kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahis

మలేసియాపై భారత్ భారీ విజయం

=యుఎఇ వేదికగా జరుగుతున్న అండర్19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు రికార్డు విజయం సాధించింది. మంగళవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 315 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూత్ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన మలేసియాను భారత బౌలర్లు 93 పరుగులకే పరిమితం చేశారు. మలేసియా టీమ్‌లో హంజా (35), డియాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మరోసారి అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న దీపేశ్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

వైభవ్ దూకుడు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి టీమ్ ముందు 409 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. కెప్టెన్ అయుష్ మాత్రే (14) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విహాన్ మల్హోత్ర (7) కూడా విఫలమయ్యాడు. అయితే ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన వైభవ్ 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

కుందు వీరవిహారం..

ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి టీమ్ బౌలర్లపైఎదురు దాడికి దిగి స్కోరును పరిగెత్తించాడు.కుందు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో మలేసియా బౌలర్లను హడలెత్తించాడు. అతనికి వేదాంత్ పూర్తి సహకారం అందించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వేదాంత్ 7 ఫోర్లతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేస్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అలరించిన అభిజ్ఞాన్ కుందు 125 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

‘దేఖ్‌లేంగే సాలా’కు రికార్డు వ్యూస్..

’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ’ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలై శ్రోతలను ఉర్రుతలూగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి, తక్షణ హిట్ గా నిలిచింది.

దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి, సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ సమకూర్చిన నృత్యరీతులు కూడా భారీ ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇక భాస్కరభట్ల రాసిన సాహిత్యం పాట విజయంలో కీలక పాత్ర పోషించింది. ‘దేఖ్‌లేంగే సాలా’ పాట ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కృషి ఫలితంగానే ఈ పాట అభిమానులకు విందు భోజనంలా మారి, ఇంతటి ఆదరణ పొందుతోంది.

స్టాక్‌మార్కెట్‌కు భారీ నష్టాలు

 దేశీయ స్టాక్‌మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు పడిపోయి 84,680 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 167 పాయింట్లు తగ్గి 25,860కి చేరింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో షేర్లు 5 శాతం వరకు పడిపోయాయి. టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు సుమారు 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీలో 50 షేర్లలో 39 నష్టపోయాయి. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. గ్లోబల్ మార్కెట్లలో కూడా ఆసియా, అమెరికా సూచీలు తగ్గాయి. డిసెంబర్ 15న ఎఫ్‌ఐఐలు రూ.1,468 కోట్ల షేర్లు విక్రయించగా, డిఐఐలు రూ.1,792 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.  

గీతం వర్శిటీ రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఏకంగా రూ.118 కోట్లు విద్యుత్ బకాయిలు ఉండటంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్యులు వెయ్యి రూపాయలు బకాయిలు ఉంటేనే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు గీతం యూనివర్సిటీ వంద కోట్ల బకాయిలు ఉంటే ఎలా చూసి చూడకుండా ఉన్నారని మండిపడింది. గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకు? అని అధికారులను ప్రశ్నించింది. కాగా, ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకి ఎస్‌పిడిసిఎల్ నోటీసులు పంపింది. ఎస్‌పిడిసిఎల్ నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక 2008 నుంచి గీతం యూనివర్శిటీ కరెంట్ బిల్లు చెల్లించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు.

రణవీర్ సింగ్ ‘ధురంధర్’కు భారీ కలెక్షన్స్..

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ‘ధురంధర్’ విజయంతో గ్రాండ్ గా 2025ని ముగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రణవీర్ సింగ్ కెరీర్ లో తొలి 500 కోట్ల క్లబ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఇంత వరకూ ఈ స్టార్ హీరో 500 కోట్ల క్లబ్ లో చేరలేదు. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రం 350 కోట్ల వసూళ్లను సాధించింది. అదే అతడి టాప్ గ్రాసర్. 

కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ నోటీసుపై రాంచందర్ రావు ఆగ్రహం

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్నాకి ప్రతీక అయిన కొండగట్టు అంజన్న ఆలయంపై ఈ తరహా చర్యలు హందూ భక్తుల విశ్వాసాలపై దాడిగా భావిస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయానికి, ఆలయ ఆవరణలో ఆరు ఎకరాల భూమి పరిమితి అంటూ కొత్త వాదనను తీసుకుని రావడం భక్తులకు బాధను కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. అటవీ శాఖ చెబుతున్న ఆరు ఎకరాల భూమిలోనే భక్తులకు అత్యంత అవసరమైన అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, ఆగమ పాఠశాల, వేద విద్యార్థుల వసతి గృహం, భోజన శాల వంటి కీలక మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.మరోవైపు దేవాదాయ శాఖ కూడా అటవీ శాఖకు నోటీసు ఇచ్చిందని ఆయన తెలిపారు. కొండగట్టు శ్రీ ఆంజనేత స్వామి భూముల విషయంలో ఆలయానికి, అటవీ శాఖ మధ్య వివాదం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భక్తుల విశ్వాసాలు, థార్మిక సంప్రదాయాలు, పేద భక్తుల ఇబ్బందులు, ప్రజల సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ఈ వివాదానికి వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గిరి ప్రదక్షిణ, వాహన పూజలు, పార్కింగ్ వంటి అంశాల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ అటవీ శాఖ నోటీసు జారీ చేయడం అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కొండగట్టు వద్ద ఆరు ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా రాంసాగర్ గ్రామంలో ఉన్న దేవాదాయ శాఖ భూముల నుంచి ఎనిమిది ఎకరాలు ఇవ్వడానికి దేవాదాయ శాఖ ముందుకు వచ్చినా అటవీ శాఖ కొండగట్టు ఆలయం పరిథిలోనే వివాదాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాంచందర్ రావు తెలిపారు. ఇదిలాఉండగా కొండగట్టు అంజన్న ఆలయానికి ఉన్న భూములపై గతంలో సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ సర్వేయర్ లక్ష్మణ్ రావు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారని స్థానికులు చెబుతున్నారు.

సఫారీలకు పరీక్ష.. నేడు నాలుగో టి20

లక్నో: సౌతాఫ్రికాతో బుధవారం జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి పోరులో ఓడిన సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో సఫారీ టీమ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికగా తయారైంది. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా దక్షిణాఫ్రికాకు ఉంది. ఇప్పటికే రెండో మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఇలాంటి స్థితిలో భారత్ ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

గిల్, సూర్యలకు కీలకం..

వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ వీరు ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోయారు. గిల్ కిందటి మ్యాచ్‌లో 28 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. అయితే సూర్య 12 పరుగులకే ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఇద్దరిపై ఒత్తిడి నెలకొంది. దీన్ని తట్టుకుని జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇందులో వీరు ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడక తప్పదు. యువ సంచలనం అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హార్దిక్ పాండ్య కూడా జోరుమీదున్నాడు. శివమ్ దూబె, తిలక్ వర్మ, జితేశ్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ బాగానే ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, హర్షిత్, హార్దిక్, వరుణ్, కుల్దీప్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

టిజి టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

 ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) 2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2026 జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టిజి టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెట్ పరీక్షకు మొత్తం 2,37,754 దరఖాస్తులు రాగా, అందులో పేపర్ 1కు 85,538, పేపర్ 2కు 1,52,216 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఈసారి టెట్‌కు 1,66,084 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ 1కు 58,149 మంది, పేపర్ 2కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు.

