూ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థుల నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య గురించి, వాటిలో పని చేస్తున్న వేలాది నిరుద్యోగులు గురించి ప్రభుత్వానికి పట్టకపోతే ఎలా? ఇత్యాది విశాలమైన సమస్యలు చర్చించి చేపట్టే విద్యా పథకం మాత్రమే దీర్ఘకాలిక లక్ష్యంతో సఫలమవుతుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్’ కలను పై సమస్యలన్నింటితో అనుసంధానించి పథక రచన చేసినప్పుడు మాత్రమే, పథకం సత్ఫలితాలు ఇస్తాయి. ఆలోచనలు ఎన్నైనా రావచ్చును గాని, నిర్దిష్టమైన ఆచరణ, సరైన ప్రణాళికతో మాత్రమే నూతన విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయగలుగుతాము. సిఎం రేవంత్ రెడ్డి అన్ని కోణాల్లో ఆలోచించి నూతన సవాళ్ళను ఎదుర్కోగలిగిన విద్యా వ్యవస్థ రూపకల్పనలో విద్యారంగ మేధావులు, ప్రజల సలహాలు స్వీకరించడం, అనుసరించడం ప్రజాస్వామిక ఆలోచన అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులను వేయాలని కోరుకుందాం. విద్యా వ్యవస్థ ఆధునీకరణను స్వాగతిద్దాం.

ఎన్.తిర్మల్

94418 64514

నేడే పంచాయతీ తుది పోరు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో బుధవారం (డిసెంబర్ 17) మూ డో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వర కు పోలింగ్ జరుగనుండగా, మధ్యా హ్నం 2తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాల లో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పం చి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏ కగ్రీవం అయ్యాయి. 11 సర్పంచి స్థా నాలకు, 116 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 సర్పంచి స్థా నాలు, 18 వార్డు స్థానాల ఎన్నికలపై స్టే ఉంది. మిగిలిన 3,752 సర్పంచి స్థా నాలకు, 28,410 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థు లు పోటీ

పడుతుండగా, వార్డు స్థానాల కు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడో విడతలో 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు,140 మంది ఇతరులు ఉన్నారు. ఓటర్లు ఎక్కడున్నా సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పల్లె ప్రగతికి బాధ్యతగా ఓటేయాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి సామర్థ్యాలున్న నాయకుడిని ఎంచుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అందరూ ఇవిఎంలలో ఓటు వేస్తుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేస్తే మీ ఓటు వారికి పడ్డట్లే. తెలిసీ తెలియక లేదా ఏమరుపాటుతో ముద్ర సరిగ్గా పడకపోయినా, ఇద్దరు అభ్యర్థుల మధ్య అటూ ఇటూ కాకుండా ముద్ర పడితే మీ ఓటు మాత్రం చెల్లుబాటు కాదు. ఖాళీ బ్యాలెట్ వేసినా ఆ ఓటు చెల్లదు. బ్యాలెట్‌లోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటా గుర్తుపై కూడా ఓటు వేయొచ్చు.

ఆత్మహత్యలు పరిష్కారమా?

ఇటీవల బిసిలకు రిజర్వేషన్లు దక్కకపోవడంపట్ల మనస్తాపం చెందిన ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవటం ఊహించని సంఘటన. ఇట్లాంటి ఘటనలు వాంఛనీయం కాదు. ఏ సమస్యకైనా ఆత్మహత్యలు పరిష్కారం కానే కాదు. ఇట్లాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా జాగ్రత్తపడవలసి బాధ్యత బిసి ఉద్యమకారుల మీదున్నది. బిసి ఉద్యమంపట్ల సరైన వైఖరిని, దాని పంథాను ప్రజలకు వెల్లడి చేయవలసిన చారిత్రక మలుపు దగ్గర ఇప్పుడు బిసి ఉద్యమం ఉంది. జరగవల్సింది కాదు కానీ ఈశ్వరాచారి ఆత్మబలిదానం తర్వాతనయినా బిసిల మిత్రులెవరో, శత్రువులెవరో స్పష్టంగా విభజన రేఖలు గీయవల్సిన సందర్భం ఇది. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరిని బయటపెట్టి ఎవరు నిజంగా బిసిల కోసం నిలబడగలరో గుర్తించి వారితో ప్రయాణం చేయాలి. బిసి ఉద్యమం తాలూకు గత చరిత్రను బేరీజు వేసుకుని ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలో అంచనాకు రావాలి. ఈ సమస్య ఒకటి రెండు సంవత్సరాల కాలంలో పరిష్కారమయ్యే చిన్న సమస్య కూడా కాదు. దీనికి మరో తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమం జరగాలి. తెలంగాణ ఉద్యమం ఎలాగైతే న్యాయబద్ధమైనదో బిసి ఉద్యమం అలాగే న్యాయబద్ధమైన ఉద్యమం. నిజానికి బిసి ఉద్యమం ఒక తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్‌కో సంబంధించిన ఉద్యమం కాదు. అది మొత్తం భారతదేశానికి సంబంధించినది.

అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉద్యమం రావాలి. దానికి సరియైన సమయం కూడా ఇదే. కాబట్టి దేశంలో ఉన్న బిసి మేధావులను కూడా ఇక్కడి ఉద్యమంలో భాగస్వాములను చేసి ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించే ఏర్పాటు చేయాలి. దీనికి ముందుగా బాధ్యత వహించవల్సింది అన్ని రాజకీయ పార్టీలలో క్రియాశీలక స్థానాల్లో ఉన్న బిసి నాయకులే. ఈ నేపథ్యంలో ఉద్యమాలలోకి యువత రావటమన్నది ఒక అనివార్యత. చరిత్రలో గతంలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు యువత నడిపించినవే. తెలంగాణ ఉద్యమం కూడా యువకుల రంగప్రవేశం తరువాతనే ఉధృతమైన సంగతి అందరి అనుభవంలో ఉన్నదే. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమం శ్రీకాంతాచారి బలిదానంతో కొత్తమలుపు తీసుకున్నది. నిజానికి ఆ బలిదానం తర్వాతనే ప్రజలలో ఆనాటివరకు అణిచిపెట్టుకున్న అగ్రహ జ్వాలలు ఒక్కసారిగా పెల్లుబికాయి. తరువాత జరిగిందంతా తెలుగు ప్రజలకు తెలిసిందే. అయితే ఎవరోఒకరు ఆత్మార్పణ చేసుకుంటే తప్ప ఉద్యమంలో కదలిక రాదని భావిస్తే అది పెద్ద తప్పు.

శత్రువులను చంపటం ద్వారా లేదా ఆత్మహత్య చేసుకోవటం ద్వారా ఉద్యమాలను నడపాలనుకోవటం సరియైన పంథా కాదు. ‘బతికి సాధించటం’ అనే విలువను యువతకు నూరిపోయాల్సిన అవసరం ఉద్యమకారుల మీదనే కాదు పౌరసమాజం మీద కూడా ఉన్నది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఉద్యమానికి ఇచ్చే బలం కన్నా ఆ వ్యక్తి బతికి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఇచ్చే బలం గొప్పది. ఈ విషయాన్ని ఉద్యమంలో ఉన్న యువత గుర్తించాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ బలిదానాలకు సంబంధించి ఒక విషయం ప్రజలందరికీ స్పష్టమయింది. ఉద్యమంలో ఆత్మహత్యకు పాల్పడిన వాళ్లలో ఒక్కరు కూడా అగ్రకులాలకు చెందిన వారు లేరు. అలాగే ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క ఎంఎల్‌ఎ కానీ, ఎంపి కానీ ఆత్మహత్య చేసుకోలేదు.

స్వార్థప్రయోజనాలతో ఆనాడు నాయకులు రెచ్చగొట్టటంవల్ల నిస్వార్థంగా ఉద్యమంలో ఉన్న యువత ఉద్రేకానికిలోనై ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాల్లో తీరని శోకం నింపారు. కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సిన వారు ఇలా చేసుకోవడంతో ఆ కుటుంబాలు అన్ని రకాలుగా విధ్వంసమయ్యాయి. తెలంగాణ వచ్చిన తరువాత కూడా అమరవీరులకు, వాళ్ళ కుటుంబాలకు సరియైన రీతిలో న్యాయం జరగని సంగతి ఒక చేదు వాస్తవం. ఈ అనుభవాలు ఏ రకమైన ఉద్యమంలో ఉన్నవారికైనా పాఠాలు నేర్పిస్తాయి. యువత ఇవన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్రేకానికిలోను కావటమన్నది ఉద్యమాలలో సహజమే. కానీ అది ప్రాణాలను తీసుకునే స్థాయిలో ఉండకూడదు. యువకులు బిసి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, బిసి రిజర్వేషన్లు సాధించిన తరువాత అధికారాన్ని సాధించుకొని తమ జాతికి న్యాయం చేయాలి. అలా జరగాలంటే బతికి సాధించాలి.

