రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదనీ అన్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాల్లో.. మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక […]