టెట్ పరీక్ష షెడ్యూల్

2026 జనవరి 3 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ -1)

2026 జనవరి 3 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ -2)

2026 జనవరి 4- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ -1)

2026 జనవరి 4- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -2)

2026 జనవరి 5 పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -1)

2026 జనవరి 5- పేపర్ 1 సోషల్ స్టడీస్ (సెషన్ -2)

2026 జనవరి 6- పేపర్ 1 సోషల్ స్టడీస్ (సెషన్ -1)

2026 జనవరి 6- పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -2)

2026 జనవరి 8 పేపర్ 1 (సెషన్ -1)

2026 జనవరి 8 పేపర్ 1 (సెషన్ 1)

2026 జనవరి 9 పేపర్ 1 (సెషన్ -1)

2026 జనవరి 11 పేపర్ 1 (సెషన్ -1)

2026 జనవరి 11 పేపర్ 1 (సెషన్ 2)

2026 జనవరి 19 పేపర్ 1(మైనర్) (సెషన్ -1)

2026 జనవరి 20 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్(సెషన్ -1)

నాగారం భూములపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

నాగారం భూముల వివాదానికి సంబంధించి బిర్ల మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. నాగారం ప్రాంతంలోని భూములను భూధాన్ ల్యాండ్స్‌గా పేర్కొంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కొనుగోలు చేసిన భూములపై బిర్ల మల్లేష్ వివాదం సృష్టించారు. ఈ నేపథ్యంలో మల్లేష్ ముందుగా హైకోర్టును ఆశ్రయించగా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మల్లేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌లో తగిన ఆధారాలు లేవని భావించిన సుప్రీంకోర్టు విచారణకు కూడా అర్హత లేదని పేర్కొంటూ పిటిషన్‌ను పిటిషన్ స్థాయిలోనే కొట్టివేసింది. దీంతో నాగారం భూముల వివాదంలో హైకోర్టు తీర్పే తుది నిర్ణయంగా నిలిచినట్లైంది.

సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించడంతో బిర్ల మల్లేష్‌కు ఈ కేసులో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అంతకుముందు నాగారం భూముల వివాదానికి సంబంధించి బిర్ల మల్లేష్ తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195 లలో ఉన్న భూములకు సంబంధించింది. వీటిలో ముఖ్యంగా భూదాన్ భూముల అన్యాక్రాంతం జరిగిందని బిర్ల మల్లేష్ ఆరోపించారు. వందల కోట్ల విలువైన ఈ భూదాన్ భూములను కొంతమంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా తమ పేర్ల మీదకు బదిలీ చేసుకున్నారని, రికార్డులు తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.

ఐ బొమ్మ రవికి 12 రోజుల కస్టడీ

సినిమాల పైరసీ కేసులో అరెస్టు అయిన ఐ బొమ్మ వెబ్‌సైట్, బప్పం టివి నిర్వాహకుడు ఇమంది రవిని పోలీస్ కస్టడీకి మరోసారి నాంపల్లి కోర్టు అనుమతించింది. సినిమాలను పైరసీ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రవిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. దీంతో గతంలో నాంపల్లి కోర్టును హైదరాబాద్ పోలీసులు కస్టడీకి కోరగా రెండు సార్లు అనుమతి ఇచ్చింది. పోలీసులు రవిని చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకుని రెండు సార్లు విచారణ చేసి పలు విషయాలు రాబట్టింది. అయితే కస్టడీలో రవి పూర్తిగా సహకరించకుండా అడిగన వాటికి సమాధానాలు దాటవేయడంతో విచారణలో కీలక విషయాలు రాబట్టలేదని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషనల్ దాఖలు చేశారు. దీనిపై రవి తరఫు న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్య వాదనలు విన్న కోర్టు 12 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ మంగళవారం అనుమతి ఇచ్చింది. మూడు కేసుల్లో ఒక కేసుకు మూడు రోజుల చొప్పున 12 రోజులు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు రవిని చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం కస్టడీలోకి తీసుకుని మూడు కేసుల్లో విచారణ చేయనున్నట్లు తెలిసింది. మరో వైపు ఇప్పటికే రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారని, మరోసారి రవిని కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టును కోరారు.