తోకల రాజేశం

9676761415

విజిలెన్స్ విచారణ?

మన తెలంగాణ/కేపీహెచ్‌బి: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ఐడీపిఎల్ భూముల కబ్జా, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పర ఆరోపణల నేపధ్యంలో ప్రభు త్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు సర్వే నెంబర్ 376లోని భూములపై దర్యాప్తునకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జాగృతి జనం బాట పేరుతో కూకట్‌పల్లిలో ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత పదేళ్ళలో పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను, చె రువు శిఖం భూములను కబ్జా చేశారని, ఐడీపిఎల్ భూములను కబ్జా చేశారని విలేకరుల సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కృష్ణారావు తీవ్రస్థాయిలో కవిత ఆమె భర్త అనిల్ ఐడీపిఎల్ భూములను కబ్జా చేశారని, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. దీనిపై ప్రభుత్వం ఎలాం టి విచారణ అయినా జరపించుకోవచ్చన్నారు. దీంతో ప్ర భుత్వం ఐడీపిఎల్ భూములు ఎంతమేరకు కబ్జాకు గురయ్యాయో వంటి వాస్తవాలను తెలుసుకునేందుకు విజలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ జరువాత వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని భా విస్తున్నారు. కూకట్‌పల్లిలో ఐడీపీఎల్‌కు 

భూములను రెసిడెన్సియల్ కిందకు కన్వర్టు చేసి బడా నిర్మాణ సంస్థలకు విక్రయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. కొనసాగుతున్న ఐడీఎల్ కంపెనీని పథకం క్రారం మూసివేసి విలువైన 700 ఎకరాల భూములను బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టడం వెనుక స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ఈ వ్యవహారంలో దుబాయి కేంద్రంగా భారీ ఒప్పందం జరిగిందని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పరిశ్రమల జోన్ నుంచి భూమిని తప్పించి రెసిడెన్సియల్ జోన్ కింద మార్చినందుకు ఒక్కో నాయకుడికి కోట్లలో లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఐడీపిఎల్ కంపెనీని రెండు దశబ్ధాల కింద టేకోవర్ చేసుకున్న హిందూజా సంస్థ ప్రభుత్వ అండదండలతో ఆఘమేఘాలమీద ప్లాటింగ్‌చేసి బడా నిర్మాణ సంస్థలకు విక్రయించింది. ప్రస్తుతం ఈ భూముల్లో అతివేగంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించి నిజా నిజాలను నిగ్గుతేల్చాలని కూకట్‌పల్లి వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గ్రామీణ్ @125

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్య 20 ఏళ్లనాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే, కొత్తబిల్లును మోడీ ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 125 రో జుల పాటు గ్రామీణ ఉద్యోగాలకు హామీ ఇ చ్చే ఈ పథకాన్ని వ్యవసాయ శాఖమంత్రి శి వరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టారు. 20ఏ ళ్ల నాటి గ్రామీణ ఉపాధి పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా యి. మహాత్మాగాంధీ  ఫోటోను ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవికా మిషన్ (గ్రామీణ్) విబి- జి రామ్ జి) బిల్లు 2025 గా వ్యవహరిస్తున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీని ప్రవేశపెడుతూ ప్రభుత్వం మహాత్మా గాంధీని నమ్మడమే కాకుండా ఆయన సూత్రాలను కూడా అనుసరిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.;

గత ప్రభుత్వాలకన్నా మోదీ సర్కార్ గ్రామీణాభివృద్ధికి చాలా చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభంలోనే ప్రతి పక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై విసృ్తతంగా చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ కు చెందిన ప్రియాంక గాంధీ తోపాటు పలువురు ఎంపీలు పథకం పేరులో మహాత్మాగాంధీ పేరు తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిల్లు ప్రవేశ పెట్టే దశలోనే దానిని వ్యతిరేకిస్తూ డిఎంకె కు చెందిన టిఆర్ బాలు మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణులకోసం, పేదప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాలలో అత్యంత పేదలకు ఖచ్చితంగా 100 రోజుల ఉపాధి కల్పించే అపూర్వమైన బిల్లును (ఎంఎన్‌ఆర్ ఇజిఏ) తీసుకువచ్చారని, అది పేదలకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం మహాత్మా గాంధీ త్యాగాలను, జాతిపిత ను ఎగతాళి చేస్తోందని దుయ్యబట్టారు.

