రేవంత్, ఉత్తమ్ అజ్ఞానంతో నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఏడారే: హరీష్ రావు

హైదరాబాద్: కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరో మాట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క చెబుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణ జలాల్లో 299 టిఎంసిల వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని చురకలంటించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండని, […]