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ముసాయిదా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంఎన్ ఆర్ ఇజిఏ ఓ విప్లవాత్మక చట్టం అని, దీనిని ఆమోదించినప్పుడు సభలోని సభ్యులంతా ముక్తకంఠంతో సమర్థించారని గుర్తు చేశారు. ఆ పథకం కింద కేంద్రం 90 శాతం నిధులు అందేలా చూసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కేంద్ర సహాయాన్ని 60 శాతంకు తగ్గిస్తుందని, అలాగే పేదల ఉపాధి హక్కులను బలహీనపరుస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె అన్నారు. కొంత మంది ఎంపీలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, మహాత్మా గాంధీ తమ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదని, దేశంలో ప్రతి కుటుంబానికి చెందిన వారని ప్రియాంక స్పష్టం చేశారు. గొప్ప పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు కీలకమైన గొప్ప కార్యక్రమం స్ఫూర్తి, తాత్విక పునాదిపై దాడిగా అభివర్ణించారు. విబి- జి- రామ్ – జి బిల్లును దుయ్యబడుతూ 1971 లో బాలివుడ్ చిత్రంలో ని పాట – దేఖో ఓ దీవానో (తుమ్) యే కామ్ న కరో, రామ్ కా నామ్ బద్నామ్ న కరో- అన్న పాటను గుర్తు చేశారు. విబి- జి రామ్- జి చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుంచి ఆరు నెలలలోపు రాష్ట్రాలు కొత్త చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఓ పథకాన్ని రూపొందించాలి. ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పంచాయతీలకు నిధులు ఎవరి భిక్షా కాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఎ వరి భిక్ష కాదు అని, అది రా జ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అ ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత లు వారి సొంత ఇళ్లు అమ్మి నిధు లు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ఎంఎల్‌ఎలకు అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు. ప్ర జలను, ప్రజాప్రతినిధులను చం పేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఖానాపూర్, షాద్ నగర్ నియోజకవర్గా ల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచు లు, వార్డు సభ్యులను కెటిఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఎవరు..? అని ప్రశ్నించారు. అవి వారి అబ్బ సొత్తు కాదు అని, రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తున్నారా..? అని నిలదీశారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుందని స్పష్టం చేశారు.

హక్కుల కోసం కొట్లాడండి..

కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను మోసం చేసి, రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని కెటిఆర్ ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలని, ఆ నిధులను ఆపే హక్కు ఏ ముఖ్యమంత్రికి గానీ, ఎంఎల్‌ఎకు గానీ లేదని అన్నారు. హక్కుల కోసం కొట్లాడండి, బిఆర్‌ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని బిఆర్‌ఎస్ సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. ఇందుకోసం జిల్లాకోక ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటుతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కెసిఆర్ పాలనలో పల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామం వచ్చాయని, తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయని వ్యాఖ్యానించారు. క్యూ లైన్‌లో చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి తెలివిగా యూరియా యాప్ అనే కొత్త స్కీమ్ తెచ్చారని విమర్శించారు. షాపులో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా..? అని ఎద్దేవా చేశారు.

విజయోత్సవాల పేరుతో ఎన్నికల ప్రచారం

సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కెటిఆర్ విమర్శించారు. ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్, కెసిఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే అని, మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల కోసం గెలిచిన సర్పంచ్‌లు, సగం కాలం బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారని తెలిపారు. ఖానాపూర్, షాద్ నగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగురడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.

పొగమంచుకు 13మంది బలి

మధుర: యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా మంగళవారం తెల్లవారుజా మున 4.30గంటల ప్రాంతంలో ఎనిమిది బస్సు లు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగి 13మంది కాలిన గా యాలతో మృతి చెందారు. 43మంది గాయపడ్డా రు. బలదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రానొయిడా వైపు యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద దట్టమైన పొగమంచు వల్ల వాహనా లు ఒకదానినొకటి ఢీకొన్నాయని దీంతో మంటలు చెలరేగి, బస్సులు, కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ష్లోక్ కుమార్ తెలిపారు. మృతుల్లో గుర్తించిన ఇద్దరిలో ఒకరు ప్రయాగ్ రాజ్‌కు చెందిన 44 ఏళ్ల అఖిలేంద్ర ప్రతాప్ కాగా, మరొకరు మహరాజ్‌గంజ్ జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్‌పాల్ అని బలదేవ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ రంజన సచన్ చెప్పారు. మూడో వ్యక్తి గోండా జిల్లాకు చెందిన 62 ఏళ్ల సుల్తాన్ అహ్మద్‌గా బృందావన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గుర్తించారు.

కాలిన బస్సులు, కార్లు శిథిలాలుగా మారాయి.రోడ్డుపై నుంచి వీటిని తొలగించడానికి క్రేన్లను రప్పించారు. కాలిన మృతదేహాల డిఎన్‌ఎను భద్రపరిచామని, సంబంధిత కుటుంబీకులు వస్తే వారితో పోల్చి పరీక్షిస్తామని, ఇంతవరకు గుర్తించిన ముగ్గురి మృతుల బంధువులకు తెలియజేస్తున్నామని ష్లోక్ కుమార్ వివరించారు. గుర్తించిన ముగ్గురి మృతుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్ చెప్పారు. ఈప్రమాదంపై దర్యాప్తునకు నలుగురితో బృందాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించ వలసి ఉంది. ఇంకా గుర్తించని డ్రైవర్‌పై బలదేవ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్‌ఎస్‌పి తెలిపారు. మృతదేహాల పోస్ట్‌మార్టమ్‌కు, డిఎన్‌ఎ నమూనాల సేకరణకు, రెండు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆగ్రా లోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం వైద్య చికిత్స కోసం 43 మందిని బృందావన్ లోని జాయింట్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తీసుకురావడమైందని సిఎంఒ తెలిపారు.

యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ముఖ్యమంత్రి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

పొగమంచుతో మరికొన్ని ప్రమాదాలు

హర్యానా లోని సోనిపట్, నూహ్ జిల్లాల్లో పొగమంచు కారణంగా సోమవారం రోడ్డు ప్రమాదాలు సంభవించి ఇద్దరు పోలీసు అధికారులతో సహా ముగ్గురు మృతి చెందారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలు ఢీకొని సిఐఎస్‌ఎఫ్‌ఇన్‌స్పెక్టర్‌తోసహా ఇద్దరు చనిపోయారు. సోనిపట్‌లో మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తాను ప్రయాణిస్తున్న కారుకు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు.

విమానాల రాకపోకలపై ప్రభావం

వాయు కాలుష్యంతోపాటు దట్టంగా పొగమంచు కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే పలు విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చని, ప్రయాణికులకు సహాయం అందించేందుకు తమ సిబ్బంది అన్ని టెర్మినల్స్‌లో అందుబాటులో ఉన్నారని పేర్కొంది.

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే పెట్రోల్ బంద్.. ఢిల్లీ సర్కారు నిర్ణయం

దట్టమైన పొగమంచు రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్యంపై యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా డిసెంబర్ 18 నుంచి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (పియుసి) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా

చేయబడదని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. అంతేకాకుండా బిఎస్6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సేవల్లో లేని ట్రక్కులు, వాణిజ్య వాహనాలకు నగరంలో ప్రవేశం నిరాకరిస్తారు. ల్యాండ్‌ఫిల్ సైట్‌ల ఎత్తును 15 మీటర్లు తగ్గించామని, సుమారు 8 వేల పరిశ్రమలను కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనల కింద తీసుకు వచ్చామన్నారు. కాలుష్యానికి పాల్పడిన పరిశ్రమలకు రూ. 9 కోట్ల జరిమానా విధించామని చెప్పారు.

ప్రజలకు క్షమాపణలు

తొమ్మిది,పది నెలల్లో ఢిల్లీలో కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదని మంత్రి అంగీకరిస్తూ ఈ విషయంలో ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రోజువారీ గాలి నాణ్యత సూచీ తగ్గించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సిడ్నీ నిందితుడు హైదరాబాదీనే

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీవ్ర కలకలం రేపిన బాండీ బీచ్ ఉగ్ర దాడికి హైదరాబాద్‌తో సంబంధాలున్నట్లు తేలిం ది. ఈ దాడిలో ప్రధాన నిందితుడైన సాజిద్ అక్ర మ్(50) హైదరాబాద్‌కు చెందినవాడేనని తెలం గాణ డిజిపి కార్యాలయం మంగళవారం ఓ సంచ లన ప్రకటన విడుదల చేసింది. కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబా ద్‌కు చెందిన వాడిగా ప్రకటించారు. హైదరాబా ద్‌లోనే బీకామ్ చేసిన సాజిద్ 1998 నవంబర్‌లో ఆస్రే ్టలియా వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను వివాహం చేసుకు న్నాడు. వీరికి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉ న్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉ న్నారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లినప్పటికీ, సాజిద్ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఆస్ట్రే లియా వెళ్లిన తర్వాత కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు తెలిపింది. అయితే, హైదరాబాద్‌లో అతనికి ఎలాం టి నేర చరిత్రలేదని స్పష్టం చేసింది. అతని కుటుం బసభ్యులు కూడా సాజిద్‌కు ఉగ్ర వాద సంస్థలతో ఎటువంటి సంబంధాలులేవని చెబుతున్నారు. ఉ ద్యోగం కోసమే ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 27 ఏళ్లలో ఇండియాకి 6 సార్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ ఇండియాకి రాలేదని వెల్లడించారు. ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది అక్రమ్ మరణిం చాడు. హైదరాబాద్‌కు చెందిన అక్రమ్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్పటికీ భారత పౌరసత్వం రద్దు చేసుకోలేదని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. తెలంగాణ డిజిపి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్లుగా సాజిత్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. సాజిత్ అతని కుటుంబంతో చాలా తక్కువ సార్లు మాట్లాడాడు.

హైదరాబాద్‌కు చివరిగా 2022లో రాక

సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబా ద్‌కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించా రు. అదే అతను భారత్‌కు వచ్చిన ఆరోసారి, చివరి ప ర్యటనగా గుర్తించారు. సుమారు 50 ఏళ్ల వయసు న్న అక్రమ్‌కు హైదరాబాద్‌తో కుటుంబ సంబంధా లు ఉన్నప్పటికీ, దాడి అనంతరం అతని బంధువు లు బహిరంగంగా అతనితో తమకు ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. బాండీ బీచ్ ఉగ్రదాడి నిందితుడి చివరి హైదరాబాద్ పర్యటన 2022లో అంటే మూడేళ్ల క్రితం వచ్చినట్లు పోలీసులు వెల్ల డించారు. అక్రమ్ తండ్రి 2009లో మరణించగా, తల్లి, సోదరుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టోలి చౌకీలో నివసిస్తున్నారు. ఆస్తి వ్యవహారాలపై సోద రుడితో విభేదాలు తలెత్తడంతో హైదరాబాద్‌లో స్థిర పడే అవకాశాలు పరిశీలిం చేందుకే ఒకసారి పర్య టనలో ఇక్కడికి వచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని ఒక కళా శాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన అతను మధ్య మధ్యలో భారత్‌కు వస్తుండగా, 2022లో చేసిన పర్యటననే చివరిదిగా తెలంగాణ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దాడి తర్వాత మీడి యాతో మాట్లాడిన అక్రమ్ సోదరుడు కుటుంబా నికి అతనితో ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రభావం

ఈ ఉగ్రదాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ఉం దని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బార్రెట్ మంగళవారం వెల్లడించారు. నిందితులు తండ్రీ కొడుకులని, తండ్రి కాల్పుల్లో మృతి చెం దగా, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వారి దగ్గర లభించినసాక్షాల ఆధారంగా వారు ఇస్లామిక్ స్టేట్ ప్రభావితులని పాత్రికేయుల సమావేశంలో వివరించారు.

బుధవారం రాశి ఫలాలు (17-12-2025)

మేషం

మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావలసిన ధనం చేతికందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు.

వృషభం

చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.

మిధునం

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం

దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం

ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

కన్య

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

తుల

నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

వృశ్చికం

కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

ధనస్సు

ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.

మకరం

భూ క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.

కుంభం

సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మీనం

భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఒత్తిడి పెరుగుతుంది. 

 

 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. 2026 మార్చి 3న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ -2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను 4వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మార్చి 3న హోలీ పండుగ సెలవు నేపథ్యంలో ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ రాత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు.. రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి.

ఉదయం 9- నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం -5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్(20 మార్కులకు).. ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 21న, సెకండియర్‌కు 22న జరుగుతాయి. ప్రథమ ఏడాది విద్యార్థులకు జనవరి 23న ఎథిక్స్ పరీక్ష, 24న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకూ ఇవే తేదీలు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అయితే, ప్రత్యేకంగా టైం ం విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే.